జేఎన్‌టీయూకే అధికారులతో భేటీ
బాలాజీచెరువు (కాకినాడ) :
జేఎన్‌టీయూకే రిజిస్ట్రార్ సాయిబాబు, పరీక్షల విభాగం అధికారులు యూఎస్ కాన్సులేట్ ప్రతినిధులు ఫ్రాడ్ ప్రివెన్షన్ మేనేజర్ మిస్టర్ ఆడమ్ ఫెర్గూసన్, ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ అసిస్టెంట్ మేడమ్ తెన్నేరు సునీత సోమవారం కాన్ఫరెన్స్‌హాల్లో సమావేశమయ్యారు. జేఎన్‌టీయూకే పరీక్షల విభాగంలో సర్టిఫికెట్ డాక్యుమెంటేషన్ విధానంపై సమీక్షించారు. జేఎన్‌టీయూకే స్థాపించిన నాటినుంచి నకిలీ ధ్రువపత్రాలు జారీ కాకుండా సాంకేతిక పద్దతులను అనుసరించే విధానం, సాప్‌్టవేర్ వినియోగం, ధ్రువీకరణ పత్రాల జారీ వంటి అంశాలను రిజిస్ట్రార్ సాయిబాబు యూఎస్ ప్రతినిధులకు వివరించారు. ఈ సమీక్షలో జేఎన్‌టీయూకే రెక్టార్ ప్రభాకరరావు, డీఈ సుబ్బారావు, సీఈ మోహనరావు, వైస్ ప్రిన్సిపాల్ బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.