
యూఎస్ కాన్సులేట్ వద్ద సీపీఐ ధర్నా
హైదరాబాద్: తెలుగు విద్యార్థులను వేధింపులకు గురిచేస్తున్న అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారులకు వ్యతిరేకంగా సీపీఐ ధర్నా నిర్వహించింది. హైదరాబాద్ బేగంపేటలోని యూఎస్ కాన్సులేట్ వద్ద పెద్ద సంఖ్యలో కార్యకర్తలతో పాటు చేరుకున్న వామపక్ష నేతలు నారాయణ, చాడ వెంకటరెడ్డి సుధాకర్ లను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టయిన నేతలను బొల్లారం పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఎటువంటి అవాంచిత ఘటనలు జరగకుండా.. భారీ ఎత్తున పోలీసు బలగాలను యూఎస్ కాన్సులేట్ కార్యాలయం వద్ద మోహరించారు.
కాగా.. ఇటీవల ఉన్నత చదువుల కోసం అమెరికా వెళుతున్న తెలుగు విద్యార్థులను అక్కడి ఇమ్మిగ్రేషన్ అధికారులు వేధించడమే కాకుండా.. పెద్ద సంఖ్యలో వెనక్కి పంపిస్తున్నారు. ఇప్పటికే 100 పైగా విద్యార్థులను తిరిగి పంపించిన సంగతి తెలిసిందే.