Video: 14 ఏళ్లు ప్ర‌ధానిగా సేవ‌లు.. ఓట‌మి త‌ర్వాత సైకిల్‌పై ఇంటికి! | Dutch PM Mark Rutt leaves PMO on bicycle after serving for 14 years | Sakshi
Sakshi News home page

Video: 14 ఏళ్లు ప్ర‌ధానిగా సేవ‌లు.. ఓట‌మి త‌ర్వాత సైకిల్‌పై ఇంటికి!

Published Sat, Jul 6 2024 5:49 PM | Last Updated on Sat, Jul 6 2024 6:01 PM

Dutch PM Mark Rutt leaves PMO on bicycle after serving for 14 years

జీవితంలో ఎంత ఎదిగినా ఒదిగి ఉండాల‌ని పెద్ద‌లు చెబుతూ ఉంటారు. ఎంత ఆస్తి సంపాదించినా, ఎన్ని మంచి ప‌నులు చేసినా.. గ‌ర్వం, అహంకారం ద‌రిచేర‌కుండా నిరాడంబరంగా ఉండాల‌నేది దీని సారంశం. కొంద‌రికి డ‌బ్బు, అధికారం అంద‌గానే గొప్ప‌గా జీవిస్తుంటారు.. కానీ మ‌రికొంద‌రు తాము ఎంత పెద్ద స్థాయిలో ఉన్న సింపుల్‌గానే జీవిస్తుంటారు. అందుకు నిద‌ర్శ‌నంగా నిలిచారు. డ‌చ్ ప్ర‌ధాని మార్క్ రుట్టే..

ఇటీవ‌ల జ‌రిగిన నెద‌ర్లాండ్స్‌ ప్ర‌ధాన‌మంత్రిగా 14 ఏళ్లు సేవ‌లందించిన మార్క్ రుట్టే ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఓడిపోయిన విష‌యం తెలిసిందే. అయితే కొత్త పీఎంగా ఎన్నికైన మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ డిక్ షూఫ్‌కు అధికారికంగా బాధ్య‌త‌లు అప్ప‌గించి రుట్టే సాధార‌ణ పౌరుడిగా సైకిల్ తొక్కుంటూ వెళ్లిపోయారు.

రుట్టే సైకిల్‌పై వెళ్లిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. వీడియోలో ఆయ‌న సైకిల్‌పై అధ్య‌క్ష భ‌వ‌నం నుంచి బ‌య‌ట‌కు వ‌స్తున్న స‌మ‌యంలో కొంతమంది రుట్టేను చప్పట్లు కొట్టి ప్ర‌శంసించ‌డం వీడియోలో చూడొచ్చు. అయితే, రూట్టేకు ‘సైకిల్ రైడ్‌’ చేయ‌డం ఇదే తొలిసారి కాదు. ఇంతకుముందు కూడా సభలకు సైకిల్‌పై వ‌చ్చి త‌న‌ నిరాడంబరతను, అంకితభావాన్ని చాటారాయ‌న‌.

అయితే డచ్ పద్ధతిలో ఇలా చేయ‌డం ఆ దేశ ఆచార‌మ‌ని అంటున్నారు. ఎలాగైతే ఖాళీ చేతుల‌తో ప్ర‌జ‌ల‌కు ప్రాతినిధ్యం వ‌హించ‌డానికి వ‌చ్చారో, అలాగే వెళ్లిపోవ‌డం అక్క‌డ జ‌రుగుతుంద‌ట‌. ఇక 
ఇక 14 ఏళ్లు నెద‌ర్లాండ్స్ ప్ర‌ధానిగా సేవ‌లు అందించిన మార్క్ రుట్టే.. వ‌చ్చే ఏడాది 'నాటో' కొత్త సెక్ర‌ట‌రీ జ‌న‌ర‌ల్‌గా బాధ్య‌త‌లు చేప‌ట్ట‌నున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement