
సాక్షి, హైదరాబాద్: డిగ్రీ కోర్సుల్లో ప్రవేశానికి ‘దోస్త్’ ద్వారా దరఖాస్తు చేసిన విద్యార్థులకు గురువారం తొలి దశ సీట్లు కేటాయిస్తారు. సాయంత్రం 3గంటలకు విద్యా ర్థులు ఏ కాలేజీలో, ఏ కోర్సులో సీటు వచ్చిందో ఆన్‌లైన్ ద్వారా చూసుకోవచ్చని ఉన్నత విద్యా మండలి కార్యదర్శి శ్రీరాం వెంకటేశ్ తెలిపారు. దోస్త్‌లో ఇప్పటివరకూ 1.03 లక్షల మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వీరిలో 85 వేల మంది వెబ్ ఆప్షన్లు ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment