
సాక్షి, న్యూఢిల్లీ: జూన్ 6న వీసా డే నిర్వహించనున్నట్టు అమెరికా కాన్సుల్ జనరల్ జార్జ్ హెచ్ హోగ్మన్ గురువారం ప్రకటించారు. వీసా ఇంటర్వ్యూ సమయంలో అధికారులు అడిగే ప్రశ్నలను అభ్యర్థులు జాగ్రత్తగా వినాలని.. వాటికి వాస్తవమైన సమాధానాలు మాత్రమే ఇవ్వాలని ఆయన సూచించారు. అమెరికాలో చదువుతున్న ప్రతి ఆరుగురు విదేశీ విద్యార్థుల్లో ఒకరు భారత్ నుంచి వచ్చిన వారేనని చెప్పారు. జూన్ 6న ఢిల్లీలోని అమెరికా ఎంబసీ సహా హైదరాబాద్, చెన్నై, కోల్‌కతా, ముంబైలోని కాన్సులేట్లతో అమెరికాలో ఉన్నత విద్య చదవాలనుకునే భారత విద్యార్థుల వీసా దరఖాస్తులను పరిశీలిస్తారు.