ఏపీలో ఇసుజు పికప్ ట్రక్స్ తయారీ ప్లాంట్ | isuzu pickup trucks manufacturing plant in AP | Sakshi
Sakshi News home page

ఏపీలో ఇసుజు పికప్ ట్రక్స్ తయారీ ప్లాంట్

Published Tue, Nov 18 2014 1:04 AM | Last Updated on Sat, Sep 2 2017 4:38 PM

ఏపీలో ఇసుజు పికప్ ట్రక్స్ తయారీ ప్లాంట్

ఏపీలో ఇసుజు పికప్ ట్రక్స్ తయారీ ప్లాంట్

విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌లో పికప్ ట్రక్స్ తయారీ ఫ్యాక్టరీ నిర్మాణం చేపడుతున్నామని ఇసుజు మోటార్స్ ఇండియా ప్రయివేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరక్టర్ టకాషి కికుచి తెలిపారు. నగరంలో సోమవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నెల్లూరు జిల్లా శ్రీ సిటి వద్ద ఉన్న తడలో 107 ఎకరాల్లో పికప్ ట్రక్స్ తయారీ కంపెనీ పనులు జరుగుతున్నాయని చెప్పారు. రూ.3 వేట కోట్లు పెట్టుబడితో నిర్మించనున్నా ఫ్యాక్టరీలో 3వేల మందికి  ఉద్యోగ అవకాశాలు కల్పించానున్నామన్నారు.

2016 నాటికి పూర్తి స్థాయిలో ఈ ఫ్యాక్టరీ వినియోగంలోకి రానుందని చెప్పారు.  ఏడాదికి 50 వేల యూనిట్ల తయారీ లక్ష్యమన్నారు. జపాన్ పర్యటన సందర్భంగా సీఎం చంద్రబాబుతో ఇసుజు ట్రక్స్ తయారీ ఫ్యాక్టరీ, ఉపాధి తదితర విషయాలు చర్చిస్తామన్నారు. ప్రస్తుతం ఇసుజు వెహికల్స్ విడిభాగాలు దిగుమతి చేసుకుని చైన్నై హిందుస్థాన్ కంపెనీలో వాహనాలను ఉత్పత్తి చేస్తున్నామన్నారు. 11 మంది డీలర్‌షిప్‌ల ద్వారా రాష్ట్ర మార్కెట్‌లో తమ వెహికల్స్ అమ్ముడవుతున్నాయని చెప్పారు. 2016 నాటికి 60 డీలర్‌షిప్‌లు పెంచుతామన్నారు.  సమావేశంలో  ఇసుజు మోటార్స్ ఇండియా ప్రయివేట్ లిమిటెడ్ డిప్యూటీ మేనేజింగ్ డైరక్టర్ శిగెరు వాకాబాయషి, జనరల్ మేనేజర్ శంకర్ శ్రీనివాస్ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement