లండన్‌లో "ఇండిపెండెన్స్ డే ఫ్రీడమ్ మార్చ్" | TAUK, Indian high commission organizes Independence day Freedom March in London | Sakshi
Sakshi News home page

లండన్‌లో "ఇండిపెండెన్స్ డే ఫ్రీడమ్ మార్చ్"

Published Tue, Aug 15 2017 9:38 PM | Last Updated on Sun, Sep 17 2017 5:33 PM

లండన్‌లో "ఇండిపెండెన్స్ డే ఫ్రీడమ్ మార్చ్"

లండన్‌లో "ఇండిపెండెన్స్ డే ఫ్రీడమ్ మార్చ్"

- వందలాదిగా పాల్గొన్న ప్రవాస సంఘాల ప్రతినిధులు
లండన్: భారతీయ హై కమిషన్‌ ఆధ్వర్యంలో భారత 71వ స్వతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా 'ఇండిపెండెన్స్‌ డే ఫ్రీడమ్‌ మార్చ్‌'ను లండన్‌లో ఘనంగా నిర్వహించారు. లండన్‌లోని పార్లమెంట్ స్క్వేర్ నుంచి ప్రారంభమైన ర్యాలీ ఇండియన్ హై కమిషన్ కార్యాలయం వరకు సాగింది. భారత దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన వందలాది మంది  ప్రవాస సంఘాల ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు.

"భారత్ మాతాకీ జై " అను నినాదాలతో లండన్‌ వినువీధులు మారుమోగాయి. తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్‌డమ్‌(టాక్)కు చెందిన సభ్యులు మార్చ్‌లో ప్రాతినిధ్యం వహించి "జై భారత్, జై తెలంగాణ" అంటూ నినదించారు. మార్చ్‌ ముగిసిన అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో భారత హై కమిషనర్‌ వైకే సిన్హా ప్రవాస భారతీయులకు స్వాతంత్రదినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. విదేశాల్లో ఉన్నప్పటికీ మాతృభూమిపై మీకున్న ప్రేమ ఎంతో గొప్పదని ప్రవాస భారతీయులను ప్రశంసించారు. కార్యక్రమం వియజయవంతం కావడానికి కృషి చేసిన అందరికి కృతఙ్ఞతలు తెలిపారు.

టాక్ వ్యవస్థాపకుడు అనిల్ కూర్మాచలం మాట్లాడుతూ.. గతంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం లండన్‌లో ఎన్నో ర్యాలీలు నిర్వహించామని, కానీ నేటి భారత స్వాతంత్ర వేడుకల సందర్బంగా ఏర్పాటు చేసిన "ఇండిపెండెన్స్ డే ఫ్రీడమ్ మార్చ్ " లో పాల్గొనడం చాలా గర్వంగా ఉందని అన్నారు. మరీ ముఖ్యంగా బ్రిటిష్ గడ్డపై భారత జెండా ఎగురవేసి ఇలా అర్ధరాత్రి సంబరాలు చేసుకోవడం మరుపురాని అనుభూతినిచ్చిందని తెలిపారు. అలాగే వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రవాస బిడ్డలందరూ ఒక చోట ఇలా కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందని, ఈ కార్యక్రమాన్ని నిర్వహించి ఆహ్వానించిన భారత హై కమిషన్ కి కృతజ్ఞతలు తెలిపారు.


ఈ కార్యక్రమంలో హై కమిషన్ ప్రతినిధులు ఏఎస్‌ రాజన్, విజయ్ వసంత, టాక్ వ్యవస్థాపకుడు అనిల్ కూర్మాచలం, సభ్యులు నవీన్ రెడ్డి, అశోక్, రత్నాకర్, సత్య, రాకేష్, సత్యపాల్, రాజేష్ వాకా, ప్రవీణ్ వీర, రవి కిరణ్, వెంకీ, నగేష్, రాకేష్, నాగరాజు, భరత్, సత్తి రెడ్డి, నరేష్, రమ్మీ, జకీర్, రవీందర్ రెడ్డి, సాయి నితిన్, ఇతర ప్రవాస సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement