members
-
క్రిస్మస్ ప్రత్యేక ప్రార్ధనల్లో వైఎస్ జగన్, కుటుంబ సభ్యులు (ఫొటోలు)
-
ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ చార్జీల భారంపై ప్రభుత్వాన్ని నిలదీసిన వైఎస్సార్సీపీ సభ్యులు... దద్దరిల్లిన శాసన మండలి
-
‘ఇందిరమ్మ’లో కదలిక
సాక్షి, హైదరాబాద్: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో ఎట్టకేలకు కదలిక వచ్చింది. లబ్ధిదారులను గుర్తించేందుకు వీలుగా ఇందిరమ్మ కమిటీల విధివిధానాలను ఖరారు చేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. డిసెంబర్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే కొన్ని సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టినా, ఇందిరమ్మ ఇళ్ల విషయంలో మాత్రం ఆచి తూచి వ్యవహరించింది. మూడు నెలల తర్వా త ఈ పథకాన్ని భద్రాచలంలో మంత్రులందరితో కలిసి సీఎం ప్రారంభించారు. కానీ లబ్ధిదారుల ఎంపికలో జాప్యం జరుగుతూ వచ్చింది. ఏడున్నర నెలల తర్వాత ఇప్పుడు ఇందిరమ్మ కమిటీలకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఇళ్ల నిర్మాణానికి వీలుగా కసరత్తు మొదలయ్యే అవకాశం కనిపిస్తోంది. ఒక్కోటి రూ.5 లక్షల వ్యయంతో నియోజకవర్గానికి మూడున్నర వేలు చొప్పున ఇళ్ల నిర్మా ణానికి ప్రభుత్వం సిద్ధమైన విషయం తెలిసిందే. సొంత స్థలం ఉండి, పక్కా ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తారు. ప్రస్తుతానికి సొంత జాగా ఉన్నవారికే.. గ్రామ, పట్టణ స్థాయి (వార్డు/డివిజన్లవారీగా)లో ఏర్పాటయ్యే ఈ కమిటీలే ఇప్పుడు ఇందిరమ్మ పథకంలో కీలకంగా వ్యవహరించనున్నాయి. లబ్ధిదారుల ఎంపిక మొదలు, సోషల్ ఆడిట్ వరకు ప్రధాన పాత్ర పోషించనున్నాయి. గ్రామ స్థాయి కమిటీలను ఎంపీడీవోలు, వార్డు స్థాయిలో మున్సిపల్ కమిషనర్లు నామినేట్ చేస్తారు. ప్రస్తుతానికి సొంత జాగాలు ఉన్నవారినే పరిగణనలోకి తీసుకుంటారు. సొంత జాగా లేని వారికి ఇళ్లను మంజూరు చేయరు. సొంత జాగాలో కచ్చా ఇల్లు ఉన్నవారు, పక్కా ఇల్లు ఉన్నవారెవరన్న విషయంలో జాగ్రత్తగా వివరాలు సేకరించాలని ప్రభుత్వం ఇప్పటికే అధికారులను ఆదేశించింది.కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద రాష్ట్రానికి భారీగా నిధులు రాబట్టే ప్రయత్నంలో రాష్ట్రప్రభుత్వం ఉంది. అనర్హులను లబ్ధిదారులుగా గుర్తిస్తే నిధులు ఇవ్వబోమని కేంద్రం తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలోనే లబ్ధిదారుల గుర్తింపులో జాగ్రత్త అవసరమని రాష్ట్రప్రభుత్వం కలెక్టర్లకు స్పష్టం చేసింది. కాగా కమిటీ సభ్యులు లబ్ధిదారుల వివరాలను సేకరించి ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్ల ద్వారా ప్రభుత్వానికి సమర్పిస్తారు. కొత్త దరఖాస్తులు తీసుకుంటారా? ప్రజాపాలన పేరుతో రాష్ట్ర ప్రభుత్వం పది నెలల క్రితం సంక్షేమ పథకాల లబ్ధి కోసం ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. అప్పట్లో ఇందిరమ్మ ఇళ్ల కోసం 80 లక్షలకు పైగా దరఖాస్తులందాయి. వాటిల్లో ప్రాథమిక స్థాయి వడపోత తర్వాత 50 లక్షల దరఖాస్తులు మిగిలాయి. వీటిల్లో అర్హమైనవి ఎన్ననే విషయం క్షేత్రస్థాయిలో పరిశీలించాల్సి ఉంది. కాగా పాత దరఖాస్తులే పరిగణనలోకి తీసుకుంటారా? కొత్తవి కూడా స్వీకరిస్తారా? అనే విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. ఎంపికకు సుదీర్ఘ సమయం! లబ్ధిదారుల ఎంపికకు చాలా సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. ప్రజాపాలన దరఖాస్తులనే పరిగణనలోకి తీసుకున్నా.. ఒక్కో దరఖాస్తు ఆధారంగా క్షేత్రస్థాయిలో స్వయంగా పరిశీలించి అర్హతను తేల్చాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత ప్రభుత్వం జాబితాను రూపొందించి కేంద్ర ప్రభుత్వానికి సమర్పిస్తుంది. ఆ తర్వాతే నిధుల విడుదల ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే హడ్కో నుంచి ఇళ్ల కోసం దాదాపు రూ.3 వేల కోట్ల రుణం పొందింది. కేంద్రం నుంచి మరో రూ.8 వేల కోట్లు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తోంది. లబ్ధిదారులకు మొదటి విడత రూ.లక్ష చెల్లించి మిగతా విడతలను వచ్చే ఆర్థిక సంవత్సరంలో చెల్లించనున్నారు. మొదటి విడతలో మంజూరు చేసే ఇళ్లకు రూ.20 వేల కోట్లు అవసరమవుతాయి. గ్రామస్థాయి కమిటీ: సర్పంచ్/ పంచాయితీ ప్రత్యేక అధికారి చైర్మన్‌గా ఉండే కమిటీలో స్వయం సహాయక బృందాలకు చెందిన ఇద్దరు మహిళలు, గ్రామ పురోగతికి పాటుపడే ముగ్గురు స్థానికులు (వీరిలో ఒకరు బీసీ, మరొకరు ఎస్సీ/ఎస్టీ విధిగా ఉండాలి) సభ్యులుగా, పంచాయితీ కార్యదర్శి కన్వీనర్‌గా ఉంటారు. పట్టణ స్థాయి కమిటీ: వార్డు కౌన్సిలర్/కార్పొరేటర్ చైర్మన్‌గా ఉండే ఈ కమిటీలో ఇద్దరు స్వయం సహాయక బృంద సభ్యులు, స్థానికంగా అభివృద్ధి పనులకు సహకరించే ముగ్గురు స్థానికులు (వీరిలో ఒకరు బీసీ, మరొకరు ఎస్సీ/ఎస్టీ విధిగా ఉండాలి) సభ్యులుగా, వార్డు అధికారి కన్వీనర్‌గా ఉంటారు. -
రాజ్యాంగ వ్యవస్థలపై రాజకీయ దాడి..
-
హిందూ ఆలయాలపై దాడులు.. నివేదిక కోరిన యూఎస్ కాంగ్రెస్ సభ్యులు!
అమెరికాలో ఇటీవలి కాలంలో హిందూ ఆలయాలపై పెరిగిన దాడులపై జరిగిన విచారణపై నివేదిక ఇవ్వాల్సిందిగా ఐదుగురు యూఎస్ కాంగ్రెస్ సభ్యులు అమెరికా న్యాయ శాఖకు లేఖ రాశారు. దేశవ్యాప్తంగా ప్రార్ధన స్థలాల వద్ద విధ్వంసకర చర్యల పెరుగుదల ఆందోళన కలిగిస్తున్నదని వారు ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖను యూఎస్ కాంగ్రెస్ సభ్యులు ప్రమీలా జయపాల్, రో ఖన్నా, రాజా కృష్ణమూర్తి, శ్రీతానేదార్, అమీ బేరాలు రాశారు. దేవాలయాలపై దాడుల ఘటనలు హిందూ అమెరికన్ల ఆవేదనకు కారణమవుతున్నాయని, న్యూయార్క్ నుంచి కాలిఫోర్నియా వరకు పలు మందిరాలపై జరుగుతున్న దాడులపై విచారణ ఏ స్థితిలో ఉందో తెలియజేయాలని కాంగ్రెస్ సభ్యులు డిమాండ్ చేశారు. దేవాలయాలపై దాడులకు పాల్పడుతున్న అనుమానితులకు సంబంధించి ఎటువంటి ఆధారాలు లేకపోవడం విచారకరమన్నారు. దాడుల నేపథ్యంలో చాలామంది హిందువులు భయం, బెదిరింపుల మధ్య జీవించాల్సి వస్తోందని వారు వివరించారు. చట్ట ప్రకారం అందరికీ సమాన రక్షణను కల్పించడానికి తగిన ఫెడరల్ పర్యవేక్షణ ఉందా? అని వారు ఆ లేఖలో ప్రశ్నించారు. జనవరిలో కాలిఫోర్నియాలోని హేవార్డ్లోని ఒక ఆలయంపై దాడులకు పాల్పడిన దుండగులు ఖలిస్తాన్ అనుకూల నినాదాలు రాశారన్నారు. ఇలాంటి ఉదంతమే నెవార్క్‌లోని మరొక దేవాలయంలో కూడా జరిగిందన్నారు. యునైటెడ్ స్టేట్స్లో హిందువులను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న ఈ ద్వేషపూరిత దాడుల నివారణకు ప్రభుత్వం ఏమిచేస్తున్నదని వారు ప్రశ్నించారు. దీనిపై సంబంధిత విభాగం తమకు గురువారంలోగా నివేదిక అందించాలని యూఎస్ కాంగ్రెస్ సభ్యులు ఆ లేఖలో కోరారు. -
‘లోక్‌సభ’లో స్వతంత్రులు విజేతలా? పరాజితులా?
ప్రస్తుతం దేశంలో ఎక్కడ చూసినా ఎన్నికలపైనే చర్చ జరుగుతోంది. లోక్‌సభ ఎన్నికల తేదీలు ప్రకటించడంతో రాజకీయ పార్టీల కార్యకలాపాలు ఊపందుకున్నాయి. కేంద్రంలోని అధికార బీజేపీ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ కూడా తన అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ఇతర పార్టీలు కూడా తమ అభ్యర్థులను ప్రకటించాయి. ఇదిలా ఉండగా కొన్ని పార్టీలలో టిక్కెట్లు ఆశించి, భంగపడినవారు స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసే అవకాశాలున్నాయి. ఇటువంటి వ్యవహారం దేశంలో తొలిసారి లోక్‌సభ ఎన్నికలు జరిగినప్పటి నుంచి కొనసాగుతూనే ఉంది. మొదటి లోక్‌సభ ఎన్నికల్లో.. 1951-52లో మొదటి లోక్‌సభ ఎన్నికలు జరిగాయి. దేశంలో జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లో మొత్తం 37 మంది స్వతంత్ర ఎంపీలు లోక్‌సభకు ఎన్నికయ్యారు. రెండో లోక్‌సభలో స్వతంత్ర ఎంపీల సంఖ్య పెరిగింది. 1957లో రెండో లోక్‌సభకు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో మొత్తం 42 మంది స్వతంత్ర ఎంపీలు లోక్‌సభకు ఎన్నికయ్యారు. 1962లో స్వతంత్రుల హవా మూడో లోక్‌సభలో స్వతంత్ర ఎంపీల సంఖ్య సగానికి పైగా తగ్గింది. 1962లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 20 మంది స్వతంత్ర అభ్యర్థులు ఎంపీలు అయ్యారు. నాలుగో లోక్‌సభలో స్వతంత్ర ఎంపీల సంఖ్య తిరిగి పెరిగింది. 1967లో జరిగిన ఎన్నికల్లో 35 మంది స్వతంత్ర ఎంపీలు ఎన్నికయ్యారు. 1971లో ఐదవ లోక్‌సభకు ఎన్నికలు జరిగాయి. ఈసారి ఎన్నికల్లో గెలిచిన స్వతంత్రుల సంఖ్య తగ్గింది. ఈ ఎన్నికల్లో 14 మంది స్వతంత్ర ఎంపీలు మాత్రమే ఎన్నికయ్యారు. ‘ఎమర్జెన్సీ ’ తర్వాత.. దేశంలో ఎమర్జెన్సీ ముగిసిన తర్వాత జరిగిన 1977 లోక్‌సభ ఎన్నికల్లో స్వతంత్ర ఎంపీల ప్రాతినిధ్యం తగ్గింది. ఆరో లోక్‌సభలో కేవలం తొమ్మిది మంది స్వతంత్ర ఎంపీలు మాత్రమే ఎన్నికయ్యారు. ఏడో లోక్‌సభలో స్వతంత్ర ఎంపీల సంఖ్యలో ఎలాంటి మార్పు లేదు. 1980లో తొమ్మిదిమంది స్వతంత్రులు లోక్‌సభ ఎంపీలు అయ్యారు. స్వతంత్ర ఎంపీల ప్రాతినిధ్యం 1984లో మెరుగుపడింది. ఎనిమిదో లోక్‌సభలో 13 మంది స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు. స్వతంత్ర ఎంపీల సంఖ్య 1989లో స్వల్పంగా తగ్గింది. 10వ లోక్‌సభకు ఒక్కరే.. తొమ్మిదో లోక్‌సభలో 12 మంది స్వతంత్ర అభ్యర్థులు మాత్రమే పార్లమెంట్ దిగువ సభకు చేరుకున్నారు. 1991 లోక్‌సభ ఎన్నికల్లో స్వతంత్ర ఎంపీల ప్రాతినిధ్యం పూర్తిగా తగ్గిపోయింది. 10వ లోక్‌సభకు ఒక స్వతంత్ర ఎంపీ మాత్రమే ఎన్నికయ్యారు. అత్యల్ప సంఖ్యలో స్వతంత్ర ఎంపీలు 1991లో ఎన్నికయ్యారు. 11వ లోక్‌సభలో పార్లమెంటులో స్వతంత్ర ఎంపీల వాటా మరోసారి పెరిగింది. 1996లో జరిగిన ఎన్నికల్లో తొమ్మదిమంది స్వతంత్రులు లోక్‌సభ ఎంపీలు అయ్యారు. 14వ, 15వ లోక్‌సభ ఎన్నికల్లో.. 12వ లోక్‌సభలో అంటే 1998లో స్వతంత్ర ఎంపీల సంఖ్య ఆరుకి తగ్గింది. 1999లో 13వ లోక్‌సభకు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో కూడా ఆరుగురు స్వతంత్రులు పార్లమెంటుకు చేరుకున్నారు. 14వ లోక్‌సభలో తొమ్మిది మంది స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు. ఈ లోక్‌సభ ఎన్నికలు 2004లో జరిగాయి. 2009లో జరిగిన 15వ లోక్‌సభ ఎన్నికల్లో స్వతంత్ర ఎంపీల సంఖ్య తొమ్మది. 3,449 మంది డిపాజిట్లు గల్లంతు 16వ లోక్‌సభకు 2014లో ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో కేవలం ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు మాత్రమే ఎంపీలుగా ఎన్నికయ్యారు. 2019లో జరిగిన 17వ లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 8,054 మంది అభ్యర్థులు పోటీ చేయగా, వారిలో 3,461 మంది స్వతంత్రులు. వీరిలో 3,449 మందికి డిపాజిట్లు గల్లంతయ్యాయి. కేవలం నలుగురు స్వతంత్రులు మాత్రమే పార్లమెంటుకు చేరుకున్నారు. విజేతల ఓట్లు.. మహారాష్ట్రలోని అమరావతి స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన నవనీత్ రాణా 36,951 ఓట్ల తేడాతో గెలుపొందారు. అసోంలోని కోక్రాజార్ లోక్‌సభ స్థానం నుంచి 37,786 ఓట్లతో విజయం సాధించి నబ కుమార్ సరానియా పార్లమెంటుకు చేరుకున్నారు. దాద్రా అండ్ నగర్ హవేలీ స్థానం నుంచి డెల్కర్ మోహన్‌భాయ్ సంజీభాయ్ 9,001 ఓట్లతో గెలుపొందారు. కర్ణాటకలోని మాండ్య స్థానం నుంచి సుమలత అంబరీష్ 1,25,876 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. -
అమెరికాలో నలుగురు మలయాళీ కుటుంబ సభ్యుల మృతి!
అమెరికాలోని కాలిఫోర్నియాలో భారత్‌కు చెందిన నలుగురు కుటుంబ సభ్యులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. కాలిఫోర్నియాలోని శాన్ మాటియో కౌంటీలోని ఒక ఇంటిలో ఈ నలుగురు విగతజీవులుగా కనిపించారు. వీరిని భారతదేశంలోని కేరళలోగల కొల్లాంకు చెందిన ఆనంద్ సుజిత్ హెన్రీ (42), అతని భార్య అలిస్ ప్రియాంక (40), కవలలు నోహ్, నాథన్ (4)లుగా గుర్తించారు. ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైన వివరాల ప్రకారం వీరంతా హీటర్ నుంచి వచ్చిన విషవాయువులు పీల్చిన కారణంగా మృతి చెందివుంటారని తెలుస్తోంది. మృతుడు ఆనంద్ కోల్లాంలోని ఫాతిమా మాత నేషనల్ కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జీ హెన్రీ కుమారుడు. ఆనంద్ ఇటీవలే గూగుల్‌లో ఉద్యోగానికి రాజీనామా చేసి, తన కొత్త కంపెనీని ప్రారంభించారు. కాగా వీరి మృతికి గల కారణాలను శాన్ మాటియో పోలీసులు ఇంకా వెల్లడించలేదు. అమెరికా కాలమానం ప్రకారం ఫిబ్రవరి 12న ఉదయం 9.15 గంటలకు వీరి మృతదేహాలను పోలీసులు గుర్తించారు. -
ఈపీఎఫ్‌వోలో 13.95 లక్షల మంది చేరిక
న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) 2023 నవంబర్ నెలలో 13.95 లక్షల మంది సభ్యులను చేర్చుకుంది. ఇందులో 7.36 లక్షల మంది మొదటిసారి ఈపీఎఫ్‌వో కింద నమోదు చేసుకున్నారు. కొత్త సభ్యుల్లో 1.94 లక్షల మంది మహిళలు కావడం గమనించొచ్చు. నవంబర్‌లో మొత్తం మహిళా సభ్యుల చేరిక 2.80 లక్షలుగా (20 శాతం) ఉంది. సంఘటిత రంగంలో మహిళల భాగస్వామ్యం పెరుగుతున్నట్టు ఇది తెలియజేస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నవంబర్ నాటికి నికర సభ్యుల చేరిక, గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోల్చి చూసినప్పుడు ఎక్కువగా ఉన్నట్టు కేంద్ర కారి్మక శాఖ విడుదల చేసిన పేరోల్ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. నూతన సభ్యుల్లో 18–25 ఏళ్ల నుంచి చేరిన వారు 57.30 శాతం ఉన్నారు. 10.67 లక్షల మంది ఒక సంస్థలో మానేసి, మరో సంస్థకు తమ ఖాతాలను బదిలీ చేసుకున్నారు. నవంబర్‌లో మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, హర్యానా, ఢిల్లీ రాష్ట్రాల నుంచి 58.81 శాతం చేరారు. ఇందులో మహారాష్ట్ర వాటాయే 21.60 శాతంగా ఉంది. -
TSPSC ఛైర్మన్, సభ్యుల పోస్టుల కోసం 600 పైగా దరఖాస్తులు
-
టీఎస్పీఎస్సీ ఛైర్మన్, సభ్యుల నియామకానికి నోటిఫికేషన్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ప్రక్షాళనకు అడుగులు పడ్డాయి. టీఎస్పీఎస్సీ ఛైర్మన్, సభ్యుల నియామకానికి నోటిఫికేషన్ విడుదలైంది. ఈనెల 18వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అర్హులైన అభ్యర్థులు www.telangana.gov.in వెబ్సైట్ నుంచి దరఖాస్తు నమూనా పత్రాలను డౌన్లోడ్ చేసుకోవచ్చని సూచించింది. కాగా, దాదాపు నెలరోజులుగా పెండింగ్‌లో ఉన్న చైర్మన్ జనార్ధన్‌రెడ్డి, సభ్యుల రాజీనామాలకు గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ బుధవారం ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. టీఎస్పీఎస్సీలో చైర్మన్‌తో పాటు 10 సభ్యులుంటారు. కానీ గత ప్రభుత్వం చైర్మన్, ఆరుగురు సభ్యులను మాత్రమే నియమించింది. వీరిలో ఒక సభ్యుడు పదవీ విరమణ పొందగా..ఐదుగురు కొనసాగుతూ వచ్చారు. అయితే ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం, కొత్త ప్రభుత్వం ఏర్పాటైన నేపథ్యంలో చైర్మన్ బి.జనార్దన్ రెడ్డి, సభ్యులు ఆర్.సత్యనారాయణ, ప్రొఫెసర్ బండి లింగారెడ్డి, కె.రవీందర్ రెడ్డి రాజీనామాలు సమర్పించారు. రాజీనామాలను గవర్నర్ ఆమోదించిన మరుక్షణమే టీఎస్పీఎస్సీకి కొత్త చైర్మన్, సభ్యులను నియమిస్తామని డిసెంబర్ 27న సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. జాబ్ క్యాలెండర్ ప్రకారం నియామకాలు చేపడ్తామని, నిరుద్యోగులెవరూ ఆందోళనకు గురికావద్దని అన్నారు. తాజాగా నియామక ప్రక్రియ ప్రారంభమైంది. ప్రస్తుతం టీఎస్పీఎస్సీ పరిధిలో దాదాపుగా అన్ని కార్యకలాపాలు నిలిచిపోయాయి. ఇదీ చదవండి: సంక్రాంతి ఎఫెక్ట్: విజయవాడ హైవేపై కదలని వాహనాలు -
విడివిడిగా.. కూలంకషంగా
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ ప్రదేశ్ ఎన్నికల కమిటీ (పీఈసీ) సభ్యులతో స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్ సమావేశమయ్యారు. గాందీభవన్‌లో సోమవారం ఉదయం 11గంటల నుంచి రాత్రి వరకు ఈ భేటీలు కొనసాగాయి. ప్రతి నాయకుడితో వేర్వేరుగా 10 నిమిషాలకు పైగా మాట్లా డిన మురళీధరన్, రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఖరారుతో పాటు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై అభిప్రాయ సేకరణ చేశారు. నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మాజీ ఎంపీ వి.హనుమంతరావు, ఎమ్మె ల్సీ జీవన్‌రెడ్డి, పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్, కోచైర్మన్ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీధర్‌బాబు, జగ్గారెడ్డి, సీతక్క, కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరి, ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. నేను, మీ నాన్న ఫ్రెండ్స్: పొన్నాల మురళీధరన్‌ను కలిసిన సందర్భంగా ఆయన తండ్రి, కేరళ మాజీ సీఎం కరుణాకరన్‌తో తనకు ఉన్న అనుబంధాన్ని పొన్నాల గుర్తు చేసుకున్నారు. తాను మత్స్యశాఖ మంత్రిగా ఉన్న సమయంలో కేరళతో పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రపంచ బ్యాంకు రుణం తీసుకువచ్చామని, ఆ తర్వాతే రెండు రాష్ట్రాల్లో రొయ్యల పరిశ్రమ అభివృద్ధి చెందిందని గుర్తు చేశారు. పార్టీలో పరిస్థితులు, టికెట్ల ఖరారులో పాటించాల్సిన సామాజిక సమతుల్యత గురించి వారు చర్చించినట్టు సమాచారం. బీసీలకు టికెట్ల కేటాయింపులో ఇవ్వాల్సిన ప్రాధాన్యతపై వీహెచ్ చర్చించినట్టు తెలుస్తోంది. స్క్రీనింగ్ కమిటీ సభ్యుడిగా ఉన్న సిద్దిఖీ కూడా సోమవారం మధ్యాహ్నం నుంచి ఈ భేటీల్లో పాల్గొనగా, మరో సభ్యుడు, గుజరాత్ ఎమ్మెల్యే జిగ్నేశ్ మేవానీ కోర్టు కేసుల కారణంగా రాలేకపోయారని, మంగళవారం వస్తారని గాం«దీభవన్ వర్గాలు తెలిపాయి. మంగళవారం ఉదయం డీసీసీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులతో స్క్రీనింగ్ కమిటీ భేటీ కానుంది. జగ్గారెడ్డి లేఖ: పీసీసీ మాజీ అధ్యక్షులకు వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కలి్పంచాలని, పార్టీ అనుబంధ సంఘాలకు టికెట్ల కేటాయింపులో ప్రాధాన్యతనివ్వాలని మురళీధరన్‌ను జగ్గారెడ్డి కోరారు. టికెట్ల కేటాయింపు విషయంలోనూ పీసీసీ మాజీ అధ్యక్షుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని కోరుతూ లేఖ ఇచ్చారు. నేడు పీసీసీ విస్తృతస్థాయి సమావేశం ఈనెల 16, 17 తేదీల్లో జరగనున్న సీడబ్ల్యూసీ సమావేశాల నిర్వహణపై చర్చించేందుకు మంగళవారం టీïపీసీసీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశానికి పీసీసీ సభ్యులందరూ విధిగా హాజరు కావాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్‌గౌడ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. నమ్మకం నిలబెట్టుకుంటాం: రేవంత్ ట్వీట్ సీడబ్ల్యూసీ తొలి సమావేశాలను హైదరాబాద్‌లో నిర్వహించేందుకు అంగీకరించిన పార్టీ అధిష్టానానికి రేవంత్ ట్విట్టర్ వేదికగా కృతజ్ఞతలు తెలిపారు. తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని, సమావేశాలను విజయవంతం చేస్తామంటూ సోమవారం ఆయన ట్వీట్ చేశారు. బీసీలు ఎందుకు గెలవడం లేదు? రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో పాటించాల్సిన సామాజిక సమతుల్యతపై ఈ భేటీల్లో ఆసక్తికర చర్చ జరిగినట్టు తెలిసింది. 1989 తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడుసార్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా తెలంగాణలోని మొత్తం అసెంబ్లీ సీట్లలో 50 శాతం సీట్లు ఎప్పుడూ రాలేదని, ఇందుకు కాంగ్రెస్ పార్టీని వెనుకబడిన వర్గాలు అక్కున చేర్చుకోకపోవడమే కారణమని కొందరు వివరించారు. తొలుత తెలుగుదేశం, ఆ తర్వాత బీఆర్ఎస్ వైపు బీసీలు మొగ్గుచూపుతున్నారని, అత్యధిక సంఖ్యలో ఉండే బీసీల హృదయాల్లో చోటు సాధించని కారణంగానే కాంగ్రెస్ పార్టీకి ఓటమి ఎదురవుతోందని చెప్పారు. దీంతో ‘బీసీలకు సీట్లు ఇస్తే ఎందుకు గెలవడం లేదు?’అని మురళీధరన్ ప్రశ్నించినట్టు తెలుస్తోంది. కాగా ఓ ముఖ్య నాయకుడు బదులిస్తూ.. కాంగ్రెస్ పార్టీలోనే అలా జరుగుతోందని, మిగిలిన పార్టీల నుంచి బీసీ నేతలు గెలుస్తున్నారని, ఇందుకు కారణం ఏంటనేది సమీక్షించుకోవాల్సింది పార్టీయేనని చెప్పినట్టు సమాచారం. ఇక రెడ్డి సామాజిక వర్గంలోని గ్రూపు గొడవలు కూడా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఓటమికి కారణమవుతున్నాయని ఓ నేత వివరించినట్టు సమాచారం. కర్ణాటకలోని లింగాయత్‌లు, గౌడ సామాజిక వర్గ నేతలు ఐక్యంగా ఉండి అక్కడ అధికారాన్ని దక్కించుకోవడాన్ని గుర్తు చేసినట్లు తెలిసింది. అన్ని విషయాలను విన్న మురళీధరన్ ‘ఏం జరుగుతుందో వేచి చూద్దాం.’అంటూ బదులివ్వడం గమనార్హం. -
పార్లమెంటు సాక్షిగా ప్రజాప్రతినిధుల కుమ్ములాట
ప్రిస్టినా: కొసావో పార్లమెంటు సమావేశాల్లో ఘర్షణలు చోటు చేసుకున్నాయి. చట్టాలు చేయాల్సిన ప్రజాప్రతినిధులే చట్టసభను రణరంగంలా మార్చేశారు. ప్రజాస్వామ్యాన్ని నవ్వులపాలు చేస్తూ ముష్టియుద్ధానికి తెగబడ్డారు. సాక్షాత్తూ ఆ దేశ ప్రధాన మంత్రి పైనే నీళ్లు కుమ్మరించి ప్రతిపక్షాలు నానా యాగీ చేశాయి. గురువారం జరిగిన పార్లమెంటు సమావేశాల్లో కొసావో ప్రధాన మంత్రి ఆల్బిన్ కుర్తి ప్రసంగిస్తున్న సమయంలో ప్రతిపక్షాలకు చెందిన నాయకుడు మెర్గిమ్ లుష్టాకు తన చేతిలో వాటర్ బాటిల్ తో నడుచుకుంటూ వచ్చి ప్రధానమంత్రి మొహం మీద నీళ్లు కుమ్మరించారు. అంతలో పాలకపక్షం సభ్యులు ఆయనను అడ్డుకోబోతే ఏకంగా ముష్టి యుద్దానికి తెరతీశారు. మధ్యలో మహిళా సభ్యురాలు అడ్డం వచ్చి అడ్డుకునే ప్రయత్నం చేయగా ఆమెను కూడా కనికరించకుండా పిడిగుద్దులు కురిపించారు ప్రతిపక్ష నాయకులు. తోపులాటలో ఆమెను పక్కకు తోసేశారు. చిన్నగా మొదలైన గొడవ చిలికి చిలికి గాలివానగా మారింది. భద్రతా సిబ్బంది జోక్యం చేసుకుని సభ్యులను చెదరగొట్టి ప్రధానమంత్రిని బయటకు తీసుకుని వెళ్లారు. ఎందుకీ రచ్చ.. ప్రధాన మంత్రి అల్బిన్ కుర్తి విధానాల వలన పాశ్చాత్య దేశాల మైత్రి దూరమైందని, కొసావోలో సెర్బులు-పోలీసులు మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న కారణంగా ఇప్పటికే అనేకమంది గాయాల పాలయ్యారని ప్రతిపక్షాలు ఆరోపించాయి. 1998లో ఇదే తరహా ఘర్షణలు చెలరేగి ఆనాడు సుమారు 10000 మంది మరణించారని. ఈరోజు ప్రధాని అసమర్ధత వల్ల దేశంలో మళ్ళీ అలాంటి పరిస్థితులు నెలకొన్నాయని వారన్నారు. Brawl breaks out in the Kosovo Parliament after an Opposition MP threw water at the Prime Minister.pic.twitter.com/OP2DG0F9YX — The Spectator Index (@spectatorindex) July 13, 2023 ఇది కూడా చదవండి: పబ్జీ జంట ప్రేమ కథ: ముంబై పోలీసులకు బెదిరింపు కాల్ -
ఈపీఎఫ్ఓలోకి భారీగా చేరికలు.. సగం మందికిపైగా పాతికేళ్లలోపు వారే!
న్యూఢిల్లీ: రిటైర్మెంట్ ఫండ్ సంస్థ– ఎంప్లాయీస్ ప్రావిడెండ్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ)లో ఈ ఏడాది ఏప్రిల్‌లో నికరంగా 17.20 లక్షల మంది సభ్యులు చేరారు. చేరిన మొత్తం ఈ సభ్యుల్లో కొత్త సభ్యుల సంఖ్య 8.47 లక్షలు. ఈ మేరకు విడుదలైన పేరోల్ డేటా ప్రకారం.. 8.47 లక్షల మంది కొత్త సభ్యుల్లో 54.15 శాతం మంది 18 నుంచి 25 సంవత్సరాల మధ్య వయస్కులు. అంటే కొత్తగా ఉద్యోగాల్లో చేరిన వారిలో మెజారిటీ సభ్యులకు సంఘటిత రంగంలో స్థానం లభించిందన్నమాట. మొత్తం 17.20 లక్షల మందిని తీసుకుంటే, 2023 మార్చితో పోల్చితే (13.40 లక్షల మంది) వీరి సంఖ్య పెరిగింది. ఇక ఏప్రిల్‌లో రీజాయినర్స్ ఎన్రోల్ అయిన నికర మహిళా సభ్యుల సంఖ్య ఏప్రిల్‌లో 3.48 లక్షలుకాగా, మార్చిలో వీరి సంఖ్య 2.57 లక్షలు. కొత్త సభ్యులను మాత్రమే తీసుకుంటే 8.47 లక్షల మందిలో 2.25 లక్షల మంది మహిళలు. ఏప్రిల్‌లో చేరిన నికర సభ్యుల్లో మెజారిటీ (59.20 శాతం మంది) వరుసగా మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, గుజరాత్, ఢిల్లీలకు చెందినవారు ఉన్నారు. తయారీ, ఐటీ సంబంధ రంగాల్లో ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తరువాతి స్థానాల్లో ఎలక్ట్రికల్, మెకానికల్, జనరల్ ఇంజనీరింగ్, వాణిజ్య సంబంధ సంస్థలు, దుస్తులు, నిర్మాణం, ఎగుమతుల సేవా రంగాలు ఉన్నాయి. 7 కోట్లకుపైగా సభ్యత్వం.. ఉద్యోగి రికార్డుల నవీకరణ నిరంతర ప్రక్రియ. ఈ ప్రాతిపదికన పేరోల్ డేటాను తాత్కాలికమైనదిగా పరిగణించాలి. మునుపటి డేటా ప్రతి నెలా మారుతుంది. ఏప్రిల్ 2018 నుండి (సెప్టెంబర్ 2017 తరువాత కాలాన్ని పరిగణనలోకి తీసుకుంటూ) పేరోల్ డేటా విడుదలవుతోంది. ఈపీఎఫ్ఓ తన సభ్యులకు సభ్యులకు ఈపీఎఫ్, ఎంపీ చట్టం, 1952 చట్టం కింద లభించే పలు ప్రయోజనాలను అందించడానికి బాధ్యత వహించే సామాజిక భద్రతా సంస్థ. ఇది సభ్యులకు వారి పదవీ విరమణపై భవిష్య నిధి, పెన్షన్ ప్రయోజనాలు అలాగే సభ్యుడు అకాల మరణం సంభవించినప్పుడు వారి కుటుంబాలకు కుటుంబ పెన్షన్, బీమా ప్రయోజనాలను అందిస్తుంది. ఈపీఎఫ్ఓ దాదాపు 7 కోట్ల మందికి పైగా చందాదారులతో రూ.12 లక్షల కోట్లకుపైగా పెట్టుబడులను కలిగి ఉంది. పటిష్టమైన స్థాయిలో రూ.300 కోట్లకు పైగా మిగులునూ నిర్వహిస్తోంది. ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్) డిపాజిట్లపై 2022–23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 8.15 శాతం వడ్డీ రేటు చెల్లించడానికి ఈపీఎఫ్ఓ ఇటీవలే ఆమోదముద్ర వేసింది. డెట్ ఇన్వెస్ట్మెంట్ నుంచి పొందిన వడ్డీ అలాగే ఈక్విటీ పెట్టుబడుల నుంచి వచ్చిన ఆదాయ అంశాలను పరిగణనలోకి తీసు కుని ఈపీఎఫ్ఓ అత్యున్నత స్థాయి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (సీబీటీ) వడ్డీరేటును నిర్ణయిస్తుంది. 2015–16లో స్టాక్ మార్కెట్లో పెట్టుబడులను ఈపీ ఎఫ్ఓ ప్రారంభించింది. ఈక్విటీల్లో తన మొత్తం నిధుల్లో 5 శాతంతో ప్రారంభమైన ఈపీఎఫ్ఓ పెట్టుబడులు, ప్రస్తుతం 15 శాతానికి చేరాయి. (అమ్మ ఆశీస్సులతో రూ. 22000 కోట్ల కంపెనీ,అంతేనా..!) ఈఎస్ఐసీ కిందకు కొత్తగా 17.88 లక్షల మంది ఏప్రిల్ నెలలో చేరిక ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్ఐసీ) కిందకు ఏప్రిల్ నెలలో కొత్తగా 17.88 లక్షల మంది సభ్యులుగా చేరారు. ఈఎస్ఐ అనే సామాజిక భద్రతా బీమా పథకాన్ని ఈఎస్ఐసీ నిర్వహిస్తుంటుంది. ఈ సంస్థ కింద 3 కోట్ల మంది సభ్యులుగా ఉన్నారు. ఈ వివరాలను కేంద్ర కార్మిక శాఖ విడుదల చేసింది. ఈఎస్ఐసీ కింద కొత్తగా 30,249 సంస్థలు రిజిస్టర్ చేసుకున్నాయి. (ఈ ఏడాది జోరుగా ఇళ్ల అమ్మకాలు) ఏప్రిల్‌లో కొత్తగా 17.88 లక్షల మందికి ఉపాధి లభించినట్టు కార్మిక శాఖ తెలిపింది. వీరిలో 8.37 లక్షల మంది సభ్యులు 25 ఏళ్లలోపు వారేనని పేర్కొంది. నికరంగా 3.53 లక్షల మంది మహిళా సభ్యులున్నట్టు తెలిపింది. అంతేకాదు, ట్రాన్స్‌జెండర్ కేటగిరీ నుంచి 63 మంది సభ్యులుగా చేరారు. మరిన్ని బిజినెస్ వార్తలు, అప్డేట్స్ కోసం చదవండి సాక్షిబిజినెస్ -
ముగిసిన కృష్ణా రివర్ మేనేజ్మెంట్ కమిటీ సమావేశం
-
వాట్సాప్ అదిరిపోయే అప్డేట్: అడ్మిన్లకు ఫుల్ జోష్ !
న్యూఢిల్లీ: ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. గ్లోబల్‌గా బహుళ ప్రజాదరణ పొందిన వాట్సాప్ తన వినియోగదారుల కోసం అద్భుతమైన అప్డేట్స్ తీసుకొస్తోంది. ఈ క్రమంలో తాజాగా తన ప్లాట్‌ఫారమ్ ద్వారా అడ్మిన్లకు మంచివార్త చెప్పింది. వాట్సాప్ గ్రూప్‌లో యాడ్ చేసుకునే సభ్యుల సంఖ్యను మరోసారి పెంచింది. ఇప్పటి వరకు ఒక గ్రూప్‌లో 512 మందిని యాడ్ చేసుకునే అవకాశం యూజర్లకు ఉండేది. అయితే ఇప్పుడు ఈ సంఖ్య రెట్టింపు చేసి, అడ్మిన్లలో జోష్ నింపింది. WhatsApp is releasing larger groups up to 1024 participants! Some lucky beta testers on WhatsApp beta for Android and iOS can add up to 1024 participants to their groups!https://t.co/qDbG3AWaIu pic.twitter.com/oI8Dtg30RK — WABetaInfo (@WABetaInfo) October 8, 2022 వావాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్ తో అప్డేట్స్ అందిస్తూ ఉంటుంది. వాబేటా ఇన్ఫో తాజా సమాచారం ప్రకారం వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ లు గ్రూప్ సభ్యుల సంఖ్యను పెంచుకునే అవకాశాన్ని మరింత పెచింది. తాజా అప్డేట్ ప్రకారం గ్రూప్ అడ్మిన్లు తమ గ్రూప్ లో 1024 మందిని యాడ్ చేసే అవకాశం ఉంటుంది. గతంలో ఈ సంఖ్య 512 మాత్రమే. ఆండ్రాయిడ్, ఐఓఎస్ రెండు ఆపరేటింగ్ సిస్టమ్స్ వాట్సాప్ బీటా వర్షన్స్ లో ఈ ఫీచర్ అందుబాటులో తీసుకొచ్చింది మెటా యాజమాన్యంలోని వాట్సాప్. -
ప్రశ్నించే వారి గొంతు నొక్కుతారా? రోడ్డున పడ్డ జూబ్లీహిల్స్ సొసైటీ పరువు
సాక్షి, హైదరాబాద్: సహకార చట్టం నిబంధనలను బేఖాతరు చేస్తూ జూబ్లీహిల్స్ హౌజ్ బిల్డింగ్ సొసైటీ నుంచి ఏడెనిమిది వందల మంది షేర్ హోల్డర్లను తొలగించడం పట్ల సొసైటీ మేనేజింగ్ కమిటీపై సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘సొసైటీని ఉద్ధరిస్తారని ఓటేస్తే మా సభ్యత్వాలకే ఎసరు తెస్తారా? ప్రశ్నించిన వారి గొంతు నొక్కే విధంగా ఇష్టానుసారం సభ్యత్వాలను తొలగించడం ఏమిటి?’ అని మండిపడుతున్నారు. ఇటీవల జరిగిన సొసైటీ సర్వసభ్య సమావేశంలో ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే ఏడెనిమిది వందల మంది సభ్యులను తొలగిస్తున్నట్టుగా తీర్మానించారు. నిబంధనల ప్రకారం సభ్యులను తొలగించాలంటే సొసైటీలో ఉన్న 5 వేల మంది సభ్యుల్లో.. కనీసం 2,500 మంది హాజరై అందులో 75 శాతం మంది చేతులెత్తి అంగీకరించడం ద్వారా ఏదైనా తీర్మానం అమలు అవుతుంది. కానీ ఇటీవల జరిగిన సర్వసభ్య సమావేశంలో ఇదేమీ లేకుండానే తోచిన విధంగా తొలగింపు పర్వం చేపట్టినట్టు ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఖరీదైన ఆస్తులపై కన్ను జూబ్లీహిల్స్ సొసైటీలో ఇంకా జీహెచ్ఎంసీకి చెందిన ఖాళీ స్థలాలున్నాయి. కొందరు ఇతర దేశాల్లో ఉండటంతో వారి ప్లాట్లు కూడా ఖాళీగా ఉన్నాయి. వీటిపై కొందరు కన్నేసినట్టు తెలుస్తోంది. మేనేజ్మెంట్ కమిటీ సభ్యులను బెదరగొడుతూ, లొంగదీసుకుంటూ బ్లాక్ మెయిల్‌కు పాల్పడుతున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ బ్లాక్ మెయిల్ రాజకీయాలు తట్టుకోలేక, సదరు చానెల్ కార్యాలయంలోకి పదేపదే వెళ్లలేక కార్యదర్శిగా ఎన్నికైన మురళీ ముకుంద్ ధిక్కార స్వరం వినిపించారు. దీనిపై ఆగ్రహించిన ప్రెసిడెంట్ తండ్రి కక్ష పెంచుకుని.. మురళీ ముకుంద్‌ను పదవిలో లేకుండా చేయడానికి కుట్రపన్నారు. కోర్టులో మురళీ ముకుంద్ గెలిచినా ఇప్పటికీ సదరు మేనేజ్మెంట్ ఒప్పుకోవడం లేదు. షేర్హోల్డర్ను తొలగించడం చట్ట ప్రకారం సరికాదని చెప్తున్నా వినిపించుకోవడం లేదు. ప్రభుత్వం ఏం చేస్తోంది? జూబ్లీహిల్స్ సొసైటీలో ఏడాది నుంచి ఆరోపణలు, ప్రత్యారోపణలు, అవినీతి అక్రమాల విమర్శలు వస్తున్నాయి. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం, కోర్టులను ఆశ్రయించడం, సమావేశాల్లో ధిక్కార స్వరాలు వినిపించడం, సస్పెన్షన్ల పర్వం కొనసాగుతున్నాయి. ఇంత జరుగుతున్నా ప్రభుత్వంలో స్పందన లేదు. చర్యలు తీసుకోవాల్సిన అధికారులు నోరు మెదపడం లేదు. సహకార శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి, ప్రిన్సిపల్ సెక్రెటరీ రఘునందన్‌రావు, రిజి్రస్టార్ వీరబ్రహ్మంలలో ఎవరూ సొసైటీ కార్యకలాపాలపై దృష్టి పెట్టడం లేదన్న విమర్శలున్నాయి. కోట్లాది రూపాయల విలువ చేసే ఖాళీ ప్లాట్లపై కొందరు కన్నేసి, కాజేస్తున్నా సదరు సహకార శాఖ అధికారులకు పట్టడం లేదు. కనీసం విచారణకు కూడా ఇప్పటివరకు ఆదేశించిన దాఖలాలు లేవు. సొసైటీ ఫైళ్లు ఎటు వెళ్తున్నాయి, సంతకాలు ఎవరు చేస్తున్నారన్న విషయంలో ఏ ఒక్కరికి శ్రద్ధ లేకుండా పోయిందని.. విలువైన స్థలాలున్న జూబ్లీహిల్స్ సొసైటీ విషయంలో ప్రభుత్వం ఎందుకిలా వ్యవహరిస్తోందన్నది అంతుపట్టడం లేదని సభ్యులు వాపోతున్నారు. ఇప్పటికైనా సహకార శాఖ ఉన్నతాధికారులు కలి్పంచుకొని.. సొసైటీ ఫైళ్లు ఎటు వెళ్తున్నాయి, ఏం జరుగుతోందన్న విషయంలో విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేస్తున్నారు. డమ్మీ ప్రెసిడెంట్.. గత నెలలో నన్ను సొసైటీ ప్రాథమిక సభ్యత్వం నుంచి తొలగించడంపై కోర్టును ఆశ్రయించాను. ఆ రోజు సొసైటీ తరఫున వాదించిన న్యాయవాది తాము ఎవరినీ తొలగించలేదన్నారు. ఆ మరునాడే హడావుడిగా నాతోపాటు మరికొందరిని తొలగిస్తున్నట్టు వాట్సాప్ మెసేజ్‌లు పంపారు. కోర్టులో చెప్పింది ఒకటి, బయట చేసింది మరొకటి. ఇదంతా సదరు చానెల్ కార్యాలయంలో జరుగుతున్న కుట్ర. సొసైటీ ప్రెసిడెంట్ డమ్మీయే. ఆయన తండ్రి మొత్తం అధికారాన్ని చేతుల్లోకి తీసుకొని వ్యవహారం నడిపిస్తున్నారు. సొసైటీ ఫైళ్లన్నీ సదరు చానల్ కార్యాలయానికే తరలాయి. ఎస్సెమ్మెస్‌లు, వాట్సాప్ మెసేజ్‌లు అన్నీ అక్కడే రూపొందుతున్నాయి. ఇటీవల నాతోపాటు మరికొందరిని లక్ష్యంగా చేసుకొని కరపత్రాలను పంపిణీ చేస్తూ సొసైటీ పరువు ప్రతిష్టలను బజారుకీడ్చారు. ఆసియాలోనే అతి పెద్ద టౌన్షిప్ అయిన జూబ్లీహిల్స్ సొసైటీని అప్రతిష్ట పాలు చేస్తున్నారు. – ఎ.మురళీ ముకుంద్, కార్యదర్శి, జూబ్లీహిల్స్ సొసైటీ ఎవరిని తొలగించినదీ లెక్కలేదు! సొసైటీలో సభ్యులంతా షేర్ హోల్డర్లే. వీరిని తొలగించాలంటే చట్టం ప్రకారం నడుచుకోవాలి. రిజిస్ట్రార్ అనుమతి కూడా కావాలి. అయితే జూబ్లీహిల్స్ సొసైటీ విషయంలో మాత్రం జూబ్లీహిల్స్ రోడ్ నం.1 లోని ఓ టీవీ చానల్ కార్యాలయంలో సస్పెన్షన్ల అంశం పురుడు పోసుకుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సదరు చానల్ కార్యాలయంలోనే సభ్యులపై కుట్రలు జరుగుతున్నాయని విమర్శలు వస్తున్నాయి. సదరు చానెల్ ఎదురుగా ఉన్న 6 వేల గజాల స్థలంపై కన్నేసిన యజమాని.. ముందుగా తన కుమారుడిని సొసైటీలోకి ప్రవేశపెట్టి మెల్లగా ఆక్రమణల పర్వానికి తెరలేపుతున్నారని సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇదేమిటని ప్రశ్నించినవారి సభ్యత్వాలు తొలగిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు ఎంతమంది సభ్యులను తొలగించారన్న దానిపై సరైన లెక్క కూడా లేదని.. ఆ పేర్ల జాబితాను కూడా ప్రకటించలేదని పేర్కొంటున్నారు. చదవండి: వానాకాలం సీఎంఆర్‌పై నీలినీడలు -
అసెంబ్లీ బీఏసీ సభ్యులను నియమించిన సీఎం జగన్
సాక్షి, అమరావతి: అసెంబ్లీ బీఏసీ సభ్యులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నియమించారు. మంత్రి వర్గ మార్పుల నేపథ్యంలో బీఏసీ సభ్యులను సీఎం మార్చారు. కన్నబాబు, అనిల్‌కుమార్ స్థానంలో బీఏసీ సభ్యులుగా మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జోగి రమేష్, బీఏసీలో లేజిస్లేటివ్ అఫైర్ కో ఆర్డినేటర్‌గా గండికోట శ్రీకాంత్‌రెడ్డిలను నియమించారు. చదవండి: ఏపీలో మరో భారీ సంక్షేమ పథకం.. అక్టోబర్ 1 నుంచి అమలు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈనెల 15 నుంచి ప్రారంభం కానున్నాయి. 15వ తేదీ ఉదయం 9 గంటలకు శాసనసభ, 10 గంటలకు శాసనమండలి సమావేశాలు ప్రారంభమవుతాయి. సమావేశాలను ఎన్ని రోజులు నిర్వహించాలనే దానిపై శాసనసభ వ్యవహారాల సలహా కమిటీ సమావేశమై నిర్ణయం తీసుకుంటుంది. -
అసెంబ్లీ సాక్షిగా టీడీపీ వికృత చేష్టలు.. సీఎం జగన్ సీరియస్
సాక్షి, అమరావతి: అసెంబ్లీ సాక్షిగా తొలిరోజే టీడీపీ సభ్యులు వికృత చేష్టలతో నీచ సంప్రదాయానికి తెరలేపారు. రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉన్న గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రసంగానికి అడ్డుపడుతూ దిగజారుడు రాజకీయాలకు పాల్పడ్డారు. గవర్నర్ గోబ్యాక్ అంటూ టీడీపీ సభ్యులు నినాదాలు చేయడంతో పాటు, గవర్నర్ ప్రసంగ పత్రులను చించివేశారు. దీంతో సభలో గందరగోళ పరిస్థితి నెలకొంది. చదవండి: ప్రజాస్వామ్యంపై టీడీపీకి కొంచెం కూడా గౌరవం లేదు: చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి గవర్నర్‌ను దూషిస్తూ, ప్రసంగం ప్రతులను టీడీపీ సభ్యులు చించి ఆయనపై విసిరేయడంపై బీఏసీ సమావేశంలో టీడీపీ సభ్యుడు అచ్చెన్నాయుడిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సీరియస్ అయ్యారు. గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకోవడంపై మంచి పద్ధతి కాదని హితవు పలికారు. గతంలో ఇలాంటి సంస్కృతి ఎన్నడూ లేదన్నారు. గవర్నర్ వయసులో పెద్దవారని, ఆయనకు గౌరవం ఇవ్వాలని సీఎం అన్నారు. -
విజయవాడలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య
-
ఎంత కష్టం వచ్చిందో.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అత్మహత్య
సాక్షి, కృష్ణ: విజయవాడలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సూసైడ్ కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కన్యకా పరమేశ్వరి సత్రంలో తల్లీ కొడుకు విషం తాగి ఆత్మహత్య చేసుకోగా కృష్ణానదిలో తండ్రీ కొడుకు దూకి ఆత్మహత్య చేసుకున్నారు. గల్లంతైన మృతదేహాల కోసం పోలీసులు గాలింపు చర్యలు ప్రారంభించారు. కాగా దుర్గమ్మ దర్శనానికి వచ్చి ఆ కుటుంబం సూసైడ్ చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మృతులను తెలంగాణకు చెందిన వారుగా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. సూసైడ్ కారణాలు తెలుసుకునే పనిలో బెజవాడ పోలీసులు నిమగ్నమయ్యారు. ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. ( చదవండి: Nellore: పాపం పసివాళ్లు! అమ్మానాన్నలు కాదనుకున్న అభాగ్యులు) -
పార్లమెంట్ స్టాండింగ్ కమిటీల్లో మనోళ్లు
న్యూఢిల్లీ: శాఖల వారీగా మరింత జోరుగా పరిపాలన సాగించేందుకు కేంద్రం సిద్ధమైంది. మంగళవారం స్టాండింగ్ కమిటీలకు సభ్యులను నియమించింది. అన్ని పార్టీల ఎంపీలనూ పరిపాలనలో భాగస్వామ్యం చేసేందుకు ప్రయత్నిస్తూ... స్టాండింగ్ కమిటీల్లో వివిధ పార్టీల ఎంపీలకు బాధ్యతలు అప్పగించింది. ఈ కమిటీల్లో చాలా వాటికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఎంపీలను సభ్యులుగా నియమించింది. ఆయా స్టాండింగ్ కమిటీలకు ఎంపికైన తెలుగు రాష్ట్రాల ఎంపీల వివరాలు.. స్టాండింగ్ కమిటీ సభ్యులు ఆర్థిక శాఖ మిథున్ రెడ్డి, సీఎం. రమేష్, జీవీఎల్ నరసింహారావు పరిశ్రమల శాఖ వైఎస్ అవినాష్ రెడ్డి వాణిజ్య శాఖ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ హెచ్ఆర్డీ లావు శ్రీకృష్ణదేవరాయలు , గల్లా జయదేవ్ ఆరోగ్యశాఖ టీఆర్ఎస్ ఎంపీ మాలోతు కవిత న్యాయశాఖ టీఆర్ఎస్ ఎంపీలు సురేష్‌రెడ్డి, వెంకటేష్ నేత ఐటీ శాఖ వైఎస్ఆర్సీ ఎంపీ సత్యనారాయణ, టీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి రక్షణ శాఖ రేవంత్ రెడ్డి, కోటగిరి శ్రీధర్, లక్ష్మీకాంత్ ఇంధన శాఖ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కార్మిక శాఖ టీఆర్ఎస్ ఎంపీలు బండ ప్రకాష్, పసునూరి దయాకర్ రైల్వే శాఖ రెడ్డప్ప, సంతోష్ కుమార్ పట్టణాభివృద్ధి శాఖ బండి సంజయ్ కెమికల్ అండ్ ఫర్టిలైజర్ శాఖ నందిగం సురేష్ బొగ్గు,ఉక్కు శాఖ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, బడుగుల లింగయ్య యాదవ్ గ్రామీణ అభివృద్ధి శాఖ తలారి రంగయ్య -
ప్రత్యేక విమానంలో జర్మన్ల తరలింపు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో చిక్కుకున్న 38 మంది జర్మన్ దేశస్తులను తిరిగి ఆ దేశానికి పంపించేందుకు జర్మనీ కాన్సులేట్ తెలంగాణ ప్రభుత్వం సమన్వయంతో చేసిన ప్రయత్నాలు ఫలించాయి. దీంతో మంగళవారం శంషాబాద్ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానం ద్వారా వారిని జర్మనీకి తీసుకెళ్లారు. వీరిలో 19 మంది మహిళలు, 17 మంది పురుషులు, మరో ఇద్దరు పిల్లలు ఉన్నారు. జర్మన్లను తరలించేందుకు చెన్నై నుంచి వచ్చిన ఎయిర్ ఇండియాకు చెందిన డ్రీమ్ లైనర్ (బోయింగ్ బీ787–8) విమానం ఏఐ– 3005 ఉదయం 7.32 గంటలకు హైదరాబాద్ విమానాశ్రయానికి చేరుకుంది. విమానాశ్రయానికి చేరుకున్న జర్మన్లకు థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించారు. ఆ విమానంలో చెన్నై నుంచి వచ్చిన మరికొందరు జర్మన్లు ఉన్నారు. ఉదయం 9.22 గంటలకు ఈ ప్రత్యేక విమానం హైదరాబాద్ నుంచి ముంబైకు బయల్దేరింది. అక్కడ మరికొంత మంది ప్రయాణికులను తీసుకుని జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్డ్‌కు వెళ్లనుంది. ఇండిగో మెడికల్ ఎవాక్యుయేషన్ విమానం హైదరాబాద్‌లో చిక్కుకుపోయిన ఇండిగో విమాన సిబ్బందిని తరలించేందుకు వచ్చిన ప్రత్యేక రెస్క్యూ విమానాన్ని కూడా ఇదే విమానాశ్రయం నుంచి పంపించారు. మార్చి 28 మధ్యాహ్నం ముంబై నుంచి వచ్చిన ఇండిగో మెడికల్ ఎవాక్యుయేషన్ విమానంలో ఎనిమిది మంది ఇండిగో సిబ్బంది ఇక్కడ దిగారు. హైదరాబాద్‌లో చిక్కుకున్న ఐదుగురు ఇండిగో సిబ్బంది చెన్నైకు బయల్దేరి వెళ్లారు. విమానాశ్రయంలో ఇండిగో సిబ్బందికి స్క్రీనింగ్ నిర్వహించి, వారి సమాచారాన్ని తెలంగాణ ఆరోగ్య శాఖకు సమర్పించినట్లు అధికారులు తెలిపారు. దేశవ్యాప్తంగా నిత్యావసర వస్తువుల సరఫరాకు ఎలాంటి ఆటంకాలూ లేకుండా కొనసాగేందుకు కృషి చేస్తున్నారు. అత్యవసర వస్తువులైన ఔషధాలు, వ్యాక్సిన్లు, మెడికల్ ఎక్విప్ మెంట్, ఫార్మా ముడి పదార్థాలు, రక్షణ పరికరాలు, బ్యాంకు సంబంధిత వస్తువులతో నగరంనుంచి కార్గో సేవలు కొనసాగుతున్నట్లు జీఎమ్మార్ అధికారులు తెలిపారు. -
ప్రజా పోరాటాలకు..కాంగ్రెస్ కార్యాచరణ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు, విద్యుత్ ప్రాజెక్టుల్లో భారీ అవినీతి జరుగుతోందని ఆరోపిస్తున్న కాంగ్రెస్ దీనిపై ప్రజా పోరాటాలు చేసేందుకు నిర్ణయించింది. ఇప్పటికే ఏఐసీసీ కోర్‌కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల మేరకు ప్రభుత్వ అవినీతిపై పూర్తి సమాచారం, ఆధారాలు సేకరించాలనే నిశ్చయానికి వచ్చింది. దీనిలో భాగంగా రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులను సందర్శించి ఆధారాల సేకరణకు వీలుగా ఓ కమిటీని నియమించింది. ఈ మేరకు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి చైర్మన్‌గా, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కన్వీనర్‌గా 26 మందితో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి ఆర్సీ కుంతియా కమిటీని ఏర్పాటు చేశారు. దీనిలో పార్టీ సీనియర్ నేతలు రేవంత్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, వి.హనుమంతరావు, టి.జీవన్‌రెడ్డి, కె.జానారెడ్డి, దామోదర రాజనర్సింహా, విజయశాంతి, చిన్నారెడ్డి, మధుయాష్కీ, సంపత్‌కుమార్, వంశీచందర్‌రెడ్డి, మర్రి శశిధర్‌రెడ్డి, పి.సుదర్శన్‌రెడ్డి, షబ్బీర్ అలీ, శ్రీధర్‌బాబు, జగ్గారెడ్డి, గీతారెడ్డి, మల్లురవి, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, దాసోజు శ్రవణ్, అమీర్ జావేద్‌లను సభ్యులుగా నియమించారు. అవినీతిపై మెమోరాండం రూపంలో రాష్ట్రపతి, గవర్నర్, ఇతర కేంద్ర ప్రభుత్వ పెద్దలకు సమర్పిస్తుంది. -
ఎమ్మెల్యే పట్టించుకోరూ జర చెప్పన్నా..?
సాక్షి, నారాయణపేట: జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన పెసర కొనుగోలు కేంద్రం వ్యవహర తీరుపై జిల్లాలోని ఎమ్మెల్యేలు గుర్రుగా ఉన్నట్లు సమాచారం. అ న్నదాతలకు అండగా నిలుస్తూ ప్రభుత్వం మ ద్దతు ధరను ఇచ్చి కొనుగోలు కేంద్రాన్ని ఏర్పా టు చేస్తే దళారులకు దారులు వేస్తారా అంటూ మార్క్‌ఫెడ్, ఊట్కూర్ సింగిల్ విండో అధికారులతో పాటు మార్కెట్ యార్డు అధికారులకు జిల్లాలోని ఓ ఎమ్మెల్యే డైరెక్ట్‌గా ఫోన్ చేసి ఆ గ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఊట్కూర్ మండలంలో పెసర పంట ఏ మేరకు వేశారో తె లుసా.. ఆ మండలంలో పెసర ధాన్యం ఎంత వచ్చిందో వివరాలను పంపించాలని సదరు అధికారులకు హెచ్చరించినట్లు తెలిసింది. మీ రు తిరిగి కొనుగోలు కేంద్రం తెరిచినా దాదాపు 200 బస్తాల వరకు బోగస్ పెసర ధాన్యాన్ని విక్రయించేందుకు వచ్చినట్లు సమాచారం అందిందని మీరు ఏమి చేస్తున్నరంటూ అధికారులపై మండిపడినట్లు తెలుస్తోంది. ఈ విషయంలో కలెక్టర్ సీరియస్‌గా తీసుకుని విచారణ చేపడుతున్న అధికారుల బృందంతో కట్టుదిట్టంగా చేయాలని కోరినట్లు సమాచారం. దళారులకు దారులు తెరిచిందెవరు? నారాయణపేట వ్యవసాయ మార్కెట్ పరిధిలో ఊట్కూర్ విండో ఉండడంతో మార్కెట్ పాలకవర్గంలో స్థానం కల్పించారు. విండో ప్రతినిధి సభ్యుడిగా ఉండడంతో వారికి పెసర కొనుగో లు కేంద్రం నిర్వహించేందుకు ఆదేశించారు. అయితే మార్కెట్ పాలకవర్గంలోని ఓ బడా ప్రతినిధితో పాటు మరో డైరక్టర్ వారికి సంబం ధం లేకున్నా కొనుగోలు కేంద్రంలో పెత్తనం చేలాయిస్తూ రైతుల అవతారమెత్తి విక్రయించేందుకు వచ్చిన దళారులకు దారులు తెరిచినట్లు ఆరోపణలున్నాయి. మార్కెట్‌యార్డు లోని ఓ డైరెక్టర్ మరో డైరెక్టర్‌తో చేతులు కలి పి వారి బంధువులు, శ్రేయోభిలాషుల పేరిటా పెసరను విక్రయించినట్లు పలువురు ఆరోపిస్తున్నారు. వీడియో హల్చల్పై ఎమ్మెల్యేల ఆరా వ్యవసాయ మార్కెట్ యార్డు కార్యాలయంలోని ప్రతినిధి చాంబర్లో చోటు చేసుకున్న వ్యవహరంపై ఓ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ అయ్యింది. ఆ వీడియోలో ఏముంది.. అసలు మార్కెట్ యార్డులోని పెసర కొనుగోలు కేంద్రంలో ఏం అవుతుందని జిల్లాలోని ఎమ్మెల్యేలు ఆరా తీసినట్లు సమాచారం. సోషల్ మీడియాలో వచ్చిన వీడియో సైతం ఎమ్మెల్యేల దృష్టికి చేరింది. మన ఎమ్మెల్యే పట్టించుకోరూ జర చెప్పన్నా..? మన ఎమ్మెల్యే పట్టించుకోనేటట్లు లేరన్నా.. మీరైనా జర చెప్పండంటూ మార్కెట్ పాలకవర్గంలోని ఓ ప్రతినిధి మార్కెట్ మాజీ ప్రతినిధితో రాయబారం చేసినట్లు సమాచారం. మీరు చెబితే పక్క నియోజకవర్గం ఎమ్మెల్యే సైతం వింటారాన్న.. మీరు ఒక్కసారి ఈ హెల్ప్ చేయండంటూ కోరినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సదరు మాజీ ప్రతినిధి సైతం ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లినా ఆ వ్యవహరం అంతే వదిలేయండి అంటూ సున్నితంగా తిరస్కరించినట్లు వినికిడి. పక్క ఎమ్మెల్యేకు ఈ విషయం తెలిపినా ఓ బాత్ చోడ్దేవ్.. దూస్రాబాత్ క్యాహై బోలో అన్నట్లు సమాచారం. పెసర కొనుగోలు కేంద్రం వ్యవహార తీరుపై ఎమ్మెల్యేలు గుర్రుమీదున్నట్లు తెలుస్తుంది. సీల్డ్ కవర్లో నివేదికలు పెసర కొనుగోలు కేంద్రంలో చోటు చేసుకున్న వ్యవహరతీరుపై కలెక్టర్ ఎస్.వెంకట్రావు రెండు దఫాలుగా ఐదేసి బృందాలను నియమించి జిల్లాలోని గ్రామాల్లో విచారింపజేశారు. అయితే అధికారుల బృందాలు క్షేత్రస్థాయిలోకి వెళ్లి సేకరించిన నివేదికలను బృందాల వారిగా ఎవరికి వారు కలెక్టర్‌కు సీల్డ్ కవర్లో అందజేయాలని సూచించినట్లు సమాచారం. నివేదించే వివరాలతో దళారుల గుట్టు రట్టు అవుతుందా.. విచారణ తుస్సుమంటుందో వేచి చూడాల్సిందే. నేడు మార్కెటింగ్ డైరెక్టర్ రాక రాష్ట్ర మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ లక్ష్మీబాయి బుధవారం నారాయణపేటకు వస్తున్నారు. అయితే పేటలో కొనసాగుతున్న పెసర కొనుగోలు కేం ద్రం వ్యవహర తీరుపై ఆరా తీస్తున్నట్లు సమాచారం. ఆతర్వాత పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు స్థలాన్ని పరిశీలిస్తారు. -
లోక్‌సభలో మన వాణి
దేశ రాజధానిలో జిల్లాకు చెందిన ఎంపీలు ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై లోక్‌సభలో ప్రస్తావించారు. బడ్జెట్ సమావేశాల్లో జిల్లాలో నెలకొన్న వివిధ సమస్యల పరిష్కారం కోసం నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆయా శాఖల కేంద్ర మంత్రులను కలిసి విన్నవించారు. రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డికి లోక్‌సభలో అరుదైన గౌరవం లభించింది. లోక్‌సభా పక్ష నేతగా.. ప్యానల్ స్పీకర్‌గా ఎంపికయ్యారు. సాక్షి, తిరుపతి: పార్లమెంటు సమావేశాల్లో జిల్లాకు చెందిన ఎంపీల సూచనలపై కేంద్ర మంత్రులు స్పందించారు. అభివృద్ధికి సహకరిస్తామని హామీలు ఇచ్చా రు. రాష్ట్రానికి ప్రత్యేకహోదాపై 2014లో కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని అమలుచేయాలని లోక్‌సభలో ఎంపీ మిథున్‌రెడ్డి డిమాండ్ చేశారు. ట్రిపుల్ తలాక్ బిల్లుకు వ్యతిరేకంగా వైఎస్సార్ కాంగ్రెస్ తరఫున ఆయన ప్రసంగించా రు. కడప స్టీల్‌ప్లాంట్ గురించి బడ్జెట్లో ప్రస్తావనే లేదన్నారు. వెనుకబడిన జిల్లాలకు నిధులు ఇవ్వాల్సి ఉండగా గడచిన రెండేళ్లుగా ఇవ్వలేదని ప్రస్తావించారు. కస్తూర్బా బాలికా రెసిడెన్షియల్ విద్యాలయాల్లో కాంట్రాక్టు పద్ధతిన పనిచేస్తున్న ఉపాధ్యాయులకు ఇతర విభాగాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులతో సమానంగా వేతనాలు ఇవ్వాలని కోరారు. చింతపండుపై విధించిన 5 శాతం జీఎస్టీతో వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. చింతపండుపై చిన్నచిన్న వ్యాపారులు ఆధారపడి జీవిస్తున్నారని, ఇది నిత్యావసర వస్తువు కావడంతో ప్రజలపై భారం పడకుండా చిన్న వ్యాపారులు చితికిపోకుండా జీఎస్టీని పూర్తిగా తొలగించాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కోరారు. కొత్త రైల్వేలైన్ల ఏర్పాటుకు నిధులివ్వండి చిత్తూరు–బెంగళూరు మధ్య కొత్త రైల్వేలైన్ ఏర్పాటుకు నిధులు కేటాయించాలని చిత్తూరు ఎంపీ రెడ్డెప్ప లోక్‌సభలో రైల్వే పద్దులపై జరిగిన చర్చలో మాట్లాడారు. కడప–బెంగళూరు మధ్య కొత్త రైల్వే లైన్ 2008–09లో ప్రకటించినా ఇప్పటివరకు నిధులు విడుదల చెయ్యలేదని గుర్తుచేశారు. చిత్తూరు–బెంగళూరు వయా కోలార్ రైల్వే లైన్ కూడా ఏళ్ల క్రితం ప్రకటించినా ఇప్పటివరకు కార్యరూపం దాల్చలేదన్నారు. దామలచెరువు వద్ద ఉన్న మ్యాంగో నగర్ నుంచి వేల లారీల ద్వారా మామిడి కోల్‌కతా, చెన్నై, బెంగళూరుకు మామిడి ఎగుమతులు జరుగుతున్నాయని, ఎగుమతులను మరింతగా ప్రోత్సహించేందుకు రైల్యే లైన్ ఏర్పాటు చెయ్యాలని కోరారు. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల సరిహద్దు జిల్లా అయిన చిత్తూరులో రైల్వే స్టేషన్ ఇప్పటికీ అభివృద్ధికి నోచుకోలేదని, సరిపడా నిధులు విడుదల చెయ్యాలని డిమాండ్ చేశారు. దేశం నలుమూలల నుంచి భక్తులు తిరుపతి, తిరుచానూరు, కాణిపాకం, శ్రీకాళహస్తి స్టేషన్లకు వస్తుంటారని, వారికి అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు, సదరు రైల్వే స్టేషన్ల అభివృద్ధికి నిధులు కేటాయించాలని కోరారు. ఆ 34 మంది విద్యార్థులకు న్యాయం చెయ్యండి తిరుపతి కేంద్రీయ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న 34 మంది విద్యార్థులు సైన్స్‌లో ఫెయిల్ అయ్యారని, తిరిగి సప్లిమెంటరీ పరీక్షలు రాసినా మరోసారి ఫెయిల్ అయిన విషయాన్ని లోకసభలో తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ ప్రస్తావించారు. ఆ 34 మంది విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయులను కలిస్తే వేరే పాఠశాలలో చేర్చుకోమని చెప్పి పంపిన విషయాన్ని తప్పుబట్టారు. ఆ విద్యార్థులను పదో తరగతికి ప్రమోట్ చెయ్యాలని కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రిని కోరారు. విద్యార్థులకు తాగునీటి కొరత ఉందని, అయితే ఉపాధ్యాయులు నీటి కొనుగోలుకు విద్యార్థుల నుంచి డబ్బు వసూలు చెయ్యటం అన్యాయమన్నారు. ప్రభుత్వ నిధులు ఏమయ్యాయని ప్రశ్నించారు. పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమల, శ్రీకాళహస్తి, కాణిపాకం, తిరుచానూరుకు అనేకమంది భక్తులు వస్తుంటారని అయితే విమాన సర్వీసులు అందుబాటులో లేవని ఆయన లోక్‌సభలో ప్రస్తావించారు. తిరుపతి పార్లమెంట్ పరిధిలో నెలకొన్న అనేక సమస్యలను ఆయన సభ దృష్టికి తీసుకెళ్లారు. -
అగ్రికల్చర్ మిషన్ సభ్యులుగా బోయ నరేంద్ర, డాక్టర్ మల్లారెడ్డి
సాక్షి, అనంతపురం: ‘అగ్రికల్చర్ మిషన్’ సభ్యులుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు బోయ నరేంద్రబాబు(రాజారాం), ఎకాలజీ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ వైవీ మల్లారెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వై.మధుసూదన్‌రెడ్డి సోమవారం జీఓ విడుదల చేశారు. అగ్రికల్చర్ మిషన్ చైర్మన్‌గా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వ్యవహరిస్తారు. వైస్ చైర్మన్‌గా వైఎస్సార్సీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు నాగిరెడ్డిని నియమించారు. సభ్యులుగా రైతుల కోటాలో జిల్లాకు చెందిన బోయ రాజారాంతో పాటు ఇతర జిల్లాలకు చెందిన మరో ఇద్దరికి అవకాశం కల్పించారు. కీలకమైన అగ్రికల్చర్ మిషన్‌లో ఇతర సభ్యులుగా వ్యవసాయ, రెవెన్యూ, ఇరిగేషన్, విద్యుత్, పశుసంవర్ధక శాఖ మంత్రులు, ఆయా శాఖల కార్యదర్శులు సభ్యులుగా ఉంటారు. ముఖ్యమంత్రికి రుణపడి ఉంటా: బోయ నరేంద్రబాబు అగ్రికల్చర్ మిషన్‌లో సభ్యుడిగా అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రికి రుణపడి ఉంటా. తన నియామకానికి కృషి చేసిన రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు నాగిరెడ్డి, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలకు పేరుపేరునా కృతజ్ఞతలు. ఈ పదవిని హోదాగా కాకుండా బాధ్యతగా తీసుకుంటా. రైతుల సంక్షేమానికి శాయశక్తులా కృషి చేస్తా. ముఖ్యంగా కరువు సీమలో రైతులు పడుతున్న ఇబ్బందులు ‘అగ్రికల్చర్ మిషన్’ ద్వారా తొలిగిపోతాయి. నా జీవితాంతం రైతుల కోసమే శ్రమిస్తా. -
కార్పొరేషన్లకు సభ్యుల నియామకం
అమరావతి: రాష్ట్రంలోని వివిధ కార్పొరేషన్లకు సభ్యులను నియమిస్తూ ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఉత్తర్వులు జారీ చేశారు. ఒక్కో కార్పొరేషన్‌కు నాలుగు నుంచి ఆరుగురు వరకు సభ్యులను నియమించారు. ఏపీ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్, ఏపీ స్టేట్ ఇర్రిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఏపీ గ్రంధాలయ సంస్థ, ఏపీ షీప్ అండ్ గోట్ ఫెడరేషన్లకు సభ్యులను కేటాయించారు. ఎన్నికలు దగ్గర సమయంలో టీడీపీలో అసంతృప్తులను చల్లబరిచేందుకు కార్పొరేషన్ల నియామకం చేపడుతోన్నట్లు కనిపిస్తోంది. -
పీఎఫ్ చందాదారులకు శుభవార్త
న్యూఢిల్లీ: రిటైర్మెంట్ ఫండ్ బాడీ ఎంప్లాయర్స్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఇపిఎఫ్ఓ) ఖాతాదారులకు శుభవార్త అందించింది. పీఎఫ్ ఖాతాదారులకు క్రెడిట్ లింక్డ్ సబ్సిడి పథకాన్ని అందుబాటులోకి తెచ్చేలా హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (హడ్కో)తో ఒక ఒప్పందం కుదుర్చుకోనుంది. ఈ మేరకు గురువారం ఒక అంగీకారానికి వచ్చింది. తద్వారా ఇ.పి.ఎఫ్.ఒ. తన చందాదారుల కోసం, ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన (పిఎంఏఐ) ద్వారా ప్రవేశపెట్టిన హౌసింగ్ పథకం ప్రయోజనాలను మౌలీకృతం చేస్తుంది. పిఎంఏ పరిధిలో సరసమైన గృహాలను కొనుగోలు చేసేందుకు రూ. 2.67 లక్షల వరకు సబ్సిడీని సభ్యులకు అందించనుంది. ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన కింద సబ్సిడీ, వడ్డీ సబ్సిడీని పొందేందుకు గృహనిర్మాణ, పట్టణ అభివృద్ధి సంస్థతో ఇపిఎఫ్ఓ ఒప్పందం కుదుర్చుకుంటుంది. 2022 నాటికి అందరికీ ఇల్లు అనే కేంద్ర ప్రభుత్వ నిబద్ధతలో భాగంగా ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంటుందని ఒక అధికారిక ప్రకటనలో ఈపీఎఫ్‌వో తెలిపింది. హడ్కోతో కుదుర్చుకున్న ఈ ఒప్పదం ప్రకారం రూ. 2.67 లక్షల వరకు గృహ సబ్సిడీ ఇపిఎఫ్ సభ్యులు పొందుతారు. సెంట్రల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ వి పి జాయ్, హడ్కో సీఎండీ ఎం.రవి కంత్లు ఈ ఒప్పందంపై సంతకాలు చేయనున్నారు. కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ, కేంద్ర పట్టణాభివృద్ధి, సమాచారశాఖ మంత్రి వెంకయ్య నాయుడు సమక్షంలో ఈ ఒప్పందం జరగనుంది. ఇపిఎఫ్ఓ సెంట్రల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ వి పి జాయ్ ఈ ఒప్పందంపై మాట్లాడుతూ ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన కింద ఇపిఎఫ్ఓ చందాదారులకు ఇళ్లు కొనుగోలు చేయడానికి చౌకైన రుణాలు వంటి వివిధ ప్రయోజనాలను అందించనున్నట్టు చెప్పారు. -
వీరేంద్ర హత్య కేసులో ఐదుగురి అరెస్టు
మరోకరి కోసం గాలింపు కాకినాడ రూరల్ : ఇంద్రపాలెం శ్రీనివాసనగర్‌కు చెందిన దొమ్మ వీరేంద్రకు హత్య కేసులో శుక్రవారం పోలీసులు ఐదుగురిని అరెస్టు చేశారు. డీఎస్పీ వెంకటేశ్వరరావు, రూరల్ సీఐ వి.పవన్‌కిశోర్, ఎస్సై డి.రామారావు వివరాలను వెల్లడించారు. ఇంద్రపాలెం గొల్లపేటకు చెందిన భీమాల రమణ (సున్నంబట్టి రమణ) అదేగ్రామం శ్రీనివాసనగర్‌లో నివాసముంటున్న ముద్దాడ లక్ష్మితో వివాహేతర సంబంధం పెట్టుకొని సహజీవనం చేస్తున్నాడు. అయితే ఇంద్రపాలెం అర్జున్‌నగర్‌కు చెందిన మాంసం వ్యాపారి దొమ్మ వీరేంద్ర కొంత కాలంగా తన కోర్కె తీర్చాలని, లేదంటే యాసిడ్ పోస్తానని లక్ష్మిని బెదిరించసాగాడు. రమణ లేని సమయంలో లక్ష్మి ఇంటికి వెళ్లి ఆమె తమ్ముళ్లను కొట్టి వేధిస్తుండేవాడు. దీంతో వీరేంద్రను హతమార్చాలని భావించి లక్ష్మి రమణకు, అతని స్నేహితులు చీడిగకు చెందిన అనసూరి బాబూప్రసాద్, కాకినాడ పాత బస్‌స్టాండ్ వెంకటేశ్వరకాలనీకి చెందిన దంగేటి జగదీష్‌కు విషయాన్ని చెప్పింది. అదును కోసం ఎదురు చూస్తున్న రమణ తన స్నేహితులతో తీసుకున్న గ్రూప్ఫోటోను ఫేస్బుక్లో అప్లోడ్ చేయగా, అది చూసిన వీరేంద్ర మేనల్లుడు ఆరి సింహాచలం ఛీ అని కామెంట్ పెట్టాడు. దీన్ని సాకుగా తీసుకుని సింహాచలం నుంచి ఫోన్ లాక్కొని రమణ స్నేహితులు వెళ్లిపోయారు. మేనల్లుడు ఫోన్ కోసం వెళ్లిన వీరేంద్రను రమణ, అతని స్నేహితులు అనసూరి బాబూప్రసాద్, దంగేటి జగదీష్, ముద్దాడ లక్ష్మి, ఆమె తమ్ముళ్లు పితాని ఎర్రయ్య, బుల్లియ్య గొడ్డలి, కత్తి, క్రికెట్ స్టంపులతో దాడి చేసి చంపి పారిపోయారని సీఐ పవన్‌కిశోర్ వివరించారు. శుక్రవారం తెల్లవారుజామున బెయిల్ కోసం లాయర్‌ను కలిసేందుకు సొమ్ములు సిద్ధం చేసుకోవడానికి సమావేశమైనట్లు తమకు వచ్చిన సమాచారం దాడి చేసి పట్టుకున్నట్లు తెలిపారు. ముద్దాయిల్లో ఒకడైన ముద్దాడ లక్ష్మి చినతమ్ముడు బుల్లియ్య పరారయ్యాడని సీఐ పవన్‌కిశోర్ తెలిపారు. అనంతరం వారి నుంచి వీరేంద్రను చంపడానికి ఉపయోగించిన గొడ్డలి, కత్తి, క్రికెట్ స్టంపులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వీరి ఐదుగురిపై కేసులు నమోదు చేసి కోర్టుకు తరలిస్తున్నట్లు ఇంద్రపాలెం ఎస్సై డి.రామారావు వివరించారు. ముద్దాయిలను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన పోలీసు సిబ్బందిని డిఎస్పీ వెంకటేశ్వరరావు, సిఐ పవన్కిశోర్లు అభినందించారు. -
ఆ ఆరుగురికీ స్థానచలనం
- ఎన్నాళ్ల కెన్నాళ్లకు బదిలీవేటు - కదిలిన దేవాదాయశాఖ - ‘సాక్షి’ ఎఫెక్ట్ సాక్షి ప్రతినిధి, కాకినాడ : దేవాదాయ శాఖలో ఎన్నో ఏళ్లు తరువాత కదలిక వచ్చింది. ఏళ్ల తరబడి ఒకే కార్యాలయంలో తిష్టవేసి అవినీతిని పెంచిపోషిస్తున్న ఉద్యోగులకు స్థాన చలనం కలిగింది. దశాబ్దాల కాలంగా పట్టించుకోని కాకినాడ డీసీ కార్యాయాన్ని ప్రక్షాళన చేశారు. అక్కడ పాతుకుపోయిన ఆరుగురు ఉద్యోగులు ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్టుగా సాగిన అవినీతికి ఆలవాలంగా మారిన ఉద్యోగుల బండారాన్ని ఈ నెల 12న ‘ఆ ఆరుగురిదే హవా’ శీర్షికన ‘సాక్షి’ వెలుగులోకి తీసుకు వచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన దేవాదాయశాఖ ఉన్నతాధికారులు డీసీ కార్యాలయంలో ఏళ్ల తరబడి తిష్టవేసిన ఉద్యోగుల వివరాలు సేకరించారు. అందులో అటెండర్‌గా ఉద్యోగంలో చేరి ఇక్కడే జూనియర్, సీనియర్ అసిస్టెంట్లుగా కూడా పదోన్నతులు పొందిన వారు కొందరు. జూనియర్ అసిస్టెంట్‌గా జాయినై సూపరింటెండెంట్‌గా పదోన్నతిపై అదే కార్యాలయంలో పనిచేస్తూ పైసలివ్వందే ఫైళ్లు కదలని పరిస్థితి తీసుకువచ్చిన వైనాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. కాకినాడ డీసీ కార్యాలయంలో సుమారు 20 మంది అన్ని గ్రేడ్ల ఉద్యోగులు పని చేస్తుండగా వారిలో ఆరుగురు మాత్రం అక్కడే తిష్టవేసిన వైనాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తేవడం ఈ విషయాన్ని ఉన్నతాధికారులు గుర్తించారు. ఆ క్రమంలోనే ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన బదిలీల కౌన్సెలింగ్‌లో భాగంగా డీసీ కార్యాలయంలో ఏళ్లతరబడి తిష్ట వేసిన ఉద్యోగులను సాగనంపారు. ఆ ఆరుగురికి స్థానం చలనం... సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న ఎ.విజయలక్ష్మి, సీనియర్ అసిస్టెంట్ కృష్ణారెడ్డిలను రాజమహేంద్రవరం అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయానికి బదిలీ చేశారు. సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న దీపారాణిని పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయానికి, మరో ఇద్దరు ఉద్యోగులు సురేష్‌కుమార్, రాజేశ్వరిలను కాకినాడలోని దేవాదాయశాఖ కార్యాలయంలోని డివిజనల్ ఇంజినీర్ కార్యాలయానికి బదిలీ చేశారు. మరొక సీనియర్ అసిస్టెంట్ సి.హెచ్. ఉదయకుమార్బాబు రాజమహేంద్రవరం ఇన్స్పెక్టర్గా బదిలీ చేశారు. ఈ బదిలీలపై డిప్యుటీ కమిషనర్ పరిధిలోకి వచ్చే ఆలయాలు, సత్రాల కార్యనిర్వాహణాధికారులు సంబరపడుతున్నారు. కార్యాలయానికి వెళ్లాలన్నా, ఫైళ్లు తీసుకువెళ్లాలన్నా చేయి తడపందే పనయ్యే పరిస్థితి ఉండేది కాదంటున్నారు. డీసీ కార్యాలయంలో ఏళ్లతరబడి తిష్టవేసిన ఆ ఆరుగురిపైన ఇన్నేళ్ల తరువాతైనా ఏకకాలంలో బదిలీ వేటు వేయడానికి కారణమైన సాక్షి’కి దేవాదాయశాఖ ఉద్యోగులు కృతజ్ఞతలు తెలియజేశారు. -
వైఎస్సార్సీపీ కీలక నియామకాలు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని 23 అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోమవారం ప్రకటించింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ తెలంగాణ అధ్యక్షుడు డాక్టర్ గట్టు శ్రీకాంత్‌రెడ్డి 23 మంది అసెంబ్లీ కో-ఆర్డినేటర్లను నియమించారు. వీరితో పాటు పది జిల్లాలకు ఇన్చార్జీలు, ఐదు జిల్లాలకు పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర పార్టీలో పలువురు కార్యదర్శులు, అధికార ప్రతినిధులను నియమించారు. శాసనసభ నియోజకవర్గ సమన్వయకర్తలు వీరే డాక్టర్ గట్టు శ్రీకాంత్‌రెడ్డి (హుజుర్నగర్), జి.శ్రీధర్‌రెడ్డి (సంగారెడ్డి), మందడి సరోజ్‌రెడ్డి(దేవరకద్ర), డాక్టర్ నగేష్ (కరీంనగర్), అప్పం కిషన్ (భూపాలపల్లి), బీస మరియమ్మ (జడ్చర్ల), జెట్టి రాజశేఖర్ (అలంపూర్), ఇరుగు సునీల్‌కుమార్ (నకిరేకల్), సంగాల ఇర్మియా (వర్థన్నపేట), నాయుడు ప్రకాష్ (నిజామాబాద్), బి.అనిల్‌కుమార్ (ఆదిలాబాద్), వి.సతీష్ (మంచిర్యాల), బి.సంజీవరావు (ఆంథోల్), జి.రాంభూపాల్‌రెడ్డి (కొల్లాపూర్), ఎం.భగవంతురెడ్డి (నాగర్‌కర్నూలు), ఎం.విష్ణువర్థన్‌రెడ్డి (వనపర్తి), నాడెం శాంతికుమార్ (నర్సన్నపేట్), లక్కినేని సుధీర్‌బాబు (ఖమ్మం), బొబ్బిలి సుధాకరరెడ్డి (షాద్‌నగర్), సెగ్గం రాజేశ్ (మంథని), వెల్లాల రామ్మోహన్ (సనత్‌నగర్), కొండా రాఘవరెడ్డి (రాజేంద్రనగర్), డా.ప్రఫుల్లారెడ్డి (జూబ్లీహిల్స్). జిల్లాల ఇన్చార్జీలు రాష్ట్ర పార్టీలోని పలువురు నాయకులను ఆయా జిల్లాలకు ఇన్‌చార్జీలుగా నియమించారు. వారు.. జెన్నారెడ్డి మహేందర్‌రెడ్డి (నల్లగొండ), మతిన్ ముజాదుద్దీన్ (మహబూబ్‌నగర్), కె.శివకుమార్ (రంగారెడ్డి), జి.రాంభూపాల్‌రెడ్డి (హైదరాబాద్), కొండా రాఘవరెడ్డి (నిజామాబాద్), నర్ర భిక్షపతి (ఆదిలాబాద్), బి.శ్రీనివాసరావు (కరీంనగర్), వేముల శేఖర్‌రెడ్డి (వరంగల్), డాక్టర్ ప్రఫుల్లారెడ్డి (ఖమ్మం), వెల్లాల రామ్మోహన్ (మెదక్). ఐదు జిల్లాలకు పార్టీ అధ్యక్షులు గతంలోనే పలు జిల్లాలకు పార్టీ అధ్యక్షులను నియమించగా, తాజాగా మరో ఐదు జిల్లాలకు అధ్యక్షులను నియమించారు. మునగాల కళ్యాణిరాజ్ (జనగాం), బి.సంజీవరావు (మెదక్), కొళ్ల యాదయ్య (వికారాబాద్), అతిక్ రెహామాన్ (గద్వాల), వొడ్లోజు వెంకటేష్ (యాదాద్రి). రాష్ట్ర కమిటీ పార్టీ రాష్ట్ర కార్యదర్శులుగా జెట్టి రాజశేఖర్, ఇ. అవినాష్‌గౌడ్, సంయుక్త కార్యదర్శిగా డి.వేణుమాధవ్‌రావు, అధికార ప్రతినిధులుగా జె.మహేందర్‌రెడ్డి, మతిన్ ముజాదుద్దీన్, జి.రాంభూపాల్‌రెడ్డి, నర్ర భిక్షపతిలను నియమించారు. అధికార ప్రతినిధులు పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధులుగా జే మహేందర్ రెడ్డి, మతిన్ముజాదుద్దీన్, జీ రాంభూపాల్ రెడ్డి, నర్ర భిక్షపతిలను నియమించారు. -
వాసవీ క్లబ్ జిల్లా గవర్నర్‌గా మురళీకృష్ణ
నూనెపల్లె: వాసవీ ఇంటర్నేషనల్ క్లబ్ 209(ఏ) జిల్లా గవర్నర్‌గా నెరవాటి మురళీకృష్ణ ఎన్నికయ్యారు. సోమవారం క్లబ్ కార్యాలయంలో ఇంటర్నేషనల్ క్లబ్ జాయింట్ సెక్రటరీ, జిల్లా ఎన్నికల అధికారి నాదెళ్ల శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఈ ఎన్నిక జరిగింది. ఈ సందర్భంగా శ్రీనివాసులు మాట్లాడుతూ.. వచ్చే ఏడాది నుంచి మురళీకృష్ణ గరవ్నర్‌గా కొనసాగుతారని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 32 వాసవీ క్లబ్‌లు ఉన్నాయని వీటి స్థాయి పెంచాలని సూచించారు. భవిష్యత్తులో క్లబ్‌లు సేవా కార్యక్రమాలు విస్తృత పరచాలని చెప్పారు. గవర్నర్‌గా ఎన్నికైన మురళీకృష్ణను క్లబ్ సభ్యులు సంపత్ కుమార్, జేవీసీ సత్యనారాయణ, శ్రీనాథ్, గాంధీ, ఉదయగిరి శివయ్యలు అభినందించారు. -
పాత గోడ.. మృత్యువు అడుగుజాడ..
కూలీలను కబళించిన మృత్యువు ∙ పాత ఇంటిగోడ కూలి ఇద్దరు కూలీలు మృతి ∙ ముంగండ, నరేంద్రపురం గ్రామాల్లో విషాదఛాయలు పి.గన్నవరం : వారిద్దరూ తమ రెక్కల కష్టంపై కుటుంబాన్ని పోషిస్తున్న వారే. ఏ పూట కూలికి వెళ్లకపోయినా బతుకుబండి ఒడిదుడుకులకు లోనయ్యే పేదలే. పాత ఇంటిని పడగొట్టే పనికి వెళ్లిన వారికి ఆ ఇల్లే సజీవ సమాధి అయింది. కూల్చబోయిన గోడే తమ ప్రాణాల్ని హరించింది. పి.గన్నవరం మండలం రాజులపాలెం శివారు ఐనాలవారిపాలెంలో సోమవారం జరిగిన దుర్ఘటనలో ముంగండ శివారు ఇటికెలమెరకకు చెందిన మట్టపర్తి వెంకటేశ్వరరావు అనే వెంకన్న (42), నరేంద్రపురం శివారు బూరుగుగుంటకు చెందిన గుమ్మడి నాగరాజు(40) దుర్మరణం పాలయ్యారు. ఐనాలవారిపాలెంలో బొక్కా సాహెబ్‌కు చెందిన పాత ఇంటి కలప, ఇటుక సామగ్రిని ముంగండకు చెందిన మట్టపర్తి సుధాకరరావు(బాబ్జీ) రూ.30 వేలకు కొనుగోలు చేశాడు. నాలుగు రోజులుగా వెంకటేశ్వరరావు, నాగరాజు(40), ముంగండకు చెందిన మామిడిశెట్టి వేణుగోపాలరావు పాత ఇంటిని విప్పుతున్నారు. ఇటీవల పాత ఇళ్లను పొక్లెయిన్‌తో తొలగిస్తున్నారు. ఇంటి ఇటుకలు తిరిగి ఉపయోగించే స్థితిలో ఉండటంతో కూలీలతో పనిచేయిస్తున్నారు. సోమవారం ఇంటిగోడను గునపాలతో కూల్చేందుకు ప్రయత్నిస్తుండగా ఇటీవల వర్షాలకు నానిఉన్న గోడ ఒక్కసారిగా ఒకవైపున ఉన్న వెంకన్న, నాగరాజులపై పడిపోయింది. తప్పించుకునే అవకాశం లేక ఆ ఇద్దరూ శిథిలాల కిందపడి మరణించారు. గోడకు రెండోవైపున ఉన్న వేణుగోపాలరావు ప్రమాదం నుంచి బయటపడ్డాడు. మమ్మల్ని అనాథల్ని చేసి వెళ్లిపోయావా! ‘ఇద్దరు ఆడపిల్లల్నీ, నన్నూ అనాథలను చేసి వెళ్లిపోయావా..’ అంటూ వెంకటేశ్వరరావు భార్య పద్మ గుండెలవిసేలా రోదించిన తీరు అందరినీ కంట తడిపెట్టించింది. తండ్రి మృతదేహం చూసి కుమార్తెలు మీన, అరుణ సొమ్మసిల్లి పోయారు. ఈ కుటుంబానికి కనీసం ఇంటి స్థలం కూడా లేదు. ఇటికెలమెరకలో ఆక్రమణ స్థలంలో గుడిశె వేసుకుని నివసిస్తున్నారు. మీన ఇంటివద్దే ఉంటుండగా, అరుణ పదో తరగతి చదువుతోంది. నీ భార్యకు ఏం చెప్పను? మరో మృతుడు నాగరాజు సంపాదన అంతంత మాత్రంగానే ఉండటంతో భార్య నాగలక్ష్మి ఏడాది క్రితం గల్ఫ్‌లో పనికి వెళ్లింది. నాగరాజు, తండ్రి గనిరాజు కలిసి ఉంటున్నారు. ‘నీ భార్యకు ఏం సమాధానం చెప్పా’ లంటూ గనిరాజు రోదించాడు. విషాదఛాయలు ఈ సంఘటనతో ముంగండ, నరేంద్రపురం గ్రామాల్లో విషాదఛాయలు అలముకున్నాయి. బాధిత కుటుంబాలను వైఎస్సార్ సీపీ కోఆర్డినేటర్ కొండేటి చిట్టిబాబు, రాష్ట్ర టీడీపీ కార్యదర్శి డొక్కా నాథ్‌బాబు, ఎంపీటీసీ సభ్యులు నేలపూడి సత్యనారాయణ, నక్కా వీవీ సత్యనారాయణ పరామర్శించారు. రావులపాలెం సీఐ పీవీ రమణ, డిప్యూటీ తహసీల్దార్ డి.శ్రీనివాస్, ఎస్సై పి.వీరబాబు సహాయక చర్యలు చేపట్టారు. -
గ్రేటర్లో వినాయక ఉత్సవాలపై సమావేశం
-
రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలు
మంగపేట : మండల కేంద్రంలోని కోమటిపల్లి క్రాస్ రోడ్డు వద్ద రోడ్డు దాటుతుండగా ద్విచక్రవాహనాన్ని కారు ఢీకొట్టింది. ఆదివారం మధ్యాహ్నం జరిగిన ఈ ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలు కాగా మరో ఇద్దరికి స్పల్ప గాయాలయ్యాయి. పొదుమూరుకు చెందిన కోలా ఉదయ్, కొప్పుల నవీన్, గగ్గూరి నగేష్‌లు మంగపేట సమీపంలోని ముక్కిడి పోచమ్మ ఆలయానికి వెళ్లి స్వగ్రామానికి బైక్‌పై తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలో ఏటూరునాగారం నుంచి భద్రాచలానికి వెళ్తున్న కారును గమనించకుండా.. రోడ్డు దాటేందుకు యత్నించారు. అయితే కారు వేగంగా వచ్చి బైక్‌ను ఢీకొట్టింది. దీంతో ముగ్గురికీ గాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం మండల కేంద్రంలోని పీహెచ్‌సీకి తరలించారు.కాగా, ఆస్పత్రిలో వైద్యులు లేకపోవడంతో స్టాఫ్ నర్సులే వీరికి చికిత్స అందించారు. నిర్లక్ష్యంగా విధులు నిర్వర్తిస్తున్న ఆస్పత్రి వైద్యాధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ తుడుందెబ్బ మండల అధ్యక్షుడు అల్లెం నర్సింహారావు తహసీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు. -
మన్యంలో కలవరం
టార్గెట్ ఇన్ఫార్మర్ ∙ చింతూరు: పోలీసులకు ఇన్ఫార్మర్లుగా భావిస్తున్న కొందరిని మావోయిస్టులు కిడ్నాప్ చేయడంతో మన్యంలో కలవరం నెలకొంది. చింతూరు మండలం పేగ గ్రామానికి చెందిన నలుగురు గిరిజనులను మావోయిస్టులు మంగళవారం రాత్రి కిడ్నాప్ చేశారు. చింతూరు మండలంలో పోలీసులకు ఇన్ఫార్మర్గా వ్యవహరిస్తున్నాడంటూ గతనెల 29వ తేదీన లచ్చిగూడెం గ్రామానికి చెందిన చర్చి పాస్టర్ ఉయికా మారయ్యను మావోయిస్టులు హతమార్చిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా ఘటనాస్థలంలో మావోయిస్టులు ఓ లేఖను వదిలారు. చింతూరు మండలంలోని పేగ, వినాయకపురం, అల్లిగూడెం గ్రామాలకు చెందిన పలువురు గిరిజనులు పోలీసులకు ఇన్ఫార్మర్లుగా వ్యవహరిస్తున్నారని, వారు తమతీరు మార్చుకోకుంటే కన్నయ్యకు పట్టిన గతే పడుతుందని ఆ లేఖలో హెచ్చరించారు. ఆ లేఖలో ప్రస్తుతం కిడ్నాప్‌కు గురైన వారి పేర్లు కూడా ఉండడంతో లేఖలో పేర్లున్న మిగిలినవారు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. మావోయిస్టులు కిడ్నాప్ చేసిన వారిని ఆంధ్రా, ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోని సుక్మా జిల్లా అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. తమవారిని క్షేమంగా విడిచిపెట్టాలని మావోయిస్టులను బాధిత కుటుంబసభ్యులు వేడుకుంటున్నారు. ఆంధ్రా, ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న శబరి ఏరియా కమిటీ ఆధ్వర్యంలోనే ఈ కిడ్నాప్ జరిగినట్టు తెలుస్తోంది. కిడ్నాప్ నేపధ్యంలో ఆంధ్రా, ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో పోలీసులు కూంబింగ్‌ను ముమ్మరం చేసే అవకాశం ఉంది. దాంతో మరోమారు మన్యంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తవచ్చు. -
సిట్ చేతిలో 40 మంది రియల్టర్ల జాబితా!
నయీం దందాలతో సంబంధాలున్నాయనే దిశగా విచారణ వారి ఆస్తులు, సెల్‌ఫోన్ డేటా సేకరణ రెండు వాహనాలు స్వాధీనం సాక్షి ప్రతినిధి, కరీంనగర్/కరీంనగర్ క్రైం : గ్యాంగ్‌స్టర్ నయీం, అతడి అనుచరులు సాగించిన దందాలపై ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణను వేగవంతం చేసింది. అందులో భాగంగా కరీంనగర్ జిల్లాకు చెందిన 40 మంది రియల్టర్లకు నయీం భూ దందాల్లో భాగస్వామ్యం ఉందని భావిస్తోంది. ఈ మేరకు వారి ఆస్తులు, సెల్‌ఫోన్ డేటాను సేకరించి లోతుగా విచారణ జరుపుతోంది. తాజాగా సిట్ అధికారులు కరీంనగర్ జిల్లాలో ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకోవడంతోపాటు వారు ఉపయోగించే స్కోడా, వోక్స్వాగన్ కార్లును సైతం స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. మంథని ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి నయీం అనుచరుడుగా చలామణి అవుతున్నట్లు గుర్తించిన సిట్ అధికారులు అతడిపై విచారణ జరుపుతున్నారు. గతంలో ఆ వ్యక్తి ఇంటిలో శుభకార్యానికి నయీం స్కోడా, వోక్స్వ్యాగన్ కార్లలో మంథని వచ్చినట్లు తెలిసింది. అప్పటినుంచి సదరు వ్యక్తులు ఆయా వాహనాల్లోనే తిరుగుతూ నయీం ఇచ్చిన గిఫ్ట్‌గా సన్నిహితుల వద్ద చేప్పుకునే వారని ప్రచారం జరుగుతోంది. సదరు వ్యక్తులను సిట్ అదుపులోకి తీసుకునే క్రమంలో వీరు ఈ వాహనాల్లోనే ప్రయాణిస్తున్నారని సమాచారం. కేసుతో ఈ వాహనాలకు కూడా సంబంధం ఉండటంతో వాటిని స్వాధీనం చేసుకుని కరీంనగర్‌లోని ఓ రహస్య ప్రాంతానికి తరలించారని తెలిసింది. నాలుగు జిల్లాల్లో రియల్టర్ల దందా! సిట్ అధికారులు అనుమానిస్తున్న 40 మంది రియల్టర్లు కరీంనగర్, హైదరాబాద్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. వీరు ఇప్పటివరకు ఏయే ప్రాంతాల్లో వెంచర్లు, ఇతర దందాలు నిర్వహిస్తున్నారో పూర్తి సమాచారం సేకరించి వాటి ద్వారా వివరాలు రాబట్టే పనిలో పడ్డారు. కరీంనగర్‌లోని మంకమ్మతోటకు చెందిన ఓ రియల్టర్ జిల్లాతోపాటు హైదారాబాద్, భువనగిరి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేయగా.. వీటిలో రెండు వెంచర్లలో నయీం ముఠా కూడా పాలుపంచుకుందని సిట్ అధికారులు గుర్తించారు. సదరు రియల్టర్‌కు మిత్రుడైన ఓ హెడ్‌కానిస్టేబుల్ కూడా పెద్ద ఎత్తున రియల్ దందా చేయడంతో అతడిని కూడా విచారించడానికి సిట్ రంగం సిద్ధం చేసిందని సమాచారం. ఇప్పటికే సిట్ సభ్యులు సదరు రియల్టర్, హెడ్‌కానిస్టేబుల్‌కు చెందిన సెల్ రికార్డులు, బ్యాంక్ రికార్డులు పరిశీలించారని తెలిసింది. వీటిలో రెండు చోట్ల నయీంతో సంబంధాలున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం రియల్టర్‌తోపాటు సదరు హెడ్‌కానిస్టేబుల్‌కు చెందిన ఫోన్లు పని చేయడం లేదని తెలిసింది. దీనిపై మరింత లోతుగా విచారించాలని నిర్ణయించిన సిట్ బృందం వారిని అదుపులోకి తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. మరోవైపు కరీంనగర్ జిల్లాలో నాలుగు కేసులు నమోదు కావడంతో ఈ కేసుల్లో రమేశ్, గోపీ ప్రధాన నిందితులుగా భావిస్తున్న సిట్ బృందం వారిపై లోతుగా విచారణ ప్రారంభించేందుకు సిద్ధమైంది. అందులో భాగంగా ఏ క్షణమైనాlవీరిని అరెస్టు చూపే అవకాశం ఉందని తెలిసింది. వీరి ఆస్తులను సైతం స్వాధీనం చేసుకునే అవకాశం ఉందని తాజాగా జరుగుతున్న పరిణామాలను బట్టి అర్థమవుతోంది. -
జనరల్ మర్చంట్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం
విజయవాడ(వన్‌టౌన్) : జనరల్ మర్చంట్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నుకున్నారు. స్థానిక మహేశ్వరి భవన్లో కార్యవర్గ ఎన్నిక మంగళవారం నిర్వహించారు. అధ్యక్షుడిగా ప్రవీణ్కుమార్జైన్, ఉపాధ్యక్షులుగా మోహన్లాల్కొఠారి, ధనరాజ్సోలంకి, కార్యదర్శిగా నెమిచంద్జైన్, సహాయ కార్యదర్శిగా మంగీలాల్, కోశాధికారిగా మహేంద్రకుమార్జైన్, కో కోశాధికారిగా మేఘరాజ్జైన్ సభ్యులుగా గిరీష్‌కుమార్ సోదాని, విజయరాజ్ సోలాంకి, వినోద్‌కుమార్ సోలాంకి, సురేష్‌కుమార్, విజయ్తతోడి, బెహర్లాల్, రతన్‌లాల్, పొపట్లాల్, టీ దుర్గాప్రసాద్ ఎన్నికయ్యారు. -
ఎవరా...ఐదుగురు
జిల్లాకు చుట్టిన ఎంసెట్–2 ఉచ్చు ఖమ్మంలో మెరిట్ ర్యాంకర్ల వివరాలు సేకరించిన సీఐడీ విద్యార్థుల తల్లిదండ్రుల విచారణ..నేడో, రేపో అరెస్ట్‌లకు సిద్ధం ఖమ్మం : సంచలనం సృష్టించిన ఎంసెట్–2 లీకేజీ వ్యవహారం జిల్లాను తాకింది. రాష్ట్రవ్యాప్తంగా 72 మంది విద్యార్థులకు పరీక్షకు ముందుగానే ప్రశ్నపత్రాలు అందాయన్న అభియోగంలో జిల్లాకు చెందిన ఐదుగురు ఉన్నారని ‘సీఐడీ’ తేల్చినట్లు సమాచారం. నగరంలోని మోతీనగర్‌లో నివాసముంటున్న మార్కెట్ వ్యాపారి కుమారుడితోపాటు, నగరానికి సమీపంలో ఉన్న గ్రామానికి(ఖమ్మంరూరల్ మండలం) చెందిన విద్యార్థి, కొణిజర్ల మండలానికి చెందిన మరో విద్యార్థికి సంబంధించిన వివరాలతోపాటు ఇంటర్మీడియట్ ప్రథమసంవత్సరం, ద్వితీయ సంవత్సరంలో సాధించిన మార్కులు, ఏపీ ఎంసెట్‌లో విద్యార్థి ర్యాంకు మొదలైన విషయాలను సేకరించినట్లు తెలిసింది. ఖమ్మం నగరానికి చెందిన మరో ఇద్దరికి సంబంధించిన వివరాలను కూడా సీఐడీ అధికారులు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. తల్లిదండ్రుల మొబైల్ డేటా ఆధారంగా ఎంసెట్–2కు ముందు 20 రోజుల నుంచి పరీక్ష జరిగిన నాటి వరకు ఇన్కమింగ్, ఔట్‌గోయింగ్ కాల్స్, టెలిఫోన్ సంభాషణను సీఐడీ అధికారులు తీసుకున్నట్లు సమాచారం. అదేవిధంగా వారి బ్యాంక్ అకౌంట్ నుంచి ఎప్పుడు.. ఎన్ని డబ్బులు డ్రా చేశారు. ఆన్లైన్ అకౌంట్ నుంచి ఏఏ అకౌంట్లకు డబ్బులు పంపించారనే విషయం అధికారులు పరిశీలిస్తున్నట్లు తెలిసింది. వీటి ఆధారంగా జిల్లాకు చెందిన ఐదుగురు విద్యార్థులకు ఎంసెట్–2 ప్రశ్నపత్రాలు ముందుగానే వచ్చాయని నిర్ధారించినట్లు తెలిసింది. ఇందులో భాగంగానే మెరిట్ ర్యాంకులు సాధించిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులను హైదరాబాద్‌కు పిలిపించుకొని విచారించినట్లు సమాచారం. ఎక్కడ చదువుకున్నారు..? ఎంసెట్ కోచింగ్ ఎక్కడ తీసుకున్నారు..? పరీక్ష కేంద్రాలు ఎక్కడ.. పరీక్ష ఎలా రాశారని.. కోచింగ్ సెంటర్లలో నిర్వహించిన పరీక్షల్లో ఎన్ని మార్కులు వచ్చాయి.. అనే విషయాలను విద్యార్థులను అడిగినట్లు తెలిసింది. తల్లిదండ్రుల విచారణలో వారి వృత్తి, ఆర్థిక పరిస్థితులు, పిల్లలను డాక్టర్లుగా చూడాలనే కోరిక మొదలైన అంశాలపై ప్రశ్నలు వేసి సమాధానాలు తెలుసుకున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని మరికొన్ని కోణాల్లో పరిశీలించి పూర్తిస్థాయిలో సమాచారం సేకరించి అరెస్ట్ చేసేందుకు సర్వం సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. ఏ నిమిషంలోనైనా అరెస్ట్‌లు.. ఎంసెట్–2 లీకేజీకి లక్షల రూపాయల ముడుపులు చెల్లించి.. పరీక్షకు ముందే ప్రశ్నపత్రాలను సేకరించడం, బెంగుళూరు, ముంబై వంటి నగరాలకు వెళ్లి ప్రిపేర్ అయ్యి నేరుగా కేంద్రాలకు వచ్చి పరీక్ష రాసి.. 1000 లోపు ర్యాంకు సాధించిన విద్యార్థుల తల్లిదండ్రులను ఏ నిమిషంలోనైనా అరెస్ట్‌చేసే అవకాశం ఉన్నట్లు తెలిసింది. దీంతో సీఐడీ అధికారులకు ఏ విధమైన సమాచారం అందింది.. ఎవరిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు. వారి అరెస్ట్‌తో జిల్లాకు చెందిన మరికొందరి పేర్లు బయట పడతాయా..? ఎప్పుడు ఎవరికి ఏ ఉచ్చు బిగుస్తుందోననే ఉత్కంఠ నెలకొంది. -
వైఎస్ఆర్ ఘాట్ వద్ద వైఎస్ జగన్ నివాళులు
-
రోల్ మోడల్ గా 'ట్వంటీ 20'..!
క్రికెట్ లో ఎంతో గుర్తింపు పొందిన ట్వంటీ 20 పేరు... ఇప్పుడు కేరళ పంచాయతీ ఎన్నికల్లోనూ ప్రత్యేక స్థానం సంపాదించింది. గ్రామంలో సమూల మార్పుల కోసం కృషి చేసేందుకు స్థానిక వస్త్ర పరిశ్రమ సభ్యులు.. ట్వంటీ20 పేరున ఎన్నికల్లో నిలిచి.. అత్యధిక మెజార్జీతో గెలిచి.. నూతన అంకానికి తెరతీశారు. ఉత్పాదక రంగంనుంచీ రాజకీయ రంగంలో ప్రవేశించారు. గతంలోని సాంప్రదాయ వస్త్రధారణను సైతం తోసిరాజని హైటెక్ అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. స్థానిక రాజకీయాలు తమ సంస్థ అభివృద్ధికి అడ్డుపడుతుండటంతో.. రాజకీయాలతో ఎటువంటి సంబంధం లేని ఉద్యోగులే సంచలన నిర్ణయం తీసుకొని ఏళ్ళ చరిత్రను తిరగరాశారు. కేరళ ఎర్నాకుళం జిల్లాలోని కిజక్కంబాలమ్ పంచాయితీ ఎన్నికల్లో కోచీ ఆధారిత వస్త్ర తయారీదారీ సంస్థ కైటెక్స్ గ్రూప్ విజయపతాకం ఎగురవేసింది. గ్రామాభివృద్ధే ధ్యేయంగా శాశ్వత ఉద్యోగులు రాజకీయాల్లో అడుగుపెట్టారు. గతంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అధికారంలో ఉన్నపుడు... పంచాయితీ అభివృద్ధికోసం కైటెక్స్ చేపట్టిన ప్రతి ప్రాజెక్ట్ ను అడ్డుకుంది. సెక్షన్ 144 కింద నేషేధాజ్ఞలు విధించి ట్రేడ్ ఫెయిర్ ను బలవంతంగా మూసివేయించింది. ఇటువంటి అనేక కారణాలతోనే ఎన్నికల్లో పోటీకి సిద్ధపడాల్సి వచ్చిందని మాజీ కమ్యూనిస్టు పార్టీ నాయకుడు, కైటెక్స్ మేనేజింగ్ డైరెక్టర్ జాకబ్ చెప్తున్నారు. లేదంటే తమకు రాజకీయాల్లో ప్రవేశించే ఉద్దేశ్యమే లేదని, సామాజిక బాధ్యతగానే గ్రామాభివృద్ధిని కాంక్షిస్తున్నామని సాబు జాకబ్ అంటున్నారు. ట్వంటీ20 అభివృద్ధి మంత్రం ఓటర్లపై భారీ ప్రభావం చూపడంతో మొత్తం పంచాయితీలోని 19 వార్డుల్లో 17 వార్డుల్లో విజయ పథంలో దూసుకుపోయారు. ఈసారి ఓనమ్ పండుగకు ప్రత్యేక ట్రేడ్ ఫెయిర్ నిర్వహిస్తామని, ప్రజలకు వస్తువులను సగం ధరకే అందిస్తామని చెప్తున్నారు. 1968 నుంచి కైటెక్స్ పరిశ్రమ ఎటువంటి ఫిర్యాదులు లేకుండా పనిచేస్తుండగా... ఎల్డీఎఫ్ అధికారంలోని చేదు అనుభవాలే తమను పోటీకి నిలబడేలా చేశాయని జాకబ్ చెప్తున్నారు. యూడీఎఫ్, ఎల్డీఎఫ్ ఆధ్వర్యంలో స్థానికంగా ఎటువంటి అభివృద్ధీ జరగకపోవడంతోనే స్థానికులు తమను గెలిపించారని, ట్వంటీ20 సభ్యుడు, కంపెనీ చిత్రకారుడు శిబు కుమరన్ చెప్తున్నారు. ట్వంటీ20 అధికారంలోకి రాకముందే.. సామాజిక సేవలో భాగంగా సగం ధరకు నిత్యావసర వస్తువులు అదించిందని, నాలుగు వందల ఇళ్ళు, ఐదు వందల టాయిలెట్లు కూడ నిర్మించి ఇచ్చిందని చెప్తున్నారు. దీనికి తోడు రోడ్లు రిపేర్లు చేయించడం, పేదలకు వైద్యం అందించడం వంటి అనేక సేవా కార్యక్రమాలు చేపట్టడంతోనే తమకు స్థానికులు పట్టం కట్టారని చెప్తున్నారు. ముఖ్యంగా గ్రామాన్ని వ్యవసాయంతోపాటు అన్నిరంగాల్లో అభివృద్ధి పరిచేందుకు కృషి చేస్తామని, ఇప్పటికే ట్వంటీ20 అభివృద్ధి పనులకోసం 36 కోట్ల రూపాయలను వెచ్చించడంతోపాటు... వచ్చే ఐదేళ్ళలో మొత్తం 350 కోట్ల రూపాయలను వెచ్చించేందుకు ప్లాన్ చేస్తోందన్నారు. కైటెక్స్ గ్రూప్, ఇతర కార్పొరేట్ సంస్థలు సామాజిక బాధ్యతగా నిధులు వెచ్చించేందుకు సిద్ధంగా ఉన్నాయని, అలాగే రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా వచ్చే నిధులను వినియోగిస్తామని జాకబ్ చెప్తున్నారు. నిధులను సక్రమంగా వినియోగించడానికి గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉన్నవారిని ప్రత్యేకంగా టీమ్ లో ఉంచామని చెప్తున్నారు. ఎన్నికైన పంచాయితీ అధికారులకు నెలసరి వేతనం 3,500 రూపాయలు మాత్రమే ఉందని, గ్రామీణ ఉపాధిహామీ పథకంలో కార్మికులకు చెల్లించే వేతనాల కంటే అధికారులకు అన్యాయంగా ఉండటంతో వారి వేతనం 15 వేలకు పెంచుతున్నట్లు ఆయన వెల్లడించారు. ఇది అధికారులు అవినీతికి పాల్పడకుండా ఉండేందుకు తోడ్పడుతుందని ఆశిస్తున్నారు. పంచాయితీ అధికారులు ఫంక్షన్లకు, ప్రారంభోత్సవాలకు అనవసరంగా సమయం వృధా చేయకుండా..పంచాయితీ కార్యాలయంలో కొంత సమయాన్ని కేటాయించి... అభివృద్ధికోసం పాటుపడాలని ట్వంటీ20 సభ్యులకు నిబంధనలను విధించారు. వారికి సహకరించేందుకు సామాజిక కార్యకర్తలను కూడ ఏర్పాటు చేశారు. కిజక్కంబాలమ్ పంచాయితీ చేపట్టిన ప్రత్యేకాభివృద్ధి పై రాష్ట్రంలోని పంచాయితీలన్నీ దృష్టి సారిస్తున్నాయి. ఈ గ్రామాన్ని రోల్ మోడల్ గా తీసుకొనేందుకు ఆసక్తి చూపుతున్నాయి. అంతేకాక యూఎస్ ఆధారిత వ్యాపార సంస్థలు సైతం... కేరళలోని పది పంచాయితీలను దత్తత తీసుకొనేందుకు సంసిద్ధత వ్యక్తం చేస్తున్నాయి. అయితే డబ్బు, ప్రతిభ ఉన్నంత మాత్రాన అభివృద్ధి సాధ్యం కాదని, ప్రజల అంకిత భావంకూడ ఎంతో అవసరమని జాకబ్ చెప్తున్నారు. -
ఎంపీ సమక్షంలో తెలుగు తమ్ముళ్ల తన్నులాట!
-
ఆస్పత్రిలో10 మంది క్రికెటర్లు
దక్షిణాఫ్రికా ‘ఎ’ జట్టుకు అనారోగ్యం చెన్నై: పాపం దక్షిణాఫ్రికా ‘ఎ’ జట్టుకు ఎంత కష్టం వచ్చింది! ఒకరు కాదు ఇద్దరు కాదు...ఏకంగా పది మంది సభ్యులు ఒక్కసారే అనారోగ్యం బారిన పడ్డారు. చెన్నైలో వాతావరణం ఒక కారణం కాగా, ముందు రోజు రాత్రి తీసుకున్న భోజనం పడక చాలా మంది అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం 10 మంది ఆటగాళ్లు స్థానిక అపోలో ఆస్పత్రిలో ఉన్నారని దక్షిణాఫ్రికా బోర్డు అధికారిక ప్రకటన చేసింది. భారత్‌తో వన్డేలో సెంచరీ చేసి 25 ఓవర్ల పాటు ఫీల్డింగ్ చేసిన డి కాక్ కూడా ఒక్కసారిగా ఆరోగ్యం దెబ్బ తినడంతో హాస్పిటల్ చేరాడు. అంతకు ముందు స్వల్ప అనారోగ్యంతో మ్యాచ్ నుంచి దూరంగా ఉన్న ముగ్గురు క్రికెటర్లు తప్పనిసరి పరిస్థితిలో ఎవరూ అందుబాటులో లేక మైదానంలో దిగాల్సి వచ్చింది. ఈ కారణంగా తాము షెడ్యూల్ ప్రకారం సోమవారం ఆసీస్‌తో మ్యాచ్ ఆడలేమని వారు విజ్ఞప్తి చేయడంతో...ఆసీస్‌తో భారత్ బరిలోకి దిగేందుకు కోచ్ ద్రవిడ్ అంగీకరించారు. చివరకు ఆటగాళ్లు సరిపోక భారత్‌తో మ్యాచ్‌లో భారత ఆటగాడు మన్దీప్ సింగ్ సౌతాఫ్రికా జెర్సీతో ఫీల్డింగ్ చేయడం విశేషం! -
పనితీరు మార్చుకోవాలి
అధికారుల తీరుపై సభ్యుల ఆగ్రహంపనితీరు మార్చుకోవాలని సూచనసమావేశాలకు సమాచారం, అవగాహనతో రావాలి రారుతీ ట్రాక్టర్లపై కోర్టుకు వెళ్లేందుకు సిద్ధం వాడీవేడీగా జెడ్పీ సర్వసభ్య సమావేశం జెడ్పీ సర్వసభ్య సమావేశం గరం గరంగా సాగింది.. అధికారుల పనితీరుపై సభ్యులు అసహనం వ్యక్తం చేశారు.. యూంత్రీకరణ అమలులో అక్రమాలు, అవకతవకలు చోటు చేసుకుంటున్నాయని జెడ్పీటీసీలు మండిపడ్డారు.. కరువు, బ్యాంకు రుణాలు, పంట నష్టం అంచనాపై అధికారులను నిలదీశారు. హన్మకొండలోని జెడ్పీ సమావేశ మం దిరంలో శుక్రవారం జెడ్పీ చైర్ పర్సన్ పద్మ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఇందులో ప్రధానంగా వ్యవసాయం, నీటిపారుదల, ఆర్డబ్ల్యూఎస్, ఆర్అండ్ బీ, పీఆర్, విద్య, వైద్య ఆరోగ్య శాఖ, హరితహారంపై సమీక్షించారు. - సమావేశాలకు పూర్తి సమాచారం, అవగాహనతో రావాలని అధికారులకు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ఆదేశం - రాయితీ ట్రాక్టర్లలో అవకతవకలపై కోర్టుకు వెళ్లేందుకైనా సిద్ధమన్న జెడ్పీ వైస్‌చైర్మన్ మురళీధర్ హన్మకొండ : జిల్లాలోని అధికారుల పనితీరు సరిగా లేదని సభ్యులు అసహనం వ్యక్తం చేశారు. పనితీరు మార్చుకోవాలని సూచించారు. సమావేశాలకు పూర్తి సమాచారంతో రాకపోవడంతోపాటు సభ్యులు అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పకపోవడంపై సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. హన్మకొండలోని జెడ్పీ సమావేశ మందిరంలో జెడ్పీ చైర్పర్సన్ గద్దల పద్మ అధ్యక్షతన శుక్రవారం సర్వసభ్య సమావేశం జరిగింది. సమావేశంలో వ్యవసాయ శాఖ, నీటిపారుదల శాఖ, ఆర్డబ్ల్యూఎస్, ఆర్అండ్బీ, పీఆర్, విద్య, వైద్య ఆరోగ్య శాఖలు, హరితాహారంపై సమీక్షించారు. వ్యవసాయ శాఖపై జరిగిన చర్చలో ఆ శాఖ ద్వారా అమలవుతున్న యాంత్రీకరణ అమలలో అక్రమాలు, అవకతవకలు జరుగుతున్నాయని, జెడ్పీటీసీ సభ్యులకు కనీస సమాచారం ఇవ్వడం లేదని మండిపడ్డారు. జిల్లాకు 135 ట్రాక్టర్లు రాయితీపై మంజూరైతే కనీసం ప్రచారం చేయడం లేదని, 135 ట్రాక్టర్లకు 135 దరఖాస్తులే వస్తాయా అని జెడ్పీ వైస్‌చైర్మన్ చెట్టుపల్లి మురళీధర్ నిలదీశారు. రైతులకు రాయితీపై ట్రాక్టర్లు ఇస్తున్నామని ఆ శాఖ అధికారులు కనీస సమాచారం ఇవ్వలేదని, ఇటీవల జరిగిన స్టాండింగ్ కమిటీలో ఈ అంశాన్ని లేవనెత్తిపుడు సమాచారం అందించని ఏడీఏ, ఏఓల పై చర్య తీసుకుంటామని చెప్పారని, ఏ చర్య తీసుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. నర్సంపేటలో రాత్రికి రాత్రే దరఖాస్తు తీసుకుని ట్రాక్టర్ కేటాయించారన్నారు. రాయితీ ట్రాక్టర్లలో జరిగిన గోల్‌మాల్‌పై చర్యలు తీసుకోకపోతే కోర్టుకు వెళ్లడానికైనా వెనుకాడనని హెచ్చరించారు. స్పందించిన కలెక్టర్ వాకాటి కరుణ మాట్లాడుతూ రాయితీ ట్రాక్టర్ల కేటాయింపుపై విచారణ జరిపించామని, ట్రాక్టర్లు తీసుకున్న రైతులంతా అర్హులేనని తేలిందన్నారు. దీంతో సంతృప్తి చెందని సభ్యులు పథకం అమలు తీరు సరిగా లేదన్నారు. దీంతో కలెక్టర్ పూర్తి స్థాయి విచారణ జరిపిస్తానన్నారు. గణపుణం జెడ్పీటీసీ సభ్యుడు, టీడీపీ జెడ్పీ ఫ్లోర్‌లీడర్ శివశంకర్ మాట్లాడుతూ తమ మండలంలో రెండు ట్రాక్టర్లు కేటాయిస్తే ఇందులో అర్హులు ఎవరు లేరన్నారు. ఒకరైతే హన్మకొండలో నివాసముంటూ వ్యాపారం చేసుకుంటున్నారని, రైతు కాని వ్యాపారికి ఎలా ఇస్తారని ప్రశ్నించారు. మహబూబాబాద్ జెడ్పీటీసీ సభ్యుడు, కాంగ్రెస్ జెడ్పీ ఫ్లోర్‌లీడర్ వెంకన్న మాట్లాడుతూ రాయితీ యంత్రాలు రైతులకు చేరడం లేదన్నారు. జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించాలని కోరుతున్న ఎందుకు జాప్యం జరుగుతుందని నిలదీశారు. స్పందించిన కలెక్టర్ కరుణ మాట్లాడుతూ బ్యాంకర్లతో తరచూ సమావేశాలు ఏర్పాటు చేసి రైతులకు రుణాలివ్వాలని చెపుతున్నామన్నారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలకు నష్టపోయిన పంటల అంచనా జరుగుతుందన్నారు. వారం రోజుల్లో పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదిక పంపుతామన్నారు. వ్యవసాయ శాఖ ఇన్చార్జి జేడీఏ గంగారాం మాట్లాడుతూ ఖరీఫ్‌లో ఎరువులు, విత్తనాలు రైతులకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ నెల 15వ తేదీ నుంచి జరగాల్సిన రైతు చైత్యన యాత్రలు వాయిదా పడ్డాయన్నారు. మిషన్ కాకతీయలో జరుగుతున్న చెరువుల పునరుద్ధరణ పనులు నాణ్యతగా ఉండేలా చూడాలని ఎమ్మెల్యేలు రెడ్యానాయక్, శంకర్‌నాయక్ సూచించారు. శిఖం హద్దులు ఏర్పాటు చేయాలన్నారు. చెరువులకు రివిట్మెంట్ ఉండేలా చూడాలని ఎమ్మె ల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి సూచించారు. చెరువులు పునరుద్ధరించగానే సరిపోదని జనగామ ప్రాంత చెరువులను గోదావరి జలాలతో నింపాలని, అప్పుడే సార్థకత ఉంటుందన్నారు. రాజ్యసభ సభ్యురాలు గుండు సుధారాణి మాట్లాడుతూ చెరువుల ఎఫ్టీఎల్ హద్దులు ఎందుకు నిర్ణయించడం లేదని, దీంతో చెరువులు అన్యాక్రాంతం అవుతున్నాయన్నారు. స్పందించిన కలెక్టర్ కరుణ సర్వేయర్ల కొరత ఉందని, థర్డ్ పార్టీ ద్వారా ఎఫ్టీఎల్ హద్దులు నిర్ణయించే పనిని చేపట్టనున్నట్లు చెప్పారు. రెవెన్యూ, నీటిపారుదల అధికారులు సమన్వయంతో హద్దుల ఏర్పాటు జరుగుతందన్నారు. చెరువుల మరమ్మతు పనుల్లో అక్రమాలు జరుగుతున్న అధికారులు పట్టించుకోవడం లేదని ఏటూరునాగారం జెడ్పీటీసీ సభ్యురాలు వలియాబీ అన్నారు. జిల్లాలో తాగునీటి ఎద్దడి ఏర్పడకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ కరుణ చెప్పారు. ఎంపీ బూర నర్సయ్యగౌడ్ మాట్లాడుతూ మహిళలు బిందెలు పట్టుకుని రోడ్డెక్కకుండా ముందుగానే అన్నీ చర్యలను ప్రభుత్వం తీసుకుందన్నారు. నీటి ఎద్దడి నివారణకు నిధులు మంజూరు చేసిందన్నారు. ఆర్అండ్బీ, నేషనల్ హైవే, పీఆర్ అధికారులు సరైన సమాచారంతో రాకపోవడంతో ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి అసహనం వ్యక్తం చేశారు. ఇక ముందు సమావేశాలకు వచ్చేటపుడు శాఖ, చేపట్టిన పనులపై అవగాహన ఏర్పరచుకుని రావాలన్నారు. సభ్యులు అడిగిన వెంటనే సమాధానం చెప్పాలని సూచించారు. అధికారులు సక్రమంగా పని చేయాలని సూచి స్తున్నా.. అగ్రిమెంట్ సమయంలోనే పర్సంటేజీలు తీసుకుంటున్నారని సభ్యులు ఆరోపించారు. భీమారం, మడికొండ చెరువులను రిజర్వాయర్లుగా అభివృద్ది చేయాలని, తద్వారా నగర ప్రజలకు తాగునీరు సరఫరా చేసేందుకు దోహదపడుతాయని ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. ప్రాథమిక అరోగ్య కేంద్రాల్లో డాక్టర్లు అందుబాటులో ఉండడం లేదని, కనీసం మండల ప్రజాపరిషత్ సమావేశాలకు కూడా రావడం లేదని సభ్యులు వైద్యాధికారులు తీరుపై మండిపడ్డారు. ఎంపీ సీతారాంనాయక్ మాట్లాడుతూ అధికారులు పని తీరు మెరుగుపరచుకోవాలని సూచించారు. -
ఒక్క చోటే పోటీకి అవకాశం!
న్యూఢిల్లీ: ఎన్నికల్లో అభ్యర్థులు కేవలం ఒక్క చోట మాత్రమే పోటీ చేసేందుకు అవకాశముండాలని న్యాయ కమిషన్ సిఫారసు చేసింది. అంతేగాకుండా ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులు పోటీ చేయకుండా నిబంధనలు ఉండాలని ప్రతిపాదించింది. దాంతోపాటు ‘పెయిడ్ న్యూస్’పైనా కఠినంగా వ్యవహరించాలని.. వార్తలకు చెల్లించడంతో పాటు తీసుకోవడాన్నీ నేరంగా పరిగణించాలని సూచించింది. ఎన్నికల సంస్కరణలపై తమ ప్రతిపాదనలతో కూడిన రెండో నివేదికను న్యాయ కమిషన్ గురువారం సమర్పించింది. కమిషన్ చైర్మన్ రిటైర్డ్ జస్టిస్ ఎ.పి. షా దీనికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. న్యాయ కమిషన్ సూచనలు.. చెల్లింపు వార్తల (పెయిడ్ న్యూస్)పై కఠినంగా వ్యవహరించాలి. వార్తల కోసం డబ్బు ఇవ్వడంతో పాటు తీసుకోవడాన్ని కూడా ప్రజాప్రాతినిధ్య చట్టం కింద చేర్చి.. కఠిన శిక్షలను విధించాలి. వార్తల కోసం సొమ్ము చెల్లించే అభ్యర్థులను అనర్హులుగా ప్రకటించాలి. ప్రధాన ఎన్నికల కమిషనర్, ఎన్నికల కమిషనర్ల నియామకానికి ఒక కొలీజియం ఏర్పాటు చేసి, దాని ద్వారానే భర్తీ చేయాలి. లోక్‌సభ, శాసనసభల కాలపరిమితి ముగియడానికి ఆరు నెలల ముందు నుంచే ప్రభుత్వ ప్రకటనలపై కఠినమైన నియంత్రణ, నిషేధం విధించాలి. ఎన్నికల వ్యయం లెక్కలను సమర్పించని అభ్యర్థులపై విధిస్తున్న నిషేధాన్ని మూడేళ్ల నుంచి ఐదేళ్లకు పెంచాలి. తద్వారా తర్వాతి ఎన్నికల్లో వారు పోటీ చేసేందుకు అవకాశం ఉండదు. రాజకీయ పార్టీలు ఎన్నికల వ్యయం లెక్కలు సమర్పించకపోతే.. పన్ను ప్రయోజనాలను తొలగించడంతో పాటు జరిమానాలు కూడా విధించాలి. రోజుకు రూ. 25 వేల జరిమానాతో పాటు 90 రోజుల పాటు అలాగే ఉంటే పార్టీల గుర్తింపును రద్దుచేయాలి. ఎన్నికల వ్యయానికి సంబంధించి ప్రస్తుతం అభ్యర్థులు నామినేషన్ వేసిన నాటి నుంచి ఫలితాల విడుదల తేదీ వరకు లెక్కిస్తున్నారు... ఈ వ్యయ లెక్కింపు గడువును ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన నాటి నుంచి ఫలితాల వెల్లడి తేదీ వరకు పెంచాలి. వివిధ కంపెనీలు రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చే నిర్ణయాన్ని... ఆయా కంపెనీల డెరైక్టర్ల బోర్డులో కాకుండా, ఏటా జరిగే సభ్యులందరి సాధారణ సమావేశంలో తీర్మానం ద్వారా తీసుకొనేలా కంపెనీల చట్టాన్ని సవరించాలి. దేశంలో ప్రస్తుతమున్న లోక్‌సభ సీట్ల సంఖ్యను మరింత పెంచాలి. హైకోర్టుల్లో ఎన్నికల పిటిషన్లపై విచారణను వేగంగా పూర్తి చేయాలి. ఇందుకోసం హైకోర్టుల్లో ప్రత్యేకంగా బెంచ్‌లను ఏర్పాటు చేయవచ్చు. వీటిలో ఒకరు లేదా ఎక్కువ సంఖ్యలో న్యాయమూర్తులను నియమించడంపై ప్రధాన న్యాయమూర్తి నిర్ణయం తీసుకుంటారు. ఎన్నికల్లో ‘నోటా (పై అభ్యర్థులెవరూ కాదు)’ను మరింతగా విస్తృతం చేసి, దానికి ఎక్కువ ఓట్లు వస్తే ఎన్నికను రద్దు చేయాలన్న యోచన వద్దని న్యాయకమిషన్ సూచించింది. ఇక గెలిచినవారిని తిరిగి రీకాల్ (రైట్ టు రీకాల్) చేసే అవకాశాన్ని కల్పించవలసిన అవసరం లేదని స్పష్టం చేసింది. దాని వల్ల అస్థిరత, గందరగోళం నెలకొంటుందని పేర్కొంది. ఎన్నికల్లో అభ్యర్థులెవరైనా కేవలం ఒక్క నియోజకవర్గంలో మాత్రమే పోటీ చేసేందుకు అవకాశం ఉండాలి. దీనివల్ల ఓటర్లకు ఇబ్బందులు, ప్రభుత్వానికి అనవసరపు వ్యయం, శ్రమ తగ్గుతాయి. ఈ మేరకు ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 33(7)కు సవరణలు చేయాలి. ఎన్నికల్లో పోటీచేస్తున్నవారిలో డమ్మీ అభ్యర్థులే ఎక్కువ. ప్రధాన అభ్యర్థుల పేర్ల పోలికతో ఉండి ఓటర్లను తికమకపెట్టేందుకు స్వతంత్రులను పోటీ చేయిస్తున్నారు. కాబట్టి స్వతంత్రులకు పోటీ అవకాశం ఇవ్వరాదు. ఎవరైనా సీరియస్ అభ్యర్థులు ఉంటే వారు ఈసీ వద్ద ఓ పార్టీని రిజిస్టర్ చేసుకుని పోటీ చేయవచ్చు. ఫిరాయింపులకు పాల్పడిన ఎంపీలు, ఎమ్మెల్యేలపై అనర్హత వేటుపై నిర్ణయాధికారాన్ని రాష్ట్రపతి, గవర్నర్లకు అప్పగించాలి. వారు ఈసీ సలహా మేరకు నిర్ణయం తీసుకుంటారు కాబట్టి వాస్తవాధికారం ఎన్నికల సంఘానికే ఉన్నట్లవుతుంది. ఇది సభల స్పీకర్ల, చైర్మన్ల నిష్పాక్షికత్వాన్ని పెంచుతుంది. నిర్బంధ ఓటింగ్ అమలు యోచన సరికాదు. ఇది అసాధ్యం, విపరీతమైన వ్యయం అవుతుంది. నిర్బంధ ఓటింగ్ అప్రజాస్వామికమనే విమర్శలు వస్తాయి. అంతేగాక ఈ విధానం వల్ల ప్రజల్లో అవగాహన, రాజకీయ చైతన్యం పెంపొందించడం అసాధ్యం. -
ప్రభు.. కరుణించేనా..?
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : రాష్ట్రంలోనే అతిపెద్ద జిల్లా అయిన మహబూబ్‌నగర్‌కు కేంద్ర రైల్వే బడ్జెట్లో ప్రతి ఏడాదీ రిక్తహస్తమే ఎదురవుతోంది. జిల్లానుంచి ప్రాతి నిధ్యం వహిస్తున్న పార్లమెంటు సభ్యులు, ప్రజా ప్రతినిధులు, ప్రజల నుంచి వెళ్తున్న ప్రతిపాదనలు బుట్టదాఖలవుతున్నాయి. ఫలక్‌నుమా మార్గం డబ్లింగ్, విద్యుదీకరణ, దేవరకద్ర-మునీరాబాద్ మార్గానికి నిధులు, గద్వాల- మాచర్ల రైలుమార్గం ప్రతిపాదనలకు మోక్షం లభించడం లేదు. నిధులు విడుదలైనా రోడ్డు బ్రిడ్జిల నిర్మాణం ముందుకు సాగడం లేదు. రైల్వే ప్రాజెక్టులు చేపట్టేం దుకు అవసరమైన భూసేకరణతో పాటు ప్రాజెక్టు వ్యయంలో 50శాతం రాష్ట్ర ప్రభుత్వం భరించాలనే నిబంధన కూడా రైలు మార్గాల అభివృద్ధికి ఆటంకంగా మారింది. దేశవ్యాప్తంగా ఇప్పటికే రూ.8లక్షల కోట్లు విలువ చేసే రైల్వే ప్రాజెక్టులు పెండింగులో ఉన్నాయి. వీటిని పూర్తి చేసేందుకు 25 ఏళ్లు పడుతుందని రైల్వేశాఖ అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో కొత్త మార్గాలకు ఆమోదం తెలపడం అనుమానంగానే కనిపిస్తోంది. జిల్లాలో 191 కిలోమీటర్ల రైలు మార్గం ఉండగా ప్రతిరోజూ ప్రయాణికులతో 54 రైళ్లు పరుగులు తీస్తున్నాయి. సుమారు అంతే సంఖ్యలో గూడ్సు రైళ్లు సరుకులను రవాణా చేస్తున్నాయి. మరోవైపు దక్షిణ మధ్య రైల్వే హైదరాబాద్ డివిజన్ పరిధిలో మహబూబ్‌నగర్ అతి పెద్ద రైల్వే స్టేషన్. ప్రతి నెలా సుమారు కోటి రూపాయలు జిల్లా నుంచి రైల్వేకు ఆదాయం సమకూరుతోంది. ఈ నేపథ్యంలో గురువారం కేంద్ర మంత్రి సురేశ్‌ప్రభు ప్రవేశపెట్టే రైల్వే బడ్జెట్ ప్రతిపాదనలపై జిల్లా ప్రజలు కోటి ఆశలు పెట్టుకున్నారు. పట్టాలెక్కని గద్వాల- మాచర్ల కర్ణాటకలోని రాయిచూర్ నుంచి గద్వాల, వనపర్తి, నాగర్‌కర్నూలు, కల్వకుర్తి, అచ్చంపేట, నల్లగొండ జిల్లా దేవరకొండ మీదుగా మాచర్ల వరకు గతంలో నూతన రైల్వే లైనును ప్రతిపాదించారు. 1981లో అప్పటి నాగర్‌కర్నూలు ఎంపీ మల్లు అనంతరాములు ప్రతిపాదన మేరకు సర్వే కూడా జరిగింది. మొదటి దశలో భాగంగా రాయిచూరు నుంచి గద్వాల వరకు 59 కిలోమీటర్ల మేర రైల్వే లైను నిర్మాణం పూర్తయింది. మిగతా పనులు చేపట్టే అంశం ఏటా ప్రతిపాదనలకే పరిమితమవుతోంది. రెండేళ్లుగా జిల్లా ఎంపీలు ఈ లైను నిర్మాణంపై ప్రతిపాదనలు సమర్పిస్తున్నా రైల్వేబడ్జెట్‌లో ప్రస్తావనకు నోచుకోవడం లేదు. బెంగళూరు, ముంబై, సోలాపూర్ తదితర ప్రాంతాలను జిల్లాతో అనుసంధానించే అతి దగ్గరి రైల్వే మార్గం గద్వాల- రాయిచూర్. అయితే లైను నిర్మాణం పూర్తయినా కేవలం రాయిచూర్ వరకు మాత్రమే డెమో రైలు నడుస్తోంది. కలగా ఫలక్‌నుమా డబ్లింగ్ మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని రైల్వేస్టేషన్ మీదుగా ప్రతి రోజు ఎక్స్‌ప్రెస్, సూపర్ ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్లతో కలుపుకొని 54 రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. సింగిల్ లైను ఉండటం, ఎలక్ట్రిఫికేషన్ పూర్తి కాకపోవడంతో జిల్లా మీదుగా ప్రయాణించేందుకు ప్రయాణీకులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. క్రాసింగ్ పేరిట రైళ్లను నిలిపివేస్తుండటంతో గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోంది. రైల్వే స్టేషన్లలో కనీస సౌకర్యాలు లేకపోవడంతో ప్రయాణం మరింత నరకప్రాయమవుతోంది. రద్దీవేళల్లో మహబూబ్‌నగర్, జడ్చర్ల, షాద్‌నగర్ స్టేషన్లలో టికెట్ కౌంటర్ల వద్ద రద్దీతో ప్రయాణీకులు ఇక్కట్లకు గురవుతున్నారు. ఫలక్‌నుమా నుంచి మహబూబ్‌నగర్ వరకు రైల్వే లైను డబ్లింగ్ కోసం 2009-10 బడ్జెట్లో సర్వే కోసం రూ.5 కోట్లు మంజూరయ్యాయి. సర్వే పూర్తయినా డబ్లింగ్ కోసం నిధులు మంజూరు కావడం లేదు. ఆర్ఓబీలు నత్తనడక జిల్లాలో 101 రైల్వే క్రాసింగులకు గాను గత యేడాది జూలై వరకు 60చోట్ల మాత్రమే గేట్లకు కాపలా ఉంది. సమీప గ్రామాల ప్రజలు ఈ క్రాసింగుల మీదుగా ప్రతీరోజూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పట్టాలు దాటుతున్నారు. మెదక్ జిల్లా మాసాయిపేట స్కూలు బస్సు ఘటన నేపథ్యంలో ఆరు నెలల కాలంలో చాలాచోట్ల యుద్ధప్రాతిపదికన అండర్ బ్రిడ్జిలు, కాపలా గేట్లు ఏర్పాటు చేశారు. కాగా కాపలా వుండే గేట్ల వద్ద రద్దీని దృష్టిలో పెట్టుకుని పట్టాల మీదుగా రోడ్ ఓవర్ బ్రిడ్జిలు నిర్మించాలని గతంలో ప్రతిపాదించారు. అప్పన్నపల్లి, గద్వాల, జడ్చర్ల, దేవరకద్ర రైల్వే క్రాసింగ్‌ల వద్ద రోడ్డ ఓవర్‌బ్రిడ్జి నిర్మాణానికి కేంద్రం, భూసేకరణకు రాష్ట్ర ప్రభుత్వాంలు గతంలో నిధులు కూడా మంజూరు చేశాయి. అయితే రూ.22కోట్ల వ్యయంతో చేపట్టిన అప్పన్నపల్లి బ్రిడ్జి నిర్మాణ పనులు నత్తనడకన సాగి ఇటీవలే ప్రారంభానికి నోచుకుంది. 2008లో నిధులు మంజూరైనా జడ్చర్లలో నేటికీ పనులు ప్రారంభం కాలేదు. దేవరకద్రలో ఇప్పుడిప్పుడే సన్నాహాలు ప్రారంభించగా, గద్వాలలో పిల్లర్ల స్థాయిలో పనులు జరుగుతున్నాయి. -
నేత్రపర్వంగా ‘మూలస్థానేశ్వరుని’ రథోత్సవం
నెల్లూరు (బృందావనం): మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం మూలాపేటలో కొలువుదీరిన భువనేశ్వరి సమేత మూలస్థానేశ్వర స్వామి రథోత్సవం నేత్రపర్వంగా జరిగింది. ఆది దంపతులు కల్యాణోత్సవం అనంతరం ఓం నమఃశివాయ.. హరహర మహదేవ శంభో...శంకర.. పాహిమాం.. పాహిమాం.. అంటూ తన్మయత్వంతో భక్తుల నామస్మరణ, మేళతాళాలు, భాజభజంత్రీలు, తప్పెట్లు, బాణసంచా సందడి, యువకుల కేరింతల రథోత్సవం వేడుకగా సాగింది. వివిధ ప్రాంతాల నుంచి హాజరైన భక్తజనం విశేష పుష్పాభరణాలతో కొలువైన పార్వతీ పరమేశ్వరులను దర్శించుకున్నారు. కర్పూర హారతులు సమర్పిస్తూ, కొబ్బరికాయలు, గుమ్మడికాయలు కొడుతూ మొక్కులు తీర్చుకున్నారు. స్వామివార్ల రథోత్సవం మూలాపేట, బ్రాహ్మణవీధి, ఈఎస్‌ఆర్‌ఎం ఉన్నత పాఠశాలవీధి, పొట్టిశ్రీరాములు బొమ్మ, అలంకార్ సెంటర్, రాజావీధి, రావి చెట్టు సెంటర్ మీదుగా దేవస్థానం వరకు. కాగా, 11.30 గంటల సమయంలో మూలాపేటలోని శ్రీవేదసంస్కృత పాఠశాల వద్దకు చేరుకోగా రథచక్రంలో తలెత్తిన స్వల్ప సాంకేతిక లోపంతో 10 నిమిషాల పాటు రథోత్సవం నిలిచింది. రథ చోదకులు, సొప్పవేసేవారు, పర్యవేక్షకులు సరిదిద్దడంతో రథయాత్ర సాఫీగా సాగింది. దేవస్థానం అర్చకులు బాలాజీశర్మ, శ్రీరామకవచం కోటేశ్వరశర్మ, శ్రీశైలం భార్గవశర్మల ఆధ్వర్యంలో వేదపండితులు తొలుత దేవదేవేరులకు స్నపనం, విశేష పూజా కార్యక్రమాలు, నిత్యహోమం, శాంతి, పూర్ణాహుతి తదితర కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. స్వామివారికి విశేష అలంకారం చేసి రథంలో కొలువుదీర్చారు. ఉభయకర్తలుగా శ్రీశైలం దేవస్థానం మాజీ చైర్మన్, ప్రముఖ కాంట్రాక్టర్ ఆల్తూరు ఆదినారాయణరెడ్డి, సులోచనమ్మ దంపతులు వ్యవహరించారు. కార్యక్రమాలను ఆలయ ఈఓ కోవూరు జనార్దన్‌రెడ్డి, మాజీ చైర్మన్ ఆల్తూరు గిరీష్‌కుమార్‌రెడ్డి, ధర్మకర్తల మండలి మాజీ సభ్యులు నారపనేని శ్రీనివాసులు, భూపతి విజయకుమార్, డేగా జనార్దన్‌రెడ్డి, విజయలక్ష్మి, కేవీఆర్ విజయరెడ్డి తదితరులు పర్యవేక్షించారు. రథోత్సవంలో ఎమ్మెల్యే అనిల్‌కుమార్ రథోత్సవానికి ముందు జరిగిన పూజా కార్యక్రమాల్లో నెల్లూరు నగర ఎమ్మెల్యే డాక్టర్ పోలుబోయిన అనిల్‌కుమార్‌యాదవ్ పాల్గొన్నారు. స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. తొలుత ఆలయంలో భువనేశ్వరి సమేత మూలస్థానేశ్వరుని దర్శించుకున్నారు. ఎమ్మెల్యే అనిల్‌ను ఆలయ అధికారులు సంప్రదాయబద్ధంగా స్వాగతించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ పరమేశ్వరుడు ప్రజలందరికీ అష్టైశ్వర్యాలను,సుఖశాంతులను ప్రసాదించాలని వేడుకున్నట్లు వివరించారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో జరుగుతున్న రథోత్సవంలో పాల్గొనడం ఎంతో ఆనందం కలిగిస్తోందన్నారు. కార్యక్రమంలో ఫ్లోర్‌లీడర్ రూప్‌కుమార్‌యాదవ్, కార్పొరేటర్లు గోగుల నాగరాజు, ఓబిలి రవిచంద్ర, ఊటుకూరు మాధవయ్య, ఎండీ ఖలీల్‌అహ్మద్, వైఎస్సార్సీపీ నాయకులు మురళీకృష్ణయాదవ్, వందవాసి రంగ, కుంచాల శ్రీనివాసులు, దార్ల వెంకటేశ్వర్లు, ఎ.జనార్దన్‌రెడ్డి, వడ్డమూడి చంద్ర, సతీష్, నవీన్ పాల్గొన్నారు. కనువిందుగా అన్నపూర్ణ సమేత నీలకంఠేశ్వరస్వామి నగరోత్సవం మూలాపేటలో కొలువైన అన్నపూర్ణ సమేత నీలకంఠేశ్వరస్వామివారు చిరురథంపై నగరోత్సవం చేశారు .కనువిందుగా ఈ కార్యక్రమం సాగింది. ఆలయ అర్చకులు నందిగామ వెంకటేశ్వరశర్మ ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ కార్యనిర్వాహక కమిటీ చైర్మన్ పెళ్లూరు వెంకటరమణయ్య, శాశ్వత నిత్యనైవేద్య నిర్వాహక కమిటీ చైర్మన్ ఆత్మకూరు మోహన్‌రావు కార్యక్రమాలను పర్యవేక్షించారు. ఉభయకర్తలుగా రేణంగి సత్యనారాయణ, పద్మావతి దంపతులు వ్యవహరించారు. రాత్రి పుణ్యకోటి విమానం(చప్పర ఉత్సవం)నిర్వహించగా ఉభయకర్తలుగా మాలేపాటి మాల్యాద్రి, చిరంజీవమ్మ దంపతులు వ్యవహరించారు. అశ్వవాహనంపై దర్శనమిచ్చిన మీనాక్షీ సమేత సుందరేశ్వరుడు రాజరాజేశ్వరీ దేవస్థానంలో కొలువైన మీనాక్షీ సమేత సుందరేశ్వరస్వామి వారు అశ్వవాహనంపై నగరోత్సవం చేశారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం రుద్రహోమం, పూర్ణాహుతి, తీర్థవాది (త్రిశూల స్నానం), ధ్వజావరోహణం జరిగింది. స్వామివారు శ్రీశైల మల్లికార్జునస్వామి అలంకారంలో దర్శనమిచ్చారు. ఉభయకర్తలుగా నంబూరి మునిరత్నంనాయుడు, కృష్ణకుమారి వ్యవహరించారు. ఆలయ ప్రధాన అర్చకులు తంగిరాల రాధాకృష్ణశర్మ పూజా కార్యక్రమాలను నిర్వహించారు. కార్యక్రమాలను ఆలయ ఈఓ కోదండరామిరెడ్డి, ధర్మకర్త జయరామ్ పర్యవేక్షించారు. స్వామివారికి ఏకాంతసేవ నేడు శుక్రవారం రాత్రి 8 గంటలకు స్వామివారికి ఏకాంత సేవ జరగనుంది. స్వామివారు శ్రీశైల మల్లికార్జునస్వామి అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. -
‘పది’ వేల కష్టాలు
కడప రూరల్ : జిల్లాలోని స్వయం సహాయ మహిళా సంఘాలకు చెందిన సభ్యులు రుణమాఫీ ప్రకటనతో ఇబ్బంది పడుతున్నారు. ఈ సంఘాల్లో ని సభ్యులు దాదాపు 90 శాతం మందికిపైగా నిరుపేదలు,అట్టడుగు వర్గాలకు చెందిన వారు కావడంతో ఇబ్బందులకు లోనవుతున్నారు. జిల్లాలో మొత్తం 34 వేల సంఘాలు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పరిధిలో మొత్తం 34 వేల సంఘాలు ఉన్నాయి. అందులో 3.40 లక్షల మందికిపైగా సభ్యులు ఉంటున్నారు. వీరంతా మొత్తం రూ.619 కోట్లు రుణాలను పొందారు. చంద్రబాబునాయుడు ప్రకటించిన రుణమాఫీ పరిధిలోకి మొత్తం 29,436 సంఘాలు వచ్చాయి. మొదట చంద్రబాబునాయుడు రుణమంతా మాఫీ చేస్తామని ప్రకటించారు. ఆ ప్రకారమైతే మొత్తం రూ.619 కోట్లు మాఫీ కావాల్సి ఉంది. కాగా రుణ అర్హత పరిధిలోకి 29,436 సంఘాలు వచ్చాయి. అందులో 2.9 లక్షలకు పైగా సభ్యులు ఉన్నారు. అనంతరం చంద్రబాబు ఒక్కో సభ్యురాలికి రూ. 10 వేలు చొప్పున మాత్రమే చెల్లించనున్నట్లు ప్రకటించారు. ఆ ప్రకారమైనా దాదాపు రూ. 294.36 కోట్లను అర్హులైన సభ్యులకు అందించాల్సి ఉంది. ఖాతాల వివరాలు పంపిన డీఆర్డీఏ గడిచిన అక్టోబరు చివరిలో పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ఫ్) జిల్లాకు రూ. 10 వేలు చొప్పున ఎంత అవసరమో లెక్క తేల్చింది. ఆ మేరకు దాదాపు రూ. 294.36 కోట్లు అవసరమని గుర్తించింది. ఆ సమాచారాన్ని జిల్లా డీఆర్డీఏకు తెలిపింది. అలాగే సభ్యుల ఖాతాల వివరాలు పంపాలని కోరింది. ఆ ప్రకారం డీఆర్డీఏ అధికారులు సభ్యుల ఖాతాల వివరాలను పంపారు. తర్వాత ఇంతవరకు రూ.10 వేల చెల్లింపు సంగతిని ప్రభుత్వం ఏ రోజు పట్టించుకోకపోవడంతో అయోమయం నెలకొంది. నమ్మి మోసపోయిన సభ్యులు గత ఎన్నికలకు ముందు చంద్రబాబునాయుడు హామీలను గుప్పించారు. రైతులతోపాటు డ్వాక్రా రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించారు. డ్వాక్రా సంఘ సభ్యులు తమ నెలవారి కంతులు సక్రమంగా చెల్లించేవారు. వీరంతా నిరుపేదలు, దినసరి కూలీలైనప్పటికీ తీసుకున్న సొమ్మును సక్రమంగా చెల్లిస్తుండేవారు. ఈ తరుణంలో తెలుగుతమ్ముళ్లు మీరు ఎలాంటి రుణాలు కట్టవద్దని అడ్డు తగలడంతో రుణాలన్నీ పూర్తిగా మాఫీ అవుతాయని ఆశించిన సభ్యులు కంతులను కట్టకుండా నిలిపివేశారు. అనంతరం గద్దెనెక్కిన చంద్రబాబు నా దారి అడ్డదారి అని నిరూపించుకున్నారు. అంతకముందు రుణమంతా మాఫీ అన్న ఆయన ఒక సంఘానికి రూ. లక్ష చొప్పునమాఫీ చేస్తామని ప్రకటించారు. తెల్లవారేసరికి ఒక్కొ సభ్యురాలికి రూ.10 వేలు మాత్రమే చెల్లిస్తామని తెలిపారు. దీంతో అందరూ బిత్తరపోయారు. ఇక బ్యాంకర్లు కూడా తమకు నెలసరి కంతు తప్పనిసరిగా చెల్లించాల్సిందేనంటూ పట్టుబట్టారు. దీంతో సంఘ సభ్యులు గందరగోళంలో పడ్డారు. సక్రమంగా కంతులు చెల్లిస్తూ ఉండి ఉంటే వారిపై పెద్దగా భారం పడేది కాదు. ఒక్కసారిగా పెండింగ్‌లో ఉన్న కంతులను చెల్లించాల్సి రావడంతో పాపం సంఘ సభ్యులు అప్పుల వాళ్లను ఆశ్రయించాల్సి వచ్చింది. మరికొంతమంది ఉన్నకాస్త ముక్కుపుడుకలు, కమ్మలు తదితర బంగారు వస్తువులను కుదవ పెట్టడమో, అమ్ముకోవడమో చేయాల్సి వచ్చింది. రైతు రుణమాఫీనే ఇంతవరకు సక్రమంగా జరగలేదు....ఇక మాపరిస్థితి ఏంటని స్వయం సహాయక సంఘాల మహిళలో అయోమయంలో పడ్డారు. బాబు మాటలు నమ్మి పది వేల కష్టాలు పడుతున్నామని వాపోతున్నారు. త్వరలో మాఫీ ఉండవచ్చు! జిల్లాకు సంబంధించి స్వయం సహాయక మహిళా సభ్యులకు ఒకరికి రూ.10 వేలు చొప్పున మొత్తం రూ. 294 కోట్లకు పైగా వారి ఖాతాల్లో వేస్తామని ప్రభుత్వం చెబుతోంది. త్వరలో ఆ రూ. 10 వేలు సభ్యుల ఖాతాల్లో పడవచ్చు. ప్రభుత్వం నిధులు మంజూరు చేయగానే చర్యలు చేపడతాం. - అనిల్‌కుమార్‌రెడ్డి, ప్రాజెక్టు డెరైక్టర్, డీఆర్డీఏ -
తెగిన ఆ‘దారం’
మగ్గాలపై నేసే వస్త్రాలు బాగుంటాయి. వాటిని వాడడం ఆరోగ్యానికి మంచిదని అందరికీ తెలుసు. కానీ వాటిని మగ్గంపై నేసే క్రమంలో వచ్చే దుమ్ము, ధూళి కార్మికుల టీబీ, దగ్గు, దమ్ము, జ్వరం వంటి అనేక రోగాలు తెచ్చి పెడుతోంది. చేనేత కార్మికులకు హెల్త్‌కార్డులు ఇవ్వాలి. కార్మికుల పిల్లలకు కల్యాణలక్ష్మి పథకం వర్తింపజేయాలి. అప్పుడే చేనేత రంగానికి చేయూతనిచ్చిన ప్రభుత్వంగా పాలకులకు పేరుంటుంది. మాకు బతుకుపై ధీమా ఉంటుంది. - కల్యాణపు కనుక శ్రీను సంఘం ప్రత్యేకతలు కరీంనగర్ మండలం కొత్తపల్లి చేనేత పారిశ్రామికుల సహకార ఉత్పత్తి, విక్రయ సంఘం లిమిటెడ్‌ను 1949లో స్థాపించారు. సభ్యులు గతంలో 700మంది ఉండగా.. ఇప్పుడు ఆ సంఖ్య 215కి పడిపోయింది. అందులో 100 మంది కార్మికులు పనిచేస్తున్నారు. తువ్వాలలు, లుంగీలు, చెద్దర్లు, డోర్ కర్టన్స్, పాలిస్టర్ షర్టింగ్, కాటన్ డ్రెస్ మెటీరియల్స్ ఉత్పత్తి చేస్తారు. సంఘానికి బ్యాంకు అప్పు రూ.15 లక్షలు ఉండగా ఆప్కోనుంచి రూ.30 లక్షలు రావాల్సి ఉంది. వస్త్రాల నిల్వ రూ.45 లక్షలు, నూలు స్టాకు నిల్వ రూ.25 లక్షలు, రంగు రసాయనాల నిల్వ రూ.2 లక్షలు ఉన్నట్లు సమాచారం. రేయింబవళ్లు రెక్కలు ముక్కలు చేసుకుని మగ్గం నేసినా కడుపు నిండని దైన్యం వారిది. బట్టలు నేసి నాగరికతకు రూపం తెచ్చిన నేతన్నల ఒంటిపై చిరుగు బట్టలే దర్శనమిస్తూ వారి దుస్థితికి అద్దం పడుతున్నాయి. పనిచేస్తే డబ్బులతోపాటు బోనస్‌గా వచ్చే రోగాలు ఆ డబ్బునంతా హరిస్తున్నాయి. ప్రభుత్వ పథకాలేవీ వారి జీవితాల్లో వెలుగులు నింపలేకపోతున్నాయి. స్వరాష్ట్రం సిద్ధించినా వారసత్వంగా వచ్చిన వృత్తిపై మమకారం చంపుకోలేక ఇప్పటికీ ఉపాధి కోసం ముంబయి, భీవండి బాటపడుతూ బతుకుబండి లాగిస్తున్నారు. కొత్త ప్రభుత్వంలోనైనా తమ జీవితాలు బాగుపడతాయని ఆశగా ఎదురుచూస్తున్నారు. నేత కార్మికుల సమస్యలు తెలుసుకునేందుకు కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ‘సాక్షి’ తరఫున వీఐపీ రిపోర్టర్‌గా మారి వారి సమస్యలను తెలుసుకున్నారు. కరీంనగర్ మండలం కొత్తపల్లి చేనేత పారిశ్రామికుల సహకార ఉత్పత్తి, విక్రయ సంఘం లిమిటెడ్‌లో కార్మికులతో మాట్లాడారు. -
29న డీపీసీ ఎన్నికలు
కరీంనగర్ సిటీ : జిల్లా ప్రణాళిక కమిటీ(డీపీసీ) ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ముసాయిదా ఓటరు జాబితాను వెల్లడిస్తూ ఎన్నికల అధికారి ఎం.వీరబ్రహ్మయ్య శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. నోటీసును జిల్లా పరిషత్‌తోపాటు అన్ని నగరపాలకసంస్థ, మున్సిపాలిటీ, నగర పంచాయతీల్లో అతికించారు. మొత్తం 28 స్థానాలకు గాను 24 స్థానాలకు 29న ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు ఎన్నికలు జరగనున్నాయి. మిగిలిన 4 స్థానాలను నామినేషన్ పద్ధతిన ప్రభుత్వం భర్తీ చేయనుంది. బీఆర్జీఎఫ్ తదితర కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టనున్న పనుల ప్రణాళిక రూపొందించడం, నిర్వహించడం ఈ కమిటీ విధులు. డీపీసీ ఆమోదం పొందిన తర్వాతే ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపిస్తారు. డీపీసీకి చైర్‌పర్సన్‌గా జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఉంటారు. కమిటీ మెంబర్ సెక్రటరీగా కలెక్టర్ వ్యవహరిస్తారు. వీరిద్దరు, 28 మంది సభ్యులు కలిపి మొత్తం 30 మంది డీపీసీ ఉంటుంది. ఎన్నికల అధికారిగా కలెక్టర్ వీరబ్రహ్మయ్య వ్యవహరిస్తారు. రూరల్ నియోజకవర్గం రూరల్ నియోజకవర్గం పరిధిలో 18 స్థానాలు ఉంటాయి. జిల్లాలోని 57 మంది జెడ్పీటీసీలు ఈ స్థానాల్లో పోటీ చేసేందుకు అర్హులు. అర్బన్ నియోజకవర్గం అర్బన్ నియోజకవర్గం పరిధిలో 6 స్థానాలున్నాయి. జిల్లాలోని నగరపాలకసంస్థ, పురపాలక, నగరపంచాయతీల కార్పొరేటర్లు, కౌన్సిలర్లు ఈ స్థానాలకు పోటీచేయాల్సి ఉంటుంది. జిల్లావ్యాప్తంగా ఉన్న కౌన్సిలర్లు, కార్పొరేటర్లు కలిసి ఈ ఆరుగురిని ఎన్నుకుంటారు. నియోజకవర్గానికొకరు డీపీసీ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక కోసం అధికార టీఆర్ఎస్ పార్టీ కసరత్తు మొదలుపెట్టింది. జెడ్పీలో పూర్తిస్థాయి బలం ఉండడంతో మొత్తం స్థానాలను కైవసం చేసుకొనే దిశగా చర్యలు చేపట్టింది. జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ శనివారం పార్టీ జెడ్పీటీసీలతో తన చాంబర్లో సమావేశమయ్యారు. పోటీకి చాలా మంది ఆశావహులు ముందుకు వస్తుండడంతో నిర్ణయాన్ని పార్టీకే వదిలేయాలని సమావేశం నిర్ణయించింది. కమిటీ సభ్యుల్లో జిల్లా అంతటికి ప్రాధాన్యత ఉండేలా నియోజకవర్గానికొకరు చొప్పున 13 మంది ఉండేలా చూస్తామని ఉమ తెలిపారు. మరో ఐదుగురిని ఐదుగురిని ఏ నియోజకవర్గం నుంచి ఎంపిక చేయాలనేది పార్టీ నిర్ణయిస్తుందన్నారు. నామినేటెడ్‌పై నజర్ జిల్లా ప్రణాళిక కమిటీలో నలుగురు సభ్యులను నేరుగా నియమించే నిబంధన ఉండడంతో వీటిపై అధికార పార్టీ నాయకులు కన్నేశారు. ఇందులో ఒకటి మైనారిటీ కేటాయించగా, ఆ సీటుకు కూడా డిమాండ్ ఏర్పడింది. ముస్లిం, క్రిస్టియన్ వర్గాలకు చెందిన నాయకులు, పార్టీయేతరులు కూడా ఈ స్థానం కేటాయించాలంటూ టీఆర్ఎస్ నేతల చుట్టూ తిరుగుతున్నారు. మిగతా మూడు స్థానాల కోసం జిల్లా మంత్రులు ఈటెల రాజేందర్, కేటీఆర్, జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ ఆశీస్సుల కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. -
ప్రతిపాదనలపై రుసరుస
‘మన జిల్లా-మన ప్రణాళిక’ ఖరారే ప్రధానంగా గురువారం చేపట్టిన జిల్లా పరిషత్ తొలి సమావేశం గరంగరంగా సాగింది. సమస్యల ప్రస్తావన, ప్రభుత్వ తీరును ఎండగడుతూ ప్రతిపక్ష సభ్యుల వాగ్బాణాలు వాతావరణాన్ని వేడెక్కించాయి. తమతో చర్చించకుండానే పనుల ప్రతిపాదనలను రూపొందించడంపై విపక్ష కాంగ్రెస్ జెడ్పీటీసీల రుసరుసలాడగా.. కలెక్టర్ ‘కూల్’గా సమాధానమిచ్చి చల్లబరిచారు. వర్షాభావ పరిస్థితులను ఏకరువు పెడుతూ టీడీపీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ‘కరువు జిల్లా’గా ప్రకటించాలని తీర్మానం చేయాలని పట్టుబట్టడం... దానిని సభ ఆమోదించడం చకచకా సాగిపోయాయి. తొలిసారి సమావేశ మందిరంలోకి అడుగిడిన కొత్త సభ్యులు స్థానిక సమస్యలను ప్రస్తావిస్తూ తడబాట్లతో సాగించిన ప్రసంగాలు ఆసక్తి కలిగించాయి. - వాడివేడిగా సాగిన జిల్లా పరిషత్ తొలి భేటీ - సమస్యలు ఏకరువు పెట్టిన కొత్త సభ్యులు - ‘కరువు జిల్లా’గా తీర్మానం సాక్షి, రంగారెడ్డి జిల్లా : జిల్లా పరిషత్ ప్రత్యేక సర్వసభ్య సమావేశం గురువారం గందరగోళంగా మారింది. తమ ప్రమేయం లేకుండానే ప్రణాళిక తయారు చేయడంపై సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక వర్గానికి చెందిన వారితో ప్రణాళిక తయారు చేయించి సభలో ఆమోదించాలనడం సరికాదంటూ కాంగ్రెస్ జెడ్పీటీసీలు మండిపడ్డారు. సభ్యుల సలహాలు, సూచనలు పరిగణనలోకి తీసుకొని ప్రణాళిక తయారు చేస్తేనే.. పక్కాగా ఉంటుందని, సొంత ఆలోచనలు మానుకోవాలని సూచించారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ పి.సునీతారెడ్డి అధ్యక్షతన జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సర్వసభ్య సమావేశం జరిగింది. సమావేశానికి రవాణాశాఖ మంత్రి పి.మహేందర్‌రెడ్డి, కలెక్టర్ ఎన్.శ్రీధర్ హాజరయ్యారు. ‘మన జిల్లా-మన ప్రణాళిక’ నేపథ్యంలో చేపట్టిన ఈ సమావేశం.. ప్రజా సమస్యలపై కాకుండా పార్టీలపై విమర్శలు, ప్రతివిమర్శలకు దారితీసింది. కనీస సమాచారం ఇవ్వరా? చైర్పర్సన్ సునీతారెడ్డి సమావేశం ప్రధాన ఎజెండాను ప్రస్తావిస్తూ.. రూ.40 కోట్లతో రూపొందించిన ‘జిల్లా ప్రణాళిక’లో లోటుపాట్లను వివరించి సవరణలు సూచించాలని సభ్యులను కోరారు. ఇంతలో కాంగ్రెస్ జెడ్పీటీసీలు ఏనుగు జంగారెడ్డి, బి.మహిపాల్ కల్పించుకుంటూ సభ్యులకు కనీస సమాచారం ఇవ్వకుండా ఏవిధంగా ప్రణాళిక తయారు చేస్తారంటూ మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ప్రణాళికపై ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని నిరసిస్తూ వాగ్వాదానికి దిగారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి రెండు నెలలవుతున్నా ఏ సమస్యకూ పరిష్కారాన్ని చూపలేదని పేర్కొన్నారు. దీంతో మంత్రి మహేందర్‌రెడ్డి జోక్యం చేసుకుంటూ పదేళ్ల కాంగ్రెస్ పాలనలో ఏం అభివృద్ధి చేశారంటూ ఎదురు ప్రశ్నించారు. దీంతో కొంత గందరగోళ వాతావరణం నెలకొంది. ఇంతలో కలెక్టర్ శ్రీధర్ కల్పించుకుని ప్రణాళికపై మాట్లాడాలని, సభ్యుల సందేహాలకు తాను ప్రత్యేకంగా సమాధానం ఇస్తానని పేర్కొనడంతో ప్రశాంత వాతావరణం నెలకొంది. సమస్యల ప్రస్తావన కొత్తగా ఎన్నికైన పాలకవర్గం తొలి భేటీ కావడంతో పలువురు సభ్యులు సమస్యల ప్రస్తావనలో కొంత తడబడ్డారు. సమావేశంలో అన్ని మండలాల ప్రజాప్రతినిధులకు ప్రాధా న్యం ఇచ్చారు. దీంతో దాదాపు అందరు జెడ్పీటీసీలు, ఎంపీపీలు తమ పరిధి సమస్యల్ని సభ దృష్టికి తీసుకొచ్చారు. సభ్యులు పేర్కొన్న సమస్యల్ని నోట్ చేసుకున్న అనంతరం వాటిని మండల, జిల్లాస్థాయి ప్రణాళికలో తగిన ప్రాధాన్యం ఇస్తామని చైర్పర్సన్ సునీతారెడ్డి హామీ ఇచ్చారు. కరువుపై తీర్మానం.. జిల్లాలో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల నేపథ్యంపై దృష్టిసారించి ప్రత్యేక చర్చ జరపాలంటూ ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, యాదయ్య, తీగల కృష్టారెడ్డి సభలో ప్రస్తావిం చారు. గతేడాది పంట నష్టపరిహారం సైతం అందలేదని, రైతులు పలురకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు లేవనెత్తారు. దీంతో కలెక్టర్ స్పందిస్తూ జిల్లాలోని తాజా పరిస్థితిని వివరించాలని జేడీఏ విజయ్‌కుమార్‌ను ఆదేశిం చారు. జిల్లాలో వర్షపాతం, సాగు వివరాలు ప్రకటించగా సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులకు, అధికారుల నివేదికలకు పొంతనలేదని, వర్షపాత వివరాలు తీసుకోవడంలో ఆయా శాఖలు పూర్తిగా విఫలమవుతున్నాయని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. నష్టానికి సంబంధించిన సరైన అంచనాలతో నివేదికలు తయారుచేసి ప్రభుత్వానికి ఇవ్వాలని ఎమ్మెల్యే యాదయ్య సూచించారు. జిల్లాలోని పరిస్థితుల దృష్ట్యా కరువు ప్రాంతంగా ప్రకటించాలంటూ సభ్యులు ఈ సందర్భంగా తీర్మానం చేశారు. సమావేశంలో ఎమ్మెల్సీలు నరేందర్‌రెడ్డి, జనార్దన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు సంజీవరావు, ప్రకాష్‌గౌడ్, కేఎం వివేక్, సుధీర్‌రెడ్డి పాల్గొన్నారు. ‘ప్రణాళిక’పై స్పష్టత ఏదీ? ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి ‘మన జిల్లా- మన ప్రణాళిక’లో భాగంగా జిల్లా యంత్రాంగం తయారుచేసిన ప్రణాళికపై స్పష్టత ఇవ్వాలంటూ ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు. ప్రణాళికలో గ్రామానికి మూడు, మండలానికి పది పనుల చొప్పున ప్రణాళికలో పేర్కొన్నారని, మొత్తంగా వేల కోట్ల రూపాయలతో కూడిన ఈ ప్రణాళిక కేవలం ఏడాది కాలానికా, లేక ఐదేళ్ల ప్రణాళికా అంటూ ప్రశ్నించారు. నిధుల విడుదలపైనా స్పష్టతలేదని, మొత్తంగా ఈ ప్రణాళికకు సంబంధించి నెలకొన్న సందేహాలపై పూర్తిస్థాయి వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కానీ సభ ముగిసే వరకు అటు అధికార యంత్రాంగం, ఇటు జెడ్పీ పాలకవర్గం స్పష్టత ఇవ్వకపోవడం కొసమెరుపు. ఎత్తిపోతల పథకాన్ని ప్రణాళికలో చేర్చాలి: ఎమ్మెల్యే టీఆర్ఆర్ జిల్లాకు కీలకం కానున్న పాలమూరు ఎత్తిపోతల పథకానికి ప్రత్యేకంగా కొంత బడ్జెట్‌ను జిల్లా ప్రణాళికలో పొందుపర్చాలని పరిగి ఎమ్మెల్యే టి.రామ్మోహన్‌రెడ్డి సూచించారు. కనిష్టంగా మూడు వేల కోట్ల రూపాయలు కేటాయించాల న్నారు. అదేవిధంగా అనంతగిరిలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని, హైదరాబాద్- బీజాపూర్ రోడ్డును నాలుగు లైన్లతో ఏర్పాటు చేయాలన్నారు. ఈ అంశాలపై సీఎం కేసీఆర్‌ను కలిసి వివరించే ఏర్పాటు చేయాలని ఆయన కోరగా.. మంత్రి మహేందర్‌రెడ్డి స్పందిస్తూ త్వరలో జిల్లాలోని ప్రజాప్రతినిధులను సీఎం వద్దకు తీసుకెళ్లి భేటీ నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటానన్నారు. -
అనుమతి లేకుండా మణికంఠా లక్కీ స్కీమ్
-
అధికారం ఆమెది.. పెత్తనం ఆయనది
సాక్షి, కర్నూలు: సభలు.. సమావేశాలు.. సదస్సులు.. కార్యక్రమం ఏదైనా సర్పంచ్ ప్రతినిధి దర్శనమిస్తాడు. ఈయన ఎవరని ఆరా తీస్తే ఫలానా సర్పంచ్‌కు భర్త అనో.. తమ్ముడనో.. బంధువనో సమాధానం వస్తుంది. అదేంటి ఆమె ఇళ్లు కదల్లేదా అంటే.. కాదు ఇంటికే పరిమితం చేశారనే విషయం ఆ తర్వాత గానీ తెలిసిరాదు. ఇటీవల ముగిసిన సర్పంచ్ ఎన్నికల్లో జిల్లాలోని 883 పంచాయతీల్లో అత్యధికంగా 486 స్థానాల్లో మహిళలే గెలుపొందారు. ఇందులో సుమారు వంద మందికి పైగా ఏకగ్రీవమయ్యారు. 50 శాతం రిజర్వేషన్ కల్పనతో సాధించిన విజయమిది. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఎన్నికలు పూర్తి కావడమే తరువాయి, వీరి తరఫున రక్త సంబంధీకులు రంగంలోకి దిగిపోయారు. ‘ఆమె’ తరఫున అధికారాన్ని అందిపుచ్చుకొని పెత్తనం చెలాయిస్తున్నారు. ఓర్వకల్లులోని మహిళా ఐక్య సంఘంలో మొదటి విడతగా నిర్వహిస్తున్న సర్పంచ్ల శిక్షణ శిబిరానికి ఆదోని, కౌతాళం, కోసిగి, పెద్దకడబూరు మండలాలకు చెందిన 55 మందిని ఆహ్వానించగా 42 మంది పాల్గొన్నారు. ఆదోని మండలం పెద్దహరివాణం, కౌతాళం మండలలో లింగాలదిన్నె, బాపురం, పొదలకుంట, మరో తొమ్మిది గ్రామాల సర్పంచ్‌లు గైర్హాజరయ్యారు. వీరి స్థానంలో కుటుంబసభ్యులు రావడంపై శిక్షణాధికారి మండిపడ్డారు. కొత్తగా ఎన్నికైన మహిళా సర్పంచ్‌లకు అధికారాలు, విధులు తెలియజేసే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన శిక్షణకు వారినే పంపాల్సి ఉన్నా.. అధిక శాతం కుటుంబ సభ్యులు, బంధువులు హాజరవడం మహిళలు తమకు లభించిన అవకాశాన్ని ఏమాత్రం ఉపయోగించుకుంటున్నారో తెలియజేస్తోంది. గత ఆగస్టు 2న ప్రమాణస్వీకారం చేయడంతో వీరిలో అధిక శాతం మహిళా సర్పంచ్‌లు ఇంటికే పరిమితమయ్యారు. పాలనాపరమైన అనుభవ లేమి నేపథ్యంలో కొంతవరకు కుటుంబ సభ్యులలు సహాయపడినా పర్వాలేదు కానీ.. మొత్తంగా అధికారాన్నే లాగేసుకోవడం మహిళా సాధికారతను కాలరాయడమే అనే భావన సర్వత్రా వ్యక్తమవుతోంది. ఒక కుటుంబం అభివృద్ధిలో స్త్రీ పాత్ర ఎంతో ముఖ్యమైనది. ప్రతి పురుషుని విజయంలో ‘ఆమె’ తోడ్పాటు ఎనలేనిది. ఈ నేపథ్యంలో గ్రామాభివృద్ధిలోనూ మహిళలను భాగస్వాములను చేస్తే మెరుగైన ఫలితాలు సాధ్యమనే విషయం అందరూ గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మహిళా సర్పంచ్‌లు ఉన్న చోట ఇదీ పరిస్థితి హలహార్వి మండలంలో ఏడుగురు మహిళా సర్పంచ్‌లు ఉన్నారు. వీరు వ్య వసాయం, ఇతర పనులకు వెళ్తుండగా.. భర్తలు చక్రం తిప్పుతున్నారు. కౌతాళం మండలంలోని 12 పంచాయతీల్లో మహిళ సర్పంచ్‌లు డమ్మీగా మిగిలిపోయారు. కోడుమూరు నియోజకవర్గంలోని కృష్ణాపురం, పులకుర్తి గ్రామాల్లో సర్పంచ్ల కుమారులు అన్నీ తామూ వ్యవహరిస్తున్నారు. వెంకటగి గ్రామ సర్పంచ్ ఎస్సీ కావడంతో ఆమె గెలుపులో కీలకంగా వ్యవహరించిన ఓ నేత పెత్తనం సాగిస్తున్నారు. ఆమె వినకపోతే ఖర్చు పెట్టిన రూ.6 లక్షలు తిరిగివ్వాలని కోరుతున్నట్లు సమాచారం. ఆలూరు, మొలగవెల్లి, బన్నూరు, బిల్లేకల్, కమ్మరచేడు పంచాయతీల్లో భర్తలు, కుమారుల ఆధిపత్యం కనిపిస్తోంది. కర్నూలు రూరల్ మండలంలోని పంచలింగాల, దిగువపాడు, నందనపల్లె, ఇ.తాండ్రపాడు, గొందిపర్ల, దేవమాడ, శివరాంపురం, పడిదెంపాడు, నిడ్డూరు గ్రామాల్లో వారి భర్తలే పాలనా వ్యవహారాలు చూస్తున్నారు. ఆర్.కొంతపాడులో సర్పంచ్ అల్లుడు అన్నీ తానై నడిపిస్తున్నాడు. పత్తికొండ మండలంలోని దేవనబండ సర్పంచ్ తరపున ఆ గ్రామ టీడీపీ నేత పెత్తనం చెలాయిస్తున్నాడు. కోతిరాళ్ల సర్పంచ్ శిరీష కర్నూలులో డిగ్రీ చదువుతున్నారు. ఈమె స్థానంలో తండ్రి నగేష్ వ్యవహారాలను చక్కబెడుతున్నారు. -
సీమాంధ్ర భగ్గుమన్నది-గౌతమ్ రెడ్డి
-
వరి రైతులకు మొండిచెయ్యేనా?
అనంతపురం టౌన్, న్యూస్‌లైన్ : తుంగభద్ర ఎగువ కాలువ( హెచ్చెల్సీ) ఆయకట్టులో వరి పంటను సాగుచేసే రైతులకు ఈసారీ మొండిచేయి చూపుతున్నారు. వర్షాభావం, నీటి లభ్యతను సాకుగా చూపి రైతులను దగా చేస్తున్నారు. వరుసగా రెండో ఏడాదీ వరికి మంగళం పాడడంతో రైతులు తీవ్రంగా నష్టపోనున్నారు. తుంగభద్ర డ్యామ్ నుంచి జిల్లాకు కేటాయించిన మేరకు నీటిని తీసుకురావడంలో ప్రజాప్రతినిధులకు చిత్తశుద్ధి లేకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడుతోందని అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. వ్యవసాయశాఖ అంచనా మేరకు జిల్లా వ్యాప్తంగా ఖరీఫ్‌లో బోరుబావులు, ఇతర నీటి వనరుల కింద 50 వేల ఎకరాల్లోను, కేవలం హెచ్చెల్సీ కింద 60-70 వేల ఎకరాల్లోను వరి సాగు చేస్తున్నారు. అంతటిప్రాధాన్యమున్న హెచ్చెల్సీ ఆయకట్టు కింద ఈ ఏడాది కూడా వరికి మంగళం పాడుతున్నారు. ఆరుతడి పంటలకు మాత్రమే నీరు విడుదల చేయాలని అధికారులు నిర్ణయించారు. అయితే.. ఆయకట్టు పరిధిలో వరికి తప్పా మిగతా పంటలకు అనుకూలించని భూములు వేలాది ఎకరాలు ఉన్నాయి. ఈ భూములు కల్గిన రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారనుంది. హెచ్చెల్సీ ఆయకట్టుకు నీరు విడుదల చేసే ముందు సాగునీటి సలహా మండలి(ఐఏబీ) సమావేశం నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో సభ్యులు తీర్మానించిన మేరకు పంటలకు నీటిని విడుదల చేయాల్సి ఉంటుంది. జిల్లాకు కేటాయింపుల మేరకు నీటిని తీసుకురావడానికి ప్రజాప్రతినిధులపై ఒత్తిడి తీసుకురావడానికి కూడా ఇదొక్క సమావేశమే అవకాశం. అయితే... ఈ ఏడాది సమావేశం నిర్వహించకుండానే నేరుగా పంటలకు నీటిని విడుదల చేస్తుండడం పలు విమర్శలకు తావిస్తోంది. తొలుత పంచాయతీ ఎన్నికల కోడ్‌ను సాకుగా చూపి సమావేశాన్ని వాయిదా వేశారు. ఆగస్టులో నిర్వహిస్తామని ప్రకటించారు. అయితే.. ప్రస్తుతం సమైక్యాంధ్ర ఉద్యమాలను సాకుగా చూపి ఐఏబీ తీర్మానం లేకుండానే నిర్ణయం తీసుకున్నారు. వరుసగా రెండో ఏడాదీ వరికి నీటిని విడుదల చేయకపోవడంపై ప్రతిపక్ష ప్రజాప్రతినిధులు, రైతు సంఘం నాయకులు నిలదీస్తారనే భయంతో అధికారపార్టీకి చెందిన ప్రజాప్రతినిధుల సూచన మేరకే ఐఏబీ సమావేశం నిర్వహించలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. హెచ్చెల్సీపై అనంతపురం, వైఎస్సార్ జిల్లాల్లో వేలాది మంది రైతులు ఆధారపడి ఉన్నారు. కాలువ కింద సుమారు 2.84 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ప్రతియేటా దాదాపు 1.20 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నారు.కాగా... కొన్నేళ్లుగా వర్షభావం, తుంగభద్ర జలాశయంలో పూడిక చేరిందనే సాకుచూపి జిల్లాకు నీటి కేటాయింపుల్లో భారీగా కోత వేస్తున్నారు. నికరంగా 24 టీఎంసీలకు పైగా జిల్లాకు రావాల్సి ఉన్నా .. ఎప్పుడూ 20 టీఎంసీల లోపే వదులుతున్నారు. గతేడాది మరీ తక్కువగా 18 టీఎంసీలు మాత్రమే విడుదల చేశారు. దీనివల్ల ఇటు పంటలకే కాకుండా అటు తాగునీటికీ కటకటలాడాల్సి వస్తోంది. నీటి కేటాయింపుల్లో కోత కారణంగా గతేడాది ఆయకట్టును భారీగా కుదించారు. 55 వేల ఎకరాల్లో ఆరుతడి పంటలకు మాత్రమే నీరందించాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకుని పనిచేశారు. హైలెవల్ మెయిన్ కెనాల్ కింద 17,500 ఎకరాలు, గుంతకల్లు బ్రాంచ్ కెనాల్ (జీబీసీ) కింద ఐదు వేలు, పీఏబీఆర్ సౌత్ కెనాల్ కింద పది వే లు, నార్త్ కెనాల్ కింద నాలుగు వేలు, తాడిపత్రి బ్రాంచ్ కెనాల్(టీబీసీ) కింద ఆరు వేలు, మైలవరం బ్రాంచ్ కెనాల్ కింద ఐదు వేలు, పులివెందుల బ్రాంచ్ కెనాల్(పీబీసీ) కింద 7,500 ఎకరాల్లో పంటలు సాగు చేయించాలని భావించారు. అయితే... చివరకు అన్ని ఉపకాల్వల కింద మొత్తం 67 వేల ఎకరాల్లో వివిధ పంటలు సాగయ్యాయి. గతేడాది ఏ సంస్కరణలు అమలు చేశారో ఈసారీ వాటినే అవలంబించాలని అధికారులు నిర్ణయించారు. తొలిప్రాధాన్యత తాగునీటికి ఇవ్వాలని నిర్ణయించారు. తుంగభద్ర జలాశయం నుంచి హెచ్చెల్సీకి గత నెల 15 నుంచి నీటిని విడుదల చేస్తున్నారు. ఇప్పటి వరకూ తాగునీటి నిమిత్తం పీఏబీఆర్, ఎంపీఆర్ డ్యాంలలో నిల్వ చేశారు. ఈ నెల 8 నుంచి పంటలకు విడుదల చేస్తున్నారు. అయితే వరి సాగు చేయవద్దని అధికారులు రైతులకు చెబుతున్నారు. 80 రోజుల్లో పూర్తయ్యే జొన్న, మొక్కజొన్న, పప్పుశనగ తదితర ఆరుతడి పంటలు సాగు చేయాలని రైతులకు సూచిస్తున్నారు. ఇప్పటికే వరి నారు వేసుకున్న రైతులు మాత్రం నాట్లు వేయడానికి సిద్ధమవుతున్నారు. ఆతర్వాత వరి పంటకు పూర్తి స్థాయిలో నీరు వస్తుందోలేదోనని ఆందోళన చెందుతున్నారు.