
శ్రీసిటీలో పార్క్‌సన్ ప్యాకేజింగ్ పరిశ్రమ
శ్రీసిటీ (వరదయ్యపాళెం): ముం బయికి చెందిన పార్క్‌సన్ ప్యాకేజింగ్ లిమిటెడ్ పరిశ్రమ నూతన ఉత్పత్తి కేంద్రాన్ని శ్రీసిటీలో శుక్రవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఆ సంస్థ చైర్మన్ ష్ కేజ్రీవాల్, బాబ్ట్స్ గ్రూప్ సీఈవో జీన్ పాస్కల్ బాబ్ట్స్, హెడెల్ బర్గ్ గ్రూప్ హెడ్ స్టీపెన్ ఖ్య అతిథులుగా హాజరయా్యరు. ప్రింటెడ్, లామినేటెడ్, ఫోల్డింగ్ కార్టన్ పెట్టెల తయారీలో ఈ పరిశ్రమ పేరొందింది. ఇప్పటికే నాలుగు యూనిట్లు ఉన్న ఈ పరిశ్రమ ఐదో యూనిట్‌ను శ్రీసిటీలో ఏర్పాటు చేసినట్లు ఆ సంస్థ ఛైర్మన్ రమేష్ కేజ్రీవాల్ తెలిపారు. శ్రీసిటీలో పది ఎకరాల విస్తీర్ణంలో రూ. 70 కోట్ల పెట్టుబడులతో ఏర్పాటుచేసిన పార్క్‌సన్ జింగ్ పరిశ్రమ ద్వారా 200 మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయన్నారు.
1986లో మొదట ముంబయిలో పరిశ్రమ ప్రారంభించామని, ప్రస్తుతం అదే ప్రాంతంలో నాలుగు యూనిట్లు విస్తరింపజేశామన్నారు. త్వరలో ఆరో ప్లాంటును గౌహతిలో ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ప్యాకేజింగ్ రంగంలో పేరుగాంచిన పార్క్‌సన్ పరిశ్రమ శ్రీసిటీలో ఏర్పాటుకావడం శుభపరిణామమని శ్రీసిటీ ఎండీ రవీంద్రసన్నారెడ్డి చెప్పారు. వినూత్న ఆలోచనలతో ముందుకెళు్తన్న ఈ పరిశ్రమ ఉత్పతు్తలు కస్టమర్లకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయన్నారు. శ్రీసిటీలో ఆహార శుద్ధి, పానీయాలు ఇతర తయారీ పరిశ్రమలు 150కిపైగా ఉన్నాయని, వీటికి పార్క్‌సన్ ఉత్పతు్తలు ప్రయోజనకరంగా ఉంటాయని తెలిపారు.