ప్రత్యేక రైళ్ల బెర్తులపై సమాచారం
హైదరాబాద్: ‘వెయిటింగ్ లిస్టు’ ప్రయాణికులకు కోసం దక్షిణమధ్య రైల్వే వినూత్న సౌకర్యాన్ని అందుబాటులోకి తేనుంది. రద్దీ సమయాల్లో నడిపే ప్రత్యేక రైళ్ల సమాచారాన్ని వారికి సంక్షిప్త సందేశా(ఎస్‌ఎంఎస్)ల రూపంలో పంపనుంది. వెయిటింగ్ లిస్టు ప్రయాణికులు రిజర్వ్ చేసుకున్న తేదీలతో పాటు ఆ రోజుకు దగ్గర్లో ఏవైనా ప్రత్యేక రైళ్లు నడుపుతుంటే... అందులోని బెర్తుల వివరాలతో సమాచారాన్ని వారికి చేరవేస్తారు. ఇటీవల పొగమంచు కారణంగా తెలంగాణ ఎక్స్‌ప్రెస్, దక్షిణ్ ఎక్స్‌ప్రెస్ వంటి కొన్ని రైళ్లను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు.
అయితే మంచు తెరలు వీడిపోవడంతో వాటిని పునరుద్ధరించారు. కానీ రైళ్లు ఖాళీగా ఉండటంతో విస్మయానికి గురైన రైల్వే అధికారులు... అదే మార్గంలో నడిచే ఇతర రైళ్లలోని వెయిటింగ్ లిస్టు ప్రయాణికులకు ఎస్‌ఎంఎస్‌లు పంపారు. దీనికి అనూహ్య స్పందన రావడంతో ఈ సదుపాయాన్ని అన్ని స్పెషల్ ట్రైన్స్‌లో అందుబాటులోకి తెచ్చేందుకు దక్షిణమధ్య రైల్వే ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ వినూత్న ఆలోచనను త్వరలోనే అన్ని ప్రత్యేక రైళ్లకు విస్తరించనున్నట్టు దక్షిణమధ్య రైల్వే ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి చెప్పారు.
ఇకపై ‘వెయిటింగ్ లిస్ట్’వారికి ఎస్‌ఎంఎస్
Published Tue, Jan 19 2016 3:11 AM | Last Updated on Mon, Oct 22 2018 2:17 PM
Advertisement