Fan die
-
యడ్డీ రాజీనామాతో ఆగిన గుండె.. విషాదంలో మాజీ సీఎం
బెంగళూరు: తమ అభిమాన నేత ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలగడంతో అతడు తల్లడిల్లిపోయాడు. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారనే వార్త విన్న ఆ యువకుడు తట్టుకోలేక బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన తెలిసి అపద్ధర్మ ముఖ్యమంత్రి దిగ్ర్భాంతికి గురయ్యారు. ఈ ఘటన తనకు షాక్‌కు గురి చేసిందని తెలిపారు. ఆ కుటుంబంలో అతడి లోటును ఏమిచ్చినా పూడ్చలేమని తెలిపారు. ఈ సంఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకుంది. కర్ణాటకలో కొన్ని నెలలుగా సాగుతున్న పొలిటికల్ సస్పెన్స్‌కు సోమవారం తెరపడింది. కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి ఎట్టకేలకు బీఎస్ యడియూరప్ప సోమవారం రాజీనామా చేశారు. పార్టీలో ఏర్పడ్డ విబేధాల కారణంగా.. అసమ్మతి వర్గం వైపు అధిష్టానం మొగ్గు చూపడంతో రెండేళ్లకే ముఖ్యమంత్రి పదవి నుంచి ఆయన దిగిపోయారు. యడియూరప్ప రాజీనామాతో చామరాజనగర జిల్లాకు చెందిన రవి (35) మనస్తాపానికి గురయ్యాడు. దీంతో అతడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న యడియూరప్ప షాక్‌కు గురయ్యినట్లు ట్వీట్ చేశారు. ‘నా రాజీనామాతో మనస్తాపం చెంది రవి ఆత్మహత్యకు పాల్పడడం బాధ కలిగింది. రాజకీయాల్లో గెలుపోటములు సహజం. ఇది జీవితంలో అంగీకరించలేని వాస్తవం. అతడిని కోల్పోవడంతో ఆ కుటుంబం పడుతున్న బాధ అంతాఇంతా కాదు’ అని యడియూరప్ప ట్వీట్ చేశారు. త్వరలోనే మృతుడి కుటుంబాన్ని ఆయన పరామర్శించే అవకాశం ఉంది. కాగా, రవి ఆత్మహత్యపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. సీఎం రాజీనామాతోనే అతడు ఆత్మహత్యకు పాల్పడ్డాడా, లేదా అనే అంశంపై కూడా దర్యాప్తు చేయనున్నారు. -
రాజకుటుంబ వీరాభిమాని ‘కోహినూర్’ మృతి
ముంబై: బ్రిటన్ రాజవంశానికి వీరాభిమాని, బ్రిటానియా&కో రెస్టారెంట్ ఓనర్ అయిన బోమన్ కోహినూర్(93) బుధవారం మృతి చెందాడు. గుండెపోటుతో నిన్న సాయంత్రం 4.45గంటలకు కన్ను మూసినట్లు పార్సీ జనరల్ ఆస్పత్రి అధికారి తెలిపారు. బ్రిటానియా రెస్టారెంట్ ఓనర్‌గా కొద్ది మందికి మాత్రమే తెలిసిన బోమన్ కోహినూర్.. 2016లో ఆకస్మాత్తుగా దేశం అంతటా గుర్తింపు తెచ్చుకున్నాడు. 2016లో ఇండియా-భూటాన్ వారం రోజుల పర్యటన నిమిత్తం భారత్ వచ్చిన ప్రిన్స్ విలియమ్స్ దంపతులు ప్రత్యేకంగా ముంబై వెళ్లి బోమన్‌ని కలుసుకున్నారు. ఈ సంఘటనతో బోమన్‌కు ఒక్కరోజులోనే దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చేసింది. బోమన్ కోహినూర్ తండ్రి 1923లో ముంబైలో బ్రిటానియా&కో రెస్టారెంట్‌ను ప్రారంభించాడు. ఊహ తెలిసిన నాటి నుంచి కోహినూర్ జీవితం ఆ రెస్టారెంట్‌కు అంకితమయ్యింది. చిన్ననాటి నుంచి కోహినూర్ బ్రిటన్ రాజవంశం పట్ల వల్లమాలిన అభిమానాన్ని పెంచుకున్నాడు. ఎంతలా అంటే బోమన్ రెస్టారెంట్లోకి అడుగుపెట్టిన వారికి ముందుగా క్వీన్ ఎలిజబెత్ II, మహాత్మగాంధీ నిలువెత్తు ఫోటోలు దర్శనమిస్తాయి. అంతేకాక కోహినూర్ ప్రతి ఏడాది క్వీన్ ఎలిజబెత్ IIకు ప్రత్యేక సందర్భాల్లో ఉత్తరాలు రాస్తుంటాడు. రాజ ప్రసాదం నుంచి క్వీన్ ప్రతినిధులు ఆమె తరఫున ప్రత్యుత్తరం కూడా పంపుతారు. కోహినూర్‌కు రాజ కుటుంబం అంటే ఎంత అభిమానం అంటే.. తన మనవరాలికి ఏకంగా ప్రిన్స్ విలియమ్స్ తల్లి డయానా పేరు పెట్టాడు. కోహినూర్ మరణం పట్ల నెటిజన్లు విచారం వ్యక్తం చేస్తున్నారు. అత్యంత ప్రియమైన బొంబాయి వాసి ఇక లేరని తెలిసి బాధగా ఉందంటూ కామెంట్ చేస్తున్నారు. -
అభిమాని కోసం ఆ హీరో ఏం చేశాడంటే..!
తమిళసినిమా: అభిమానులు లేనిదే హీరోలు లేరంటారు. ఇది ముమ్మాటికీ నిజమే. హీరోలు కొన్ని సందర్భాల్లో వారి కోసం ఎందాకైనా అంటుంటారు. సంచలన నటుడు శింబు చేసిన ఈ పని చూస్తే మీరే అవునంటారు. అసలేంటీ ఇదంతా అంటారా.. చదవండీ. నటుడు శింబు లక్షలాది అభిమానుల్లో మదన్ ఒకరు. స్థానిక తేనాంపేటలోని ఒక ఏరియాలో నివశిస్తున్నాడు. ఇతను నగరంలోని ఒక నక్షత్ర హోటల్లో పాటలు పాడుతుంటాడు. మదన్‌కు నటుడు శింబు అంటే వల్లమాలిన అభిమానం. ఆయన అభిమాన సంఘంలో నిర్వాహకుడిగా ఉన్నాడు. గతవారం ఒక వివాహ వేడుక కోసం పోస్టర్ అంటిస్తుండగా ఆ ప్రాంతంలోని యువకులకు, మదన్‌కు మధ్య గొడవ జరిగింది. అది చినికిచినికి పెద్దదై మదన్ హత్యకు దారితీసింది. ఈ విషయం దుబాయిలో ‘సెక్క సివంద వానం’ చిత్ర షూటింగ్లో ఉన్న శింబు దృష్టికి వచ్చింది. శింబు తన తండ్రి టి.రాజేందర్‌కు విషయం చెప్పి మదన్ కుటుంబాన్ని ఓదార్చడానికి పంపారు. గురువారం షూటింగ్ పూర్తి చేసుకుని శింబు చెన్నైకి చేరుకున్నారు. శుక్రవారం రాత్రి తేనాంపేట ప్రాంతంలో శింబు తన అభిమానికి కన్నీటి అంజలి పోస్టర్‌ను స్వయంగా అంటించారు. అభిమానులపై హీరోలకు ప్రేమాభిమానాలు ఉంటాయన్నది శింబు ఇలా నిరూపించారు. -
ఫుట్‌బాల్ మ్యాచ్‌లో విషాదం
బ్యూనస్ ఎయిర్స్ (అర్జెంటీనా): వినోదాన్ని పంచాల్సిన ఫుట్‌బాల్ మ్యాచ్.. అభిమానం హద్దులు దాటడంతో విషాదాన్ని మిగిల్చింది. అర్జెంటీనాలో ఓ ఫుట్‌బాల్ మ్యాచ్ సందర్భంగా స్టేడియంలో ఇరు జట్ల అభిమానులు ఘర్షణ పడటంతో ఓ అభిమాని తీవ్రంగా గాయపడి మరణించాడు. బెల్గ్రానో, టాలెరెస్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ 1-1తో డ్రా అయ్యింది. స్టేడియంలో మ్యాచ్ తిలకిస్తున్న ఇరు జట్ల అభిమానులు పరస్పరం దాడికి దిగారు. ఈ దాడిలో ఎమాన్యుల్ బాల్బో అనే అభిమాని తీవ్రంగా గాయపడ్డాడు. అతన్ని వెంటనే ఆస్పత్రికి తరలించగా, కోమాలో ఉన్నట్టు వైద్యులు చెప్పారు. ఆ తర్వాత అతన్ని బ్రెయిన్ డెడ్‌గా ప్రకటించారు. ఎమాన్యుల్ మృతిపై ఫుట్‌బాల్ సంఘాల అధికారులు దిగ్భ్రాంతి చెందారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఇలాంటి ఘటనను జరగకుండా తగిన చర్యలు తీసుకుంటామని, అభిమానులు ఇలా దాడులకు దిగడం సరికాదని పేర్కొన్నారు.