పాట పాడిన కలెక్షన్‌ కింగ్‌ | Mohan babu turns singer for Gayathri | Sakshi
Sakshi News home page

పాట పాడిన కలెక్షన్‌ కింగ్‌

Published Sun, Jan 28 2018 10:43 AM | Last Updated on Sun, Jan 28 2018 10:43 AM

Mohan babu - Sakshi

‘గాయత్రి’ సినిమాలో మోహన్‌ బాబు

సీనియర్ నటుడు మోహన్‌ బాబు లీడ్‌ రోల్‌ లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘గాయత్రి’. మదన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మోహన్ బాబు ద్విపాత్రిభినయం చేస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయమోకటి బయటకు వచ్చింది. ఇటీవల సినిమా ప్రమోషన్‌ లో భాగంగా ఓ సాంగ్‌ టీజర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్‌.

‘అండ పిండ బ్రహ్మాండ..’ అంటూ సాగే హనుమాన్‌ పాటను రిలీజ్ చేశారు. తమన్ సంగీత సారధ్యంలో రూపొందిన ఈ పాటను శంకర్‌ మహదేవన్‌తో కలిసి మోహన్‌ బాబు ఆలపించారు. గతంలో ‘తప్పుచేసి పప్పుకూడు’ సినిమాకోసం ‘అంతన్నాడింతన్నాడే’ అనే పాటలోనూ తన గాత్రాన్ని వినిపించారు కలెక్షన్‌ కింగ్‌. ఫిబ్రవరి 9న రిలీజ్‌ అవుతున్న గాయత్రి సినిమాలో మంచు విష్ణు, శ్రియలు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement