సినీ రంగ ప్రవేశానికి డిప్లొమా కోర్సులు
Published Wed, Mar 22 2017 4:13 PM | Last Updated on Sat, Oct 20 2018 6:19 PM
నెల్లూరు(బారకాసు)/దర్గామిట్ట: సౌత్ ఇండియా సినీ కల్చరల్ అసోసియేషన్(ఎస్‌ఐసీసీఏ) సంస్థ ఆధ్వర్యంలో నెల్లూరులో సినిమా పరిశ్రమను ఏర్పాటు చేస్తున్నట్లు ఆ సంస్థ నిర్వాహకుడు మంజునాథ్ మస్కల్‌మట్టి తెలిపారు. స్థానిక ఇస్కాన్‌సిటీలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సినీ, టీవీ రంగాల్లో ప్రవేశించే వారికి డిప్లమా ఇన్ ఫిల్మ్‌మేకింగ్(డీఎఫ్‌ఎం), డిప్లమా ఇన్ ఫిల్మ్ ఆర్ట్(డీఎఫ్‌ఏ), డిప్లమా ఇన్ ఫిల్మ్ టెక్నాలజీ(డీఎఫ్‌టీ) కోర్సులను తమ సంస్థ స్కూల్ ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్‌లో ప్రారంభిచామన్నారు.
ప్రస్తుతం అడ్మిషన్లు జరుగుతున్నాయన్నారు. ఏప్రిల్ 10 నుంచి క్లాసులు ప్రారంభిస్తామన్నారు. అర్హులైన పేద కళాకారులకు పింఛన్లు ఇస్తామన్నారు. సమావేశంలో నిర్వాహకులు సెంథిల్‌రాజ్, సరిగమ వీజీ, మైకోమంజు, వేణుగోపాల్, విజయభాస్కర్‌రెడ్డి, బుజ్జిబాబు, ప్రీతి, అశ్వని, ప్రతిభ, మునియప్ప, లింగా, రఫి, హేమంత్ పాల్గొన్నారు.
Advertisement