
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్ త్వరలోనే నూతన భవనంలోకి మారనుంది. బేగంపేటలోని పైగా ప్యాలస్‌లో 14 ఏళ్లుగా కార్యకలాపాలు సాగిస్తోంది అమెరికా దౌత్య కార్యాలయం. 2008, అక్టోబర్ 24న హైదరాబాద్‌లోని యూఎస్ కాన్సులేట్‌లో అమెరికా జెండా తొలిసారి ఎగిరింది.
పైగా ప్యాలస్‌లోని కాన్సులేట్‌లో విధులు నిర్వర్తిస్తున్న సిబ్బందికి అక్కడ ఇదే చివరి వార్షికోత్సవం కానుంది. త్వరలోనే సుమారు 300 మిలియన్ డాలర్లతో నిర్మించిన కొత్త భవనంలోకి మారనున్నారు. ఈ క్రమంలో పైగా ప్యాలస్‌లో కాన్సులేట్ స్టాఫ్ తుది వార్షికోత్సవాన్ని నిర్వహించుకున్నారు. వచ్చే ఏడాది ఇదే సమయానికి నూతన భవనంలో అమెరికా జెండాను ఎగురవేయనున్నారు. హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్... తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశాలతో అగ్రరాజ్య సంబంధాలను పర్యవేక్షిస్తోంది.
ఇదీ చదవండి: 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు..
Comments
Please login to add a commentAdd a comment