Kosovo parliament
-
విదేశాల్లో కూడా ఇంతేనా! ప్రధాని ప్రసంగిస్తుండగా అలా చేయడంతో..
మన దేశంలో పార్లమెంట్లో కొన్ని బిల్లుల విషయమై చర్చలు రసాభాసాగా మారిన ఉదంతాలు చూశాం. ఒక్కోసారి అవి కాస్తా తారాస్థాయికి చేరుకుని ఆ బిల్లులు వీగిపోయిన సందర్భాలు ఉన్నాయి. మహా అయితే ఒకరిపై ఒకరు సెటైర్లు వేసుకోవడం, గట్టి కౌంటర్లు వేసుకోవడం వంటివి చేస్తారు. ఒక నాయకుడిని నేరుగా అవమానించేంత దారుణానికి దిగారు. కానీ ఇక్కడొక దేశంలో పార్లమెంట్‌లోని నాయకులు అంతటి దారుణానికి ఒడిగట్టారు. వివరాల్లోకెళ్తే.. జులై13న కొసావో పార్లమెంట్లో పెద్ద వాగ్వాదం జరిగింది. పార్లమెంట్లో సరిగ్గా ప్రధానమంత్రి అల్బిన్ కుర్తీ ప్రసంగిస్తుండగా.. ప్రతిపక్ష నాయకుడు, ఎంపీ ప్రధాని, అతని డిప్యూటీపైన నీళ్లు పోశాడు. దీంతో ఒక్కసారిగా పార్లమెంట్ భగ్గుమంది. ఈ ఘటనతో ఒక్కసారిగా ప్రతిపక్షాలు, పాలక సంకీర్ణ శాసన సభ్యులు మంత్రులు కూర్చొన్న పోడియం వద్దకు రాగ.. ఒక్కసారిగా గొడవ కాస్తా మరింత రాజుకుంది. పోలీసులు జోక్యం చేసుకునేంత వరకు ఇరుపక్షాల శాసనసభ్యులు పరస్పరం దాడులు చేసుకుంటూనే ఉన్నారు. వాస్తవానికి ఉత్తర కొసావోలో తీవ్ర ఉద్రిక్తతలతో అట్టుడుకిపోతోంది. కొసావో జనాభాలో అల్బేనియన్లు 90% కాగా, సెర్బ్‌లు దాదాపు 5% మాత్రమే ఉన్నారు. ఉత్తర కొసావోలో ఏప్రిల్ జరిగిన ఎన్నికల్లో అల్బేనియన్లు మేయర్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించనప్పటి నుంచే.. తీవ్ర అశాంతి నెలకొంది. అంతేగాదు సెర్బ్‌లు దశాబ్దాల కాలం నాటి ఒప్పందాన్ని అమలు చేయాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రతిపక్ష ఎంపీ ప్రధానిపై ఇలా తన విద్వేషాన్ని వెళ్లగక్కారు. ఇది అమోదయోగ్యమైనది కాదని, శిక్షార్హమైన హింసను ప్రేరేపించడమేనని కొసావో పార్లమెంట్ స్పీకర్ గ్లాక్ కొంజుఫ్కా అన్నారు. దీంతో సెషన్ రెండు గంటల ఆలస్యంతో సాగింది. ఇదిలా ఉండగా 2008లో కొసావో స్వాతంత్య్రం ప్రకటించుకున్నప్పటి నుంచి అల్బేనియన్లు, సెర్బ్‌లు మధ్య శత్రుత్వం కొనసాగుతూనే ఉంది. ఇటీవల కాలంలో ఉత్తర కొసావోలో అదికాస్త మరింత తీవ్ర స్థాయికి చేరుకుంది. దీంతో ప్రభుత్వం పోలీసుల జోక్యాన్ని తగ్గించి..అక్కడ అశాంతి తగ్గేలా ఇతర చర్యలు తీసుకుంటామని పేర్కొంది. 🇽🇰Brawl breaks out during Kosovo prime minister's proposal to ease tensions against Serbs pic.twitter.com/msqQ0w0IpA — Zlatti71 (@djuric_zlatko) July 14, 2023 (చదవండి: వింత ఆచారం:అక్కడ దేవుడికి నైవేద్యంగా రాళ్లే పెడతారు!) -
పార్లమెంటు సాక్షిగా ప్రజాప్రతినిధుల కుమ్ములాట
ప్రిస్టినా: కొసావో పార్లమెంటు సమావేశాల్లో ఘర్షణలు చోటు చేసుకున్నాయి. చట్టాలు చేయాల్సిన ప్రజాప్రతినిధులే చట్టసభను రణరంగంలా మార్చేశారు. ప్రజాస్వామ్యాన్ని నవ్వులపాలు చేస్తూ ముష్టియుద్ధానికి తెగబడ్డారు. సాక్షాత్తూ ఆ దేశ ప్రధాన మంత్రి పైనే నీళ్లు కుమ్మరించి ప్రతిపక్షాలు నానా యాగీ చేశాయి. గురువారం జరిగిన పార్లమెంటు సమావేశాల్లో కొసావో ప్రధాన మంత్రి ఆల్బిన్ కుర్తి ప్రసంగిస్తున్న సమయంలో ప్రతిపక్షాలకు చెందిన నాయకుడు మెర్గిమ్ లుష్టాకు తన చేతిలో వాటర్ బాటిల్ తో నడుచుకుంటూ వచ్చి ప్రధానమంత్రి మొహం మీద నీళ్లు కుమ్మరించారు. అంతలో పాలకపక్షం సభ్యులు ఆయనను అడ్డుకోబోతే ఏకంగా ముష్టి యుద్దానికి తెరతీశారు. మధ్యలో మహిళా సభ్యురాలు అడ్డం వచ్చి అడ్డుకునే ప్రయత్నం చేయగా ఆమెను కూడా కనికరించకుండా పిడిగుద్దులు కురిపించారు ప్రతిపక్ష నాయకులు. తోపులాటలో ఆమెను పక్కకు తోసేశారు. చిన్నగా మొదలైన గొడవ చిలికి చిలికి గాలివానగా మారింది. భద్రతా సిబ్బంది జోక్యం చేసుకుని సభ్యులను చెదరగొట్టి ప్రధానమంత్రిని బయటకు తీసుకుని వెళ్లారు. ఎందుకీ రచ్చ.. ప్రధాన మంత్రి అల్బిన్ కుర్తి విధానాల వలన పాశ్చాత్య దేశాల మైత్రి దూరమైందని, కొసావోలో సెర్బులు-పోలీసులు మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న కారణంగా ఇప్పటికే అనేకమంది గాయాల పాలయ్యారని ప్రతిపక్షాలు ఆరోపించాయి. 1998లో ఇదే తరహా ఘర్షణలు చెలరేగి ఆనాడు సుమారు 10000 మంది మరణించారని. ఈరోజు ప్రధాని అసమర్ధత వల్ల దేశంలో మళ్ళీ అలాంటి పరిస్థితులు నెలకొన్నాయని వారన్నారు. Brawl breaks out in the Kosovo Parliament after an Opposition MP threw water at the Prime Minister.pic.twitter.com/OP2DG0F9YX — The Spectator Index (@spectatorindex) July 13, 2023 ఇది కూడా చదవండి: పబ్జీ జంట ప్రేమ కథ: ముంబై పోలీసులకు బెదిరింపు కాల్ -
పార్లమెంట్ లో టియర్ గ్యాస్ ప్రయోగం!
ప్రిస్టినా: కొసొవో పార్లమెంట్ సమావేశాల్లో సోమవారం ఊహించని ఘటనలు చోటు చేసుకున్నాయి. సమావేశాలను అడ్డుకునేందుకు విపక్ష సభ్యులు ఏకంగా టియర్ గ్యాస్ ప్రయోగించారు. దీంతో పార్లమెంట్ లో ఒక్కసారిగా గందరగోళం తలెత్తంది. ఏం జరుగుతుందో తెలియక సభలో ఉన్నవారంతా పరుగులు తీశారు. భద్రతా సిబ్బంది రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దారు. ముగ్గురు విపక్ష ఎంపీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొసొవోలోని సెర్బ్ మైనారిటీలకు మరింత స్వయంప్రతిపత్తి ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ ప్రతిపక్ష సభ్యులు గత రెండు నెలలుగా పార్లమెంట్ లో ఆందోళన చేస్తున్నారు. ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో వారు టియర్ గ్యాస్ ప్రయోగించి సమావేశాలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఎంపీలు హాక్స్ హి శాలా, సామి కుర్తెషిలను అదుపులోకి తీసుకున్నారు. టియర్ గ్యాస్ గోళాలను పార్లమెంట్ లోకి తెచ్చేందుకు యత్నించిన మరో ఎంపీ పిస్నిక్ ఇస్మాజ్లీను అరెస్ట్ చేశారు. ఈ ముగ్గురు ఎంపీలను పార్లమెంట్ నుంచి ఒక రోజు పాటు సస్పెండ్ చేశారు. అమెరికా విదేశాంగ మంత్రి జాన్‌కెర్రీ బుధవారం కొసొవో పర్యటనకు నేపథ్యంలో పార్లమెంట్ లో చోటుచేసుకున్న ఘటన సంచలనం రేపింది.