diploma course
-
ఉన్నతప్రమాణాలు..మరింత ప్రశాంతత
సాక్షి, హైదరాబాద్: మరింత ప్రశాంతతకు, ఉన్నత విద్యా ప్రమాణాలకు ఉస్మానియా విశ్వవిద్యాలయం వేదిక కాబోతోందని వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ డి.రవీందర్ తెలిపారు. యూనివర్సిటీలు ప్రశాంత వాతావరణంలో ఉండేలా దేశవ్యాప్తంగా క్లోజ్డ్ క్యాంపస్‌ల ఏర్పాటు జరుగుతోందని చెప్పారు. ఇందులో భాగంగా ఓయూకు ప్రభుత్వం రూ.16 కోట్లు మంజూరు చేసిందని, బయటి వ్యక్తులు క్యాంపస్ నుంచి ప్రయాణించకుండా బైపాస్ రోడ్డు ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. దీనివల్ల కేవలం విద్యార్థులే ప్రాంగణంలో తిరుగుతారన్నారు. ఓయూలో మహిళా విద్యార్థినుల సంఖ్య పెరుగుతోందని, క్లోజ్డ్ క్యాంపస్ ఏర్పాటు వల్ల వారికి మరింత పటిష్టమైన భద్రత చేకూరుతుందని చెప్పారు. మరోవైపు వర్సిటీలో మౌలిక వసతుల కల్పనకు అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నట్టు వివరించారు. రెండేళ్లుగా మౌలిక వసతులకు రూ.145 కోట్లు ఖర్చు చేశామన్నారు. శుక్రవారం యూనివర్సిటీ ప్రాంగణంలో ఆయన విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. హాస్టళ్లు.. సరికొత్త క్లాస్‌రూమ్‌లు సైఫాబాద్‌లోని యూనివర్సిటీ కాలేజీలో 300 మందికి సరిపడా బాలుర హాస్టల్ నిర్మాణం. నిజాం కాలేజీలో 284 మంది బాలికల కోసం హాస్టల్ ఏర్పాటు. సెంటినరీ హాస్టల్‌ను 500 మందికి సరిపడేలా నిర్మాణం. ఓయూ ప్రాంగణంలో స్విమ్మింగ్ పూల్, బ్యాడ్మింటన్ కోర్టుల ఏర్పాటు. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విభాగంలో సరికొత్త క్లాస్ రూంల ఏర్పాటుకు శ్రీకారం. పరిశోధనలకు వీలు కల్పించేలా పూర్తి స్థాయి సాంకేతిక విద్యా విధానం అందుబాటులోకి తెచ్చేందుకు వ్యూహరచన. కార్పొరేట్ సంస్థల సామాజిక బాధ్యతలో భాగంగా పలు ప్రభుత్వ రంగ సంస్థల నుంచి ఓయూకు నిధులు సమకూరాయి. అమెరికాలోని 12 నగరాలను ప్రొఫెసర్ రవీంద్ర సందర్శించారు. అక్కడ పూర్వ విద్యార్థులతో భేటీ అయ్యారు. ఓయూలో వారి అనుభవాలు వివరించేందుకు అంగీకారం కుదిరింది. మారుతున్న విద్యా విధానంలో భాగంగా ఈ ఏడాది నుంచి ప్రొఫెసర్ ఆఫ్ ప్రాక్టీసెస్ అమలు. ఇందులో భాగంగా వివిధ రంగాల్లో నిష్ణాతులైన వారు వర్సిటీ విద్యార్థులకు పాఠ్యాంశాలు బోధించేందుకు అనుమతి. ఈ ఏడాది నుంచి నిరంతర పరీక్షా విధానం అమలు. ఎప్పటికప్పుడు మధ్యంతర పరీక్షలు నిర్వహిస్తారు. ప్రిన్సిపల్స్, ప్రొఫెసర్లతో సమీక్ష ఉస్మానియా యూనివర్సిటీ: నిరంతర పరీక్షా విధానంపై ప్రొఫెసర్ రవీందర్ వివిధ కాలేజీల ప్రిన్సిపల్స్, ప్రొఫెసర్లతో శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇప్పటివరకు డిగ్రీ, పీజీ, డిప్లొమా, ఇతర కోర్సులకు ఇంటర్నల్ పరీక్షలు, ప్రాక్టికల్స్‌తో పాటు ప్రతి ఆరు నెలలకు ఒక సెమిస్టర్ పరీక్షను నిర్వహిస్తున్నారు. యూజీసీ ప్రవేశ పెట్టిన కొత్త నిబంధనల ప్రకారం సెమిస్టర్ పరీక్షలతో పాటు 15 రోజులకు ఒకసారి పరీక్షలను నిర్వహించేందుకు వర్సిటీ సమాయత్తం అవుతోంది. ఈ నేపథ్యంలో ప్రొఫెసర్ల అభిప్రాయాలు, అభ్యంతరాలు, సందేహాలను వీసీ తెలుసుకున్నారు. -
ఉద్యాన డిప్లొమా కోర్సులకు దరఖాస్తులు
సాక్షి, సిద్దిపేట: సిద్దిపేట జిల్లా ములుగులోని శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం రెండేళ్ల ఉద్యాన డిప్లొమా కోర్సుల ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. పదో తరగతి పాసై పాలీసెట్ అర్హత సాధించిన వారు ఈ డిప్లొమా కోర్సుల్లో చేరేందుకు అర్హులని వర్సిటీ వీసీ నీరజ ప్రభాకర్ చెప్పారు. ఈనెల 22 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఐదు పాలిటెక్నిక్ కళాశాలల్లో 200 సీట్లు ఉన్నాయి. ప్రభుత్వ పాలిటెక్నిక్‌లు ఆదిలాబాద్, పెద్దపల్లి జిల్లాల్లో ఉండగా, మరో మూడు ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలలు నల్లగొండ జిల్లా (గ్రామభారతి ఉద్యాన పాలిటెక్నిక్ మర్రిగూడ), మహబూబాబాద్ జిల్లా (విశ్వవర్ధిని తొర్రూర్), సూర్యాపేట జిల్లా (గంట గోపాల్‌రెడ్డి కళాశాల)లో ఉన్నాయి. డిప్లొమా కోర్సు పూర్తి చేసిన వారు హార్టీసెట్ ప్రవేశపరీక్ష ద్వారా 15 శాతం మందికి ఉద్యాన బీఎస్సీ చేసేందుకు అవకాశం కల్పించనున్నారు. -
సాఫ్ట్ స్కిల్స్‌లో ఇది కొత్త అధ్యాయం: సీఎం జగన్
సాక్షి, విశాఖపట్టణం:ప్రపంచంలోనే తొలిసారిగా మైక్రోసాఫ్ట్ ద్వారా 1.62 లక్షల మంది ఏపీ విద్యార్థులకు సాఫ్ట్‌స్కిల్స్‌లో ఉచితంగా శిక్షణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. మైక్రోసాఫ్ట్ చరిత్రలోనే ఇంత మందికి శిక్షణ అందించలేదన్నారు. ఉద్యోగాలను సాధించడంతోపాటు నైపుణ్యాలను పెంపొందించుకునేలా పాఠ్య ప్రణాళికలను తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. దేశంలో మొదటిసారిగా నాలుగేళ్ల ఆనర్స్ డిగ్రీని ప్రవేశపెట్టినట్లు తెలిపారు. శుక్రవారం విశాఖలోని సిరిపురం ఏయూ కాన్వొకేషన్ హాల్లో మైక్రోసాఫ్ట్ సర్టిఫికెట్ల ప్రదానోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్ పాల్గొన్నారు. మొదటి విడతలో శిక్షణ పూర్తి చేసుకున్న 35,980 మందికి ధృవపత్రాల పంపిణీ చేపట్టారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ఏమన్నారంటే.. సాఫ్ట్‌స్కిల్స్‌లో కొత్త అధ్యాయం.. మైక్రోసాఫ్ట్ ద్వారా 1.62 లక్షల మంది విద్యార్థులకు శిక్షణ అందించనుండటం ఇదే మొదటిసారి. మైక్రోసాఫ్ట్ చరిత్రలో ఏ దేశంలోనూ ఇంత భారీ స్థాయిలో శిక్షణ ఇవ్వలేదు. ఇప్పటికే శిక్షణ పూర్తైన విద్యార్థులకు, నవంబర్‌లో పూర్తి చేసుకోనున్న విద్యార్థులకు అభినందనలు. సాఫ్ట్ స్కిల్ డెవలప్మెంట్లో ఇది సరికొత్త అధ్యాయం. ఉద్యోగాల సాధనే ధ్యేయంగా నైపుణ్యాలను పెంచేలా పాఠ్య ప్రణాళికను తీర్చిదిద్దాం. సర్టిఫైడ్ కోర్సులను అందిస్తున్నాం. డిగ్రీలు పొందినా ఉద్యోగాలు వస్తున్నాయా? లేదా అని ప్రశ్నించుకోవాలి. అందుకే మైక్రోసాఫ్ట్ సంస్థతో అడుగులు వేశాం. ప్రపంచంలో అన్ని సంస్థలూ మన విద్యార్థుల వైపు చూసే రోజు రావాలని ఆకాంక్షిస్తున్నాం. విశాఖలోని సిరిపురం ఏయూ కాన్వొకేషన్ హాల్లో మైక్రోసాఫ్ట్ సర్టిఫికెట్ల ప్రదానోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు తదితరులు 40 భిన్న కోర్సుల్లో.. పట్టా పుచ్చుకున్న ప్రతి విద్యార్థీ పూర్తి స్థాయి నిపుణుడిగా మారి ఉద్యోగం సాధించాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగా 40 విభిన్న కోర్సుల్లో శిక్షణ ఇచ్చి సర్టిఫికెట్ జారీ చేసేందుకు మైక్రోసాఫ్ట్ ముందుకొచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, డేటా ఎనలిటిక్స్, నెట్వర్కింగ్, వెబ్ డిజైనింగ్, ఐవోటీ తదితర కోర్సుల్లో శిక్షణ అందించింది. ఉద్యోగాల సాధనకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఒక విద్యార్థి దాదాపు రూ.30 వేలు ఖర్చు చేస్తే కానీ పొందలేని ఈ శిక్షణ వ్యయాన్ని ప్రభుత్వమే భరించి ఉచితంగా అందచేశాం. మైక్రోసాఫ్ట్ కూడా చాలా ఉదారంగా ముందుకు వచ్చింది. రూ.465 కోట్ల విలువైన శిక్షణను కేవలం రూ.32 కోట్లకు అందించేందుకు అంగీకరించింది. ఈ మొత్తాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరించడంతో పిల్లలు ఉచితంగా శిక్షణ అందుకున్నారు. కేవలం శిక్షణ ఇచ్చి «ధృవపత్రాలు అందించడంతోనే సరిపెట్టుకోలేదు. వారికి ఉద్యోగావకాశాలు కల్పించేందుకు కూడా అడుగులు వేశాం. మైక్రోసాఫ్ట్ భాగస్వామ్యంతో ప్రపంచంలోనే అతి పెద్ద జాబ్ పోర్టల్ సంస్థ లింక్డిన్తో జతకట్టాం. సర్టిఫికెట్స్ పొందిన విద్యార్థులకు జాబ్‌లు కూడా సెర్చ్ చేసి సలహాలు అందించేలా చర్యలు తీసుకుంటాం. ముఖ్యమంత్రికి పుష్పగుచ్ఛం ఇస్తున్న మైక్రోసాఫ్ట్ ప్రతినిధులు విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు... ప్రాథమికవిద్య నుంచి ఇంగ్లీషు మీడియంను ప్రవేశపెట్టాం. అమ్మఒడి, మనబడి నాడు–నేడు, విద్యాకానుక, గోరు ముద్ద, సంపూర్ణ పోషణ లాంటి పథకాలు అందిస్తున్నాం. ఉన్నతవిద్యని ప్రోత్సహించేందుకు విద్యాదీవెన, వసతిదీవె న కార్యక్రమాలు చేపట్టాం. విదేశాల్లో చదువుకోవాలనుకునే వారికి విదేశీదీవెన అందిస్తున్నాం. చదువుకునేవారికి ఈ ప్రభుత్వం అన్నిరకాలుగా సహాయ, సహకారాలు అంది స్తోంది. విప్లవాత్మక మార్పులను విద్యారంగంలో తెచ్చాం. పోటీని తట్టుకునేలా విద్యార్థులను తీర్చిదిద్దుతున్నాం. 10 నెలల ఇంటర్న్‌షిప్ తప్పనిసరి చేశాం. బీటెక్ ఆనర్స్ లాంటి కోర్సులను అందిస్తున్నాం. పరిశ్రమల అవసరాలకు తగ్గ ట్లుగా శిక్షణ అందిస్తున్నాం. డిగ్రీ, ఇంజనీరింగ్‌లో ఇండ స్ట్రియల్ ఓరియంటేషన్, డ్యుయల్ డిసిప్లినరీ సర్టిఫికేషన్ కోర్సులు, స్కిల్ కోర్సులు ప్రవేశపెట్టాం. దేశంలో తొలిసారిగా నాలుగేళ్ల ఆనర్స్ అండర్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్ని తెచ్చాం. ఆన్లైన్ లెర్నింగ్ ద్వారా మేనేజ్మెంట్ స్కిల్స్, ప్రోగ్రామింగ్ లెర్నింగ్ కోసం 2,500 వీడియోలు, 450 ఆడియో పోడ్కేస్ట్లు ఇందులో పొందుపరిచాం. 13 కంపెనీలతో మ్యాపింగ్.. విద్యాసంస్థలను పరిశ్రమలతో అనుసంధానించేలా ఉన్నత విద్యకు సంబంధించి ఒక పోర్టల్‌ని ప్రారంభించాం. ఇందు లో ఇప్పటి వరకూ 1,65,341 మంది విద్యార్థులు రిజిస్టర్ అయ్యారు. నాస్కామ్, మార్క్బ్రిడ్జి, ఎడ్యుస్కిల్స్తో ఒప్పం దాలు చేసుకున్నాం. వర్చువల్ ఇంటర్న్‌షిప్‌లు చేపడుతు న్నాం. ఇప్పటి వరకూ 1.15 లక్షలమంది విద్యార్థుల్ని 13 కంపెనీలతో ఇంటర్న్‌షిప్‌కు మ్యాపింగ్ చేశాం. బాగా చదు వుకుంటేనే పేదరికం నుంచి బయటకు వస్తారనే తాపత్ర యంతో ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఇప్పుడున్న కరిక్యులమ్ జాబ్ ఓరియంటెడ్‌గా ఉందా లేదా? అనే విషయంపై సీఎం స్థాయి నుంచి కిందిస్థాయి వరకూ మనసు పెట్టి ఆలోచన చే స్తున్నాం. రాష్ట్రంలో గ్రాస్ ఎన్రోల్మెంట్రేషియో (జీఈ ఆర్) మారాలి. 18 నుంచి 23 సంవత్సరాల్లోపు పిల్లలు ఎంతమంది కాలేజీల్లో అడుగు పెడుతున్నారనేది బ్రిక్స్ దేశా లతో పోల్చి చూస్తుంటాం. దురదృష్టమేంటంటే అది మన దేశంలో 26 శాతమే ఉంది. మిగిలినవారు కాలేజీల్లో ఎందు కు చేరడం లేదని పరిశీలన చేస్తే ఆర్థిక భారం కారణంగా కాలేజీల్లో అడుగులు పడటం లేదని తెలిసింది. పిల్లల్ని చదివించేలా తల్లిదండ్రులను ప్రోత్సహిస్తూ అన్ని రకాలుగా తోడుగా నిలుస్తున్నాం. ఈరోజు మైక్రోసాఫ్ట్ సర్టిఫికేషన్ ద్వారా దాదాపు 36 వేలమంది పిల్లలకు ఉద్యోగాలు వచ్చే అవకాశాలు మెరుగుపడటం శుభపరిణామం. సాఫ్ట్ స్కిల్స్‌లో శిక్షణ పొందిన విద్యార్థినికి సర్టిఫికెట్ అందజేస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రాథమిక విద్య నుంచే ఇంగ్లీష్.. ఇంగ్లీష్ మీడియం లేకపోతే పోటీ ప్రపంచంలో పిల్లలు నెగ్గుకు రాలేరని ప్రాథమిక విద్య నుంచి కూడా ఇంగ్లీష్ మీడియం పెట్టాం. తల్లులను చైతన్యం చేసేందుకు అమ్మ ఒడి తీసుకొచ్చాం. మన బడి.. నాడు–నేడుతో మెరుగైన మౌలిక సదుపాయాల్ని సమకూర్చాం. విద్యా కానుక కింద వారికి కావాల్సినవన్నీ సమకూర్చాం. గోరుముద్ద, సంపూర్ణ పోషణతో ప్రాథమిక విద్య నుంచి ఉన్నత విద్యవరకూ పిల్లల్ని చేయిపట్టి నడిపిస్తూ అడుగులు వేస్తున్నాం. ఇంటర్‌తో ఆగిపోకుండా ప్రతి విద్యార్థీ పై చదువులు చదవాలని ఉద్దేశంతో విద్యాదీవెన, వసతి దీవెన పథకాలను తెచ్చాం. ప్రతి త్రైమాసికంలో విద్యా దీవెన ఇస్తున్నాం. ఏటా క్రమం తప్పకుండా రెండుసార్లు వసతి దీవెన అందిస్తున్నాం. ఇవన్నీ ఒకవైపు చేస్తూనే పాఠ్యప్రణాళికలో రూపు రేఖలు మారుస్తున్నాం. అందరికీ సమాన అవకాశాలు నేను బీఎస్సీ స్టాటిస్టిక్స్ చేశా. చాలామంది నాకు ట్రైనింగ్ ఇవ్వరని అన్నారు. కానీ నాకు శిక్షణ ఇచ్చారు. అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తున్నందుకు కృతజ్ఞతలు సర్. ఆర్థిక స్థోమత కారణంగా విద్యకు దూరం కాకుండా చర్యలు తీసుకున్న గొప్ప ముఖ్యమంత్రిగా మీరు చరిత్రలో నిలిచిపోతారు. అమ్మ ఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, విదేశీ దీవెన లాంటి పథకాల ద్వారా ప్రాథమిక విద్య నుంచి ఉన్నత విద్య వరకూ ఎక్కడా బ్రేక్ లేకుండా చదువు కొనసాగించేలా ఆలోచన చేయడం నిజంగా గ్రేట్ లీడర్‌కే సాధ్యం. – లిఖిత నెక్కంటి, బీఎస్సీ స్టాటిస్టిక్స్ విద్యార్థిని ముఖ్యమంత్రి తపనతో బృహత్తర కార్యక్రమం ప్రపంచవ్యాప్తంగా మన యువతకు ఉద్యోగావకాశాలు కల్పించాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి జగన్ ఈ అద్భుత కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మైక్రోసాఫ్ట్ ఎక్కడా ఇంత పెద్ద స్థాయిలో శిక్షణ అందించలేదు. శిక్షణకు అయిన ప్రతి పైసానూ ప్రభుత్వమే భరించింది. గత అక్టోబర్‌లో ట్రైనింగ్ ప్రారంభమైంది. పోటీని తట్టుకొని ప్రపంచాన్ని శాసించేస్థాయికి మన విద్యార్థులు ఎదగాలి. – బొత్స సత్యనారాయణ, విద్యాశాఖ మంత్రి ప్రపంచంలోనే అతి పెద్ద స్కిల్లింగ్ ప్రోగ్రామ్ రాష్ట్ర ప్రభుత్వంతో వేసిన అడుగులు చరిత్రాత్మకం. ఇంత గొప్ప కార్యక్రమానికి మైక్రోసాఫ్ట్ అధినేత సత్య నాదెళ్ల రాలేకపోయారు. కానీ సందేశం పంపించారు. కెరీర్లో అద్భుతమైన దిశగా పయనించేందుకు ఏపీ విద్యార్థులు శిక్షణ తీసుకోవడం చాలా ఉద్వేగంగా ఉంది. డేటా సైన్స్, బిజినెస్, ఇతర కీలక అంశాలకు సంబంధించి శిక్షణ అందించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. 35,980 మంది విద్యార్థులు విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్నారు. లింక్డిన్ సపోర్ట్‌తో ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా అడుగులు వేస్తున్నాం. – నవ్‌తేజ్ బాల్, మైక్రోసాఫ్ట్ ఇండియా హెడ్ ఇదీ చదవండి: పర్యావరణాన్ని పరిరక్షిస్తేనే ఆర్థిక పురోగతి.. సీఎం జగన్ -
రేపు పాలీసెట్
♦ హాజరుకానున్న 1.31 లక్షల మంది ♦ ఏర్పాట్లు పూర్తి చేసిన ఎస్బీటీఈటీ ♦ నిమిషం ఆలస్యమైనా అనుమతి లేదు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్ కాలేజీల్లో డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈనెల 22న పాలీసెట్–2017 నిర్వహించేందుకు రాష్ట్ర సాంకేతిక విద్యా శిక్షణ మండలి (ఎస్బీటీఈటీ) అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్షను నిర్వహించనుంది. పరీక్షకు హాజరయ్యేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 1,31,044 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 393 కేంద్రాల్లో పరీక్షలను పక్కాగా నిర్వహించేందుకు 52 సమన్వయ కేంద్రాలను ఏర్పాటు చేసింది. విద్యార్థులను పరీక్ష హాల్లోకి గంట ముందునుంచే అనుమతిస్తామని, ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకునేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని ఎస్బీటీఈటీ సూచించింది. ఉదయం 11 గంటలకు పరీక్ష ప్రారంభం అయ్యాక నిమిషం ఆలస్యమైనా విద్యార్థులను పరీక్ష హాల్లోకి అనుమతించేది లేదని స్పష్టం చేసింది. సెల్‌ఫోన్, మొబైల్, క్యాలుక్యు లేటర్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్ష హాల్లోకి అనుమతించేది లేదని, విద్యార్థులు హెచ్‌బీ/2బీ పెన్సిల్, ఎరేజర్, షార్ప్‌నర్, ఎగ్జామ్ ప్యాడ్ వెంట తెచ్చుకోవాలని సూచించింది. విద్యార్థులు తమ వెబ్సైట్ నుంచి (ఞౌlyఛ్ఛ్టి్టట.nజీఛి.జీn) హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపింది. ఏమైనా సమస్యలు తలెత్తితే హెల్ప్‌లైన్ కేంద్రాల్లో సంప్రదించాలని, హెల్ప్ డెస్క్ నంబర్లలోనూ (8499827774, 18005995577–టోల్‌ఫ్రీ, ఞౌlyఛ్ఛ్టి్టటఃజఝ్చజీl.ఛిౌఝ మెయిల్లో) సంప్రదించ వచ్చని వివరించింది. -
సినీ రంగ ప్రవేశానికి డిప్లొమా కోర్సులు
నెల్లూరు(బారకాసు)/దర్గామిట్ట: సౌత్ ఇండియా సినీ కల్చరల్ అసోసియేషన్(ఎస్ఐసీసీఏ) సంస్థ ఆధ్వర్యంలో నెల్లూరులో సినిమా పరిశ్రమను ఏర్పాటు చేస్తున్నట్లు ఆ సంస్థ నిర్వాహకుడు మంజునాథ్ మస్కల్మట్టి తెలిపారు. స్థానిక ఇస్కాన్‌సిటీలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సినీ, టీవీ రంగాల్లో ప్రవేశించే వారికి డిప్లమా ఇన్ ఫిల్మ్‌మేకింగ్(డీఎఫ్ఎం), డిప్లమా ఇన్ ఫిల్మ్ ఆర్ట్(డీఎఫ్ఏ), డిప్లమా ఇన్ ఫిల్మ్ టెక్నాలజీ(డీఎఫ్టీ) కోర్సులను తమ సంస్థ స్కూల్ ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్‌లో ప్రారంభిచామన్నారు. ప్రస్తుతం అడ్మిషన్లు జరుగుతున్నాయన్నారు. ఏప్రిల్ 10 నుంచి క్లాసులు ప్రారంభిస్తామన్నారు. అర్హులైన పేద కళాకారులకు పింఛన్లు ఇస్తామన్నారు. సమావేశంలో నిర్వాహకులు సెంథిల్‌రాజ్, సరిగమ వీజీ, మైకోమంజు, వేణుగోపాల్, విజయభాస్కర్‌రెడ్డి, బుజ్జిబాబు, ప్రీతి, అశ్వని, ప్రతిభ, మునియప్ప, లింగా, రఫి, హేమంత్ పాల్గొన్నారు. -
‘డిగ్రీ’ వద్దు.. ‘డిప్లొమా’ ముద్దు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థుల సంఖ్య లక్షకు పైగా తగ్గిపోయింది. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ), డెలాయిట్ సంస్థ సంయుక్తంగా వెల్లడించిన నివేదిక ఈ విషయాన్ని స్పష్టం చేసింది. అంతేకాదు గతంతో పోల్చితే మన రాష్ట్రంలో కాలేజీల సంఖ్య కూడా పెరిగిందని ‘యాన్యువల్ స్టేటస్ ఆఫ్ హైయ్యర్ ఎడ్యుకేషన్ (ఏఎస్‌హెచ్‌ఈ) ఆఫ్ స్టేట్స్ అండ్ యూటీస్ ఇన్ ఇండియా–2016’నివేదిక తెలిపింది. ఈ నివేదికను సీఐఐ ఇటీవల విడుదల చేసింది. ఏఎస్‌హెచ్‌ఈ–2015 నివేదిక ప్రకారం రాష్ట్రం లో 13,82,137 మంది విద్యార్థులు వివిధ ఉన్నత విద్యా కోర్సులను అభ్యసించగా, 2016 నివేదిక ప్రకారం 12,81,443 మందే ఉన్నత విద్యను అభ్యసిస్తున్నట్లు వెల్లడైంది. మొత్తం లక్షమంది విద్యార్థులు తగ్గగా.. ఒక్క డిగ్రీలోనే 79,880 మంది తగ్గిపోయారు. అలాగే గతంలో రాష్ట్రంలో మొత్తం 2,256 కాలేజీలు ఉంటే 2016 నివేదిక ప్రకారం వాటి సంఖ్య 2,536కు పెరిగింది. అంటే 284 కాలేజీలు పెరిగాయి. పెరిగిన బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థుల సంఖ్య మొత్తంగా తగ్గినా.. బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. గతంలో కంటే ఈసారి బీసీ, ఎస్సీ, ఎస్టీల్లో కాలేజీల్లో చేరిన విద్యార్థుల సంఖ్య పెరిగిందని నివేదిక వెల్లడించింది. 2015 నివేదిక ప్రకారం ఎస్సీ విద్యార్థులు 15.8 శాతం ఉన్నత విద్యను అభ్యసిస్తే.. 2016లో 16.2 శాతానికి పెరిగింది. బీసీ విద్యార్థులు అంతకుముందు 42.5 శాతం మంది ఉన్నత విద్యను అభ్యసించగా, తాజాగా 44 శాతానికి పెరిగింది. ఎస్టీ విద్యార్థులు గతంలో 7.4 శాతం ఉండగా, ప్రస్తుతం 8.4 శాతానికి పెరిగింది. ముస్లిం విద్యార్థుల సంఖ్య గతంలో 6.5 శాతం ఉంటే.. ఈసారి 6.8 శాతానికి చేరింది. డిప్లొమాకు పెరుగుతున్న ఆదరణ రాష్ట్రంలో డిప్లొమా కోర్సులు చదివే విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. గత నివేదికతో పోలిస్తే 2016లో 15,042 మంది అత్య«ధికంగా డిప్లొమా కోర్సుల్లో చేరారు. మన రాష్ట్రాల్లోనే ఎక్కువ అధ్యాపకులు ఎక్కువ మంది ఉన్న రాష్ట్రాల్లో కేరళ, కర్ణాటక ముందున్నాయి. అక్కడ ఉన్నత విద్యను బోధించేందుకు 13 మంది విద్యా ర్థులకు ఒక అధ్యాపకుడు ఉండగా.. తెలం గాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో 14 మంది విద్యార్థులకు ఒక అధ్యాపకుడు ఉన్నారు. దేశ వ్యాప్తంగా చూస్తే సరాసరి ప్రతి 21 మంది విద్యార్థులకు ఒక అధ్యాపకుడు పని చేస్తున్నట్లు వెల్లడించింది. -
డిప్లమో కోర్సు నిర్వహణకు ఒప్పందం
ఎచ్చెర్ల: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీలో పీజీ డిప్లమో ఇన్ మెడికల్ రికార్డ్సు హెల్త్ ఆర్గనైజేషన్ కోర్సు నిర్వహ ణకు బొల్లినేని మెడిస్కిప్సు సంస్థతో మంగళవారం ఒప్పందం కుదిరింది. ఈ మేరకు వర్సిటీ ఇన్చార్జి వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ మిర్యాల చంద్రయ్య, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ గుంట తులసీరావు, బొల్లినేని సంస్థ సెంటర్ హెడ్ సీహెచ్ నాగేశ్వరరావు, అకడమిక్ డెరైక్టర్ లక్ష్మీ శైలజ పరస్పరం ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు. ఏడాది కాలపరిమితి గల ఈ కోర్సు చదివేందుకు డిగ్రీ అర్హత. 35 ఏళ్లులోపు వారు దరఖాస్తు చేసుకోవచ్చు. 70 శాతం ప్రాక్టికల్, 30 శాతం థియరీ పద్ధతిలో ఉండే ఈ కోర్సు ఫీజు రూ.20 వేలు. రాగోలు జెమ్స్ ఆస్పత్రిలో తరగతులు నిర్వహించనున్నారు. పరీక్షల నిర్వహణ, ధ్రువీకరణ పత్రాల జారీ తదితర ప్రక్రియలను వర్సిటీ చేపట్టనుంది. ఈ ఏడాది నుంచే కోర్సు ప్రారంభం కానుంది. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ పెద్దకోట చిరంజీవులు, ఎగ్జామినేషన్స్ డీన్ ప్రొఫెసర్ తమ్మినేని కామరాజు, చీఫ్ వార్డెన్ ప్రొఫెసర్ బిడ్డిక అడ్డయ్య పాల్గొన్నారు. -
పాలీసెట్ ప్రశాంతం
97 శాతం మంది హాజరు నిమిషం ఆలస్యం నిబంధనతో పరీక్ష రాయలేకపోయిన పలువురు విద్యార్థులు సిటీబ్యూరో: ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలల్లో డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం గురువారం నిర్వహించిన పాలీసెట్-2016 ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. జంట నగరాల్లో 30,444 మందికి గాను 30,010 (97 శాతం) మంది అభ్యర్థులు పరీక్షకు హాజరైనట్లు అధికారులు తెలిపారు. మొత్తం 65 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు. పరీక్ష ప్రారంభ సమయం ఉదయం 11 గంటలకు ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు ముందే చెప్పినా... పలుచోట్ల అభ్యర్థులు ఆలస్యంగా వెళ్లారు. ఫలితంగా వారిని అధికారులు పరీక్షా కేంద్రంలోకి అనుమతించలేదు. దీంతో అభ్యర్థులు కన్నీటి పర్యంతమవుతూ ఇంటి దారి పట్టారు. నిరాశ.. కంటోన్మెంట్: నిమిషం ఆలస్యం నిబంధన ఓ విద్యార్థి పరీక్ష రాసే అవకాశం కోల్పోయేలా చేసింది. మారేడ్‌పల్లిలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలోని పరీక్షా కేంద్రానికి అఖిల్ అనే విద్యార్థి ఆలస్యంగా రావడంతో అధికారులు లోపలికి అనుమతించలేదు. అఖిల్ ఎంత వేడుకున్నా నిబంధనలకు విరుద్ధంగా తాము పరీక్షకు అనుమతించేది లేదని అధికారులు తేల్చి చెప్పడంతో నిరాశతో వెనుదిరగాల్సి వచ్చింది. -
ప్రధానోపాధ్యాయులకు నాయకత్వ పాఠాలు!
ప్రత్యేకంగా ఏడాది డిప్లొమా కోర్సు ప్రభుత్వ పాఠశాలల నిర్వహణలో మెళకువలపై ప్రత్యేక శిక్షణ రాష్ట్రంలో దశల వారీగా అమలుకు కసరత్తు వేసవి సెలవుల్లో శిక్షణకు సిద్ధమవుతున్న జాతీయ విద్యా ప్రణాళిక విభాగం సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోని ప్రధానోపాధ్యాయులకు నాయకత్వ లక్షణాలు లేవని, అందువల్లే పాఠశాలల నిర్వహణ అస్తవ్యస్తంగా మారుతోందని భావిస్తున్న కేంద్ర ప్రభుత్వం ప్రధానోపాధ్యాయులకు వాటిని నేర్పించేందుకు నడుంబిగించింది. ఇందులో భాగంగా అన్ని రాష్ట్రాల్లో ప్రధానోపాధ్యాయులకు శిక్షణ అవసరమని స్పష్టం చేసింది. ఇటీవల వివిధ రాష్ట్రాలకు చెందిన విద్యాశాఖ అధికారులతో నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ ఎడ్యుకేషనల్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ (న్యూపా) ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించింది. ప్రధానోపాధ్యాయుల్లో సామర్థ్యాల పెంపునకు 16 రోజులపాటు శిక్షణ కార్యక్రమాలు చేపట్టాలని అన్ని రాష్ట్రాలకు స్పష్టం చేసింది. అలాగే స్కూల్ లీడర్షిప్ అండ్ మేనే జ్‌మెంట్‌పై నె లపాటు రానున్న వేసవి సెలవుల్లో ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని సూచిం చింది. ఇక దీర్ఘకాలిక అవసరాల దృష్ట్యా ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాళ్లు, సీనియర్ టీచర్లకు స్కూల్ లీడర్షిప్ అండ్ మేనేజ్మెంట్పై ఏడాది వ్యవధితో పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమాను నిర్వహించాలని స్పష్టం చేసింది. దీనికి సంబంధించి న్యూపాకు చెందిన ప్రతినిధులు కూడా ఇటీవల హైదరాబాద్‌కు వచ్చి రాష్ట్రంలో ప్రధానోపాధ్యాయులకు ఏయే అంశాల్లో శిక్షణ అవసరం? ఎలా నిర్వహించాలన్న వివిధ అంశాలను తెలియజేశారు. దశలవారీగా శిక్షణ.. రాష్ట్రంలోని ప్రధానోపాధ్యాయులకు దశలవారీగా శిక్షణ కార్యక్రమాలు చేపట్టేందుకు విద్యాశాఖ సిద్ధమవుతోంది. ఎలిమెంటరీ స్కూళ్లలో ప్రధానోపాధ్యాయులకు సర్వ శిక్షా అభియాన్ (ఎస్ఎస్ఏ) ద్వారా, ఉన్నత పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులకు రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ (ఆర్‌ఎంఎస్‌ఏ) ద్వారా శిక్షణ ఇచ్చేందుకు చర్యలు చేపడుతోంది. మొదటి దశలో మెదక్, ఆదిలాబాద్, ఆ తరువాత కరీంనగర్, నిజమాబాద్, నల్లగొండ, చివరగా మిగితా జిల్లాల్లో ఈ శిక్షణ కార్యక్రమాలు చేపట్టేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. అయితే ఈ శిక్షణను 10 రోజులు ఇవ్వాలా? 16 రోజులు ఇవ్వాలా? అనే అంశాలపై ఆలోచనలు చేస్తున్నారు. న్యూపా డిప్లొమా కోర్సును ప్రవేశపెట్టాలని పేర్కొన్న నేపథ్యంలో వీటితోపాటు 45 రోజులు ఉండే షార్ట్ టర్మ్ శిక్షణ కోర్సు, 3 నెలలు ఉండే సర్టిఫికెట్ కోర్సు, తరువాత డిప్లొమా కోర్సు ప్రవేశపెడితే ఎలా ఉంటుందన్న కోణంలో ఆలోచిస్తోంది. ఏయే అంశాల్లో శిక్షణ ఇస్తారంటే.. నాణ్యత ప్రమాణాల పెంపు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, పాఠశాల పరిపాలన, సమాచార సాంకేతిక విజ్ఞాన వినియోగం, మానవ వనరుల నిర్వహణ, కమ్యూనిటీ భాగస్వామ్యం పెంపు, సేవల్లో పరిపాలన నైపుణ్యాలు. అన్ని స్కూళ్లలో ప్రధానోపాధ్యాయులకు శిక్షణలు అవసరమే! రాష్ట్రంలో 28,707 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. అన్నింటిలో రెగ్యులర్ ప్రధానోపాధ్యాయులు లేకపోయినా ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు అన్ని పాఠశాలలకు ఉన్నారు. అయితే వాటిల్లో పని చేసే ప్రధానోపాధ్యాయులందరికీ శిక్షణ అవసరమని విద్యాశాఖ వర్గాలు భావిస్తున్నాయి. -
రేపే మెడికల్ పీజీ ప్రవేశ పరీక్ష
-
రేపే మెడికల్ పీజీ ప్రవేశ పరీక్ష
కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసిన అధికారులు రాష్ట్రంలోని ఎనిమిది నగరాల్లో నిర్వహణ మే మొదటివారంలో ఫలితాల విడుదల విజయవాడ, వైద్యవిద్య పోస్టుగ్రాడ్యుయేషన్, డిప్లొమా కోర్సుల్లో వచ్చే విద్యాసంవత్సరం(2014-15) అడ్మిషన్లకోసం ఈ నెల 27న ప్రవేశ పరీక్ష(పీజీ-మెట్) నిర్వహించేందుకు డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. పీజీమెట్ను తిరిగి నిర్వహించాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని హైకోర్టు శుక్రవారం సమర్థించిన నేపథ్యంలో.. ముందుగా ప్రకటించిన ప్రకారం 27న ప్రవేశపరీక్ష నిర్వహణకు అధికారులు సర్వం సిద్ధంచేశారు. కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లమధ్య ఎంట్రెన్స్‌ను నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. గతంలో నిర్వహించి రద్దయిన పరీక్షకు 15,194 మంది విద్యార్థులు హాజరవగా, ఈసారి కొత్తవారికీ అవకాశమివ్వడంతో మరో 549 మంది దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్రంలోని 8 నగరాల్లోని 24 కేంద్రాల్లో ఉదయం 10 గంటలనుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పరీక్షను నిర్వహిస్తారు. విజయవాడలోని మేరీస్టెల్లా కళాశాలకు బదులుగా పీవీపీ ఇంజనీరింగ్ కళాశాలలో, గుంటూరులోని ఏసీ కళాశాలకు బదులుగా ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఈసారి పరీక్షను నిర్వహించనున్నట్లు వర్సిటీ అధికారులు తెలిపారు. మే మొదటివారంలో ఫలితాలు విడుదల చేస్తామని పేర్కొన్నారు. పరీక్షా కేంద్రాల్లో సెల్ జామర్లు ఏర్పాటు చేస్తున్నామని, హాల్‌టికెట్, పెన్ను మినహా సెల్‌ఫోన్, బ్లూటూత్ లాంటి పరికరాలను లోపలికి అనుమతించేది లేదని తెలిపారు. ప్రతిఒక్కరినీ క్షుణ్ణంగా పరీక్షించాకే పరీక్షా కేంద్రం లోపలికి అనుమతిస్తామని స్పష్టం చేశారు. మెడికల్ పీజీ రీఎంట్రన్స్కు సంబంధించి.. హాల్ టికెట్లను వర్సిటీ వెబ్సైట్ జ్ట్టిఞ//ఠీఠీఠీ.్టటఠజిట.ౌటజలో ఐదురోజుల కిందటే ఉంచినట్లు అధికారులు తెలిపారు. ‘పీజీ-మెట్’ పునఃనిర్వహణ సరైనదే: హైకోర్టు హైదరాబాద్: పోస్ట్ గ్రాడ్యుయేట్ వైద్య ప్రవేశ పరీక్ష (పీజీ-మెట్)ను తిరిగి నిర్వహించాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని హైకోర్టు సమర్థించింది. ఈ నెల 27వతేదీన పీజీ-మెట్ తిరిగి నిర్వహించేందుకు ప్రభుత్వం జారీ చేసిన జీవో 69ని కొట్టివేసేందుకు నిరాకరించింది. జీవో 69 కొట్టివేయాలంటూ 90 మందికి పైగా విద్యార్థులు దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టి వేస్తూ న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావు శుక్రవారం తీర్పు వెలువరించారు. అవకతవకలు జరిగినప్పుడు పాత పరీక్షను రద్దు చేసి తిరిగి నిర్వహించే అధికారం ప్రభుత్వానికి ఉందని, ఆ అధికారాన్ని అహేతుకమైనదిగా ప్రకటించజాలమని న్యాయమూర్తి తన తీర్పులో తేల్చి చెప్పారు. కొందరి అత్యాశకు అమాయకులైన ఎందరో విద్యార్థులు బాధితులుగా మారారనడంలో సందేహం లేదని జస్టిస్ నవీన్‌రావు స్పష్టం చేశారు.