లండన్‌లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు
రాయికల్: ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో ఉన్న తెలంగాణవాదులు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించుకోవడం అభినందనీయమని కేంద్ర పట్టణాభివద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు, తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ మధుసూదనచారి అన్నారు. ఆదివారం లండన్‌లోని తెలంగాణ జాగృతి యునైటెడ్ కింగ్‌డమ్ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమరువీరులకు నివాళులర్పించారు. ఈ వేడుకలకు కేంద్ర పట్టణాభివద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు, తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ మధుసూదనచారి, మేయర్ సలేర్ జఫర్, లండన్‌లోని ఇండియన్ హైకమిషన్ ఫస్ట్‌సెక్రటరి విజయ్‌వసంత, బ్రిటన్ ఎంపీ స్టీఫెన్ టిమ్స్, మిల్టన్ కిన్ కౌన్సిలర్ గీత ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా కేంద్ర పట్టణాభివద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ, తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ప్రపంచంలోని వివిధదేశాల్లో తెలంగాణ ఆవిర్భావ వేడుకలను నిర్వహించుకోవడం అభినందనీయమన్నారు. అనంతరం తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ మధుసూదనచారి మాట్లాడుతూ.. తెలంగాణ అమరుల ఆత్మబలిదానాలతోనే ఈ తెలంగాణ రాష్ట్రమేర్పడిందన్నారు. బంగారు తెలంగాణలో ఎన్‌ఆర్‌ఐలు భాగస్వాములు కావాలని కోరారు. అనంతరం నిర్వహించిన సాంస్కతిక కార్యక్రమాలు పలువురిని ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగతి యునైటెడ్ కింగ్‌డమ్ అధ్యక్షుడు దన్నంనేని సంపత్‌కృష్ణ, ఉపాధ్యక్షుడు బల్మూరి సుమన్, సంతోష్, జువ్వాడి సుష్మా, ప్రావస్‌రెడ్డి, కిశోర్‌కుమార్, పావని గణేశ్, ప్రశాంత్, వంశీ, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.