పార్టీ వ్యవస్థాపక దినం.. జయకు ఊరట! | jayalalithaa gets bail on the formation day of party | Sakshi
Sakshi News home page

పార్టీ వ్యవస్థాపక దినం.. జయకు ఊరట!

Published Fri, Oct 17 2014 1:01 PM | Last Updated on Wed, Oct 3 2018 7:02 PM

పార్టీ వ్యవస్థాపక దినం.. జయకు ఊరట! - Sakshi

పార్టీ వ్యవస్థాపక దినం.. జయకు ఊరట!

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు బెయిల్ మంజూరు కావడం చాలా రకాలుగా ఊరట కలిగించింది. దీపావళికి ముందు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోడానికి ఆమెకు ఇదే చిట్టచివరి అవకాశం. దాంతో.. పండుగ నాటికి అసలు ఆమె బయటకు వస్తారా లేదా అనే అనుమానాలు పార్టీ వర్గాల్లో తలెత్తాయి. ఇక శుక్రవారం అన్నా డీఎంకే వ్యవస్థాపక దినోత్సవం. సరిగ్గా అదేరోజు సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ మీద విచారణ ఉంది.

ఫాలీ నారిమన్ లాంటి దిగ్గజ న్యాయవాదులు అంతా అక్కడ వాదస్తున్నారు. ఈరోజు బెయిల్ వస్తే సెంటిమెంటు కూడా బాగుంటుందని అన్నాడీఎంకే వర్గాలు భావించాయి. అనుకున్నట్లే బెయిల్ వచ్చింది. దాంతో పార్టీ వర్గాలు సంబరాల్లో మునిగిపోయాయి. ఎంజీ రామచంద్రన్ ఫొటోలు, జయలలిత ఫొటోలతో ప్లకార్డులు పట్టుకుని, టపాసులు కాలుస్తూ, డాన్సులు చేస్తూ ఆనందాన్ని పంచుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement