Takashi Kikuchi
-
ఏపీలో ఇసుజు పికప్ ట్రక్స్ తయారీ ప్లాంట్
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌లో పికప్ ట్రక్స్ తయారీ ఫ్యాక్టరీ నిర్మాణం చేపడుతున్నామని ఇసుజు మోటార్స్ ఇండియా ప్రయివేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరక్టర్ టకాషి కికుచి తెలిపారు. నగరంలో సోమవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నెల్లూరు జిల్లా శ్రీ సిటి వద్ద ఉన్న తడలో 107 ఎకరాల్లో పికప్ ట్రక్స్ తయారీ కంపెనీ పనులు జరుగుతున్నాయని చెప్పారు. రూ.3 వేట కోట్లు పెట్టుబడితో నిర్మించనున్నా ఫ్యాక్టరీలో 3వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించానున్నామన్నారు. 2016 నాటికి పూర్తి స్థాయిలో ఈ ఫ్యాక్టరీ వినియోగంలోకి రానుందని చెప్పారు. ఏడాదికి 50 వేల యూనిట్ల తయారీ లక్ష్యమన్నారు. జపాన్ పర్యటన సందర్భంగా సీఎం చంద్రబాబుతో ఇసుజు ట్రక్స్ తయారీ ఫ్యాక్టరీ, ఉపాధి తదితర విషయాలు చర్చిస్తామన్నారు. ప్రస్తుతం ఇసుజు వెహికల్స్ విడిభాగాలు దిగుమతి చేసుకుని చైన్నై హిందుస్థాన్ కంపెనీలో వాహనాలను ఉత్పత్తి చేస్తున్నామన్నారు. 11 మంది డీలర్‌షిప్‌ల ద్వారా రాష్ట్ర మార్కెట్లో తమ వెహికల్స్ అమ్ముడవుతున్నాయని చెప్పారు. 2016 నాటికి 60 డీలర్‌షిప్‌లు పెంచుతామన్నారు. సమావేశంలో ఇసుజు మోటార్స్ ఇండియా ప్రయివేట్ లిమిటెడ్ డిప్యూటీ మేనేజింగ్ డైరక్టర్ శిగెరు వాకాబాయషి, జనరల్ మేనేజర్ శంకర్ శ్రీనివాస్ పాల్గొన్నారు. -
2018 నాటికి పూర్తి స్వదేశీ వాహనాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ ఇసుజు మోటార్స్ రూ.3 వేల కోట్లతో శ్రీసిటీలో నెలకొల్పుతున్న ప్లాంటు 2016కల్లా సిద్ధం కానుంది. కంపెనీ ప్రస్తుతం స్పోర్ట్స్ యుటిలిటీ వాహనాలు, పిక్ అప్ ట్రక్‌లను థాయ్‌లాండ్ నుంచి తెప్పించి భారత్‌లో విక్రయిస్తోంది. కొత్త ప్లాంటు ద్వారా 2018 నాటికి పూర్తి స్వదేశీ పరికరాలతో వాహనాలు తయారవుతాయని ఇసుజు మోటార్స్ ఇండియా ప్రెసిడెంట్, ఎండీ టకషి కికుచి గురువారం తెలిపారు. తద్వారా పోటీ ధరలో మోడళ్లను విక్రయించేందుకు వీలవుతుందని చెప్పారు. ప్రీమియం స్పోర్ట్స్ యుటిలిటీ వాహనం ఎంయూ-7ను హైదరాబాద్‌లో తొలి వినియోగదారునికి అందజేసిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఎస్యూవీ, పిక్ అప్ ట్రక్లపైనే ప్రధానంగా దృష్టి పెడతామని కంపెనీ డిప్యూటీ ఎండీ షిగెరు వకబయషి తెలిపారు. ఇతర దేశాల్లో ఇసుజు విక్రయిస్తున్న తేలికపాటి వాణిజ్య వాహనాలు, మధ్యంతర వాణిజ్య వాహనాలను భారత్‌లో ప్రవేశపెట్టడంపై అధ్యయనం చేస్తున్నట్టు ఆయన వివరించారు. భారత వాహన పరిశ్రమ పరిమాణం ప్రస్తుతమున్న 35 లక్షల యూనిట్ల నుంచి 2020 నాటికి 1 కోటి యూనిట్లకు చేరుకుంటుందని అంచనా వేశారు. కాగా, హైదరాబాద్ ఎక్స్ షోరూంలో ఎంయూ-7 ధర రూ.22.6 లక్షలుగా ఉంటుంది.