‘డిగ్రీ’ వద్దు.. ‘డిప్లొమా’ ముద్దు | Students focus on Diploma course | Sakshi
Sakshi News home page

‘డిగ్రీ’ వద్దు.. ‘డిప్లొమా’ ముద్దు

Published Mon, Dec 19 2016 3:23 AM | Last Updated on Mon, Sep 4 2017 11:03 PM

‘డిగ్రీ’ వద్దు.. ‘డిప్లొమా’ ముద్దు

‘డిగ్రీ’ వద్దు.. ‘డిప్లొమా’ ముద్దు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థుల సంఖ్య లక్షకు పైగా తగ్గిపోయింది. కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఇండస్ట్రీ (సీఐఐ), డెలాయిట్‌ సంస్థ సంయుక్తంగా వెల్లడించిన నివేదిక ఈ విషయాన్ని స్పష్టం చేసింది. అంతేకాదు గతంతో పోల్చితే మన రాష్ట్రంలో కాలేజీల సంఖ్య కూడా పెరిగిందని ‘యాన్యువల్‌ స్టేటస్‌ ఆఫ్‌ హైయ్యర్‌ ఎడ్యుకేషన్‌ (ఏఎస్‌హెచ్‌ఈ) ఆఫ్‌ స్టేట్స్‌ అండ్‌ యూటీస్‌ ఇన్‌ ఇండియా–2016’నివేదిక తెలిపింది. ఈ నివేదికను సీఐఐ ఇటీవల విడుదల చేసింది. ఏఎస్‌హెచ్‌ఈ–2015 నివేదిక ప్రకారం రాష్ట్రం లో 13,82,137 మంది విద్యార్థులు వివిధ ఉన్నత విద్యా కోర్సులను అభ్యసించగా, 2016 నివేదిక ప్రకారం 12,81,443 మందే ఉన్నత విద్యను అభ్యసిస్తున్నట్లు వెల్లడైంది. మొత్తం లక్షమంది విద్యార్థులు తగ్గగా.. ఒక్క డిగ్రీలోనే 79,880 మంది తగ్గిపోయారు. అలాగే గతంలో రాష్ట్రంలో మొత్తం 2,256 కాలేజీలు ఉంటే 2016 నివేదిక ప్రకారం వాటి సంఖ్య 2,536కు పెరిగింది. అంటే 284 కాలేజీలు పెరిగాయి.

పెరిగిన బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు
ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థుల సంఖ్య మొత్తంగా తగ్గినా.. బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. గతంలో కంటే ఈసారి బీసీ, ఎస్సీ, ఎస్టీల్లో కాలేజీల్లో చేరిన విద్యార్థుల సంఖ్య పెరిగిందని నివేదిక వెల్లడించింది. 2015 నివేదిక ప్రకారం ఎస్సీ విద్యార్థులు 15.8 శాతం ఉన్నత విద్యను అభ్యసిస్తే.. 2016లో 16.2 శాతానికి పెరిగింది. బీసీ విద్యార్థులు అంతకుముందు 42.5 శాతం మంది ఉన్నత విద్యను అభ్యసించగా, తాజాగా 44 శాతానికి పెరిగింది. ఎస్టీ విద్యార్థులు గతంలో 7.4 శాతం ఉండగా, ప్రస్తుతం 8.4 శాతానికి పెరిగింది. ముస్లిం విద్యార్థుల సంఖ్య గతంలో 6.5 శాతం ఉంటే.. ఈసారి 6.8 శాతానికి చేరింది.

డిప్లొమాకు పెరుగుతున్న ఆదరణ
రాష్ట్రంలో డిప్లొమా కోర్సులు చదివే విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. గత నివేదికతో పోలిస్తే 2016లో 15,042 మంది అత్య«ధికంగా డిప్లొమా కోర్సుల్లో చేరారు.

మన రాష్ట్రాల్లోనే ఎక్కువ
అధ్యాపకులు ఎక్కువ మంది ఉన్న రాష్ట్రాల్లో కేరళ, కర్ణాటక ముందున్నాయి. అక్కడ ఉన్నత విద్యను బోధించేందుకు 13 మంది విద్యా ర్థులకు ఒక అధ్యాపకుడు ఉండగా.. తెలం గాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో 14 మంది విద్యార్థులకు ఒక అధ్యాపకుడు ఉన్నారు. దేశ వ్యాప్తంగా చూస్తే సరాసరి ప్రతి 21 మంది విద్యార్థులకు ఒక అధ్యాపకుడు పని చేస్తున్నట్లు వెల్లడించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement