సాక్షి, అమరావతి: అసెంబ్లీ సాక్షిగా తొలిరోజే టీడీపీ సభ్యులు వికృత చేష్టలతో నీచ సంప్రదాయానికి తెరలేపారు. రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉన్న గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రసంగానికి అడ్డుపడుతూ దిగజారుడు రాజకీయాలకు పాల్పడ్డారు. గవర్నర్ గోబ్యాక్ అంటూ టీడీపీ సభ్యులు నినాదాలు చేయడంతో పాటు, గవర్నర్ ప్రసంగ పత్రులను చించివేశారు. దీంతో సభలో గందరగోళ పరిస్థితి నెలకొంది.
చదవండి: ప్రజాస్వామ్యంపై టీడీపీకి కొంచెం కూడా గౌరవం లేదు: చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి
గవర్నర్‌ను దూషిస్తూ, ప్రసంగం ప్రతులను టీడీపీ సభ్యులు చించి ఆయనపై విసిరేయడంపై బీఏసీ సమావేశంలో టీడీపీ సభ్యుడు అచ్చెన్నాయుడిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సీరియస్ అయ్యారు. గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకోవడంపై మంచి పద్ధతి కాదని హితవు పలికారు. గతంలో ఇలాంటి సంస్కృతి ఎన్నడూ లేదన్నారు. గవర్నర్ వయసులో పెద్దవారని, ఆయనకు గౌరవం ఇవ్వాలని సీఎం అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment