‘గాయత్రి’ మూవీ రివ్యూ | Mohan Babu Gayathri Movie Review | Sakshi
Sakshi News home page

Published Fri, Feb 9 2018 12:04 PM | Last Updated on Fri, Feb 9 2018 12:38 PM

Mohan Babu Gayathri Movie Review - Sakshi

టైటిల్ : గాయత్రి
జానర్ : యాక్షన్‌ డ్రామా
తారాగణం : మోహన్‌ బాబు, మంచు విష్ణు, శ్రియ, నిఖిలా విమల్‌, అనసూయ
సంగీతం : తమన్‌ ఎస్‌
దర్శకత్వం : మదన్‌
నిర్మాత : మోహన్‌ బాబు

సీనియర్‌ నటుడు మోహన్ బాబు చాలా కాలం తరువాత లీడ్ రోల్‌లో నటించిన సినిమా గాయత్రి. తన సొంత నిర్మాణ సంస్థ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్‌ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ సినిమాలో మోహన్‌ బాబు ద్విపాత్రాభినయం చేయగా, యంగ్ మోహన్‌ బాబుగా అతిథి పాత్రలో మంచు విష్ణు నటించాడు. ఆ నలుగురు, పెళ్లైన కొత్తలో చిత్రాలను తెరకెక్కించిన మదన్‌ తొలిసారిగా తన స్టైల్‌ మార్చి థ్రిల్లర్ జానర్‌ సినిమాను తెరకెక్కించారు. మరి ఈ ప్రయత్నం మదన్‌కు మరో విజయాన్ని అందించిందా..? నటుడిగా మోహన్‌ బాబు మరోసారి తన మార్క్‌ చూపించాడా..?

కథ :
దాసరి శివాజీ (మోహన్‌ బాబు) రంగస్థల నటుడు. దూరమైన కూతురి కోసం ఎదురుచూస్తూ కొంత మంది అనాథలను చేరదీసి శారదా సదనం అనే అనాథాశ్రమాన్ని నిర్వహిస్తుంటాడు. తన కూతురు ఏదో ఒక అనాథాశ్రమంలో ఉండే ఉంటుందన్న నమ్మకంతో అన్ని అనాథాశ్రమాలకు డబ్బు సాయం చేస్తుంటాడు. ఆ డబ్బు కోసం నేరస్థులలా మేకప్ వేసుకొని వారికి బదులు జైలు శిక్ష అనుభవిస్తుంటాడు. (సాక్షి రివ్యూస్‌) శివాజీ మీద అనుమానం వచ్చిన జర్నలిస్ట్‌ శ్రేష్ఠ (అనసూయ) అతడు చేసే పని ఎలాగైన బయటపెట్టాలని ప్రయత్నిస్తుంటుంది. ఓ గొడవ కారణంగా శివాజీకి తన కూతురు ఎవరో తెలుస్తుంది. కూతుర్ని కలుసుకునే సమయానికి గాయత్రి పటేల్‌ (మోహన్‌ బాబు), శివాజీని కిడ్నాప్ చేస్తాడు. తన బదులుగా శివాజీని ఉరికంభం ఎక్కించాలని ప్లాన్ చేస్తాడు గాయత్రి పటేల్‌. తనకు బదులుగా శిక్ష అనుభవించడానికి గాయత్రి పటేల్‌.. శివాజీనే ఎందుకు ఎంచుకున్నాడు..? శివాజీ కూతురు గాయత్రికి, గాయత్రి పటేల్‌కు సంబంధం ఏంటి..? ఈ సమస్యల నుంచి శివాజీ ఎలా బయటపడ్డాడు..? చివరకు గాయత్రి పటేల్‌ ఏమయ్యాడు..? అన్నదే మిగతా కథ.

నటీనటులు :
కలెక్షన్‌ కింగ్ మోహన్ బాబు రెండు విభిన్న పాత్రల్లో ఆకట్టుకున్నారు.  నెగెటివ్ టచ్ ఉన్న పాత్రలు చేయటంలో తనకు తిరుగులేదని మరోసారి ప్రూవ్ చేసుకున్నారు. యాక్టింగ్‌ విషయంలో సూపర్బ్‌ అనిపించినా.. డ్యాన్స్ లు, ఫైట్స్ విషయంలో మాత్రం కాస్త ఇబ్బంది పడ్డారు. (సాక్షి రివ్యూస్‌) చిన్న పాత్రే అయినా విష్ణు కెరీర్ లో బెస్ట్ పర్ఫామెన్స్ తో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా విష్ణు నటించిన  ఎమోషనల్ సీన్స్‌ ఆడియన్స్‌ తో కంటతడి పెట్టిస్తాయి. శ్రియ అందంగా, హుందాగా కనిపించింది. కీలకమైన గాయత్రి పాత్రలో నిఖిలా విమల్‌ మంచి నటన కనబరించింది. జర్నలిస్ట్ పాత్రలో అనసూయ పర్ఫెక్ట్‌గా సూట్‌ అయ్యింది. ఇతర పాత్రల్లో శివ ప్రసాద్‌, పోసాని కృష్ణ మురళీ, రాజా రవీంద్ర, బ్రహ్మానందం తమ పరిధి మేరకు మెప్పించారు.

విశ్లేషణ :
ఇప్పటి వరకు క్లాస్, హార్ట్‌ టచింగ్ సినిమాలు మాత్రమే చేసిన మదన్ తొలిసారిగా ఓ థ్రిలర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మోహన్‌ బాబు లాంటి విలక్షణ నటుడికి తగ్గ కథా కథనాలతో ఆకట్టుకున్నాడు. చాలా కాలం తరువాత మోహన్‌ బాబు ను పూర్తి నెగెటివ్ క్యారెక్టర్ లో చూపించిన మదన్ అభిమానులను మెప్పించాడు. ఫస్ట్‌ హాఫ్‌లో వేగంగా కథ నడిపించిన దర్శకుడు. ద్వితియార్థంలో మాత్రం కాస్త స్లో అయ్యాడు. సెకండ్‌ హాఫ్‌లో ఎమోషనల్‌ సీన్స్‌ ఆకట్టుకున్నా కథనం నెమ్మదించటం, (సాక్షి రివ్యూస్‌) అవసరం లేకపోయినా ఇరికించిన ఐటమ్‌ సాంగ్‌ కాస్త ఇబ్బంది పెడతాయి.  సినిమాకు మేజర్‌ ప్లస్ పాయింట్‌ డైమండ్‌ రత్నబాబు డైలాగ్స్‌. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో శివాజీ పాత్రతో పలికించిన డైలాగ్స్‌కు థియేటర్లలో విజిల్స్ పడుతున్నాయి. తమన్ సంగీత మందించిన పాటలు పరవాలేదనిపించినా.. నేపథ్య సంగీతంతో మాత్రం మరోసారి మ్యాజిక్ చేశాడు. ఎడిటింగ్‌, సినిమాటోగ్రఫి, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.


ప్లస్ పాయింట్స్ :
మోహన్‌ బాబు నటన
డైలాగ్స్‌

మైనస్ పాయింట్స్ :
సెకండ్‌ హాఫ్‌ స్లో నేరేషన్‌
సాంగ్స్‌

- సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement