జనరల్ మర్చంట్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం
విజయవాడ(వన్‌టౌన్) :
జనరల్ మర్చంట్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నుకున్నారు. స్థానిక మహేశ్వరి భవన్‌లో కార్యవర్గ ఎన్నిక మంగళవారం నిర్వహించారు. అధ్యక్షుడిగా ప్రవీణ్‌కుమార్‌జైన్, ఉపాధ్యక్షులుగా మోహన్‌లాల్‌కొఠారి, ధనరాజ్‌సోలంకి, కార్యదర్శిగా నెమిచంద్‌జైన్, సహాయ కార్యదర్శిగా మంగీలాల్, కోశాధికారిగా మహేంద్రకుమార్‌జైన్, కో కోశాధికారిగా మేఘరాజ్‌జైన్ సభ్యులుగా గిరీష్‌కుమార్ సోదాని, విజయరాజ్ సోలాంకి, వినోద్‌కుమార్ సోలాంకి, సురేష్‌కుమార్, విజయ్‌తతోడి, బెహర్‌లాల్, రతన్‌లాల్, పొపట్‌లాల్, టీ దుర్గాప్రసాద్ ఎన్నికయ్యారు.