సాక్షి, హైదరాబాద్: టీఆర్‌ఎస్ పుణ్యమా అని మంత్రి వర్గంలో మహిళా సభ్యులు లేని రాష్ట్రంగా తెలంగాణ రికార్డుల్లోకి ఎక్కిం దని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ విమర్శించారు. గురువారం మహిళా దినోత్సవం సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ ప్రభుత్వం మహిళా వ్యతిరేక ప్రభుత్వమని ఆరోపించారు.
మహిళల పట్ల అధికార టీఆర్‌ఎస్‌కు ఎందుకంత చిన్నచూపో సీఎం కేసీఆర్ స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. మహిళలకు రాజకీయంగా సముచిత అవకాశాలు కల్పిస్తున్న ఏకైక పార్టీ బీజేపీయేనని లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. రిజర్వేషన్లను నిర్ణయించే అధికారం రాష్ట్రాలకు ఉండాలనే టీఆర్‌ఎస్ డిమాండ్ సరికాదని బీజేపీ సీనియర్ నేత ప్రొఫెసర్ ఎస్‌వీ శేషగిరిరావు అన్నారు. రిజర్వేషన్ల అధికారం రాష్ట్రాలకు ఇవ్వడం వల్ల చాలా సమస్యలు ఉత్పన్నమవుతాయని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వాలు మారినప్పుడల్లా రిజర్వేషన్లు మారుతాయన్నారు. మతపరమైన రిజర్వేషన్లు ఇవ్వడం సరికాదని రాజ్యాంగంలోనే ఉందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment