చూస్తే... డిజప్పాయింట్ కారు! | garam movie press meet | Sakshi
Sakshi News home page

చూస్తే... డిజప్పాయింట్ కారు!

Published Wed, Feb 10 2016 10:12 PM | Last Updated on Sun, Sep 3 2017 5:22 PM

చూస్తే... డిజప్పాయింట్ కారు!

చూస్తే... డిజప్పాయింట్ కారు!

‘‘మదన్ ఈ చిత్రాన్ని బాగా డెరైక్ట్ చేశాడు. సినిమా బాగా వచ్చింది. ఫీల్‌గుడ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ఇది. ఇందులో మంచి సోల్ ఉంటుంది. ఆది డ్యాన్స్, ఫైట్స్, అదా శర్మ నటన హైలైట్ ’’ అని సాయికుమార్ తెలిపారు. ఆది, అదాశర్మ జంటగా వసంత శ్రీనివాస్ సమర్పణలో శ్రీనివాస సాయి స్క్రీన్స్ పతాకంపై మదన్ దర్శకత్వంలో పి.సురేఖ నిర్మించిన ‘గరం’ ఈ శుక్రవారం విడుదల అవుతోంది. ఈ సందర్భంగా చిత్రబృందం  హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడింది.
 
  ‘‘ఈ చిత్రానికి మంచి టెక్నీషియన్స్, నటులు పనిచేశారు. ‘గరం’ చిత్రం అమెరికాలో కూడా పెద్ద రేంజ్‌లో విడుదలవుతోంది. ఓ మంచి సినిమాను అందరూ ఆదరించాలి’’ అని సాయికుమార్ పేర్కొన్నారు. దర్శకుడు మదన్ మాట్లాడుతూ- ‘‘నా దృష్టిలో ఈ సినిమా ఇప్పటికే హిట్. తనికెళ్ల, పోసాని వంటి నట-రచయితలతో పనిచేసే అవకాశం ఈ చిత్రంతో వచ్చింది. సాయికుమార్ గారు నాకు స్వేచ్ఛనిచ్చి, మంచి పని రాబట్టుకున్నారు’’ అని చెప్పారు.
 
  ‘‘సీనియర్లతో కలిసి పనిచేయడం ఆనందంగా ఉంది. సినిమాపై మంచి అంచనాలున్నాయి. యూత్, ఫ్యామిలీ ప్రేక్షకులందరికీ నచ్చే సినిమా ఇది. ‘గరం’ చూసినవారెవరూ డిజప్పాయింట్ అవరు’’ అని ఆది తెలిపారు. అదాశర్మ, తనికెళ్ల, పోసాని, పృథ్వి, నాజర్, చైతన్య కృష్ణ, కథారచయిత శ్రీనివాస్ గవిరెడ్డి పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement