రేపు పాలీసెట్‌ | Polytechnic Colleges Diploma Course in this month 22th | Sakshi
Sakshi News home page

రేపు పాలీసెట్‌

Published Fri, Apr 21 2017 3:15 AM | Last Updated on Mon, Sep 17 2018 7:38 PM

రేపు పాలీసెట్‌ - Sakshi

రేపు పాలీసెట్‌

హాజరుకానున్న 1.31 లక్షల మంది
ఏర్పాట్లు పూర్తి చేసిన ఎస్‌బీటీఈటీ
నిమిషం ఆలస్యమైనా అనుమతి లేదు  


సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్‌ కాలేజీల్లో డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈనెల 22న పాలీసెట్‌–2017 నిర్వహించేందుకు రాష్ట్ర సాంకేతిక విద్యా శిక్షణ మండలి (ఎస్‌బీటీఈటీ) అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్షను నిర్వహించనుంది. పరీక్షకు హాజరయ్యేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 1,31,044 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 393 కేంద్రాల్లో పరీక్షలను పక్కాగా నిర్వహించేందుకు 52 సమన్వయ కేంద్రాలను ఏర్పాటు చేసింది.

విద్యార్థులను పరీక్ష హాల్లోకి గంట ముందునుంచే అనుమతిస్తామని, ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకునేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని ఎస్‌బీటీఈటీ సూచించింది. ఉదయం 11 గంటలకు పరీక్ష ప్రారంభం అయ్యాక నిమిషం ఆలస్యమైనా విద్యార్థులను పరీక్ష హాల్లోకి అనుమతించేది లేదని స్పష్టం చేసింది. సెల్‌ఫోన్, మొబైల్, క్యాలుక్యు లేటర్‌ వంటి ఎలక్ట్రానిక్‌ పరికరాలను పరీక్ష హాల్లోకి అనుమతించేది లేదని, విద్యార్థులు హెచ్‌బీ/2బీ పెన్సిల్, ఎరేజర్, షార్ప్‌నర్, ఎగ్జామ్‌ ప్యాడ్‌ వెంట తెచ్చుకోవాలని సూచించింది.

విద్యార్థులు తమ వెబ్‌సైట్‌ నుంచి (ఞౌlyఛ్ఛ్టి్టట.nజీఛి.జీn) హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని తెలిపింది. ఏమైనా సమస్యలు తలెత్తితే హెల్ప్‌లైన్‌ కేంద్రాల్లో సంప్రదించాలని, హెల్ప్‌ డెస్క్‌ నంబర్లలోనూ (8499827774, 18005995577–టోల్‌ఫ్రీ,  ఞౌlyఛ్ఛ్టి్టటఃజఝ్చజీl.ఛిౌఝ మెయిల్‌లో) సంప్రదించ వచ్చని వివరించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement