ఆదిలాబాద్ రూరల్ : పోలవరం ప్రాజెక్టు ముంపు గ్రామాలను ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేస్తూ పార్లమెంట్ ఆమోదించిన బిల్లును ఉపసంహరించుకోవాలని జిల్లా సర్పంచుల సం ఘం, ఆదివాసీ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. జిల్లా సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో బుధవారం జిల్లాకేంద్రంలోని ఆర్‌అండ్ బీ వసతి గృహం నుంచి ర్యాలీ తీశారు. కొమురం భీమ్ చౌరస్తాకు చేరుకొని ధర్నా నిర్వహించారు.
వివిధ ఆదివాసీ సంఘాలు, స ర్పంచుల సంఘం నాయకులు మాట్లాడారు. ఆదివాసీల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా ఏకప క్షంగా కేంద్రం ఆర్డినెన్స్ జారీ చేసి బిల్లు ఆమోదించడం అన్యాయమన్నారు. ఈ బిల్లును ఉపసంహరించుకొని, ముంపు గ్రామాలను తెలంగాణలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. లక్షా 50 వేల మంది ఆదివాసీలను నిర్వాసితులను చేసే పోలవరం ప్రాజెక్టు రద్దు కోసం తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, న్యాయస్థానం ద్వారా పోరాడాలని కోరారు.
ఇకనైనా కేంద్రం పోలవరం ప్రాజెక్టుపై తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం కలెక్టరేట్‌కు చేరుకుని కలెక్టర్ జగన్మోహన్‌కు వినతిపత్రం సమర్పించారు. సర్పంచుల సంఘం జిల్లా కన్వీనర్ తుంరం చందర్‌షావ్, జిల్లా కో కన్వీనర్లు పెందోర్ మోహన్, మర్సుకోల కేశవ్, ఆదిలాబాద్ ఎంపీపీ నైతం లక్ష్మీసుఖలాల్, తోటి సంఘం జిల్లా అధ్యక్షుడు తొడసం శ్రీనివాస్, ఆదివాసీ సంక్షేమ పరిషత్ జిల్లా అధ్యక్షుడు కనక మాధవరావు, జిల్లా కార్యదర్శి మర్సుకోల వసంత్‌రావు, ఆదివాసీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెస్రం గంగారాం, గిరిజన ఐక్యవేదిక జిల్లా కన్వీనర్ గేడం మనోహర్, మేస్రం శంకర్, ఆదిమ గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు సిడాం వామన్‌రావు, అఖిల భారతీయ ఆదివాసీ వికాస్ పరిషత్ జిల్లా అధ్యక్షుడు సిడాం రాంకిషన్, తుడుందెబ్బ రాష్ట్ర కార్యదర్శి కుర్సేంగే తానాజీ పాల్గొన్నారు.
బిల్లు ఉపసంహరించాలి
Published Thu, Jul 17 2014 12:52 AM | Last Updated on Tue, Aug 21 2018 8:34 PM
Advertisement
Advertisement