![1550 అడుగుల జాతీయ పతాక మహార్యాలీ](/styles/webp/s3/article_images/2017/09/5/81485462489_625x300.jpg.webp?itok=fT0bwYX5)
1550 అడుగుల జాతీయ పతాక మహార్యాలీ
పులివెందుల టౌన్ : గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం వైఎస్‌ఆర్ జిల్లా పులివెందులలో 1550 అడుగుల జాతీయ పతాక మహార్యాలీ నిర్వహించారు. ఇంత పెద్ద కార్యక్రమాన్ని రాయలసీమలోనే తొలిసారిగా వాసవీ క్లబ్ ఆధ్వర్యంలో చేపట్టారు. ఇందులో విద్యార్థులు, ప్రజలు పది వేల మంది పాల్గొన్నారు. వాసవీ క్లబ్ అధ్యక్షుడు మేడా దినేష్‌గుప్తా, జాతీయ పతాక నమూనాను అందజేసిన అనంతపురం జిల్లా రొద్దం డీసీ లక్ష్మీనారాయణగుప్తాకు వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ ప్రతినిధి నరేంద్రగౌడ్ ప్రశంసా పత్రంతోపాటు, వండర్ బుక్‌ఆఫ్ వరల్డ్ షీల్డ్‌ను అందజేసి అభినందించారు. కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌సీపీ సీజీసీ సభ్యుడు వైఎస్ వివేకానందరెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తులసిరెడ్డి మాట్లాడుతూ పాల్గొన్నారు.