
సింగపూర్ : ఆర్య వైశ్యుల కులదైవమైన వాసవిమాత జయంతి వేడుకలు వాసవి క్లబ్ మెర్లియన్ సింగపూర్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో 200 మందికి పైగా ఆర్య వైశ్య కుంటుంబాలు పాల్గొన్నాయి. పాయలేబర్లోని శ్రీ శివన్ టెంపుల్లో సామూహిక వాసవి కుంకుమార్చన కార్యక్రమం జరిగింది. ఆర్యవైశ్య మహిళలు వాసవి మాత కుంకుమార్చనలో పాల్గొని, అమ్మ వారి పాటలను సామూహికంగా గీతాలాపన చేశారు.
ఈ సందర్భంగా చార్టర్డ్ ప్రెసిడెంట్ నాగరాజ్ కైల నూతన కార్యవర్గ సభ్యులుగా అరుణ్ కుమార్ గొట్లూరి - ప్రెసిడెంట్, నరేంద్ర కుమార్ నారంశెట్టి - జనరల్ సెక్రటరీ, రామ్ ప్రసాద్ మామిడి, ట్రెజరర్లను పరిచయం చేశారు. భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడంలో వాసవి సేవాదళ్ సభ్యులైన రవి కిరణ్, ప్రసాద్, ముక్క కిషోర్, శ్రీధర్, అనిల్, అజయ్, రాజ, సంతోష్ తదితరులు తమ వంతు కృషి చేశారు.



Comments
Please login to add a commentAdd a comment