ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వ్యవస్థాపక దినోత్సవం
విజయవాడ (హెల్త్ యూనివర్సిటీ): డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వ్యవస్థాపక దినోత్సవం మంగళవారం యూనివర్సిటీలో ఘనంగా జరిగింది. యూనివర్సిటీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు విగ్రహానికి యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్ డాక్టర్ టీ రవిరాజు, రిజిస్ట్రార్ డాక్టర్ ఎస్.అప్పలనాయుడు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వీసీ మాట్లాడుతూ దేశంలోనే తొలి హెల్త్ యూనివర్సిటీ స్థాపించిన ఎన్టీఆర్ కారణ జన్ముడన్నారు. ఇరు రాష్ట్రాల్లో ఎన్నో వైద్య, దంత, పారా మెడికల్ కళాశాలలు ఏర్పాటుకు ఆయన కారణమయ్యారని కొనియాడారు. కార్యక్రమంలో జాయింట్ రిజిస్ట్రార్ అనురాధ, సుబ్బారావు, పరీక్షల నియంత్రణ అధికారి విజయ్‌కుమార్, ముఖ్య ఇంజినీర్ కేఎల్‌ఆర్‌కే ప్రసాద్, ఉద్యోగులు పాల్గొన్నారు.