Brawl Erupts in Kosovo Parliament Opposition Throws Water on PM - Sakshi
Sakshi News home page

పార్లమెంటులో కుమ్ములాట.. వీధి రౌడీల్లా కొట్టుకున్న సభ్యులు  

Published Fri, Jul 14 2023 3:44 PM | Last Updated on Fri, Jul 14 2023 5:08 PM

Brawl Erupts In Kosovo Parliament Opposition Throws Water On Pm - Sakshi

ప్రిస్టినా: కొసావో పార్లమెంటు సమావేశాల్లో ఘర్షణలు చోటు చేసుకున్నాయి. చట్టాలు చేయాల్సిన ప్రజాప్రతినిధులే చట్టసభను రణరంగంలా మార్చేశారు. ప్రజాస్వామ్యాన్ని నవ్వులపాలు చేస్తూ ముష్టియుద్ధానికి తెగబడ్డారు. సాక్షాత్తూ ఆ దేశ ప్రధాన మంత్రి పైనే నీళ్లు కుమ్మరించి ప్రతిపక్షాలు నానా యాగీ చేశాయి. 

గురువారం జరిగిన పార్లమెంటు సమావేశాల్లో కొసావో ప్రధాన మంత్రి ఆల్బిన్ కుర్తి ప్రసంగిస్తున్న సమయంలో ప్రతిపక్షాలకు చెందిన నాయకుడు మెర్గిమ్ లుష్టాకు తన చేతిలో వాటర్ బాటిల్ తో నడుచుకుంటూ వచ్చి  ప్రధానమంత్రి మొహం మీద నీళ్లు కుమ్మరించారు. అంతలో పాలకపక్షం సభ్యులు ఆయనను అడ్డుకోబోతే ఏకంగా ముష్టి యుద్దానికి తెరతీశారు. 

మధ్యలో మహిళా సభ్యురాలు అడ్డం వచ్చి అడ్డుకునే ప్రయత్నం చేయగా ఆమెను కూడా కనికరించకుండా పిడిగుద్దులు కురిపించారు ప్రతిపక్ష నాయకులు. తోపులాటలో ఆమెను పక్కకు తోసేశారు. చిన్నగా మొదలైన గొడవ చిలికి చిలికి గాలివానగా మారింది. భద్రతా సిబ్బంది జోక్యం చేసుకుని సభ్యులను చెదరగొట్టి ప్రధానమంత్రిని బయటకు తీసుకుని వెళ్లారు. 

ఎందుకీ రచ్చ.. 
ప్రధాన మంత్రి అల్బిన్ కుర్తి విధానాల వలన పాశ్చాత్య దేశాల మైత్రి దూరమైందని, కొసావోలో సెర్బులు-పోలీసులు మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న కారణంగా ఇప్పటికే అనేకమంది గాయాల పాలయ్యారని ప్రతిపక్షాలు ఆరోపించాయి. 1998లో ఇదే తరహా ఘర్షణలు చెలరేగి ఆనాడు సుమారు 10000 మంది మరణించారని. ఈరోజు ప్రధాని అసమర్ధత వల్ల దేశంలో మళ్ళీ  అలాంటి పరిస్థితులు నెలకొన్నాయని వారన్నారు.   

ఇది కూడా చదవండి: పబ్జీ జంట ప్రేమ కథ: ముంబై పోలీసులకు బెదిరింపు కాల్   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement