Madan
-
‘విద్యుత్’ కమిషన్ చైర్మన్‌గా జస్టిస్ మదన్ బి.లోకూర్
సాక్షి, హైదరాబాద్: గత బీఆర్ఎస్ సర్కారు హయాంలో జరిగిన విద్యుత్ నిర్ణయాలపై ఏర్పాటైన విచారణ కమిషన్‌కు కొత్త చైర్మన్‌గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ మదన్ బి.లోకూర్‌ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. అనూహ్య పరిణామాల నేపథ్యంలో విచారణ కమిషన్ బాధ్యతల నుంచి తప్పుకున్న జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి స్థానంలో ఆయన్ను నియమిస్తూ రాష్ట్ర ఇంధన శాఖ కార్యదర్శి రోనాల్డ్ రాస్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. విచారణ నిర్వహించి నివేదిక సమరి్పంచడానికి ప్రభుత్వం జస్టిస్ లోకూర్‌కు 3 నెలల గడువును విధించింది.జస్టిస్ లోకూర్ గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, గౌహతి హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తిగా కూడా వ్యవహరించారు. కాగా, నామినేషన్ల ప్రాతిపదికన యాదాద్రి, భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణాన్ని బీహెచ్ఈఎల్ సంస్థకు అప్పగించడంతోపాటు ఛత్తీస్‌గఢ్‌తో 1000 మెగావాట్ల విద్యుత్ కొనుగోళ్లకు ఒప్పందం కుదుర్చుకోవడంపై పట్నా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి అధ్యక్షతన విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం గత మార్చి 14న ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.ఈ మూడు నిర్ణయాల్లో చోటుచేసుకున్న అవకతవకతలపై విచారణ జరిపి రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని నిర్ధారించాలని, అందుకు బాధ్యులైన వారిని గుర్తించాలని ప్రభుత్వం మార్గదర్శకాలు రూపొందించింది. ఇప్పుడు ఇదే మార్గదర్శకాలు జస్టిస్ లోకూర్ కమిషన్‌కు కూడా వరిస్తాయని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ నిర్ణయాల్లో పాత్ర ఉన్న మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి, ట్రాన్స్‌కో, జెన్కో మాజీ సీఎండీ డి.ప్రభాకర్ రావు, ఇంధన శాఖ కార్యదర్శులు, ఇతర అధికారులకు జస్టిస్ నరసింహా రెడ్డి గతంలో నోటీసులు జారీ చేసి వారి నుంచి రాతపూర్వకంగా వాంగ్మూలాన్ని స్వీకరించారు.విచారణ ప్రక్రియను దాదాపుగా పూర్తి చేసి నివేదికను సైతం రూపొందించారు. ఈ క్రమంలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఓ సందర్భంలో జస్టిస్ నరసింహా రెడ్డి మీడియాతో మాట్లాడుతూ చేసిన వాŠయ్‌ఖ్యలను కారణంగా చూపుతూ విచారణ కమిషన్‌ను రద్దు చేయాలని కేసీఆర్ రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించగా, జూలై 1న కేసును కొట్టివేస్తూ హైకోర్టు తీర్పునిచి్చంది.హైకోర్టు తీర్పును కేసీఆర్ సుప్రీంకోర్టులో సవాలు చేయగా, జస్టిస్ నరసింహారెడ్డిని మార్చి విచారణను యథావిధిగా కొనసాగించవచ్చని ఈ నెల 16న మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం జస్టిస్ మదన్ బి.లోకూర్‌ను నియమించడంతో విద్యుత్ నిర్ణయాలపై విచారణ ప్రక్రియ పునఃప్రారంభం కానుంది. -
ఆ పిల్లల చదువు బాధ్యత నాదే
చెన్నారావుపేట: వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం 16 చింతల్ తండాలో ప్రేమోన్మాది దాడిలో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అండగా నిలిచారు. నిందితుడు నాగరాజు దాడిలో తల్లిదండ్రులు శ్రీనివాస్, సుగుణలు చనిపోవడంతో పిల్లలు దీపిక, మదన్‌లు అనాథలయ్యారు. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి, జెడ్పీ ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్నలు మంగళవారం హైదరాబాద్‌లోని కేటీఆర్ వద్దకు పిల్లలను తీసుకెళ్లారు.వారితో మాట్లాడిన కేటీఆర్ జరిగిన విషయాలు తెలుసుకుని ధైర్యం చెప్పారు. అనంతరం సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ అనాథ పిల్లల చదువు బాధ్యత తానే తీసుకుంటానని కేటీఆర్ హామీ ఇచ్చినట్లు తెలిపారు. సుగుణ బీఆర్ఎస్ క్రియాశీల కార్యకర్త, గ్రామ పంచాయతీలో వార్డు సభ్యురాలు కావడంతో పార్టీ తరఫున కుటుంబాన్ని ఆదుకునేందుకు రూ. 5 లక్షలు ఆర్థికసాయం అందించనున్నట్లు తెలిపారు. కుటుంబానికి భరోసా కల్పించే విధంగా ప్రభుత్వం రూ.50 లక్షల ఆర్ధిక సాయం అందించాలని కోరినట్లు తెలిపారు. అంతేకాకుండా నిందితుడు నాగరాజుకు కఠినశిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని సీఎంను కేటీఆర్ కోరినట్లు చెప్పారు. -
దేశంలోని తొలి సినిమాహాలు ఏది? ఏ సినిమాలు ఆడేవి?
‘ఈమధ్య మీరు ఏ సినిమా చూశారు?’ ఈ ప్రశ్నకు ప్రతి ఒక్కరి దగ్గరా సమాధానం ఉంటుంది. ఇందులో తేడా ఏమిటంటే ఒక్కొక్కరు ఒక్కో సమాధానం చెబుతారు. మరికొందరు తమ జ్ఞాపకాలను రిఫ్రెష్ చేసుకోవడానికి పాత సినిమాల గురించి ప్రస్తావిస్తారు. మొత్తం మీద దీనికి మంచి సమాధానమే దొరుకుతుంది. అయితే ఇదే సమయంలో దేశంలోనే మొదటి సినిమా థియేటర్ గురించిన వివరాలు తెలిస్తే ఎవరైనా కాసేపు ఆశ్చర్యపోతారు. ఇప్పుడు మనం భారతదేశంలోని మొట్టమొదటి సినిమా థియేటర్ గురించి తెలుసుకోబోతున్నాం. భారతదేశంలో నిర్మితమైన మొదటి సినిమా థియేటర్ చాప్లిన్ సినిమా. దీనిని ఎల్ఫిన్‌స్టోన్ పిక్చర్ ప్యాలెస్ అని కూడా పిలుస్తారు. ‘చాప్లిన్ సినిమా’ను 1907లో జమ్షెడ్జీ రామ్‌జీ మదన్ నిర్మించారు. ఆయన మదన్ థియేటర్స్ పేరుతో భారతదేశంలో మొదటి థియేటర్ చైన్ స్థాపించారు. ‘చాప్లిన్ సినిమా’.. 5/1, చౌరింగ్గీ ప్లేస్, కోల్‌కతా చిరునామాలో ఉండేది. జమ్షెడ్జీ రామ్‌జీ మదన్‌ను భారతదేశంలో చిత్ర నిర్మాణ పితామహునిగా పిలుస్తారు. మదన్ ఎల్ఫిన్‌స్టోన్ డ్రామా క్లబ్లో అసిస్టెంట్ బాయ్‌గా ఉద్యోగ జీవితం ప్రారంభించారు. ఈ క్లబ్ ఎంతో విజయవంతమైంది. ప్రపంచవ్యాప్తంగా పర్యటనలు సాగించింది. జమ్షెడ్జీ కలకత్తాలో స్థిరపడాలని నిర్ణయించుకున్నాడు. ఆ సమయంలో ప్రసిద్ధ నాటక థియేటర్ అయిన కొరింథియన్ హాల్‌ను కొనుగోలు చేశారు. 1902లో మైదాన్ చుట్టూ బయోస్కోప్ షోలను ఏర్పాటు చేశారు. చివరికి అతని ఆసక్తి సినిమా ప్రదర్శన వైపు మళ్లింది. 1907లో ఎల్ఫిన్‌స్టోన్ పిక్చర్ ప్యాలెస్‌ను ప్రారంభించారు. ఈ ప్యాలెస్‌కు తరువాతి కాలంలో మినర్వా అనే పేరు పెట్టారు ఇది హాలీవుడ్ చిత్రాలను ప్రదర్శించే ప్రసిద్ధ థియేటర్‌గా మారింది. థియేటర్ లాభాలను కాపాడుకునే ప్రయత్నంలో దీనిని చార్లీ చాప్లిన్ పేరు మీద ‘చాప్లిన్ సినిమా’ అనే పేరు పెట్టారు. అయితే ఈ థియేటర్‌ను పలు కారణాలతో 2003లో కూల్చివేశారు. ఇది కూడా చదవండి: ఫ్రాన్స్‌లో నల్లుల నకరాలు.. జనం పరేషాన్! -
టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ డైరెక్టర్, రైటర్ మదన్ కన్నుమూత
Director Madan.. టాలీవుడ్లో మరో విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రముఖ దర్శకుడు మదన్ ఆకస్మిక మరణం పొందారు. అనారోగ్యం కారణంగా అపోలో ఆసుపత్రిలో చేరిన మదన్ చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. అయితే, మదన్ నాలుగు రోజుల క్రితం బ్రెయిన్ స్ట్రోక్‌కు గురైనట్టు సమాచారం. కాగా మదన్ స్వస్థలం మదనపల్లి. సినిమాల మీద ఆసక్తితో ఎస్.గోపాల్‌రెడ్డి దగ్గర అసిస్టెంట్ కెమెరామన్‌గా చేరారు. అలా మనసంతా నువ్వే సినిమాకు పని చేశారు. పెళ్లైన కొత్తలో మూవీతో దర్శకుడిగా మారారు. "ఆ నలుగురు" చిత్రంతో రచయితగా తన ప్రతిభను నిరూపించుకున్నారు. గుండె ఝల్లుమంది, ప్రవరాఖ్యుడు, కాఫీ విత్ మై వైఫ్, గరం, గాయత్రి చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. -
విషమంగా 'ఆ నలుగురు' రచయిత ఆరోగ్యం
"ఆ నలుగురు" చిత్రంతో రచయితగా తన ప్రతిభను నిరూపించుకున్న దర్శకుడు మదన్ అనారోగ్యంతో ఆస్పత్రి పాలయ్యారు. "పెళ్లయిన కొత్తలో" చిత్రంతో దర్శకుడిగా మారిన ఆయన నాలుగు రోజుల క్రితం బ్రెయిన్ స్ట్రోక్‌కు గురయ్యారు. దీంతో ఆయనను హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా మదన్ స్వస్థలం మదనపల్లి. సినిమాల మీద ఆసక్తితో ఎస్.గోపాల్‌రెడ్డి దగ్గర అసిస్టెంట్ కెమెరామన్‌గా చేరారు. అలా మనసంతా నువ్వే సినిమాకు పని చేశారు. పెళ్లైన కొత్తలో మూవీతో దర్శకుడిగా మారారు. గుండె ఝల్లుమంది, ప్రవరాఖ్యుడు, కాఫీ విత్ మై వైఫ్, గరం, గాయత్రి చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. చదవండి: మరో విషాదం, నటి మృతి -
ఫోర్జరీ ఖరీదు రూ.30 లక్షలు!
సాక్షి, హైదరాబాద్: తెలుగు అకాడమీకి సంబంధించిన రూ.64.5 కోట్లు కాజేయడానికి పథకం వేసిన సూత్రధారి సాయికుమార్ అందుకు నకిలీ లేఖలు, ఫిక్స్డ్ డిపాజిట్ (ఎఫ్డీ) బాండ్లు వినియోగించాడు. వీటిని తమిళనాడుకు చెందిన పద్మనాభన్ తయారు చేయగా.. అకాడమీ, బ్యాంకు అధికారుల సంతకాలను ఫోర్జరీ చేసింది మాత్రం మదన్ అని తేలింది. దీని నిమిత్తం ఇతడికి కుంభకోణం సొమ్ము నుంచి రూ.30 లక్షలు ముట్టింది. సాయి అనుచరుడు వెంకట రమణకు స్నేహితుడైన ఇతడిని కేసు దర్యాప్తు అధికారి కె.మనోజ్‌కుమార్ నేతృత్వంలోని బృందం గురువారం షిర్డీలో అరెస్టు చేసి శుక్రవారం నగరానికి తరలించింది. దీంతో ఈ కేసులో ఇప్పటి వరకు అరెస్టు అయిన నిందితుల సంఖ్య 17కు చేరింది. ఏపీ పోలీసులు అరెస్టు చేసిన యోహాన్ రాజును పీటీ వారెంట్‌పై తీసుకురావాల్సి ఉంది. టెన్త్ చదివిన మదన్ ఫోర్జరీలో దిట్ట మహారాష్ట్రలోని షిర్డీకి చెందిన మదన్ పదో తరగతి వరకు చదివాడు. ఆపై అక్కడే వ్యవసాయం చేసేవాడు. 2019లో వెంకటరమణ షిర్డీ వెళ్లినప్పుడు ఇతడితో పరిచయం ఏర్పడింది. అప్పటినుంచి రాకపోకలు, సంప్రదింపులు కొనసాగాయి. సంతకాలను ఫోర్జరీ చేయడంలో మదన్‌కు పట్టుండటంతో వెంకటరమణ అతన్ని సాయికి పరిచయం చేశాడు. తెలుగు అకాడమీ డబ్బు వివిధ బ్యాంకుల్లో ఎఫ్డీ చేయడానికి సాయి తన అనుచరులైన సోమశేఖర్ తదితరులను దళారుల అవతారం ఎత్తించాడు. డబ్బు కాజేయాలని ముందే పథకం వేసిన సాయి.. అకాడమీ నుంచి తన అనుచరుల ద్వారా ఆ మొత్తాలకు సంబంధించిన చెక్కులు, కవరింగ్ లెటర్లను తీసుకున్నాడు. తొలుత లేఖల్లో ఎఫ్డీ కాలాన్ని మారుస్తూ నకిలీవి సృష్టించాడు. వీటిని అకాడమీ ఇచ్చిన చెక్కులతో జత చేసి బ్యాంకుల కు పంపించాడు. ఈ లేఖల్లో సదరు మొత్తాన్ని 5 రోజుల నుంచి వారానికే ఎఫ్డీ చేయాలని కోరేవాడు. బ్యాంకులు ఈ కాలానికి ఎఫ్డీ చేస్తూ దానికి సంబంధించిన బాండ్లు అందించేవి. వీటిని తీసుకుని సాయి అనుచరులు కొండాపూర్‌లోని అడ్డాకు చేర్చేవాళ్లు. ఎఫ్‌డీల ఆధారంగా పద్మనాభన్ కంప్యూటర్ సాయంతో నకిలీవి తయారు చేసి ప్రింట్ తీసేవాడు. నకిలీ కవరింగ్ లెటర్లపై అకాడమీ అధికారుల సంతకాలు, నకిలీ ఎఫ్డీలపై బ్యాంకు అధికారుల సంతకాలను మదన్ ఫోర్జరీ చేసేవాడు. నకిలీ ఎఫ్డీలను అకాడమీకి ఇచ్చి 5 రోజులో, వారం రోజులో గడువు ముగిసిన తర్వాత తమ వద్ద ఉన్న ఒరిజనల్ ఎఫ్డీలు రద్దు చేసేవారు. కేవలం తెలుగు అకాడమీ కుంభకోణంలోనే కాకుండా ఏపీలో చోటు చేసుకున్న రెండు స్కాముల్లోనూ సాయి తదితరులతో పాటు మదన్ నిందితులుగా ఉన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలైన ఏపీ ఆయిల్ ఫెడ్, ఏపీ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ల నుంచీ సాయి గ్యాంగ్ రూ.14.6 కోట్లు కాజేశారు. అక్కడా నకిలీ లేఖలు, బాండ్లను పద్మనాభన్ తయారు చేయగా... బ్యాంకు, అధికారుల సంతకాలను మదన్ ఫోర్జరీ చేశాడని తేలింది. ఇతడిని సీసీఎస్ పోలీసులు న్యాయస్థానంలో హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. -
పబ్జీ మొనగాడు.. బూతులతో బుక్కయ్యాడు
చెన్నై: పబ్జీ.. మన దేశంలో యువతను బాగా అతుక్కుపోయేలా చేసుకున్న గేమ్. బ్యాన్ విధించినప్పటికీ వీపీఎన్ సౌలత్‌తో ఇంకా ఆడుతూనే ఉన్నారు. అలాంటి గేమ్‌లో మదన్ ఘనాపాటి. తమిళనాడుకు చెందిన మదన్ ఓపీ.. గేమర్, వ్లోగర్ కూడా. యూత్‌లో ముఖ్యంగా కాలేజీ అమ్మాయిల్లో ఇతనికి మంచి క్రేజ్ ఉంది. అంతెందుకు కొందరు సెలబ్రిటీలు కూడా ఇతని అభిమానులే. అలాంటి కుర్రాడిపై లైంగిక ఆరోపణల కింద కేసు బుక్ అయ్యింది. అసలు మదన్‌కి ఇంతలా పేరు రావడానికి ముఖ్య కారణం.. పబ్జీ గేమింగ్‌లో అతను ఉపయోగించే భాష. కో-ప్లేయర్స్ గనుక బాగా ఆడకపోతే బండబూతులు తిడతాడు. లైవ్‌లో ఉన్నాననే సంగతి మర్చిపోయి ఇష్టమొచ్చినట్లు మాట్లాడతాడు. ఆ ఆటిట్యూడ్ అతనికి మరింత క్రేజ్ తెచ్చి పెట్టింది. అంతేకాదు ఆటలో అతను ఇచ్చే టిప్స్.. ఇంటర్నేషనల్ వైడ్‌గా అతనికి గుర్తింపు ఇచ్చింది. అయితే రీసెంట్గా ఓ వీడియోలో అతను అమ్మాయిలను ఉద్దేశిస్తూ అసభ్య పదజాలం వాడాడు. దీంతో ఇతగాడి వ్యవహారం చెన్నై క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు చేరింది. శృతి మించారు నిజానికి ఈ కుర్రాడు పబ్లిక్‌కి తెలిసేలా తప్పులన్నీ చేస్తుంటాడు. అతనికి ఉన్న అభిమానుల్లో అమ్మాయిలే ఎక్కువ మంది ఉన్నారు. ఎలాగోలా వాళ్ల అమ్మాయిల నెంబర్లు సంపాదించి.. వాళ్లతో మాటలు కలుపుతాడు. అసభ్యంగా మాట్లాడుతూ.. తేడాగా వ్యవహరిస్తాడు. ఇన్స్టాగ్రామ్ పేజీలలో న్యూడ్‌గా వీడియో ఛాట్ చేయాలని ఒత్తిడి చేస్తాడు. ఆ ఛాటింగ్‌లను, స్క్రీన్ షాట్లను పబ్లిక్‌గానే పోస్ట్ చేస్తాడు. దీంతో ఈ వ్యవహారంలో బాధిత యువతులనూ ప్రశ్నించాలని పోలీసులు భావిస్తున్నారు. అయితే ఇవన్నీ తాను బహిరంగంగానే చేస్తున్నానని, తన ఎదుగుదలను ఓర్వలేక కొందరు తన మీద కుట్రపన్నారని మదన్ చెప్తున్నాడు. చర్యలు తప్పవా? ఇక తాజాగా విమర్శల నేపథ్యంలో మదన్ దూకుడు తగ్గించాడు. తన సోషల్ మీడియా అకౌంట్లకు కామెంట్ సెక్షన్‌కు ప్రైవసీ పెట్టాడు. అతని యూట్యూబ్ పేజీలో 8 లక్షల ఫాలోవర్స్ ఉన్నారు. వాళ్లలో చాలామంది 18 ఏళ్లలోపు వాళ్లే. అందుకే చైల్డ్ వెల్ఫేర్ కమిషన్ గరం అయ్యింది. కొందరు తల్లిదండ్రులు, విద్యావేత్తలు సోషల్ మీడియాలో చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో కేసు చెన్నై పోలీసులు కేసు రిజిస్ట్రర్ చేయడంతో.. త్వరలోనే మదన్‌పై చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నారంతా. ఇది #arrestmadanop పేరుతో ట్విట్టర్లో ట్రెండ్ అవుతున్న హ్యాష్‌ట్యాగ్ కథ. -
పరకాయ ప్రవేశం
‘‘ఏమండోయ్, కాఫీ తాగేసి త్వరగా తయారయారంటే వేడి వేడి పెసరట్లు మీకిష్టమైన అల్లం పచ్చడితో వడ్డిస్తాను’’ ఒక చేతిలో కాఫీ కప్పునీ, మరో చేతిలో ఆవేళ్టి న్యూస్ పేపర్నీ పెట్టేసి హడావిడిగా వంటింట్లోకి దూరింది నా శ్రీమతి. నా అలవాట్లనీ , ఇష్టాయిష్టాలని గమనించుకుని వాటికనుగుణంగా నడుచుకునే నా భార్య సుచిత్ర అంటే నాకు ప్రాణం. ఇంజనీరింగ్ చదువుతున్న మా ఒక్కగానొక్క కొడుకు రోహన్ పద్ధతిగా ఉంటాడు. పడగ్గదిలో కూర్చుని పేపర్ చదువుతున్న నాకు హాల్లో నుంచి మా సుపుత్రుడు వాళ్ళ అమ్మతో పెద్దగొంతుకతో వాదిస్తుండడమూ, ఆవిడేమో కొడుక్కి నచ్చజెప్పే ప్రయత్నం చేయడమూ తెలుస్తోంది. ‘‘అమ్మా, మన ఇంటెదురు బంగాళాలోని కృష్ణమోహన్ అంకుల్ వున్నారే, ఆయన వాళ్ళ అబ్బాయికి, అదేనమ్మా నా క్లాస్మేట్ మదన్‌కి పుట్టినరోజు బహుమతిగా కారు కొనిచ్చారు. నా పుట్టినరోజుకి కారు కాదు కదా కనీసం ఒక చిన్న బైక్ కూడా కొనివ్వలేదు నాన్న. ఆ అంకులూ, నాన్నా కలిసే చదువుకున్నారు కదమ్మా, కాలేజీ మొత్తమ్మీద నాన్నేమో ఫస్ట్ ర్యాంకు తెచ్చుకుంటే అంకుల్ మాత్రం అత్తెసరు మార్కులతో పాసయ్యారని నాన్నే చెబుతుంటారుగా! అలాంటిది, అంకుల్ చక్కగా సొంత బిజినెస్ పెట్టి అంతెత్తుకి ఎదిగితే, నాన్నేమో ఎదుగూబొదుగూ లేని గవర్నమెంట్ ఉద్యోగంలో కూరుకుపోయారు. ముడుపులని ముట్టుకునేది లేదంటూ మడికట్టుక్కూర్చున్నారు. ఎంత చాతకానితనమమమ్మా అది ! నువ్వైనా కాస్త చెప్పొచ్చుగా నాన్నకి’’ \ రోహన్ మాటలకి షాక్ తిన్నాను. ‘‘మా వాడికి నా మీద వున్న అభిప్రాయం ఇదా ? వీడి దృష్టిలో నేను చేతకాని వెధవనా?’’ ‘‘డబ్బుతో అన్నీ కొనుక్కోలేమురా నాయనా. ఉన్నంతలో సర్దుకుపోవడంలో వున్న సుఖం ఎందులోనూ లేదు’’ కొడుకు మాటలకి బాధపడ్డ మనసు మా ఆవిడ మాటలకి కాస్త తేరుకుంది. ‘‘డబ్బుతో కార్లనీ , బైకులనీ కొనగలము కానీ సరదాలనీ, సంతోషాలనీ కొనలేము రోహన్. మన పక్క ఫ్లాట్‌లో వుండే మమత ఆంటీని చూడు, ఎప్పుడూ నవ్వుతూ తుళ్ళుతూ ఎంత ఆనందంగా వుంటుందో! వాళ్ళాయన శంకర్రావ్ ఊరూపేరు లేని ఒక ప్రైవేటు కంపెనీలో చిన్న ఉద్యోగస్తుడు. అయితే ఏం, భార్యని పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటాడు! రోజూ ఠంఛన్‌గా సాయంత్రం అయిదుగంటలకల్లా ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేస్తాడు. వారంవారం భార్యాభర్తలిద్దరూ కలిసి సరదాగా సినిమాలకి వెళ్తారు. మీ నాన్నలాగా భార్య మొహాన నాలుగు డబ్బులు విదిలించేసి ‘నీకిష్టమైనవి కొనుక్కో’ అనకుండా ఆవిడకి తోడుగా దగ్గరుండి సెలెక్ట్ చేసి మరీ ప్రతీ పండక్కీ కొత్త నగలనీ, చీరలనీ కొంటాడు. పుట్టినరోజులనీ, పెళ్లిరోజులనీ వాళ్ళెంత సరదాగా జరుపుకుంటారో నీకూ తెలుసుగా! అదీ జీవితమంటే. దేనికైనా పెట్టి పుట్టాలి!’’నిర్వేదంగా వినిపిస్తున్న మా ఆవిడ మాటలకి నిర్ఘాంతపోయాను. ‘‘సుచిత్ర మనసులో నా పట్ల అంతటి అసంతృప్తి పేరుకుపోయిందా?’’ రెండు చేతులా డబ్బులని సంపాదించే కృష్ణమోహన్, భార్యతో రోజంతా సరదాగా గడిపే శంకర్రావ్లాంటి వాళ్ళవే నిండైన జీవితాలన్న విషయం యిప్పుడిప్పుడే నా మనసుకి బోధపడసాగింది. పరకాయప్రవేశం చేసైనా సరే ఆ కృష్ణమోహన్, శంకర్రావ్ల శరీరాల్లో దూరి సిసలైన సంతృప్తిని తనివితీరా అనుభవించడమే కాకుండా వాళ్ళని చూసి నేర్చుకోవలసినదంతా నేర్చుకుని వాళ్లకిమల్లే నేనూ నా భార్యాబిడ్డల్ని సంతోషపెట్టాలన్న వాంఛ పెరిగిపోసాగింది. అసంభవమని తెలిసినా ‘‘స్వామీ, ఒక్కసారి వాళ్లిద్దరి మనసుల్లో దూరి నిజమైన సంతృప్తిని అనుభవించే అదృష్టాన్ని నాకు కల్పించవూ’’ అంటూ నా ఇష్టదైవమైన శివుడిని నాకు తెలీకుండానే రెండు చేతులూ జోడించి భక్తితో వేడుకున్నాను. ‘‘‘ఓం శంభో శంకరా’ అంటూ భక్తితో నన్ను స్మరించుకుని ఏ వ్యక్తి పేరునైతే తలుచుకుంటావో ఆ వ్యక్తి శరీరంలోకి నీ మనసు ప్రవేశించగల వరాన్ని నీకీ క్షణమే ప్రసాదిస్తున్నాను.’’ ‘‘ధన్యుడను స్వామీ’’‘‘శుభమస్తు’’ అంటూ ఆశీర్వదించి అంతర్ధానమయాడు పరమశివుడు. ‘ఓం శంభో శంకరా’ అనుకుని ఆ పైన శంకర్రావ్ పేరుని తలచుకున్నదే తడవుగా మనసు వాయువేగాన వెళ్లి శంకర్రావు శరీరంలోకి ప్రవేశించింది. మా ఆవిడ చెప్పింది నిజమేలాగుంది. వాళ్ళావిడ భుజం చుట్టూరా చెయ్యేసి సరదాగా మాట్లాడుతూ మాల్లో షాపింగ్ చేస్తున్నాడు శంకర్రావ్. ఈ వేళ ఆదివారమేమీ కాదే! ఆఫీస్‌కి సెలవు పెట్టాడేమో మరి. అటువైపు ఫోన్లో మాట్లాడుతున్నది అతని బాస్ కాబోలు, వినయంగా సమాధానమిస్తున్నాడు. ‘‘సార్, మా బామ్మకి సీరియస్ అయితే ఐసీయూలో పెట్టారండీ, అందుకే ఈవేళ ఆఫీస్‌కి రాలేకపోతున్నా’’ ‘బీప్’ అంటూ శబ్దం రావడంతో ఫోన్లో వచ్చిన మెసేజ్ ని చదువుకుని హుషారుగా నవ్వుకున్నాడు శంకర్రావ్. ‘‘మమతా డార్లింగ్, ఆఫీస్ నుండి ఒకటే ఫోన్లు, అర్జెంటు పని. యిలా వెళ్లి అలా పని ముగించుకుని వచ్చేస్తానే, ఈలోగా నువ్వు నీ షాపింగ్ పని పూర్తి చేసుకో’’ అంటూ ఆగమేఘాల మీద బయల్దేరాడు. ‘‘మీరెప్పుడూ ఇంతే, నాతో షాపింగుకని రావడం, వచ్చిన పదినిమిషాలకే ఆఫీస్ పనంటూ వెళ్ళిపోవడం. ఛ ఛ.’’ వాళ్ళావిడ విసుక్కుంటున్నా విననట్లుగానే వెళ్లిపోయాడు శంకర్రావ్. అతనితో పాటే నా మనస్సూనూ ! శంకర్రావ్ బైక్ ఒక చిన్న ఇంటి ముందు ఆగింది. ‘‘ఇతను పని చేసేది మరీ ఇంత చిన్న ఆఫీస్‌లోనా?’’ ఈలోగా తలుపులు తెరిచి వాకిలికి అడ్డంగా వయ్యారంగా నిలబడ్డ ఓ ముప్ఫైరెండేళ్ళ పడతి నడుం మీద సుతారంగా వేళ్లతో మీటుతూ ఆమె భుజం మీద చెయ్యేసి ఆ యింట్లోకి.., కాదు కాదు, సరాసరి ఆమె బెడ్రూమ్లోకి ప్రవేశించాడు శంకర్రావ్. ఉన్నపళాన ఇంటికి వెళ్లి మా ఆవిడని తీసుకొచ్చి ఇదంతా చూపించి ‘‘వీడి గురించేనా నువ్వంత గొప్పగా మాట్లాడింది?’’ అంటూ నిలదీయాలనిపించింది. ఛ ఛ, చూసింది చాలు. ఇలాంటి మోసగాడి శరీరంలో యిక ఒక్క క్షణమైనా వుండలేను బాబూ ! శివనామస్మరణ చేసుకుని కృష్ణమోహన్ శరీరంలోకి చేర్చమంటూ మనసులో ప్రార్థించాను.మురికి కూపంలాంటి శంకర్రావ్ దేహం నుంచి బయటపడ్డ నా మనసు స్వేచ్ఛా వాయువులు పీల్చుకుని కృష్ణమోహన్ శరీరంలోకి ప్రవేశించింది. అసలు కృష్ణమోహన్ శరీరంలో మనసు ఉండవలసిన చోటంతా ఖాళీ !మనస్సనే ఛాయలే లేకుండా మనిషి వుండడం నాకెంతో అయోమయంగా తోచింది. ఇంతలో ఏవో ఫైళ్ల ని చేత్తో పట్టుకుని ఛాంబర్ లోకి వచ్చి కృష్ణమోహన్‌కి ఎదురుగా కూర్చున్నాడు ఒక వ్యక్తి. ‘‘మూర్తీ, ఆ గవర్నమెంట్ ఫ్లైఓవర్ కాంట్రాక్టు విషయం ఏమైంది? ఆ ఆఫీసర్‌తో డీల్ విషయం మాట్లాడావా?’’‘‘సార్, ఆ పోస్ట్‌లోకి కొత్తగా బదిలీ అయి వచ్చిన ఆఫీసర్ చాలా స్ట్రిక్ట్. ఎంత పెర్సెంటేజీ ఆఫర్ చేసినా అతనొప్పుకోవడంలేదు.’’‘‘పోనీ డబ్బు కాకుండా అతనికి మరేవైనా బలహీనతలున్నాయేమో కనుక్కున్నారా?’’‘‘ ఆడవాళ్ళ పిచ్చి బాగా ఉందని తెలిసింది సార్.!’’ ‘‘మరింకేం, వాడికి కావలసిన పిల్లని పంపిస్తే సరిపోతుందిగా ! ‘‘‘‘ కొత్త అమ్మాయిలని పట్టుకోవడం చాలా కష్టంగా వుంది.’’రెండు క్షణాల పాటు మౌనంగా ఆలోచిస్తూ ఉండిపోయాడు. ‘‘ప్రస్తుతానికి నా పీయే రజిత ఉందిగా , దాన్ని ఎర వేసేయండి’’‘‘ఆ పిల్ల యిలాంటి పనులకి ఒప్పుకోదు సార్ ’’‘‘కొత్తగా మాట్లాడుతున్నావేమిటి మూర్తీ? గతంలో ఎంతమంది కన్నెపిల్లలని బలవంతంగా మనమిలాంటి పన్లకి ఉపయోగించుకోలా? అంతగా ఆ పిల్ల బెట్టుచేస్తే ఏ కాఫీలోనో రేవ్ డ్రగ్ కలిపిచ్చేయండి. డ్రగ్మత్తులో ఏం జరిగిందీ ఎవ్వరికీ గుర్తుండదు. ఇవి కూడా నేనే చెప్పాలా?’’ చిరాకుపడ్డాడు కృష్ణమోహన్.‘‘అలాగే సార్’’మూర్తి వెళ్ళిపోయాక చేత్తో ఒక ఫైల్ ని పట్టుకుని మరొక వ్యక్తి ప్రవేశించాడు. ‘‘ఏవయ్యా గుప్తా, నాల్గు నెలలుగా ఆ టేబుల్ నుండి మన మెట్రో కాంట్రాక్టు ఫైల్ అరంగుళం కూడా కదలడం లేదు. ఎంతాలస్యంజరిగితే మనకంత నష్టమని తెలీదా నీకు?’’ వచ్చిన వ్యక్తిని గద్దించాడు కృష్ణమోహన్.‘‘ఏం చేయమంటారు సార్? ఆ సీట్లో వున్న రామరాజు సాక్షాత్తూ శ్రీరామచంద్రుడే. ఎన్ని ప్రలోభాలు చూపినా అతను దేనికీ లొంగట్లేదు’’‘‘సరే, యింక చేసేదేముంది. లేపించేయ్ ఆ శాల్తీని’’సింపుల్‌గా చెప్పేసి టేబుల్ మీద ఉంచిన ప్లేట్ లోని బిస్కెట్లని తింటూ టీ తాగసాగాడు కృష్ణమోహన్. భయంతో మనసు జలదరించింది.అప్పుడే ‘నోట్ల రద్దు’ అనే వార్త చూసి కృష్ణమోహన్‌కు గుండె పోటు వచ్చింది.కష్టం మీద ‘ఓం శంభో శంకరా’ అంటూ ఈశ్వరుడ్ని ప్రార్థించి అక్కడి నుండి బయటపడింది నా మనసు. ఎక్కడెక్కడికో వెళ్ళొచ్చి అడ్డమైన దుర్గంధాలన్నీ అంటించుకుని వచ్చిన మనసుకి నా శరీరాన్ని చేరుతూనే అంటుకున్న మురికంతా మటుమాయమైపోయి ఒళ్ళంతా తేలికయినట్లపించింది. ‘‘మళ్ళీపడుకున్నారేమిటండీ ? లేవండీ’’మా ఆవిడ మాటలకి దిగ్గున లేచా ! ‘‘ఏమండీ, ఈ విషయం విన్నారా? మన ప్రక్క ఫ్లాట్ శంకర్రావ్ లేడూ, అతనికి ఇదే ఊళ్ళో చిన్నిల్లుందటండీ! ఆ సంగతి తెలిసినప్పటి నుంచి పాపం వాళ్ళావిడ ఒకటే ఏడుస్తోంది. ఏమైనా నాకుమల్లే అందరికీ శ్రీరాముడిలాంటి భర్త దొరకడమంటే మాటలా చెప్పండి? ’’ నా సమాధానంకోసం ఎదురు చూడకుండానే నేను ఖాళీ చేసిన కాఫీకప్పు తీసుకుని వెళ్ళిపోయింది సుచిత్ర. ఆవిడలా వెళ్లిందో లేదో యిలా పరిగెత్తుకుంటూ వచ్చాడు మా పుత్రరత్నం.‘‘నాన్నా , మన కృష్ణమోహన్ అంకుల్‌కి గుండెపోటు వస్తే హాస్పిటల్లో చేర్పించారట! పోలీసులకి ఆయన గోడౌన్లలో రద్దు చేసిన పెద్దనోట్ల కట్టలు కోట్లకొద్దీ దొరికాయట! కాలేజీలో తన పరువుపోయిందని చెప్పి వాళ్ళ అబ్బాయి మదన్ క్లాసులకి రావడం మానేశాడు. కాలేజీమొత్తం ఇదే చర్చ నాన్నా. ‘పై రాబడి వచ్చే అవకాశాలున్న వుద్యోగం చేస్తూ కూడా ఈ కాలంలో నిజాయితీగా ఎంతమంది వుంటారండీ? మన రోహన్ నాన్నలాగా నీతిగా, పరుల సొమ్ము ఆశించకుండా నిబద్ధతతో జీవించేమనుషులని వేళ్ళమీద లెక్కపెట్టొచ్చు’ అని మా లెక్చరర్లంతా అంటుంటే నాకెంత సంతోషమేసిందో తెలుసా! ఐయాం వెరీ ప్రౌడాఫ్ యూ నాన్నా.’’నా చేతులని పట్టుకుని గట్టిగా ఊపేస్తున్న మా వాడి కళ్ళల్లో ఆ క్షణాన నాపట్ల కనిపించిన ఆరాధనా, కొద్ది ఘడియల ముందర మా ఆవిడ తన మాటల్లో నాపై వ్యక్తపరచిన నమ్మకమూ, ప్రేమా యివి కావూ అసలైన నిధులు! - అప్పరాజు నాగజ్యోతి -
అభిమాని కోసం ఆ హీరో ఏం చేశాడంటే..!
తమిళసినిమా: అభిమానులు లేనిదే హీరోలు లేరంటారు. ఇది ముమ్మాటికీ నిజమే. హీరోలు కొన్ని సందర్భాల్లో వారి కోసం ఎందాకైనా అంటుంటారు. సంచలన నటుడు శింబు చేసిన ఈ పని చూస్తే మీరే అవునంటారు. అసలేంటీ ఇదంతా అంటారా.. చదవండీ. నటుడు శింబు లక్షలాది అభిమానుల్లో మదన్ ఒకరు. స్థానిక తేనాంపేటలోని ఒక ఏరియాలో నివశిస్తున్నాడు. ఇతను నగరంలోని ఒక నక్షత్ర హోటల్లో పాటలు పాడుతుంటాడు. మదన్‌కు నటుడు శింబు అంటే వల్లమాలిన అభిమానం. ఆయన అభిమాన సంఘంలో నిర్వాహకుడిగా ఉన్నాడు. గతవారం ఒక వివాహ వేడుక కోసం పోస్టర్ అంటిస్తుండగా ఆ ప్రాంతంలోని యువకులకు, మదన్‌కు మధ్య గొడవ జరిగింది. అది చినికిచినికి పెద్దదై మదన్ హత్యకు దారితీసింది. ఈ విషయం దుబాయిలో ‘సెక్క సివంద వానం’ చిత్ర షూటింగ్లో ఉన్న శింబు దృష్టికి వచ్చింది. శింబు తన తండ్రి టి.రాజేందర్‌కు విషయం చెప్పి మదన్ కుటుంబాన్ని ఓదార్చడానికి పంపారు. గురువారం షూటింగ్ పూర్తి చేసుకుని శింబు చెన్నైకి చేరుకున్నారు. శుక్రవారం రాత్రి తేనాంపేట ప్రాంతంలో శింబు తన అభిమానికి కన్నీటి అంజలి పోస్టర్‌ను స్వయంగా అంటించారు. అభిమానులపై హీరోలకు ప్రేమాభిమానాలు ఉంటాయన్నది శింబు ఇలా నిరూపించారు. -
‘గాయత్రి’ మూవీ రివ్యూ
టైటిల్ : గాయత్రి జానర్ : యాక్షన్ డ్రామా తారాగణం : మోహన్ బాబు, మంచు విష్ణు, శ్రియ, నిఖిలా విమల్, అనసూయ సంగీతం : తమన్ ఎస్ దర్శకత్వం : మదన్ నిర్మాత : మోహన్ బాబు సీనియర్ నటుడు మోహన్ బాబు చాలా కాలం తరువాత లీడ్ రోల్లో నటించిన సినిమా గాయత్రి. తన సొంత నిర్మాణ సంస్థ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ సినిమాలో మోహన్ బాబు ద్విపాత్రాభినయం చేయగా, యంగ్ మోహన్ బాబుగా అతిథి పాత్రలో మంచు విష్ణు నటించాడు. ఆ నలుగురు, పెళ్లైన కొత్తలో చిత్రాలను తెరకెక్కించిన మదన్ తొలిసారిగా తన స్టైల్ మార్చి థ్రిల్లర్ జానర్ సినిమాను తెరకెక్కించారు. మరి ఈ ప్రయత్నం మదన్‌కు మరో విజయాన్ని అందించిందా..? నటుడిగా మోహన్ బాబు మరోసారి తన మార్క్ చూపించాడా..? కథ : దాసరి శివాజీ (మోహన్ బాబు) రంగస్థల నటుడు. దూరమైన కూతురి కోసం ఎదురుచూస్తూ కొంత మంది అనాథలను చేరదీసి శారదా సదనం అనే అనాథాశ్రమాన్ని నిర్వహిస్తుంటాడు. తన కూతురు ఏదో ఒక అనాథాశ్రమంలో ఉండే ఉంటుందన్న నమ్మకంతో అన్ని అనాథాశ్రమాలకు డబ్బు సాయం చేస్తుంటాడు. ఆ డబ్బు కోసం నేరస్థులలా మేకప్ వేసుకొని వారికి బదులు జైలు శిక్ష అనుభవిస్తుంటాడు. (సాక్షి రివ్యూస్) శివాజీ మీద అనుమానం వచ్చిన జర్నలిస్ట్ శ్రేష్ఠ (అనసూయ) అతడు చేసే పని ఎలాగైన బయటపెట్టాలని ప్రయత్నిస్తుంటుంది. ఓ గొడవ కారణంగా శివాజీకి తన కూతురు ఎవరో తెలుస్తుంది. కూతుర్ని కలుసుకునే సమయానికి గాయత్రి పటేల్ (మోహన్ బాబు), శివాజీని కిడ్నాప్ చేస్తాడు. తన బదులుగా శివాజీని ఉరికంభం ఎక్కించాలని ప్లాన్ చేస్తాడు గాయత్రి పటేల్. తనకు బదులుగా శిక్ష అనుభవించడానికి గాయత్రి పటేల్.. శివాజీనే ఎందుకు ఎంచుకున్నాడు..? శివాజీ కూతురు గాయత్రికి, గాయత్రి పటేల్‌కు సంబంధం ఏంటి..? ఈ సమస్యల నుంచి శివాజీ ఎలా బయటపడ్డాడు..? చివరకు గాయత్రి పటేల్ ఏమయ్యాడు..? అన్నదే మిగతా కథ. నటీనటులు : కలెక్షన్ కింగ్ మోహన్ బాబు రెండు విభిన్న పాత్రల్లో ఆకట్టుకున్నారు. నెగెటివ్ టచ్ ఉన్న పాత్రలు చేయటంలో తనకు తిరుగులేదని మరోసారి ప్రూవ్ చేసుకున్నారు. యాక్టింగ్ విషయంలో సూపర్బ్ అనిపించినా.. డ్యాన్స్ లు, ఫైట్స్ విషయంలో మాత్రం కాస్త ఇబ్బంది పడ్డారు. (సాక్షి రివ్యూస్) చిన్న పాత్రే అయినా విష్ణు కెరీర్ లో బెస్ట్ పర్ఫామెన్స్ తో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా విష్ణు నటించిన ఎమోషనల్ సీన్స్ ఆడియన్స్ తో కంటతడి పెట్టిస్తాయి. శ్రియ అందంగా, హుందాగా కనిపించింది. కీలకమైన గాయత్రి పాత్రలో నిఖిలా విమల్ మంచి నటన కనబరించింది. జర్నలిస్ట్ పాత్రలో అనసూయ పర్ఫెక్ట్గా సూట్ అయ్యింది. ఇతర పాత్రల్లో శివ ప్రసాద్, పోసాని కృష్ణ మురళీ, రాజా రవీంద్ర, బ్రహ్మానందం తమ పరిధి మేరకు మెప్పించారు. విశ్లేషణ : ఇప్పటి వరకు క్లాస్, హార్ట్ టచింగ్ సినిమాలు మాత్రమే చేసిన మదన్ తొలిసారిగా ఓ థ్రిలర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మోహన్ బాబు లాంటి విలక్షణ నటుడికి తగ్గ కథా కథనాలతో ఆకట్టుకున్నాడు. చాలా కాలం తరువాత మోహన్ బాబు ను పూర్తి నెగెటివ్ క్యారెక్టర్ లో చూపించిన మదన్ అభిమానులను మెప్పించాడు. ఫస్ట్ హాఫ్‌లో వేగంగా కథ నడిపించిన దర్శకుడు. ద్వితియార్థంలో మాత్రం కాస్త స్లో అయ్యాడు. సెకండ్ హాఫ్‌లో ఎమోషనల్ సీన్స్ ఆకట్టుకున్నా కథనం నెమ్మదించటం, (సాక్షి రివ్యూస్) అవసరం లేకపోయినా ఇరికించిన ఐటమ్ సాంగ్ కాస్త ఇబ్బంది పెడతాయి. సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ డైమండ్ రత్నబాబు డైలాగ్స్. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో శివాజీ పాత్రతో పలికించిన డైలాగ్స్‌కు థియేటర్లలో విజిల్స్ పడుతున్నాయి. తమన్ సంగీత మందించిన పాటలు పరవాలేదనిపించినా.. నేపథ్య సంగీతంతో మాత్రం మరోసారి మ్యాజిక్ చేశాడు. ఎడిటింగ్, సినిమాటోగ్రఫి, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ : మోహన్ బాబు నటన డైలాగ్స్ మైనస్ పాయింట్స్ : సెకండ్ హాఫ్ స్లో నేరేషన్ సాంగ్స్ - సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్ -
పాట పాడిన కలెక్షన్ కింగ్
సీనియర్ నటుడు మోహన్ బాబు లీడ్ రోల్ లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘గాయత్రి’. మదన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మోహన్ బాబు ద్విపాత్రిభినయం చేస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయమోకటి బయటకు వచ్చింది. ఇటీవల సినిమా ప్రమోషన్ లో భాగంగా ఓ సాంగ్ టీజర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ‘అండ పిండ బ్రహ్మాండ..’ అంటూ సాగే హనుమాన్ పాటను రిలీజ్ చేశారు. తమన్ సంగీత సారధ్యంలో రూపొందిన ఈ పాటను శంకర్ మహదేవన్‌తో కలిసి మోహన్ బాబు ఆలపించారు. గతంలో ‘తప్పుచేసి పప్పుకూడు’ సినిమాకోసం ‘అంతన్నాడింతన్నాడే’ అనే పాటలోనూ తన గాత్రాన్ని వినిపించారు కలెక్షన్ కింగ్. ఫిబ్రవరి 9న రిలీజ్ అవుతున్న గాయత్రి సినిమాలో మంచు విష్ణు, శ్రియలు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. -
మోహన్ బాబు గాయిత్రి టీజర్
-
‘వాళ్లు దేవుళ్లయితే ఇక్కడ నేనూ దేవుణ్నే’
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా గాయత్రి. మదన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మోహన్ బాబు ద్విపాత్రాభినయం చేస్తున్నారు. అంతేకాదు చాలా కాలం తరువాత ఆయన ఈ సినిమా పూర్తి స్థాయి ప్రతినాయక పాత్రలో కనిపించనున్నాడన్న టాక్ వినిపిస్తోంది. మంచు విష్ణు, శ్రియ, నిఖిలా విమల్లు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్లు సినిమా మీద మంచి హైప్ క్రియేట్ చేశాయి. తాజాగా ఇంట్రస్టింగ్ డైలాగ్స్ తో ఆసక్తికరంగా రూపొందించిన టీజర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. మదన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను మోహన్ బాబు స్వయంగా నిర్మిస్తున్నారు. -
సెల్‌ఫోన్‌తో తలెత్తే సమస్యలేంటీ?
తమిళసినిమా: టెక్నాలజీ నానాటికీ అభివృద్ధి చెందుతున్న ఈ రోజుల్లో మనిషి చేతిలో సెల్‌ఫోన్ లేకపోతే ఏ పనీ జరగని పరిస్థితి. ఇంతకు ముందు మాట్లాడుకోవడానికి మాత్రమే వాడే సెల్‌ఫోన్ ఇప్పుడు అన్నిటికీ ఉపయోగిస్తున్నారు. సెల్‌ఫోన్‌తో ప్రపంచమే అర చేతిలో ఉన్నట్లుగా మారిపోయింది. అయితే ఏ విషయాలైతే బహిరంగపరచకూడదో అలాంటివన్నీ సెల్‌ఫోన్ కారణంగా బట్టబయలు కావడంతో ఎదురయ్యే సమస్యలను ఆవిష్కరించే చిత్రంగా 88 చిత్రం ఉంటుందని ఆ చిత్ర దర్శకుడు ఎం.మదన్ తెలిపారు. ఈయన కథ, కథనం, మాటలు, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించిన ఈ చిత్రాన్ని జేకే.మూవీస్ పతాకంపై ఏ.జయకుమార్ నిర్మించారు. మదన్ కథానాయకుడిగా నటించిన ఇందులో ఆయనకు జంటగా ఉపాస్నారాయ్ కథానాయకిగా నటించారు. డేనియల్బాలాజీ, జయప్రకాశ్, పవర్‌స్టార్, జీఎం.కుమార్, అప్పుకుట్టి, శ్యామ్, ఎస్పీ.రాజా, కడమ్ కిషన్, మీరాకృష్ణన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించగా నటుడు జాన్‌విజయ్ ప్రధాన పాత్రలో నటించారు. దయారత్నం సంగీతాన్ని అందించిన ఈ 88 చిత్రాన్ని ఈ నెల 21న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు దర్శకుడు వెల్లడించారు. -
14న తెరపైకి 88
తమిళసినిమా: ఇప్పుడు అంకెలు టైటిల్‌గా రావడం ఎక్కువ అవుతోంది. ధనుష్ హీరోగా 3, సూర్య కథానాయకుడిగా 24 ఇలా కొన్ని చిత్రాలు ఇప్పటికే తెరపైకి వచ్చాయి. అదే విధంగా విజయ్‌సేతుపతి, త్రిష జంటగా నటిస్తున్న 96 చిత్రం ఇటీవలే ప్రారంభమైంది. ఈ కోవలో తాజాగా 88 అనే చిత్రం రానుంది. మదన్, ఉపాస్నారాయ్ జంటగా నటించిన ఇందులో డేనియల్ బాలాజి, జయప్రకాశ్, జీఎం.కుమార్, పవర్‌స్టార్, అప్పుకుట్టి, శ్యామ్, ఎస్పీ.రాజా, కడమ్ కిషన్, మీరాకృష్ణన్ ముఖ్యపాత్రలను పోషించిన ఇందులో నటుడు జాన్‌విజయ్ ప్రధాన పాత్ర పోషించారు. జీకే.మూవీ మేకర్స్ పతాకంపై ఏ.విజయ్‌కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి వినోద్ సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కథ, కథనం, దర్శకత్వం బాధ్యతలను ఎం.మదన్ నిర్వహించిన ఈ చిత్రానికి దయారత్నం సంగీతాన్ని, వెట్రిమారన్ ఛాయాగ్రహణం అందించారు. చిత్రం గురించి దర్శకుడు తెలుపుతూ, ఆధునిక యుగంలో కేవలం మాట్లాడడానికే వాడే సెల్‌ఫోన్‌తో ఇప్పుడు ఉపయోగపడని అంశం లేదన్నారు. అయితే కొన్ని విషయాలను బహిరంగపరచరాదన్నారు. ముఖ్యంగా స్త్రీల విషయంలో అలాంటివి బహిరంగపరచడం వల్ల ఎదురయ్యే సమస్యలే ఈ చిత్ర ఇతివృత్తం అని పేర్కొన్నారు. చిత్రాన్ని కమర్షియల్ అంశాలు జోడించి జనరంజకంగా తెరెకెక్కించినట్లు చెప్పారు. చెన్నై, ఆంధ్ర, ఊటీ ప్రాంతాల్లో చిత్రీకరణను పూర్తి చేశామని 88 చిత్ర నిర్మాణ కార్యక్రమాలు పూర్తయ్యాయని, జూలై 14వ తేదీన విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు దర్శకుడు వెల్లడించారు. -
‘ప్రొఫెషనల్’గా దివాకర్, మదన్
న్యూఢిల్లీ: ఒలింపియన్ దివాకర్ ప్రసాద్, జాతీయ మాజీ చాంపియన్ మదన్‌లాల్ ప్రొఫెషనల్ బాక్సింగ్‌లోకి అడుగు పెట్టనున్నారు. ఈ అమెచ్యూర్ బాక్సర్లు మంగళవారం ఐఓఎస్ బాక్సింగ్ ప్రమోషన్ అనే సంస్థతో ఒప్పందం చేసుకున్నారు. దివాకర్, మదన్‌తో పాటు మరో 11 మంది కూడా ఐఓఎస్‌తో ఒప్పందం చేసుకున్నారు. ఇప్పటికే విజేందర్, అఖిల్ కుమార్ వంటి వారిని ఈ సంస్థ ప్రమోట్ చేస్తోంది. ప్రొఫెషనల్ బాక్సింగ్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియాలో సభ్యులైన కామన్వెల్త్గేమ్స్ మెడలిస్ట్ అమన్‌దీప్ సింగ్, నీరజ్ గోయత్ వంటి ఆటగాళ్లు కూడా ఈ సంస్థతో కొత్తగా ఒప్పందం చేసుకున్నారు. ‘ఇప్పుడు మాతో 16 మంది బాక్సర్లు ఉన్నారు. వీరందరికీ గుర్గావ్లోని మా అకాడమీలో శిక్షణ ఇస్తాం’ అని ఐఓఎస్ డైరెక్టర్ గౌరవ్ తోమర్ తెలిపారు. ‘ఐదేళ్ల కింద భారత్‌లో ప్రొఫెషనల్ బాక్సింగ్‌కు అంతగా గుర్తింపు లేదు. కానీ ప్రస్తుతం పరిస్థితులు మారాయి. అందుకే ప్రొఫెషనల్‌గా మారాలని నిర్ణయం తీసుకున్నాను’ అని 2004 ఏథెన్స్ ఒలింపిక్స్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన జార్ఖండ్ బాక్సర్ దివాకర్ ప్రసాద్ తెలిపాడు. -
వేందర్ మూవీస్ మదన్ అదృశ్యం
భార్య, స్నేహితుల గాలింపు మధురై: వేందర్ మూవీస్ మదన్ గంగలో సమాధి అవుతానని లేఖ రాసి పెట్టి అదృశ్యం అయిన సంఘటన తీవ్ర సంచలనం కలిగించింది. దీంతో ఆయనను వెదుక్కుంటూ భార్య, మిత్రులు కాశీకి బయల్దేరారు. వేందర్ మూవీస్ సంస్థాపకుడు మదన్. ఈయన 2011లో ఈ సంస్థను ప్రారంభించి ‘అరవాన్’, విశాల్ నటించిన పాండియనాడులతో సహా పలు చిత్రాలను నిర్మించారు. అంతేకాకుండా 20 సినిమాలకు పైగా డిస్ట్రిబ్యూటర్‌గా వ్యవహరించారు. ఈయన ఎస్ఆర్ఎం విద్యాసంస్థల అధ్యక్షుడు పచ్చముత్తుకు సన్నిహితుడు. వేందర్ అని పిలవబడే పచ్చముత్తు తరఫున వేందర్ మూవీస్ అనే సంస్థను ప్రారంభించారు. అంతేకాకుండా ఎస్ఆర్ఎం కళాశాలలో అడ్మిషన్ల భర్తీకి మదన్‌కు పూర్తి స్వేచ్ఛ ఉంది. విద్యార్థులు చెల్లించే డొనేషన్ మదన్ ద్వారా కళాశాలకు చేరుతుంది. ఈ స్థితిలో వేందర్ మూవీస్ లెటర్ హెడ్లో ఐదుపేజీల లేఖను రాసిపెట్టి మదన్ అదృశ్యం అయ్యారు. ఈ లేఖ జిరాక్స్‌ను వాట్సప్ ద్వారా సినిమా, పత్రికల్లోని స్నేహితులకు పంపారు. అంతేగాకుండా సెల్‌ఫోన్ స్విచ్ఛాఫ్ చేశారు. ఆ లేఖలో తాను కాశీలోని గంగలో సమాధి అవుతానని తెలిపారు. తాను ఎంతో నిజాయితీగా, నిస్వార్థంగా పచ్చముత్తు వద్ద పనిచేశానని, కొందరు తనపై చాడీలు చెప్పి మా ఇద్దరి మధ్య వున్న స్నేహాన్ని దెబ్బతీశారని, ఐజేకే పార్టీ అభివృద్ధి కోసం తాను ఎంతో కష్టపడినట్లు మదన్ తెలిపారు. ఈ స్థితిలో విరక్తి చెందిన తాను ఇకపై ప్రాణాలతో బతికి ఉండడం వృథా అని పేర్కొన్నారు. దీంతో అతను ఎక్కిడికి వెళ్లాడనే ఆచూకీ తెలియలేదు. మదన్‌ను వెతుకుతూ అతని భార్య, అమ్మ క్రియేషన్స్ శివ, నటుడు లారెన్స్ కాశీకి బయలుదేరి వెళ్లినట్లు సమాచారం. -
చూస్తే... డిజప్పాయింట్ కారు!
‘‘మదన్ ఈ చిత్రాన్ని బాగా డెరైక్ట్ చేశాడు. సినిమా బాగా వచ్చింది. ఫీల్‌గుడ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ఇది. ఇందులో మంచి సోల్ ఉంటుంది. ఆది డ్యాన్స్, ఫైట్స్, అదా శర్మ నటన హైలైట్ ’’ అని సాయికుమార్ తెలిపారు. ఆది, అదాశర్మ జంటగా వసంత శ్రీనివాస్ సమర్పణలో శ్రీనివాస సాయి స్క్రీన్స్ పతాకంపై మదన్ దర్శకత్వంలో పి.సురేఖ నిర్మించిన ‘గరం’ ఈ శుక్రవారం విడుదల అవుతోంది. ఈ సందర్భంగా చిత్రబృందం హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడింది. ‘‘ఈ చిత్రానికి మంచి టెక్నీషియన్స్, నటులు పనిచేశారు. ‘గరం’ చిత్రం అమెరికాలో కూడా పెద్ద రేంజ్లో విడుదలవుతోంది. ఓ మంచి సినిమాను అందరూ ఆదరించాలి’’ అని సాయికుమార్ పేర్కొన్నారు. దర్శకుడు మదన్ మాట్లాడుతూ- ‘‘నా దృష్టిలో ఈ సినిమా ఇప్పటికే హిట్. తనికెళ్ల, పోసాని వంటి నట-రచయితలతో పనిచేసే అవకాశం ఈ చిత్రంతో వచ్చింది. సాయికుమార్ గారు నాకు స్వేచ్ఛనిచ్చి, మంచి పని రాబట్టుకున్నారు’’ అని చెప్పారు. ‘‘సీనియర్లతో కలిసి పనిచేయడం ఆనందంగా ఉంది. సినిమాపై మంచి అంచనాలున్నాయి. యూత్, ఫ్యామిలీ ప్రేక్షకులందరికీ నచ్చే సినిమా ఇది. ‘గరం’ చూసినవారెవరూ డిజప్పాయింట్ అవరు’’ అని ఆది తెలిపారు. అదాశర్మ, తనికెళ్ల, పోసాని, పృథ్వి, నాజర్, చైతన్య కృష్ణ, కథారచయిత శ్రీనివాస్ గవిరెడ్డి పాల్గొన్నారు. -
సాయికుమార్, ఆది వల్లే ఆ షాక్ నుంచి తేరుకున్నా!
‘ఆ నలుగురు’ సినిమా ఒక్కటి చాలు... రచయితగా మదన్ టాలెంట్ గురించి చెప్పడానికి. ‘పెళ్లైన కొత్తలో’ చిత్రంతో దర్శకునిగా కూడా భేష్ అనిపించుకున్నారాయన. ఆది, అదా శర్మ జంటగా ఆయన డెరైక్ట్ చేసిన ‘గరం’ ఈ 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా మదన్‌తో జరిపిన భేటీ... * మీ ఇమేజ్ దృష్ట్యా ‘గరం’ టైటిల్‌తో మీ నుంచి సినిమా ఎక్స్పెక్ట్ చేయలేదు? (నవ్వుతూ) యాక్చువల్‌గా నేనే ఎక్స్పెక్ట్ చేయలేదు. శ్రీనివాస్ గవిరెడ్డి ఈ లైన్ చెప్పినప్పుడు నాకు చాలా నచ్చింది. గరం అంటే కోపానికి పర్యాయ పదం అనుకుంటారు. ఇందులో రొమాన్స్ ఉంది. ఆ ఫీల్‌ని కూడా గరం అనొచ్చు. ఫ్యామిలీ ఎమోషన్స్‌ను కూడా అలా అనొచ్చు. ఈ సినిమాలో ప్రేమ, రొమాన్స్, యాక్షన్, ఫ్యామిలీ ఎమోషన్స్ అన్నీ ఉన్నాయి. * ఈ సినిమా మధ్యలో ఆగడం, ఆ తర్వాత సాయికుమార్ టేకప్ చేయడం.. ఈ ప్రాసెస్ గురించి చెబుతారా? 2014లో ఓ షెడ్యూల్ చేశాం. ఆ తర్వాత జరిగిన యాక్సిడెంట్ వల్ల సినిమా ఆగింది. ఒక మంచి కథతో తీస్తున్న సినిమా ఆగడం నచ్చక హీరో ఆది తన తండ్రి సాయికుమార్ని ఒప్పించి, ఈ చిత్రాన్ని నిర్మించేలా చేశాడు. సాయికుమార్ ప్రాజెక్ట్‌ని టేకప్ చేశాక కేక్ వాక్‌లా అయ్యింది. నిర్మాతలు సురేఖ, వసంతా శ్రీనివాస్‌ల సహకారం మర్చిపోలేనిది. ఏది అడిగినా కాదన కుండా సమకూర్చి, సినిమా బాగా రావడానికి కారణమయ్యారు. మళ్లీ నా కెరీర్లో సాయికుమార్ అంతటి బెస్ట్ ప్రొడ్యూసర్ దొరుకుతారో లేదో? * ఇంతకూ ఆ యాక్సిడెంట్ గురించి చెప్పలేదు? ‘గరం’ ప్రాజెక్ట్ సెట్ అవ్వడానికి కారణం నా మిత్రుడు నాగిరెడ్డి. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత, నా రైట్ హ్యాండ్లాంటివాడు. ఈ చిత్రానికి సంబంధించిన పనుల మీద వెళుతూ జరిగిన యాక్సిడెంట్లో చనిపోయాడు. నేను చాన్నాళ్లు ఆ షాక్‌లోనే ఉండిపోయాను. సాయికుమార్, ఆది, నా కుటుంబ సభ్యులు, మిత్రుల వల్లే ఆ షాక్ నుంచి బయటపడగలిగాను. ఆది నమ్మకమే స్ఫూర్తిగా... ఈ సినిమా కోసం ఇటలీలోని గోర్మిటి అనే ఎత్తై ప్రదేశంలో ఒక సీన్ తీశాం. ఎముకలు కొరికే చలి. ఒంటి మీద పల్చని షర్ట్, ఫ్యాంట్‌తో ఆది ఆ సీన్ చేయాలి. మేమంతా కింద ఉన్నాం. తను పైకి ఎక్కాడు. ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకూ అక్కడే నిలబడ్డాడు. వాతావరణం అనుకూలించక ఆ రోజు షాట్ తీయలేదు. మర్నాడు మేం ఎక్కడ ఆ షాట్ వద్దంటామేమోనని ముందే కొండ ఎక్కేశాడు. అంత డెడికేషన్. ఈ చిత్రంపై ఆది పట్టుదల, నమ్మకం నాకు చాలా స్ఫూర్తిగా నిలిచాయి. కచ్చితంగా మా అందరికీ మంచి ఫలితం దక్కుతుందనే నమ్మకం ఉంది. * మంచి కంటెంట్‌తో సినిమాలు తీసే దర్శకుడు మీరు. మరి.. ఆదిలాంటి కమర్షియల్ హీరోకి కావాల్సిన ఎలిమెంట్స్ ఈ కథలో ఉన్నాయా? ‘పెళ్లైన కొత్త’లోని తీసుకుంటే.. వైవాహిక అనుబంధాన్ని కమర్షియల్‌గానే డీల్ చేశాను. బేసిక్‌గా నేను సోల్ లేకుండా సినిమా చేయడానికి ఇష్టపడను. ‘గరం’ ప్రేమ నేపథ్యంలో సాగే చిత్రం. వరాలు పాత్రను ఆది నరనరాన జీర్ణించు కుని చేశాడు. ఇప్పటివరకు చేసిన చిత్రాల ద్వారా ఆది బాగా డ్యాన్సులు, ఫైట్లు చేయగలడని ప్రూవ్ చేసుకున్నాడు. నటనాపరంగా కూడా మంచి మార్కులే తెచ్చుకున్నాడు. ఈ సినిమా నటుడిగా తనకు ఇంకా మంచి పేరు తెచ్చిపెట్టే విధంగా ఉంటుంది. డైలాగ్ డెలివరీకి ప్రత్యేకంగా ప్రశంసలు లభిస్తాయి. ఆది హార్డ్ వర్క్, నమ్మకమే ఈ సినిమా. * సినిమా సినిమాకీ గ్యాప్ తీసుకుంటున్నారు.. కారణం ఏంటి? ఒకానొక దశలో సినిమా పరిశ్రమ నుంచి వెళ్లిపోదామనుకున్నాను. దానికో కారణం ‘ప్రవరాఖ్యుడు’ ఆశించిన ఫలితం ఇవ్వకపోవడం. ఆ సినిమా విడుదలైన రెండో రోజుకే రాజకీయాలపరంగా ఏర్పడిన పరిస్థితుల కారణంగా థియేటర్లు మూతపడ్డాయి. అప్పటికి ఆంధ్రా సైడ్ మంచి టాక్ వచ్చింది. ఆ తర్వాత అక్కడా థియేటర్లు మూతపడ్డాయి. ఒక మంచి సినిమా అలా ఇగ్నోర్ అయిపోయినందుకు బాధపడ్డా. సినిమాలు ఎందుకులే? అనుకోవడానికి అదో కారణం. ఆ తర్వాత చేసిన రెండు వ్యాపారాలు వర్కవుట్ కాలేదు. దాంతో సినిమా పరిశ్రమే కరెక్ట్ అనిపించింది. * మీ ప్రతిభకు తగ్గ గుర్తింపు లభించలేదనే బాధ ఏదైనా ఉందా? మొదట్లో ఉండేది. ఆ తర్వాత అలా ఆశించడం సరికాదని తెలుసుకున్నా. గుర్తింపు రావడం అంటే ఏంటి? నలుగురూ అభినందించడమే కదా. ఇప్పుడు నేనో మంచి సినిమా చూశాననుకోండి.. ‘బాగుంది’ అనుకుంటాను తప్ప స్వయంగా ఫోన్ చేసి చెప్పను. అంటే.. ఆ సినిమా తీసినవాళ్లకు గుర్తింపు లేనట్లా? అలాగే నాకు స్వయంగా ఫోన్ చేయకపోయినా మనసులో అభినందించి ఉండొచ్చు. అసలెవరూ గుర్తించకపోతే అప్పుడు మన ఎఫర్ట్‌లో లోపం ఉన్నట్లు లెక్క. * మీ తదుపరి చిత్రాలు? ‘గరం’ మీద ఆధారపడి ఉంటుంది. ఆ సినిమాకి వచ్చే మార్కెట్‌ని బట్టి నాకు ఫోన్ కాల్స్ వస్తాయి (నవ్వుతూ). -
ఆల్ ది బెస్ట్
పరీక్షలు బాగా రాసినప్పుడు ఫలితం బాగుంటుందనే నమ్మకం కలుగుతుంది. ఆది ఆ నమ్మకంతోనే ఉన్నారు. అదా శర్మతో కలిసి మదన్ డెరైక్షన్‌లో ‘గరం’ అనే పరీక్ష రాశారు ఆది. ఈ చిత్రాన్ని పరీక్ష అని ఆది ఎందుకు అంటున్నారంటే కథ విపరీతంగా నచ్చి, తన తండ్రి సాయికుమార్ని ఒప్పించి, నిర్మించేలా చేశారు. వసంతా శ్రీనివాస్ సమర్పణలో శ్రీనివాస సాయి స్క్రీన్స్ పతాకంపై పి. సురేఖ నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సాయికుమార్ మాట్లాడుతూ - ‘‘ఆది నటించిన 7వ చిత్రమిది. తన కెరీర్లో బెస్ట్ ఫిల్మ్ అవుతుంది. అన్ని కమర్షియల్ హంగులూ ఉన్నాయి. తొలిసారి అమెరికా, కెనడాలో ఈ చిత్రం భారీగా విడుదలవుతోంది. 2016వ సంవత్సరం చాలా మంచి ఊపుతో మొదలైంది. కొత్త ఏడాదిలో విడుదలైన సినిమాలన్నీ మంచి విజయం సాధించాయి. అన్ని సినిమాలూ బాగుండాలి, అందరూ సంతోషంగా ఉండాలని కోరుకునే వాణ్ణి నేను’’ అన్నారు. ‘‘మంచి సినిమా చేశాం. విడుదల దగ్గర పడుతోంటే నెర్వస్‌గా, ఎగ్జయి టింగ్‌గా ఉంది. సినిమా సమస్యల్లో ఉన్నప్పుడు నాన్న నా భుజం తట్టి ప్రోత్సహించారు. చిత్రం చూసిన ప్రేక్షకులు డిజప్పాయింట్ కారు’’ అని ఆది పేర్కొన్నారు. సీనియర్ నరేష్ మాట్లాడుతూ - ‘‘పదహారు రకాల కూరలతో విందు భోజనం చేసినట్లుంటుందీ చిత్రం. ప్రతి ప్రేక్షకుడూ ఈ కథలో తనను తాను చూసుకుంటాడు. నేను చేసిన తండ్రి పాత్రకు మంచి పేరొస్తుంది. ఫ్యామిలీస్‌తో అందరూ చూసే మంచి సినిమా ఇది. సాయికుమార్ ‘బెస్ట్ ఫాదర్’. ఆది అందమైన హీరో. మంచి మనసున్న వాడు. కెరీర్‌వైజ్‌గా తనను మరో పదిమెట్లు ఎదిగేలా చేసే సినిమా ఇది. అతని కెరీర్ బెస్ట్ఫిల్మ్కు నా ఆల్ ది బెస్ట్’’ అని పేర్కొన్నారు. అదా శర్మ, సహ నిర్మాత బాబ్జీ పాల్గొన్నారు. సంగీతం: అగస్త్య, కెమెరా: సురేందర్ రెడ్డి. -
పోష్ కుర్రాడిలా గెటప్, పబ్బుల్లో వినోదం..ఆపై చోరీలు
హైదరాబాద్ : సంపన్న కుటుంబం నుంచి వచ్చిన కుర్రాడిలా గెటప్... బ్రాండెడ్ వస్తువులు... పబ్బుల్లో వినోదం... అక్కడికొచ్చే అమ్మాయిలతో పరిచయం. అమ్మాయిల ఇళ్ల వరకూ ప్రయాణం.. ప్రేమ పేరుతో మోసం.. వాళ్లకి తెలియకుండా అమ్మాయిల చుట్టుపక్కల ఇళ్లల్లో చోరీలు... ఇంజినీరింగ్ చదివిన ఓ ప్రబుద్ధుడి తీరిది. ఎవరికీ అనుమానం రాకుండా రెండున్నరేళ్ల నుంచి ఇలా దొంగతనాలు చేస్తూ తప్పించుకు తిరుగుతున్నాడు. పోలీసులకు సవాల్‌గా మారిన ప్రేమదొంగ మదన్... ఎట్టకేలకు శుక్రవారం ఎస్ఆర్ నగర్ పోలీసులకు చిక్కాడు. నిందితుడి నుంచి 30 లక్షలకుపైగా సొత్తును స్వాధీనం చేసుకున్నారు. అతనితో పాటు మరో ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద ఉన్న కారును సీజ్ చేసి, విచారణ జరుపుతున్నారు. -
తండ్రికి మందులు తీసుకువస్తూ..
రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం వృద్ధుడికి తీవ్ర గాయాలు ఉయ్యూరు రోటరీ ఆస్పత్రి వద్ద ఘటన మృతుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ అభ్యర్థి తనయుడు ఉయ్యూరు, న్యూస్‌లైన్ : తండ్రి కి మందులు కొని బైక్‌పై ఇంటికి తిరిగి వెళుతున్న ఓ యువకుడు రోడ్డు ప్ర మా దంలో మరణించాడు. మం దు లు తీసుకెళ్లడం ఆలస్యమైతే తండ్రికి గ్యాస్ నొప్పి ఎక్కువై ఎలాంటి ముప్పు వాటిల్లుతుం దోనన్న ఆతృతలో మో టార్సైకిల్పై వస్తూ రోడ్డు దా టుతున్న ఓ వృద్ధుడిని ఢీకొట్టాడు. ఈ ఘటనలో యువకుడు పంట కాలువలో పడి మరణించగా, వృద్ధుడికి తీవ్ర గాయాలయ్యా యి. పట్టణంలో గురువారం తె ల్లవారుజామున ఈ ఘటన జరి గింది. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని కడవకొల్లు శివారు పొట్లపాడు గ్రామానికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఎంపీటీసీ అభ్యర్థి ఎర్రపోతు నాంచారయ్యకు గురువారం తెల్లవారుజామున గ్యాస్ కారణంగా విపరీతమైన నొప్పితో బాధపడ్డారు. దీంతో ఆయన కుమారుడు మదన్(18) మందుల కోసం మోటార్‌సైకిల్‌పై ఉయ్యూరు వచ్చాడు. వాటిని తీసుకుని హడావుడిగా తిరిగి వెళుతూ రోటరీ ఆస్పత్రి వద్ద కంటి వై ద్యం కోసం వచ్చి రోడ్డు దాటుతున్న ఎం.నరసింహారావు అ నే వృద్ధుడిని ఢీకొట్టాడు. ఈ ఘటనలో నరసింహారావుకు తీవ్ర గాయాలవగా, మదన్ పక్కనే ఉన్న పంట కాలువలోకి ఎగిరి పడ్డాడు. తలకు బలమైన గాయం కావడంతోపాటు నీటిలో మునిగిపోవడంతో బయటకు రాలేక, ఊపిరాడక అక్కడికక్కడే మరణించాడు. అతడు పంట కాలువలో పడిపోవడాన్ని ఎవరూ చూడలేదు. కొంతసేపటి తరువాత అటుగా వచ్చిన వారు తీవ్రంగా గాయపడిన నరసింహారావును, రోడ్డు పక్కన పడి ఉన్న మోటార్‌సైకిల్‌ను చూశారు. వృద్ధుడిని ఎవరో బైక్‌తో ఢీకొట్టి అక్కడే వదిలి పరారయ్యాడని భావించారు. నరసింహారావును స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మదన్ ఎంతకూ తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యులు, బంధు వులు గాలింపు ప్రారంభించారు. తరువాత కొంతసేపటికి అటుగా వెళుతున్న వ్యక్తి పంట కాలువలో మృతదేహం ఉం డటాన్ని చూశారు. ఈ విషయం తెలిసిన నాంచారయ్య బంధువులు అక్కడకు వచ్చి మృతదేహాన్ని వెలికి తీసి, మదన్దిగా గుర్తించారు. కుమారుడి మృతదేహా న్ని చూసి నాంచారయ్య స్పృహతప్పి పడిపోయారు. దీంతో బంధువులు మరింత ఆందోళనకు గురై ఆయనను ఆస్పత్రికి తరలించారు. మదన్ పాలిటెక్నిక్ పూర్తిచేసి ఇంటివద్దనే ఉంటున్నాడని స్థానికులు తెలి పారు. చేతికంది వచ్చిన ఒక్క కుమారుడు అర్ధంతరంగా మరణించడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మదన్ అకాల మరణంతో గ్రామంలో విషా దం నెలకొంది. వైఎస్సార్ సీపీ నేతల పరామర్శ ఈ ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పెనమలూరు అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి కె.విద్యాసాగరరావు, నియోజకవర్గ సమన్వయకర్త పడమట సురేష్‌బాబు, మండల కన్వీనర్ వంగవీటి సురేష్‌బాబు, పార్టీ నేత దేవభక్తుని చక్రవర్తి తదితరులు గ్రామానికి వచ్చి నాంచారయ్య కుటుంబీకులను పరామర్శించారు. మదన్ మృతదేహం వద్ద నివాళులు అర్పించారు. మదన్ మృతదేహాన్ని సందర్శించిన వారిలో గ్రామ సర్పంచ్ యర్రపోతు అంకవరప్రసాద్, పార్టీ నాయకులు వల్లె శ్రీనివాసరావు, చింతా వెంకటేశ్వరరావు, కార్తీక్, నాని, వంగా శివార్జునరెడ్డి, వణుకూరు సురేష్, నిడుమోలు పూర్ణ తదితరులు ఉన్నారు.