మెరుగైన సేవలు అందించేందుకు త్వరతగతిన వీసాలు మంజూరు చేసేందుకు హైదరాబాద్‌లోని యూఎస్ కాన్సులేట్ త్వరలో సువిశాల ప్రాంగణంలోకి మారనుంది.
హైదరాబాద్ : మెరుగైన సేవలు అందించేందుకు త్వరతగతిన వీసాలు మంజూరు చేసేందుకు హైదరాబాద్‌లోని యూఎస్ కాన్సులేట్ త్వరలో సువిశాల ప్రాంగణంలోకి మారనుంది. కొత్త కన్సూలేట్ భవనానికి వచ్చే ఏడాది ఆగస్టులో శంకుస్థాపన చేయనున్నారు. హైదరాబాద్ నానక్‌రాంగూడలో 12.3 ఎకరాల విస్తీర్ణంలో సకల సదుపాయలతో కూడిన భవనం 2020 నాటికి అందుబాటులోకి రానుంది. కొత్తభవనంలో ఒకేరోజు 15 వందల నుంచి 2500 వీసా కోసం దరఖాస్తులు తీసుకునేందుకు వీలుగా సౌకర్యాలు కల్పిస్తున్నారు. హైదరాబాద్ నగర సంస్కృతిని ప్రతిబింబించే విధంగా ఈ భవనం నిర్మించనున్నారు.