హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మెషినరీ విడిభాగాల తయారీలో ఉన్న జపాన్‌కు చెందిన టీహెచ్‌కే భారత్‌లో తన తొలి ప్లాంటును ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీసిటీలో నెలకొల్పనుంది. 50 ఎకరాల్లో రానున్న ఈ యూనిట్ కోసం కంపెనీ సుమారు రూ.1,300 కోట్లు ఖర్చు చేయనుంది. 2018 ఆగస్టులో నిర్మాణ పనులు ప్రారంభం అవుతాయి. ఇక్కడ వివిధ పరిశ్రమల్లో వాడే మెషినరీకి అవసరమైన లీనియర్ మోషన్ గైడ్స్ ఉత్పత్తి చేస్తారు.
ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ఎకనమిక్ డెవలప్‌మెంట్ బోర్డుతో (ఏపీఈడీబీ) మంగళవారం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఏపీ సీఎం ఎన్.చంద్రబాబు నాయుడు సమక్షంలో ఈ ఒప్పందంపై టీహెచ్‌కే ప్రెసిడెంట్ అకిహిరో టెరమచి, ఏపీఈడీబీ సీఈవో జె.కృష్ణ కిషోర్ సంతకాలు చేశారు. 1971లో ప్రారంభం అయిన టీహెచ్‌కే పారిశ్రామిక యంత్రాలు, రవాణా వాహనాలకు కావాల్సిన లీనియర్ మోషన్ గైడ్స్ తయారు చేస్తోంది. భారత్‌లో 2012లో కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment