Vasavi club
-
సింగపూర్‌లో వాసవి జయంతి సంబరాలు
వాసవి క్లబ్ మెర్లయన్ సింగపూర్ (VCMS) ఆధ్వర్యంలో ఇక్కడి సింగపూర్ ఆర్యవైశ్యులు చైనాటౌన్‌లోని శ్రీ మారియమ్మన్ ఆలయంలో శ్రీ వాసవి మాత జయంతిని అత్యంత వైభవంగా జరుపుకున్నారు. వాసవి జయంతితో పాటు VCMS దశమ వార్షికోత్సవ సంబరాలు కూడా ఇదే సందర్భంగా నిర్వహించారు. సుమారు ఎనిమిది గంటల పాటు పలు సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఆద్యంతమం ఆసక్తికరంగా జరిగాయి. కార్యక్రమాల్లో సుమారు 350 మందికి పైగా ఆర్య వైశ్యులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఎప్పటిలాగే వాసవి అమ్మవారికి కుంకుమార్చన, అలంకార పూజ, రథయాత్ర కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో జరిగాయి. ఈ సందర్బంగా తెలుగు సంప్రదాయ భోజనాలు, తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఆర్యవైశ్య కుటుంబాలకు చెందిన పలువురు ఔత్సాహిక కళాకారులు తమ కళా ప్రతిభతో అలరించారు. గౌరవ అతిథిగా విచ్చేసిన శ్రీ మరియమ్మన్ ఆలయం వైస్ చైర్మన్ బొబ్బ శ్రీనివాస్ జ్యోతి ప్రజ్వలన చేసి సాంస్కృతిక కార్యక్రమాలను ప్రారంభించారు. VCMS కార్యనిర్వాహక బృందానికి చెందిన నాగరాజు కైల, నరేంద్ర కుమార్ నారంశెట్టి, సరిత విశ్వనాథన్, ముక్క కిషోర్ వేదికను అలంకరించారు. ఈ సందర్భంగా నాగరాజ్ కైల, శ్రీధర్ మంచికంటి మాట్లాడుతూ అతి కొద్దిమంది ఆర్యవైశ్యులతో చిన్న సంస్థగా ప్రస్థానాన్ని ప్రారంభించిన VCMS పది సంవత్సరాలలో ఒక వటవృక్షంగా ఎదగటం శ్లాఘనీయమని, దీని వెనక ఎందరో సింగపూర్ ఆర్యవైశ్యుల అంకితభావం, కృషి ఉన్నాయని పేర్కొన్నారు. అనంతరం సింగపూర్ తెలుగు సమాజం పూర్వ అధ్యక్షులు రంగా రవికి చిరు సత్కారం జరిగింది. 'గణానాం త్వ గణపతిం' అంటూ చిన్నారి కారె సాయి కౌశాల్ గుప్త చేసిన రుగ్వేదం లోని గణపతి ప్రార్థనతో కార్యక్రమాలు మొదలయ్యాయి. శిల్పా రాజేష్ సారధ్యంలో కోలాట నృత్య ప్రదర్శన బృందం వేదికపై వాసవి మాతకు కోలాటంతో వందనాలు సమర్పించారు. సింగపూర్‌లో మొట్టమొదటిసారిగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జీవిత చరిత్రను దృశ్య శ్రవణ మాధ్యమాల సహాయంతో నాటక రూపంలో ప్రదర్శించారు. ఈ వాసవి మాత నాటక రూపానికి మూల ప్రతిపాదనను చైతన్య రాజా బాలసుబ్రహ్మణ్యం చేయగా, కథ, కూర్పు, సంభాషణలు ఫణేష్ ఆత్మూరి వెంకట రామ సమకుర్చారు. కిషోర్ కుమార్ శెట్టి దర్శకత్వం వహించారు. యువ కళాకారులు కుమారి అక్షర శెట్టి మాడిచెట్టి, చిరంజీవి ముక్తిధ మేడం, చిరంజీవి ఉమా మోనిష నంబూరిల భరతనాట్య ప్రదర్శనలు, చిన్నారి తన్వి మాదారపు ప్రదర్శించిన కూచిపూడి నృత్యం ఆకట్టుకున్నాయి. ఆనంద్ గంధే, కిరణ్ కుమార్ అప్పన, కొండేటి ఈశాన్ కృష్ణ తమ గాత్ర ప్రతిభతో శ్రోతలను మంత్రముగ్ధులను చేశారు. సాయంత్రం అమ్మవారికి కుంకుమార్చన, అలంకార పూజ అనంతర జరిగిన రథయాత్రలో భాగంగా శ్రీమతి గాదంశెట్టి నాగ సింధు గారి నేతృత్వంలో 16 మంది కళాకారిణులు చేసిన కోలాటం ప్రదర్శన కూడా అందరినీ ఎంతో ఆకట్టుకుంది. ఇదే సందర్భంగా VCMS నూతన కార్యవర్గ బృంద సభ్యులను ప్రకటించారు. ప్రెసిడెంట్ గా మురళీకృష్ణ పబ్బతి, సెక్రటరీగా సుమన్ రాయల, కోశాధికారిగా ఆనంద్ గంధే, మహిళా విభాగానికి సారథిగా సరిత విశ్వనాథన్‌లను ఆహూతులకు పరిచయం చేశారు. అనంతరం సంస్థ అభివృద్ధికి చేసిన ఇతోధిక కృషిని గుర్తిస్తూ నరేంద్ర కుమార్ నారంశెట్టికి ‘వాసవి సేవా కుసుమ’గా సత్కరించారు. సింగపూర్‌లో గత పది సంవత్సరాలుగా VCMS వైశ్య ధర్మాన్ని నిలబెడుతూ అనేక సాంస్కృతిక, సాంఘిక కార్యక్రమాలకు వారధిగా ఎనలేని సేవలు చేస్తూ సింగపూర్ లో పెరుగుతున్న ఆర్యవైశ్య భావితరానికి దీపస్తంభంగా వెలుగొందుతోందని నరేంద్ర కుమార్ పేర్కొన్నారు. ఈ సాంస్కృతిక కార్యక్రమాలకు సంధానకర్తగా ఆత్మూరి వెంకట రామ ఫణేష్, సహ వ్యాఖ్యాతగా వాసవి ఫణేష్ ఆత్మూరి వ్యవహరించారు. కార్యనిర్వాహక బృందం, దాతలు, సేవాదళ సభ్యుల అంకితభావం వల్లనే ఈ కార్యక్రమం ఇంత విజయవంతమైందని నూతన ప్రెసిడెంట్ మురళీకృష్ణ పబ్బతి పేర్కొంటూ వారందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. -
వాసవి క్లబ్ మెర్లయన్ ఆధ్వర్యంలో సింగపూర్‌లో సంక్రాంతి సంబరాలు
వాసవి క్లబ్ మెర్లయన్ సింగపూర్ వారి ఆధ్వర్యంలో, సంక్రాంతి సంబరాల వేడుకను పొంగోల్ పార్క్ లో ఘనంగా జరిగాయి. తెలుగు సంస్కృతీ సాంప్రదాయాలు ఉట్టి పడేలా, పిల్లలకు భోగి పళ్ళ దీవెనలతో ప్రారంభమైన ఈ వేడుకలు, గొబ్బెమ్మలు, మహిళల రంగు రంగుల రంగవల్లికల పోటీలు, పిల్లల పతంగుల తయారీ వంటి కార్యక్రమాలతో ఉత్సాహంగా జరిగాయి. చిన్నారులు సంప్రదాయ దుస్తులలో పోటీపడి మరీ తమ శ్రావ్యమైన గొంతులతో శ్లోకాలు, పాటలతో మురిపించారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక సంక్రాతి థీమ్ కి సంబంధించిన తెర ఏర్పాటులో సౌజి డేకర్స్ సంస్థ సభ్యులు సహకరించారు. ఫణీష్ ఆత్మురి ‘సంక్రాతి శోభ’ ప్రసంగం ఆహుతులని ఆకట్టుకొంది. పసందై సాంప్రదాయిక విందు భోజనంతో పాటు, రోజంతా సాగిన ఈ వేడుకలలో పిల్లలు, పెద్దలూ, దంపతులూ అనేక విన్నూత్నమైన ఆట పాటలలో అత్యంత ఉత్సాహంగా పాల్గొని ఆద్యంతమూ ఉల్లాసంగా గడిపారు. సుమారు 190 మంది పెద్దలు, 50 మంది పిల్లలు పాల్గొని విజయవంతం చేసిన ఈ సంబరాలు, వాసవి క్లబ్ మెర్లయన్ సింగపూర్ దశమ వార్షికోత్సవంలోనికి అడుగిడుతున్న శుభ తరుణంలో జరగడం విశేషం. సింగపూర్‌లోని ఆర్యవైశ్యులందరూ సంఘీభావంతో ఈ వేడుకలలో పాల్గొనడం శ్లాఘనీయమని, వాసవి క్లబ్ ప్రెసిడెంట్ అరుణ్ గోట్ల పేర్కొన్నారు. క్లబ్ సెక్రటరీ నరేంద్ర కుమార్ నారంశెట్టి వర్చువల్‌గా పాల్గొన్నారు. ఈ సంక్రాతి సంబరాలు ఎంతో గొప్పగా నిర్వహించారని, వైశ్యులు ఎప్పుడు ఇలానే ధర్మసంబంధమైన,సాంప్రదాయ సంబంధమైన విషయాల్లో సమిష్టిగా ఇలా విజయవంతంగా మరిన్ని కార్యక్రమాలు జరుపుకోవాలని వక్తలు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి తోడ్పడిన తోటి కార్య నిర్వాహక బృంద సభ్యులకు, సేవా దళానివారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సింగపూర్ ఆర్యవైశ్యులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్న ఈ వేడుకలు, భవిష్యత్తుకు ప్రేరణనివ్వడమేగాక, మన భావితరానికి మన సంప్రదాయాలను, కుటుంబ విలువలను పరిచయం చేయడానికి ఒక చక్కని వేదికలా నిలిచాయని, ఈ కార్యక్రమ విజయంలో ప్రముఖ పాత్ర వహించిన సీనియర్ సభ్యుడు ముక్కా కిశోర్ తెలియ చేశారు, వర్షాన్ని కూడా లెక్కచేయకుండా అందరు చిన్నపిల్లల్లా ఆటపాటల్లో మునిగితేలారరని కార్యక్రమ నిర్వాహక కర్త రాయల సుమన్, దివ్య సంతోసం వ్యక్తం చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా విచ్చేసిన జానపద కోకిల, డాక్టర్ అరుణ సుబ్బారావు ప్రత్యేక ప్రదర్శనలతో, పాటలతో ఆద్యంతం అందరిని ఆనందంలో ముంచెత్తింది. కార్యక్రమం విజయవంతమవ్వడంలో సంస్థ సభ్యులు సరిత, రాజా విశ్వనాథుల, రాఘవ, ఆనంద్, కిశోర్, శ్రీధర్ మంచికంటి, వాసవి సేవ సభ్యులైన శివ కిషన్, మార్తాండ్, చైతన్య, అవినాష్, చలం, గోపి కిషోర్, ప్రసాద్ బచ్చు, యదా నరేష్, పురుషోత్తం, సందీప్, సతీష్ వుద్దగిరి, సంతోష్ మాదారపు, మనోహర్, సత్య, దివ్య గాజులపల్లి తదితరులు ఎంతో ఉత్సాహంగా కార్యక్రమాన్ని విజయవంతంగా ముగించారు. -
వాసవి క్లబ్ మెర్లయన్ సింగపూర్ ఆధ్వర్యంలో కార్తీక వనభోజనాలు
సింగపూర్ సింగపూర్‌లోని ఆర్యవైశ్యులు సమీపంలోని కూర్మ ద్వీపంలో (కుసు ఐలాండ్) కార్తికవనభోజనాలను నిర్వహించారు. స్వయంగా తయారుచేసుకున్న వంటకాలతో సామూహికంగా సముద్ర నౌక విహారంలొ కుసు ద్వీపాన్ని చేరుకొన్నారు. ఈసందర్భంగా సముద్ర ఇసుకతో విజయలక్ష్మి, ముక్క ఇంద్రయ్య అంజలి, చైతన్య కలిసి రూపొందించిన సైకత లింగం విశేష ఆకర్షణగా నిలిచింది. సామూహిక లింగాష్టకం, శ్రీమారియమ్మన్ ఆలయంనుండి తెచ్చిన అమ్మవారి విగ్రహానికి ప్రార్థనలు నిర్వహించారు. అత్యంత భక్తి శ్రద్ధలతో సంయుక్తంగా సామూహిక కార్తీక దీప సమర్పణ చేసారు. ఆరంభంలో క్లబ్ సెక్రటరీ నరేంద్రకుమార్ నారంశెట్టి కార్తీకమాస వైభవాన్ని, కార్తీకమాస ప్రాముఖ్యతను, మహాశివుని విశిష్టతను సభ్యులకు వివరించారు, ఈ కార్యక్రమంలో చిరంజీవి మౌల్య కిషోర్,అమృత వాణి మానస నాట్య ప్రదర్శన ఆకట్టుకొంది. వినయ్, శిల్ప మకేష్, దివ్య మంజుల, స్వప్న మంచికంటి, నీమ ఆనంద్, శ్రావణి, హైందవి లు 80 కి పైగా కుటుంబాలతో 250 మంది సభ్యుల సమన్వయంతో షడ్రషోపేతమైన విందుభోజనాలు సమ కూర్చడం విశేషం. ఫ్లాష్ మాబ్, విగ్నేశ్వర్ రావ్ మానస సహకారంతో ఫ్యాషన్ వాక్ కార్యక్రమం ఉల్లాసంగా సాగింది. అనంతరం విజేతలకు ప్రత్యేక బహుమతులు అందించారు. గత పది సంవత్సరాల్లో కమిటీ ఎంతో వైభవాన్ని సంతరించుకొందని క్లబ్ సహ వ్యవస్థాపకుడు మంచికంటి శ్రీధర్ ప్రశంసించారు. ఇంకా సీనియర్ సభ్యులు విజయ్ వల్లంకొండ, భాస్కర్ గుప్త, ప్రసాద్, దివ్య, గోపి కిషోర్, సతీష్ కోట తమ అనుభవాలను పంచుకున్నారు. సేవాదళ్ సభ్యులు శివ కిషన్, ఫణీష్, వినయ్ చంద్, శ్రీనివాస్ అమర, సతీష్ వుద్దగిరి, హైందవి, కొత్త హరింద్రబాబు, అనిల్ గాజులపల్లి, మణికంఠ, కిషోర్, నందన్, మానస్ తదితరులు కార్యక్రమం విజయవంతానికి తోడ్పడ్డారు. ముగింపు సభలో కిషోర్ శెట్టి పోషించిన కీలక పాత్రను క్లబ్ సెక్రటరీ నరేంద్ర కుమార్ నారంశెట్టి ,సీనియర్ కమిటీ సభ్యుడు ముక్కాకిషోర్ అభినందించారు గత తొమ్మిది సంవత్సరాలుగా నరేంద్రసేవలను గుర్తిస్తూ సీనియర్ సభ్యులందరు దంపతులకు ప్రత్యేకంగా సన్మానించారు. సింగపూర్‌లో కోవిడ్ పరిస్థితుల తరువాత మళ్లీ మూడేళ్లకు 250 మంది సభ్యులతో కుసు ద్వీపంలో ఈ కార్యక్రమం నిర్వహించడంపై నరేంద్ర సంతోషం వెలిబుచ్చారు. వైశ్యులు అన్ని ధార్మిక, సేవా కార్యక్రమాల్లో ఎప్పటిలాగే ముందుండి ఇక మీదట కూడా నడిపించాలని అభిలషించారు. -
సింగపూర్‌లో వాసవి జయంతి వేడుకలు
సింగపూర్ : ఆర్య వైశ్యుల కులదైవమైన వాసవిమాత జయంతి వేడుకలు వాసవి క్లబ్ మెర్లియన్ సింగపూర్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో 200 మందికి పైగా ఆర్య వైశ్య కుంటుంబాలు పాల్గొన్నాయి. పాయలేబర్లోని శ్రీ శివన్ టెంపుల్లో సామూహిక వాసవి కుంకుమార్చన కార్యక్రమం జరిగింది. ఆర్యవైశ్య మహిళలు వాసవి మాత కుంకుమార్చనలో పాల్గొని, అమ్మ వారి పాటలను సామూహికంగా గీతాలాపన చేశారు. ఈ సందర్భంగా చార్టర్డ్ ప్రెసిడెంట్ నాగరాజ్ కైల నూతన కార్యవర్గ సభ్యులుగా అరుణ్ కుమార్ గొట్లూరి - ప్రెసిడెంట్, నరేంద్ర కుమార్ నారంశెట్టి - జనరల్ సెక్రటరీ, రామ్ ప్రసాద్ మామిడి, ట్రెజరర్లను పరిచయం చేశారు. భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడంలో వాసవి సేవాదళ్ సభ్యులైన రవి కిరణ్, ప్రసాద్, ముక్క కిషోర్, శ్రీధర్, అనిల్, అజయ్, రాజ, సంతోష్ తదితరులు తమ వంతు కృషి చేశారు. -
జాతీయ సమైక్యతే దేశానికి పునాదులు
లండన్ : వాసవి క్లబ్ ఇంగ్లాండ్ ఆధ్వర్యంలో లండన్‌లో సంఘటిత సమ్మేళనం నిర్వహించారు. కులం, మతం పేరుతో దేశంలో అశాంతికి దారితీసే పరిణామాలను మొదట్లోనే తుంచివేయాలని వాసవి క్లబ్ ఇంగ్లాండ్ సంయుక్త ప్రకటనలో తెలిపింది. మతం పేరుతో, కులం పేరుతో దూషణ సరికాదని రాజ్యాంగం ద్వారా కల్పించిన భావ ప్రకటన స్వేచ్ఛ ఇతరుల మనో భావాలను దెబ్బతీసే విధంగా ఉండరాదని పేర్కొంది. చరిత్రలో మంచిని స్వీకరించి సమాజ శ్రేయస్కర రచనలు చేసి జాతి ఉపయోగకరంగా ఉండాలి తప్ప, చరిత్రలో జరిగిన కొన్ని సంఘటనలను తెర పైకి తెచ్చి ప్రజల్లో గొడవలు సృష్టించే విధంగా ఉండకూడదని సూచించింది. ఈ మధ్య ప్రొఫెసర్ కంచె ఐలయ్య రాసిన పుస్తకం సమాజంలో తారతమ్యాలు తెచ్చే విధంగా, కులాల మధ్య చిచ్చు పెట్టి మానవ సంబంధాలు తెంచే విధంగా ఉన్నాయని వాసవి క్లబ్ ఇంగ్లాండ్ సభ్యులు పేర్కొన్నారు. రచనలు సమాజ శ్రేయస్కరంగా ఉండాలి తప్ప గొడవలకు ఆస్కారం కారాదని తెలిపారు. కంచె ఐలయ్య యావత్ జాతికి బేషరతు క్షమాపణ చెప్పి తన పుస్తకాన్ని విరమించుకోవాలని వాసవి క్లబ్ ఇంగ్లాండ్ సభ్యులు డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్రా ప్రభుత్వాలు ఇలాంటి సంఘ విద్రోహ చర్యలు ఎవరు చేపట్టినా తక్షణమే స్పందించి చట్ట రీత్యా చర్యలు తీసుకోవాలని కోరారు. కంచె ఐలయ్య పుస్తకాన్ని నిషేధించాలని ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలకు లేఖ రాయాలని వాసవి క్లబ్ ఇంగ్లాండ్ శాఖ తీర్మానం చేసింది. ఈ కార్యక్రమంలో సురేష్ ముర్కీ, మహేష్ చందా మోహన్, మధు, కృష్ణ లాలం, వెంకట కుమార్, రాజేష్ చుండూరి, నరేష్ మర్యాల, అంజి కుమార్, అరవింద్ శ్రీరామ్, హేమకుమార్ అమృతలూరు, బాల దర, ఓం ప్రకాష్ ,గోపి అగీర్ నిర్మల్ వెచ్చం నాగేంద్ర శ్రీమకుర్తి, గంప వేణుగోపాల్, మహేష్ యంసానిలతో పాటూ పలువురు వాసవి క్లబ్ ఇంగ్లాండ్ సభ్యులు వివిధ ప్రాంతాల నుండి వచ్చి తమ మద్దతు తెలిపారు. -
1550 అడుగుల జాతీయ పతాక మహార్యాలీ
పులివెందుల టౌన్ : గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం వైఎస్ఆర్ జిల్లా పులివెందులలో 1550 అడుగుల జాతీయ పతాక మహార్యాలీ నిర్వహించారు. ఇంత పెద్ద కార్యక్రమాన్ని రాయలసీమలోనే తొలిసారిగా వాసవీ క్లబ్ ఆధ్వర్యంలో చేపట్టారు. ఇందులో విద్యార్థులు, ప్రజలు పది వేల మంది పాల్గొన్నారు. వాసవీ క్లబ్ అధ్యక్షుడు మేడా దినేష్‌గుప్తా, జాతీయ పతాక నమూనాను అందజేసిన అనంతపురం జిల్లా రొద్దం డీసీ లక్ష్మీనారాయణగుప్తాకు వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ ప్రతినిధి నరేంద్రగౌడ్ ప్రశంసా పత్రంతోపాటు, వండర్ బుక్ఆఫ్ వరల్డ్ షీల్డ్‌ను అందజేసి అభినందించారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ సీజీసీ సభ్యుడు వైఎస్ వివేకానందరెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తులసిరెడ్డి మాట్లాడుతూ పాల్గొన్నారు. -
ఇంటర్నేషనల్ క్లబ్ డైరెక్టర్‌గా జొన్నలగడ్డ నాగరాజు
నూనెపల్లె: వాసవీ క్లబ్ 209లో ఇంటర్నేషనల్ డైరెక్టర్‌గా జొన్నలగడ్డ నాగరాజును ఎన్నుకున్నారు. డిసెంబర్ 28వ తేదీన బెంగుళూరులో నిర్వహించిన ఇంటర్నేషనల్ క్లబ్ ఎన్నికల్లో ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకోగా జనవరి 21న విశాఖపట్నంలో నిర్వహించిన సమావేశంలో ఆయనకు పిన్ కేటాయించారు. ఇంటర్నేషనల్ క్లబ్ 22 మంది డైరెక్టర్లు ఉండగా కర్నూలు జిల్లా నుంచి ఆయనకు చోటు కల్పించారు. 2017 చివరి వరకు క్లబ్ డైరెక్టర్‌గా ఉంటారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తనపై ఉంచిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తానని చెప్పారు. తాను నిర్వహించిన పలు సేవా కార్యక్రమాలను గుర్తించి డైరెక్టర్‌గా అవకాశం కల్పించారని చెప్పారు. -
వాసవీక్లబ్ నూతన క్యాలెండర్ ఆవిష్కరణ
నాగర్‌కర్నూల్ విద్యావిభాగం: జిల్లా కేంద్రంలోని వాసవీ, వనితా క్లబ్‌ల ఆధ్వర్యంలో ఆదివారం కన్యకా పరమేశ్వరి దేవాలయంలో 2017 నూతన సంవత్సర క్యాలెండర్లను ఇంటర్నేషనల్ మల్టీ వైస్ ప్రెసిడెంట్ హకీం రాజేష్, డిప్యూటీ గవర్నర్ కొట్ర బాలాజీ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈసందర్భంగా పేద ప్రజల కోసం వాసవీ, వనితాక్లబ్లు ఎన్నో రోజులుగా కార్యక్రమాలు చేపడుతున్నాయని, ఇకముందు కూడా మరెన్నో కార్యక్రమాలు చేపట్టనున్నట్లు హామీఇచ్చారు. ఇదేరోజు వాసవీక్లబ్ సభ్యులు కోదండరాం, బాదం శ్రీనుల జన్మదినం కావడంతో వారితోనే నూతన సంవత్సర, బర్త్‌డే కేక్‌లను కట్చేయించి సంబరాలు జరుపుకున్నారు. వాసవీ, వనితాక్లబ్ అధ్యక్షులు బాదం శివకుమార్, పూర్ణిమ, ప్రధాన కార్యదర్శులు మలిపెద్ది రమేష్, కవిత, కోశాధికారి మిడిదొడ్డి ప్రవీణ్, మాధవి, జోన్ చైర్మన్ రాఘవేందర్, ఆర్గనైజింగ్ సెక్రెటరీ రాఘవేందర్, మాజీ అధ్యక్షులు డీవీ.నారాయణ, సాయిబాబు, దొంతు శంకర్, బాదం పరమేష్, ఉజ్వల్ ఉన్నారు. -
వాసవీ క్లబ్ జిల్లా గవర్నర్‌గా మురళీకృష్ణ
నూనెపల్లె: వాసవీ ఇంటర్నేషనల్ క్లబ్ 209(ఏ) జిల్లా గవర్నర్‌గా నెరవాటి మురళీకృష్ణ ఎన్నికయ్యారు. సోమవారం క్లబ్ కార్యాలయంలో ఇంటర్నేషనల్ క్లబ్ జాయింట్ సెక్రటరీ, జిల్లా ఎన్నికల అధికారి నాదెళ్ల శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఈ ఎన్నిక జరిగింది. ఈ సందర్భంగా శ్రీనివాసులు మాట్లాడుతూ.. వచ్చే ఏడాది నుంచి మురళీకృష్ణ గరవ్నర్‌గా కొనసాగుతారని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 32 వాసవీ క్లబ్‌లు ఉన్నాయని వీటి స్థాయి పెంచాలని సూచించారు. భవిష్యత్తులో క్లబ్‌లు సేవా కార్యక్రమాలు విస్తృత పరచాలని చెప్పారు. గవర్నర్‌గా ఎన్నికైన మురళీకృష్ణను క్లబ్ సభ్యులు సంపత్ కుమార్, జేవీసీ సత్యనారాయణ, శ్రీనాథ్, గాంధీ, ఉదయగిరి శివయ్యలు అభినందించారు. -
దర్శకుడు శంకర్ జన్మదిన వేడుకలు
నాగర్‌కర్నూల్: ప్రముఖ సినీ దర్శకుడు శంకర్ జన్మదిన వేడుకలను గురువారం వాసవీ క్లబ్ ఆధ్వర్యంలో స్థానిక ఎస్సీ– ఏ హాస్టల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు దేశభక్తి పాటలపోటీలను నిర్వహించి బహుమతులను అందజేశారు. అనంతరం అధ్యక్షుడు వాస రాఘవేంర్ మాట్లాడుతూ శంకర్ భారతీయుడు, అపరిచితుడు వంటి దేశభక్తి చిత్రాలు తీశారని, ఆయన మరిన్ని దేశభక్తి చిత్రాలు తీయాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కోదండరాములు, శశికళ, వార్డెన్ రామస్వామి పాల్గొన్నారు. -
సామాజిక సేవలో ‘వాసవీ’ ముందంజ
హన్మకొండ : సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టడంలో వాసవీ క్లబ్ ముందంజలో నిలుస్తోందని క్లబ్ అంతర్జాతీయ అధ్యక్షుడు పబ్బ విజయ్‌కుమార్ అన్నారు. హన్మకొండ నక్కలగుట్టలోని నందన గార్డెన్స్‌లో వాసవీ క్లబ్ ఇంటర్నేషనల్ అర్ధ వార్షిక సమావేశం ఆదివారం జరిగింది. ఈ సమావేశంలో వివిధ రాష్ట్రాలు, జిల్లాల గవర్నర్లు, అధ్యక్షులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆరు నెలలుగా చేపట్టిన కార్యక్రమాలను సమీక్షించగా, అత్యుత్తమ సేవలు అందించిన క్లబ్‌ల బాధ్యులను సన్మానించారు. అనంతరం విజయ్‌కుమార్ మాట్లాడుతూ సామాజిక సేవే లక్ష్యంగా వాసవీ క్లబ్ ఇంటర్నేషనల్ ఏర్పాటైందన్నారు. ఈ మేరకు వివిధ క్లబ్‌ల బాధ్యులు పోటీ పడి పనిచేస్తున్నారని, ఇదే స్ఫూర్తిని భవిష్యత్‌లో కూడా కొనసాగించాలని సూచించారు. సమావేశంలో క్లబ్ ప్రతినిధులు గార్లపాటి శ్రీనివాస్, పొట్టి శ్రీనివాస్, యాదా నాగేశ్వర్రావు, ఐత రాములు, వెంకటరమణమూర్తి, ఏవీఎస్‌ఎన్.గుప్త, శెట్టి శ్రీరాములు, వెంకటరమణమూర్తి, తాడిశెట్టి వెంకట్రావు, పావుశెట్టి అయోధ్యరాములు, గాయత్రి, ప్రకాశ్, ఐత మురళీధర్, రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
అఖిలభారత వాసవి క్లబ్ మాజీ అధ్యక్షుడు అదృశ్యం
-
స్వైన్‌ఫ్లూ నివారించడానికి మాస్క్‌ల పంపిణీ
వరంగల్: రాష్ట్ర వ్యాప్తంగా స్వైన్‌ఫ్లూ మరణాలు సంభవిస్తుండటంతో ఈ వ్యాధి ప్రభలకుండా ఉండడానికి తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీన్ని గుర్తించిన వరంగల్ వాసవీక్లబ్ సభ్యులు మంగళవారం సాయంత్రం స్థానిక రైల్వే స్టేషన్‌లోని రెండువేల మంది ప్రయాణికులకు మాస్క్‌లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం వాసవీక్లబ్ వరంగల్ శాఖ అధ్యక్షులు వాసుదేవులు ఆధ్వర్యంలో జరిగింది. -
వాసవీ క్లబ్ సేవలు అభినందనీయం
క్లబ్ గవర్నర్ మదన్మోహన్ పింఛన్లు, పరీక్ష కిట్లతో పాటు బియ్యం పంపిణీ మట్టెవాడ, న్యూస్‌లైన్ : వాసవీ క్లబ్ వరంగల్ శాఖ బాధ్యులు ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ సమాజంలో ఆదర్శంగా నిలుస్తున్నారని క్లబ్ గవర్నర్ మాడిశెట్టి మదన్మోహన్ కొనియాడారు. వరంగల్ పిన్నావారి వీధిలోని వాసవీక్లబ్ భవన్లో వరంగల్ శాఖ అధ్యక్షుడు గుముడవెల్లి సత్యనారాయణ అధ్యక్షతన శనివారం రాత్రి ఏర్పాటుచేసిన సమావేశంలో మదన్మోహన్ మాట్లాడారు. సమాజంలోని అట్టడుగు వర్గాలు, అనాథలు, పేద విద్యార్థులను ఆదుకోవడంలో వాసవీ క్లబ్ బాధ్యులు ముందు వరుసలో నిలుస్తున్నారని తెలిపారు. భవిష్యత్‌లో సేవా కార్యక్రమాలను మరింత విస్తరించాలనిస ఊచించారు. ఈ సందర్భంగా 22 మంది పేద మహిళలకు పింఛన్లు, 65 మంది విద్యార్థులు పరీక్ష కిట్లతో పాటు ఐదుగురు పేదలకు బియ్యం పంపిణీ చేశారు. కార్యక్రమంలో క్లబ్ ప్రధాన కార్యదర్శి టి.వాసుదేవులు, కోశాధికారి గాదె వాసుదేవ్‌తో పాటు వల్లాల నాగేశ్వర్రావు, వి.సుధాకర్, కె.రాజగోపాల్, సంతోష్‌కిరణ్, శ్రీరాం బిక్షపతి తదితరులు పాల్గొన్నారు.