పురపోరుకు సై
పురపోరుకు సై
Published Wed, Mar 19 2014 1:18 AM | Last Updated on Fri, Aug 24 2018 2:33 PM
మొత్తం 12 మునిసిపాలిటీలు
362 వార్డులు..1472 మంది అభ్యర్థులు
మాచర్లలో తెలుగుదేశంకు రెబల్స్ బెడద
ముచ్చెమటలు పట్టించనున్న స్వతంత్రులు
సాక్షి, గుంటూరు :జిల్లాలోని 12 పురపాలక సంఘాల్లో నామినేషన్ల ఘట్టం ముగిసేనాటికి 2,601 నామినేషన్లు దాఖలు కాగా, పరిశీలన,తిరస్కరణ అనంతరం 2,271 మిగిలాయి. చివరకు ఉపసంహరణకు గడువు ముగిసిన అనంతరం అంటే మంగళవారం సాయంత్రానికి 1472 మంది అభ్యర్థులు మునిసి‘పోల్స్’లో నిలిచారు. అత్యధికంగా నరసరావుపేటలో 203 మంది అభ్యర్థులు, అత్యల్పంగా మాచర్లలో 70 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. ఇండిపెండెంట్ అభ్యర్థులు 419 మంది తేలారు. 12 పురపాలక సంఘాల పరిధిలో 362 వార్డులకు 634 పోలింగ్‌బూత్‌లు ఏర్పాటు చేశారు. ఆయా పోలింగ్ కేంద్రాల్లో ఓటర్ల జాబితా అందుబాటులో ఉంటుందని అధికారులు తెలిపారు. అన్ని పురపాలక సంఘాల్లో కలిపి మొత్తం 6,08,972 మంది ఓటర్లు వున్నారు.
బరిలో ఉన్న అభ్యర్థుల వివరాలుః
రేపల్లె మునిసిపాలిటీలో 28 వార్డులకు 85 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వైఎస్సార్ సీపీ-27, టీడీపీ-28, కాంగ్రెస్-24, ఇండిపెండెంట్‌లు-06 .
సత్తెనపల్లిలో 30 వార్డులకు 109 మంది
అభ్యర్థులు బరిలో ఉన్నారు. వైఎస్సార్ సీపీ-30, టీడీపీ-28, కాంగ్రెస్-24, సీపీఎం-08, సీపీఐ-01, బీజేపీ-02, బీఎస్పీ-01, నవోదయం-01, ఇండిపెండెంట్‌లు-14 మంది.
=నరసరావుపేటలో 34 వార్డులకు 203 మంది అభ్యర్థులు బరిలో మిగిలారు. వైఎస్సార్ సీపీ-34, టీడీపీ-31, కాంగ్రెస్-33, సీపీఐ-01, బీజేపీ-01, ఇండిపెండెంట్‌లు-103 మంది.
=పొన్నూరులో 31 వార్డులకు 96 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వైఎస్సార్ సీపీ-31, టీడీపీ-30, కాంగ్రెస్-12, బీఎస్పీ-05, బీజేపీ-01, ఎంఐఎం-02, ఇండిపెండెంట్‌లు-15 మంది.
=తాడేపల్లిలో 23 వార్డులకు 111 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వైఎస్సార్ సీపీ-23, టీడీపీ-22, కాంగ్రెస్-23, సీపీఎం-19, సీపీఐ-04, లోక్‌సత్తా-01, ఇండిపెండెంట్‌లు-19 మంది.
=వినుకొండలో 26 వార్డులకు116 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వైఎస్సార్ సీపీ-25, టీడీపీ-13, కాంగ్రెస్-26, సీపీఎం-04, సీపీఐ-07, లోక్‌సత్తా-01, బీజేపీ-06, ఇండిపెండెంట్‌లు-34 మంది.
=బాపట్లలో 34 వార్డులకు 139 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వైఎస్సార్ సీపీ-34, టీడీపీ-32, కాంగ్రెస్-19, సీపీఐ-02, బీజేపీ-06, బీఎస్పీ-04 ఇండిపెండెంట్‌లు- 42.
=చిలకలూరిపేటలో 34 వార్డులకు 119 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వైఎస్సార్ సీపీ-34, టీడీపీ-33, కాంగ్రెస్-12, సీపీఎం-01, బీఎస్పీ-06 ఇండిపెండెంట్‌లు-33 మంది.
=మాచర్లలో 29 వార్డులకు 21, 22 వార్డుల్లో ఎన్నిక నిలిచిపోయింది. మిగిలిన వార్డులకు 70 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వైఎస్సార్ సీపీ-26, టీడీపీ- 31, కాంగ్రెస్-01, సీపీఎం-02, సీపీఐ-01, సమాజ్‌వాదీ పార్టీ-01, బీఎస్పీ-02, ఇండిపెండెంట్‌లు-06 మంది.
=పిడుగురాళ్లలో 30 వార్డులకు 126 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వైఎస్సార్ సీపీ-30, టీడీపీ-30, కాంగ్రెస్-08, సీపీఎం-01, సీపీఐ-01, బీజేపీ- 01, బీఎస్పీ-01, ఇండిపెండెంట్‌లు-54 మంది.
=మంగళగిరిలో 32 వార్డులకు 120 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వైఎస్సార్ సీపీ-30, టీడీపీ-23, కాంగ్రెస్-30, సీపీఎం-03, సీపీఐ-05, బీజేపీ- 10, బీఎస్పీ-01, ఇండిపెండెంట్‌లు-18 మంది.
=తెనాలిలో 40 వార్డులకు 178 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వైఎస్సార్ సీపీ-40, టీడీపీ-40, కాంగ్రెస్-40, సీపీఐ-01, బీజేపీ-07, లోక్‌సత్తా-06, ఇండిపెండెంట్‌లు-44 మంది పోటీలో ఉన్నారు.
Advertisement