తండ్రికి మందులు తీసుకువస్తూ..
- రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం
- వృద్ధుడికి తీవ్ర గాయాలు
- ఉయ్యూరు రోటరీ ఆస్పత్రి వద్ద ఘటన
- మృతుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ అభ్యర్థి తనయుడు
ఉయ్యూరు, న్యూస్‌లైన్ : తండ్రి కి మందులు కొని బైక్‌పై ఇంటికి తిరిగి వెళుతున్న ఓ యువకుడు రోడ్డు ప్ర మా దంలో మరణించాడు. మం దు లు తీసుకెళ్లడం ఆలస్యమైతే తండ్రికి గ్యాస్ నొప్పి ఎక్కువై ఎలాంటి ముప్పు వాటిల్లుతుం దోనన్న ఆతృతలో మో టార్‌సైకిల్‌పై వస్తూ రోడ్డు దా టుతున్న ఓ వృద్ధుడిని ఢీకొట్టాడు. ఈ ఘటనలో యువకుడు పంట కాలువలో పడి మరణించగా, వృద్ధుడికి తీవ్ర గాయాలయ్యా యి. పట్టణంలో గురువారం తె ల్లవారుజామున ఈ ఘటన జరి గింది. వివరాలిలా ఉన్నాయి.
మండలంలోని కడవకొల్లు శివారు పొట్లపాడు గ్రామానికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఎంపీటీసీ అభ్యర్థి ఎర్రపోతు నాంచారయ్యకు గురువారం తెల్లవారుజామున గ్యాస్ కారణంగా విపరీతమైన నొప్పితో బాధపడ్డారు. దీంతో ఆయన కుమారుడు మదన్(18) మందుల కోసం మోటార్‌సైకిల్‌పై ఉయ్యూరు వచ్చాడు. వాటిని తీసుకుని హడావుడిగా తిరిగి వెళుతూ రోటరీ ఆస్పత్రి వద్ద కంటి వై ద్యం కోసం వచ్చి రోడ్డు దాటుతున్న ఎం.నరసింహారావు అ నే వృద్ధుడిని ఢీకొట్టాడు.
ఈ ఘటనలో నరసింహారావుకు తీవ్ర గాయాలవగా, మదన్ పక్కనే ఉన్న పంట కాలువలోకి ఎగిరి పడ్డాడు. తలకు బలమైన గాయం కావడంతోపాటు నీటిలో మునిగిపోవడంతో బయటకు రాలేక, ఊపిరాడక అక్కడికక్కడే మరణించాడు. అతడు పంట కాలువలో పడిపోవడాన్ని ఎవరూ చూడలేదు. కొంతసేపటి తరువాత అటుగా వచ్చిన వారు తీవ్రంగా గాయపడిన నరసింహారావును, రోడ్డు పక్కన పడి ఉన్న మోటార్‌సైకిల్‌ను చూశారు.
వృద్ధుడిని ఎవరో బైక్‌తో ఢీకొట్టి అక్కడే వదిలి పరారయ్యాడని భావించారు. నరసింహారావును స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మదన్ ఎంతకూ తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యులు, బంధు వులు గాలింపు ప్రారంభించారు. తరువాత కొంతసేపటికి అటుగా వెళుతున్న వ్యక్తి పంట కాలువలో మృతదేహం ఉం డటాన్ని చూశారు. ఈ విషయం తెలిసిన నాంచారయ్య బంధువులు అక్కడకు వచ్చి మృతదేహాన్ని వెలికి తీసి, మదన్‌దిగా గుర్తించారు.
కుమారుడి మృతదేహా న్ని చూసి నాంచారయ్య స్పృహతప్పి పడిపోయారు. దీంతో బంధువులు మరింత ఆందోళనకు గురై ఆయనను ఆస్పత్రికి తరలించారు. మదన్ పాలిటెక్నిక్ పూర్తిచేసి ఇంటివద్దనే ఉంటున్నాడని స్థానికులు తెలి పారు. చేతికంది వచ్చిన ఒక్క కుమారుడు అర్ధంతరంగా మరణించడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మదన్ అకాల మరణంతో గ్రామంలో విషా దం నెలకొంది.
వైఎస్సార్ సీపీ నేతల పరామర్శ
ఈ ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పెనమలూరు అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి కె.విద్యాసాగరరావు, నియోజకవర్గ సమన్వయకర్త పడమట సురేష్‌బాబు, మండల కన్వీనర్ వంగవీటి సురేష్‌బాబు, పార్టీ నేత దేవభక్తుని చక్రవర్తి తదితరులు గ్రామానికి వచ్చి నాంచారయ్య కుటుంబీకులను పరామర్శించారు. మదన్ మృతదేహం వద్ద నివాళులు అర్పించారు.
మదన్ మృతదేహాన్ని సందర్శించిన వారిలో గ్రామ సర్పంచ్ యర్రపోతు అంకవరప్రసాద్, పార్టీ నాయకులు వల్లె శ్రీనివాసరావు, చింతా వెంకటేశ్వరరావు, కార్తీక్, నాని, వంగా శివార్జునరెడ్డి, వణుకూరు సురేష్, నిడుమోలు పూర్ణ తదితరులు ఉన్నారు.