కాసేపట్లో తెలంగాణ ఆవిర్భావ వేడుకల ముగింపు కార్యక్రమం | Telangana formation day celebrations to be started | Sakshi
Sakshi News home page

కాసేపట్లో తెలంగాణ ఆవిర్భావ వేడుకల ముగింపు కార్యక్రమం

Published Sun, Jun 7 2015 3:56 PM | Last Updated on Wed, Oct 3 2018 7:02 PM

Telangana formation day celebrations to be started

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాల ముగింపునకు నగరం సిద్ధమైంది. భారీ స్థాయిలో ఈ వేడుకలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. కాసేపట్లో ట్యాంక్‌బండ్‌పై ముగింపు ఉత్సవాలు నిర్వహించనున్నారు. గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కేసీఆర్ సహా ప్రముఖులంతా హాజరుకానున్నారు. పీపుల్స్ ప్లాజా నుంచి ట్యాంక్‌బండ్ వరకు లక్ష మందితో భారీ ప్రదర్శన నిర్వహించనున్నారు.

మరోవైపు తెలంగాణ సాంస్కృతిక, కళా వైభవాన్ని చాటేలా వివిధ కళా రూపాలను ట్యాంక్‌బండ్‌పై ప్రదర్శించనున్నారు. సుమారు 5 వేల మంది కళాకారులు వీటిలో పాల్గొంటారు. ధూంధాం, ఆట, పాటలు, బతుకమ్మలు, బోనాలతో సాయంత్రం 4 గంటల నుంచే ట్యాంక్‌బండ్‌పై సందడి నెలకొననుంది. రాత్రి 8 గంటలకు అవతరణ ఉత్సవాల ముగింపు సభ నిర్వహించనున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement