థియేటర్లకు కష్టం
థియేటర్లకు కష్టం
Published Sat, Nov 12 2016 2:22 AM | Last Updated on Sat, Oct 20 2018 6:19 PM
నెల్లూరు సిటీ :
పెద్ద నోట్ల రద్దుతో సినిమా థియేటర్లకు ‘కలెక‌్షన్ల’ కష్టంగా మారింది. నగరంలో 9 థియేటర్లు ఉన్నాయి. చిన్న నోట్లు తప్ప పెద్ద నోట్లు స్వీకరించకపోవడంతో యజమాన్యాలకు ‘సినిమా’ కష్టాలు తప్పడం లేదు. శుక్రవారం పలు కొత్త సినిమాలు విడుదల కావడంతో ప్రేక్షకులు థియేటర్‌కు వచ్చినా.. పెద్ద నోట్ల సమస్యతో వెనుదిరిపోయారు. దీంతో క్యూలైన్లు బోసిపోయాయి. మూడు రోజులుగా టికెట్లు విక్రయాలు, క్యాంటిన్‌లో తినుబండరాలు విక్రయాలు సైతం తగ్గుముఖం పట్టాయి.
ఆన్‌లైన్‌లో టికెట్లు కొనుగోలు
నగరంలోని అన్ని థియేటర్లలో ఆన్‌లైన్ సేవలు ఉన్నాయి. ఇంట్లో నుంచే ఆన్‌లైన్ ద్వారా టికెట్లు కొనుగోలు చేసే అవకాశం ఉండటంతో కొందరు థియటర్లకు చేరుకున్నారు. శుక్రవారం «పలు సినిమాలు విడుదల కావడంతో ఎక్కువ శాతం టికెట్లు విక్రయాలు ఆన్‌లైన్‌లో జరిగాయని తెలుస్తుంది. తినుబండరాలు కొనుగోళ్లు సైతం ముందుగానే ఆన్‌లైన్‌లో చేయడం విశేషం.
Advertisement
Advertisement