సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ ఆర్థికవేత్త, ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి సభ్యుడు సూర్జిత్ భల్లా రాజీనామాచేశారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ప్రధానమంత్రి (ఇఎసి-పిఎం) పాక్షిక సభ్యుడిగా డిసెంబర్ 1 న గా రాజీనామా చేసినట్లు భల్లా ట్విటర్‌లో వెల్లడించారు.
నీతి ఆయోగ్ సభ్యుడు వివేక్ ఒబెరాయ్ నేతృత్వంలో ఆర్థిక సలహా మండలిలో ఆర్ధికవేత్తలు రాతిన్ రాయ్, అషిమా గోయల్, షామికా రవి ఇతర పార్ట్ టైమ్ సభ్యులు. కాగా ఆర్‌బీఐ గవర్నర్‌గా ఉర్జిత్ పటేల్ రాజీనామా ప్రకంపనలు రేపింది. ఇవి ఇంకా చల్లారకముందే సూర్జిత్ భల్లా రాజీనామా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మరోవైపు కొత్త ఆర్‌బీఐ గవర్నర్ ఎంపికపై నేడు (డిసెంబరు 11) ప్రభుత్వం ఒక ప్రకటన చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు.
1/2 My forecast on Elections 2019; written as Contributing Editor Indian Express & Consultant @Network18Group; I resigned as part-time member PMEAC on December 1st; also look for my book Citizen Raj: Indian Elections 1952-2019 , due
— Surjit Bhalla (@surjitbhalla) December 11, 2018
Comments
Please login to add a commentAdd a comment