మాస్కో: మహిళా దినోత్సవం సందర్భంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశంలోని మహిళలపై ప్రశంసల జల్లు కురిపించారు. మాతృత్వపు బహుమతులను వారు అందిస్తున్నారని కీర్తించారు. మహిళా దినోత్సవం సందర్భంగా శుక్రవారం(మార్చ్ 8)నాడు పుతిన్ దేశంలోని మహిళలను ఉద్దేశించి మాట్లాడారు.
‘మహిళలు క్లిష్టతరమైన బాధ్యతలు వేగంగా, సమర్థవంతంగా నిర్వహించడంతో పాటు మగవారి పట్ల చాలా కేరింగ్‌గా ఉంటారు. ఎన్నో సమస్యలున్నప్పటికీ వారెప్పుడూ అందంగానే వెలిగిపోతుంటారు’అని పుతిన్ వ్యాఖ్యానించారు. ఇటీవలి కాలంలో రష్యాలో బర్త్‌రేటు పెంచే ప్రచారాన్ని పుతిన్ తీవ్రం చేశారు.
ముగ్గురు పిల్లలున్న యువ తల్లిదండ్రుల కోసం ఏం చేయడానికైనా ప్రభుత్వం సిద్ధంగా ఉందని మహిళా దినోత్సవం సందర్భంగా పుతిన్ మరోసారి స్పష్టం చేశారు. గత వారం పార్లమెంట్‌లో మాట్లాడుతూ ముగ్గురు అంతకంటే ఎక్కువ పిల్లలున్న తల్లిదండ్రులు దేశానికి గొప్ప గౌరవం అని పుతిన్ కీర్తించడం గమనార్హం. కాగా, సోవియెట్ కాలం నుంచి రష్యాలో మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటారు. మార్చి 8 వుమెన్స్ డేను హాలిడేగా ప్రకటించి మహిళలకు భారీగా బహుమతులు అందిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment