వాసవీ క్లబ్ జిల్లా గవర్నర్‌గా మురళీకృష్ణ
నూనెపల్లె: వాసవీ ఇంటర్నేషనల్ క్లబ్ 209(ఏ) జిల్లా గవర్నర్‌గా నెరవాటి మురళీకృష్ణ ఎన్నికయ్యారు. సోమవారం క్లబ్ కార్యాలయంలో ఇంటర్నేషనల్ క్లబ్ జాయింట్ సెక్రటరీ, జిల్లా ఎన్నికల అధికారి నాదెళ్ల శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఈ ఎన్నిక జరిగింది. ఈ సందర్భంగా శ్రీనివాసులు మాట్లాడుతూ.. వచ్చే ఏడాది నుంచి మురళీకృష్ణ గరవ్నర్‌గా కొనసాగుతారని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 32 వాసవీ క్లబ్‌లు ఉన్నాయని వీటి స్థాయి పెంచాలని సూచించారు. భవిష్యత్తులో క్లబ్‌లు సేవా కార్యక్రమాలు విస్తృత పరచాలని చెప్పారు. గవర్నర్‌గా ఎన్నికైన మురళీకృష్ణను క్లబ్ సభ్యులు సంపత్ కుమార్, జేవీసీ సత్యనారాయణ, శ్రీనాథ్, గాంధీ, ఉదయగిరి శివయ్యలు అభినందించారు.