
తమిళసినిమా: అభిమానులు లేనిదే హీరోలు లేరంటారు. ఇది ముమ్మాటికీ నిజమే. హీరోలు కొన్ని సందర్భాల్లో వారి కోసం ఎందాకైనా అంటుంటారు. సంచలన నటుడు శింబు చేసిన ఈ పని చూస్తే మీరే అవునంటారు. అసలేంటీ ఇదంతా అంటారా.. చదవండీ. నటుడు శింబు లక్షలాది అభిమానుల్లో మదన్ ఒకరు. స్థానిక తేనాంపేటలోని ఒక ఏరియాలో నివశిస్తున్నాడు. ఇతను నగరంలోని ఒక నక్షత్ర హోటల్‌లో పాటలు పాడుతుంటాడు. మదన్‌కు నటుడు శింబు అంటే వల్లమాలిన అభిమానం. ఆయన అభిమాన సంఘంలో నిర్వాహకుడిగా ఉన్నాడు. గతవారం ఒక వివాహ వేడుక కోసం పోస్టర్ అంటిస్తుండగా ఆ ప్రాంతంలోని యువకులకు, మదన్‌కు మధ్య గొడవ జరిగింది.
అది చినికిచినికి పెద్దదై మదన్ హత్యకు దారితీసింది. ఈ విషయం దుబాయిలో ‘సెక్క సివంద వానం’ చిత్ర షూటింగ్‌లో ఉన్న శింబు దృష్టికి వచ్చింది. శింబు తన తండ్రి టి.రాజేందర్‌కు విషయం చెప్పి మదన్ కుటుంబాన్ని ఓదార్చడానికి పంపారు. గురువారం షూటింగ్ పూర్తి చేసుకుని శింబు చెన్నైకి చేరుకున్నారు. శుక్రవారం రాత్రి తేనాంపేట ప్రాంతంలో శింబు తన అభిమానికి కన్నీటి అంజలి పోస్టర్‌ను స్వయంగా అంటించారు. అభిమానులపై హీరోలకు ప్రేమాభిమానాలు ఉంటాయన్నది శింబు ఇలా నిరూపించారు.
Comments
Please login to add a commentAdd a comment