మన దేశంలో పార్లమెంట్‌లో కొన్ని బిల్లుల విషయమై చర్చలు రసాభాసాగా మారిన ఉదంతాలు చూశాం. ఒక్కోసారి అవి కాస్తా తారాస్థాయికి చేరుకుని ఆ బిల్లులు వీగిపోయిన సందర్భాలు ఉన్నాయి. మహా అయితే ఒకరిపై ఒకరు సెటైర్లు వేసుకోవడం, గట్టి కౌంటర్లు వేసుకోవడం వంటివి చేస్తారు. ఒక నాయకుడిని నేరుగా అవమానించేంత దారుణానికి దిగారు. కానీ ఇక్కడొక దేశంలో పార్లమెంట్‌లోని నాయకులు అంతటి దారుణానికి ఒడిగట్టారు.
వివరాల్లోకెళ్తే.. జులై13న కొసావో పార్లమెంట్‌లో పెద్ద వాగ్వాదం జరిగింది. పార్లమెంట్‌లో సరిగ్గా ప్రధానమంత్రి అల్బిన్ కుర్తీ ప్రసంగిస్తుండగా.. ప్రతిపక్ష నాయకుడు, ఎంపీ ప్రధాని, అతని డిప్యూటీపైన నీళ్లు పోశాడు. దీంతో ఒక్కసారిగా పార్లమెంట్ భగ్గుమంది. ఈ ఘటనతో ఒక్కసారిగా ప్రతిపక్షాలు, పాలక సంకీర్ణ శాసన సభ్యులు మంత్రులు కూర్చొన్న పోడియం వద్దకు రాగ.. ఒక్కసారిగా గొడవ కాస్తా మరింత రాజుకుంది. పోలీసులు జోక్యం చేసుకునేంత వరకు ఇరుపక్షాల శాసనసభ్యులు పరస్పరం దాడులు చేసుకుంటూనే ఉన్నారు. వాస్తవానికి ఉత్తర కొసావోలో తీవ్ర ఉద్రిక్తతలతో అట్టుడుకిపోతోంది. కొసావో జనాభాలో అల్బేనియన్లు 90% కాగా, సెర్బ్‌లు దాదాపు 5% మాత్రమే ఉన్నారు.
ఉత్తర కొసావోలో ఏప్రిల్ జరిగిన ఎన్నికల్లో అల్బేనియన్లు మేయర్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించనప్పటి నుంచే.. తీవ్ర అశాంతి నెలకొంది. అంతేగాదు సెర్బ్‌లు దశాబ్దాల కాలం నాటి ఒప్పందాన్ని అమలు చేయాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రతిపక్ష ఎంపీ ప్రధానిపై ఇలా తన విద్వేషాన్ని వెళ్లగక్కారు. ఇది అమోదయోగ్యమైనది కాదని, శిక్షార్హమైన హింసను ప్రేరేపించడమేనని కొసావో పార్లమెంట్ స్పీకర్ గ్లాక్ కొంజుఫ్కా అన్నారు. దీంతో సెషన్ రెండు గంటల ఆలస్యంతో సాగింది. ఇదిలా ఉండగా 2008లో కొసావో స్వాతంత్య్రం ప్రకటించుకున్నప్పటి నుంచి అల్బేనియన్లు, సెర్బ్‌లు మధ్య శత్రుత్వం కొనసాగుతూనే ఉంది. ఇటీవల కాలంలో ఉత్తర కొసావోలో అదికాస్త మరింత తీవ్ర స్థాయికి చేరుకుంది. దీంతో ప్రభుత్వం పోలీసుల జోక్యాన్ని తగ్గించి..అక్కడ అశాంతి తగ్గేలా ఇతర చర్యలు తీసుకుంటామని పేర్కొంది.
🇽🇰Brawl breaks out during Kosovo prime minister's proposal to ease tensions against Serbs pic.twitter.com/msqQ0w0IpA
— Zlatti71 (@djuric_zlatko) July 14, 2023
(చదవండి: వింత ఆచారం:అక్కడ దేవుడికి నైవేద్యంగా రాళ్లే పెడతారు!)
Comments
Please login to add a commentAdd a comment