సామాజిక కార్యక్రమాల్లో మోహన్‌ బాబు | Mohan Babu Meet US Consulate General Hyderabad | Sakshi
Sakshi News home page

Mar 6 2018 11:10 AM | Updated on Aug 24 2018 6:29 PM

Mohan Babu Meet US Consulate General Hyderabad - Sakshi

యుఎస్‌ కాన్సూల్‌ జనరల్‌ కేథరిన్‌తో మోహన్‌ బాబు

ఇటీవల గాయత్రి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సీనియర్‌ హీరో, విలక్షణ నటడు మోహన్‌ బాబు సామాజిక కార్యక్రమాల మీద దృష్టిపెట్టారు. తాజాగా యుఎస్‌ కాన్సూల్‌ జనరల్‌ కేథరిన్‌ను కలిసి మోహన్‌ బాబు మహిళ అక్రమ రవాణా విషయంలో అవగాహన కల్పించేందుకు ఆమె చేస్తున్న కృషిని అభినందించారు. ఈ సందర్భంగా ఆమెతో కలిసి సామాజిక కార్యక్రమాల్లో భాగం పంచుకోనున్నట్టుగా ప్రకటించారు. 

మోహన్‌ బాబుతో సమావేశంపై కేథరిన్‌ హడ్డ స్పందించారు. ‘సినీ పరిశ్రమకు చెందిన లెజెండ్ మోహన్‌ బాబును కలవటం ఆనందంగా ఉంది. మీ స్ఫూర్తిదాయకమైన కథను వివరించినందుకు కృతజ్ఞతలు. మీతో కలిసి పనిచేసేందుకు ఎదురుచూస్తున్నా’ అంటూ ఆమె సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement