న్యూఢిల్లీ: ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలెక్షన్ బోర్డు(డీఎస్‌ఎస్‌ఎస్‌బీ) పరీక్షలో ఎంపికై వెయిటింగ్ లిస్టులో ఉన్న అభ్యర్ధుల పేర్లను బహిర్గతం చేయాలని కేంద్ర సమాచార కమిషన్(సీఐసీ) ఆదేశించింది. ఈ జాబితాను వారం రోజుల్లో ఆన్‌లైన్‌లో ఉంచాలని సీఐసీ కమిషనర్ యశోవర్ధన్ ఆజాద్ సెలెక్షన్ బోర్డును కోరారు. డీఎస్‌ఎస్‌ఎస్‌బీ గత ఏడాది 34 టీచర్ పోస్టుల భర్తీకి గాను పరీక్షలు నిర్వహించింది.
ఎంపికైన వారితో 33 పోస్టులను భర్తీ చేసింది. అయితే, వెయిటింగ్ లిస్ట్, కటాఫ్ మార్కులు, ర్యాంకుల వివరాలు తెలపాలని రేఖారాణి అనే అభ్యర్థిని కోరగా డీఎస్‌ఎస్‌ఎస్‌బీ తిరస్కరించింది. దీనిపై ఆమె సీఐసీని ఆశ్రయించారు. వెయిటింగ్ లిస్ట్‌ను రహస్యంగా ఉంచడం సమాచార హక్కు చట్టాన్ని ఉల్లంఘించడమేనని సీఐసీ పేర్కొంది. అర్జీదారుకు వివరాలు తెలుసుకునే హక్కు ఉందంటూ, ఈ పరీక్ష వెయిటింగ్ లిస్ట్‌ను రెండు వారాల్లోగా ఆన్‌లైన్‌లో ఉంచాలంది.
Comments
Please login to add a commentAdd a comment