బాగ్దాద్: ఓ వైపు ఉక్రెయిన్‌లో రష్యా దాడులు కొనసాగుతున్న వేళ అంతర్జాతీయంగా మరో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఇరాక్‌లో ఉన్న అమెరికా దౌత్య కార్యాలయంపై ఆదివారం మిస్సైల్ దాడులు జరిగాయి. ఈ దాడులతో ఒక్కసారి అగ్రరాజ‍్యం అలర్ట్ అయ్యింది.
వివరాల ప్రకారం.. ఉత్తర ఇరాక్‌లోని ఇర్బిల్ పట్టణంలో ఉన్న అమెరికా దౌత్య కార్యాలయ భవనం వైపు దాదాపు 12 మిస్సైల్స్ దూసుకొచ్చినట్లు అమెరికా భద్రతా వర్గాలు వెల్లడించాయి. కాగా, ఇరాన్‌కు సమీప దేశాల నుంచి మిస్సైల్స్ దాడి జరిగినట్లు అధికారులు తెలిపారు. ఆదివారం తెల్లవారుజామున ఈ దాడులు జరిగినట్లు తెలిసింది. ఇదిలా ఉండగా.. మిస్సైల్ దాడుల్లో ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని అమెరికా భద్రతా సిబ్బంది ఒకరు మీడియాకు చెప్పారు. అయితే, ఈ దాడులపై బైడెన్ ఫోకస్ చేసినట్టు తెలుస్తోంది.
మరోవైపు.. ఈ దాడులు ఎవరు చేశారనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ దాడులను ఖండిస్తున్నట్టు ఇరాన్ అధికారులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కాగా, అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం.. మిస్సైల్స్ దాడుల వల్ల అమెరికా రాయబార కార్యాలయం పరిసరాల్లో మాత్రమే నష్టం జరిగినట్లు తెలుస్తోంది. అయితే అది కొత్త భవనమని అందులో ప్రస్తుతానికి ఎవరూ ఉండటం లేదని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment