consulate officers
-
Hyderabad: నూతన భవనంలోకి హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్
-
నూతన భవనంలోకి హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్ త్వరలోనే నూతన భవనంలోకి మారనుంది. బేగంపేటలోని పైగా ప్యాలస్‌లో 14 ఏళ్లుగా కార్యకలాపాలు సాగిస్తోంది అమెరికా దౌత్య కార్యాలయం. 2008, అక్టోబర్ 24న హైదరాబాద్‌లోని యూఎస్ కాన్సులేట్‌లో అమెరికా జెండా తొలిసారి ఎగిరింది. పైగా ప్యాలస్‌లోని కాన్సులేట్‌లో విధులు నిర్వర్తిస్తున్న సిబ్బందికి అక్కడ ఇదే చివరి వార్షికోత్సవం కానుంది. త్వరలోనే సుమారు 300 మిలియన్ డాలర్లతో నిర్మించిన కొత్త భవనంలోకి మారనున్నారు. ఈ క్రమంలో పైగా ప్యాలస్‌లో కాన్సులేట్ స్టాఫ్ తుది వార్షికోత్సవాన్ని నిర్వహించుకున్నారు. వచ్చే ఏడాది ఇదే సమయానికి నూతన భవనంలో అమెరికా జెండాను ఎగురవేయనున్నారు. హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్... తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశాలతో అగ్రరాజ్య సంబంధాలను పర్యవేక్షిస్తోంది. ఇదీ చదవండి: 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. -
ఆస్పత్రి బిల్లు రూ.3.40 కోట్లు.. ఆదుకున్న అధికారులు
దుబాయ్: అనారోగ్యం కారణంగా దుబాయ్ ఆస్పత్రిలో చేరిన గల్ఫ్ కార్మికుడికి అండగా నిలిచింది గల్ఫ్ కార్మికుల రక్షణ సమితి. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం సుద్దపెల్లి గ్రామానికి చెందిన కట్ల గంగారెడ్డి అనే కార్మికుడు గతేడాది డిసెంబర్ 25న అనారోగ్యం కారణంగా దుబాయ్‌లోని మెడిక్లినిక్ హాస్పిటల్లో చేరాడు. అప్పటికే పక్షవాతం రావడంతో బ్రెయిన్ ఆపరేషన్ మొదలుపెట్టగా పరిస్థితి విషమించి కోమాలోకి వెళ్లాడు. గత ఆరు నెలల తర్వాత గంగారెడ్డి కోమా నుంచి బయటకు వచ్చాడు,. అనంతరం మరో మూడు నెలల పాటు చికిత్స కొనసాగింది. అయితే ఈ 9 నెలలకు సంబంధించి చికిత్స బిల్లు రూ. 3.40 కోట్లు అయ్యింది. స్పందించిన అధికారులు తల తాకట్టు పెట్టినా చెల్లించలేనంతగా ఆస్పత్రి బిల్లు రావడంతో గంగారెడ్డి కుటుంబ సభ్యులు, స్నేహితులు గల్ఫ్ కార్మికుల రక్షణ సమితిని సంప్రదించారు. సమితి అధ్యక్షుడు గుండెల్లి నర్సింహా పేషెంటుకు ధైర్యం చెప్పడంతో పాటు దుబాయ్‌లో ఉన్న ఇండియన్ కాన్సులేట్ అధికారులకు సమాచారాన్ని చేరవేశారు. దీనికి స్పందించిన భారతీయ అధికారులు బిల్లు మాఫీ చేయించడంతో పాటు గంగారెడ్డి ఇండియా చేరుకునేందుకు ప్రత్యేక ఎయిర్ అంబులెన్సుని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం హైదరాబాద్‌కి చేరుకున్న గంగారెడ్డిని నేరుగా స్వగ్రామానికి పంపకుండా ప్రస్తుతం నిమ్స్ ఆస్పత్రిలో పరిశీలనలో ఉంచారు. చదవండి: యూఏఈకి వెళ్లే వారికి ఊరట -
కాన్సులేట్ అధికారుల అపహరణ
ట్యూనిస్: అంతర్యుద్ధంతో అట్టుడుకుతోన్న లిబియాలో మరో సంచలనం చోటుచేసుకుంది. రాజధాని ట్రిపోలీలోని ట్యునీషియా రాయబార కార్యాలయంపై సాయుధ ఉగ్రవాదులు దాడి జరిపి 10 మంది అధికారులను అపహరించుకు వెళ్లారు. దీంతో ఆందోళనకు గురైన ట్యునీషియా ప్రభుత్వం.. బందీలను విడిపించే దిశగా చర్యలు చేపట్టాల్సిందిగా లిబియా ఉన్నతాధికారులను కోరారు. అయితే లిబియా అధికారులు మాత్రం ఇప్పటివరకు స్పందించలేదని, ఇలాంటి అపహరణలు మరిన్ని జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో రాజధాని ట్రిపోలీ సహా లిబియాలో ఉన్న తమ దేశస్తులందూ వెంటనే వెనక్కు రావాలని ఆదేశించినట్లు ట్యునీషియా ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. 2011లో గడాఫీ మరణానంతరం తలెత్తిన ఆధిపత్య పోరు లిబియాను అతలాకుతలం చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు ఆసుపత్రులు, స్కూలు భవనాలను నేలకూల్చిన తిరుగుబాటుదారులు తాజాగా రాయబార కార్యాలయాలను టార్గెట్ చేసుకున్నట్లు తెలిసింది.