సెల్‌ఫోన్‌తో తలెత్తే సమస్యలేంటీ? | 88 is a film that launches problems with cellphone. | Sakshi
Sakshi News home page

సెల్‌ఫోన్‌తో తలెత్తే సమస్యలేంటీ?

Published Thu, Jul 13 2017 1:26 AM | Last Updated on Tue, Sep 5 2017 3:52 PM

సెల్‌ఫోన్‌తో తలెత్తే సమస్యలేంటీ?

సెల్‌ఫోన్‌తో తలెత్తే సమస్యలేంటీ?

తమిళసినిమా: టెక్నాలజీ నానాటికీ అభివృద్ధి చెందుతున్న ఈ రోజుల్లో మనిషి చేతిలో సెల్‌ఫోన్‌ లేకపోతే ఏ పనీ జరగని పరిస్థితి. ఇంతకు ముందు మాట్లాడుకోవడానికి మాత్రమే వాడే సెల్‌ఫోన్‌ ఇప్పుడు అన్నిటికీ ఉపయోగిస్తున్నారు. సెల్‌ఫోన్‌తో ప్రపంచమే అర చేతిలో ఉన్నట్లుగా మారిపోయింది. అయితే ఏ విషయాలైతే బహిరంగపరచకూడదో అలాంటివన్నీ సెల్‌ఫోన్‌ కారణంగా బట్టబయలు కావడంతో ఎదురయ్యే సమస్యలను ఆవిష్కరించే చిత్రంగా 88 చిత్రం ఉంటుందని ఆ చిత్ర దర్శకుడు ఎం.మదన్‌ తెలిపారు.

ఈయన కథ, కథనం, మాటలు, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించిన ఈ చిత్రాన్ని జేకే.మూవీస్‌ పతాకంపై ఏ.జయకుమార్‌ నిర్మించారు. మదన్‌ కథానాయకుడిగా నటించిన ఇందులో ఆయనకు జంటగా ఉపాస్నారాయ్‌ కథానాయకిగా నటించారు. డేనియల్‌బాలాజీ, జయప్రకాశ్, పవర్‌స్టార్, జీఎం.కుమార్, అప్పుకుట్టి, శ్యామ్, ఎస్‌పీ.రాజా, కడమ్‌ కిషన్, మీరాకృష్ణన్‌ తదితరులు ముఖ్య పాత్రలు పోషించగా నటుడు జాన్‌విజయ్‌ ప్రధాన పాత్రలో నటించారు. దయారత్నం సంగీతాన్ని అందించిన ఈ 88 చిత్రాన్ని ఈ నెల 21న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు దర్శకుడు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement