14న తెరపైకి 88 | 88 film is to be released on July 14th | Sakshi
Sakshi News home page

14న తెరపైకి 88

Published Thu, Jun 29 2017 1:54 AM | Last Updated on Tue, Sep 5 2017 2:42 PM

14న తెరపైకి 88

14న తెరపైకి 88

తమిళసినిమా: ఇప్పుడు అంకెలు టైటిల్‌గా రావడం ఎక్కువ అవుతోంది. ధనుష్‌ హీరోగా 3, సూర్య కథానాయకుడిగా 24 ఇలా కొన్ని చిత్రాలు ఇప్పటికే తెరపైకి వచ్చాయి. అదే విధంగా విజయ్‌సేతుపతి, త్రిష జంటగా నటిస్తున్న 96 చిత్రం ఇటీవలే ప్రారంభమైంది. ఈ కోవలో తాజాగా 88 అనే చిత్రం రానుంది.

మదన్, ఉపాస్నారాయ్‌ జంటగా నటించిన ఇందులో డేనియల్‌ బాలాజి, జయప్రకాశ్, జీఎం.కుమార్, పవర్‌స్టార్, అప్పుకుట్టి, శ్యామ్, ఎస్‌పీ.రాజా, కడమ్‌ కిషన్, మీరాకృష్ణన్‌ ముఖ్యపాత్రలను పోషించిన ఇందులో నటుడు జాన్‌విజయ్‌ ప్రధాన పాత్ర పోషించారు. జీకే.మూవీ మేకర్స్‌ పతాకంపై ఏ.విజయ్‌కుమార్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి వినోద్‌ సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కథ, కథనం, దర్శకత్వం బాధ్యతలను ఎం.మదన్‌ నిర్వహించిన ఈ చిత్రానికి దయారత్నం సంగీతాన్ని, వెట్రిమారన్‌ ఛాయాగ్రహణం అందించారు.

చిత్రం గురించి దర్శకుడు తెలుపుతూ, ఆధునిక యుగంలో కేవలం మాట్లాడడానికే వాడే సెల్‌ఫోన్‌తో ఇప్పుడు ఉపయోగపడని అంశం లేదన్నారు. అయితే కొన్ని విషయాలను బహిరంగపరచరాదన్నారు. ముఖ్యంగా స్త్రీల విషయంలో అలాంటివి బహిరంగపరచడం వల్ల ఎదురయ్యే సమస్యలే ఈ చిత్ర ఇతివృత్తం అని పేర్కొన్నారు. చిత్రాన్ని కమర్షియల్‌ అంశాలు జోడించి జనరంజకంగా తెరెకెక్కించినట్లు చెప్పారు. చెన్నై, ఆంధ్ర, ఊటీ ప్రాంతాల్లో చిత్రీకరణను పూర్తి చేశామని 88 చిత్ర నిర్మాణ కార్యక్రమాలు పూర్తయ్యాయని, జూలై 14వ తేదీన విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు దర్శకుడు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement